తిరుపతిలో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన విష్ణు నివాసం సముదాయాన్ని త్వరితగతిన పూర్తిస్థాయిలో యాత్రికులకు అందుబాటులోకి తేవాలని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు కోరారు. అత్యాధునిక హంగులతో రూపుది ద్దుకుంటున్న విష్ణు నివాసం గూర్చి ప్రతి సామాన్య భక్తునికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని ఆదేశిం చారు. ఈ సముదాయాన్ని గురువారం రాత్రి చైర్మన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలోని టీటీడీ వసతి సముదాయాలపై సరైన ప్రచారం లేనికారణంగానే యాత్రికులు ధరలు అధికంగా ఉన్నా ప్రైవేటు లాడ్జిల ను ఆశ్రయిస్తున్నారన్నారు. ఈ సముదాయం నిర్మాణాన్ని సంపూర్ణంగా పూర్తి చేసేందుకు అవసరమైన రూ.34కోట్లను అదనంగా విడుదల చేశామన్నారు. ఇం జినీరింగ్ విభాగం అధికారులు వేగంగా నిర్మాణాలు పూర్తిచేయాలన్నారు.ముఖ్యంగా టీటీడీ వసతి గృహాల్లో చోరీలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో వాటి నివారణకు సిబ్బందిని వెంటనే నియమించుకోవాలని చెప్పారు. విష్ణునివాసంలో పటిష్ట భద్రత కోసం 64 సీసీ కెమెరాలనుఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. సముదాయానికి నాలుగు వైపులా ఏర్పాటు చేసిన గేట్‌లను ఎల్లవేళలా తెరచి ఉంచాలని కోరారు.
నిర్వహణకు నెలకు రూ.17.5 లక్షలు
విష్ణు నివాసం వసతి సముదాయం నిర్వహణ కోసం నెలకు ఏజెన్సీకి రూ.17.50 లక్షలు టీటీడీ ఖర్చు చేస్తుం దని చైర్మన్ తెలిపారు. రూ.2 కోట్ల వరకు భారం భరి స్తున్నా, యాత్రికులకు మెరుగైన వసతి, సౌకర్యాలు కల్పించడమే తమ ధే ్యయమన్నారు. అన్ని అంతస్థుల్లోని గదులు, డార్మెటరీలను స్వయంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. గదులు, సముదాయం పరిసరాల్లో పారిశుధ్య పనుల నిర్వహణపై నిత్యం యాత్రికుల నుంచి అభిప్రాయ సేకరణ చేసి తనకు ఆన్‌లైన్ ద్వారా నివేదించాలని కోరారు

No comments:
Post a Comment