గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్ఓ), సహాయకుల (వీఆర్ఏ) పోస్టుల భర్తీకి రాత
పరీక్ష నిర్వహించే బాధ్యతను జేఏఎన్‌టీయూకు అప్పగించినట్లు భూ పరిపాలన
ప్రధాన కమిషనర్ జె.సత్యనారాయణ తెలిపారు. ఎంసెట్ తరహాలోనే రెవెన్యూ
పోస్టులకు రాతపరీక్ష నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.ఓఎంఆర్‌షీట్
ఆధారంగా పరీక్ష ఉంటుందని చెప్పారు. శుక్రవారం తన కార్యాలయంలో మరో సీనియర్
అధికారి ఎల్లప్పతో కలిసి సత్యనారాయణ విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు.
వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టుల భర్తీకి ఈ నెల 7న జిల్లాలవారీగా నోటిఫికేషన్లు జారీ
అయ్యాయి. ఈ నోటిఫికేషన్‌లోని పేర్కొన్న పలు ముఖ్యాంశాలకు ఆయన వివరణలు
ఇచ్చారు. వీఆర్ఓ పోస్టుకు ఇంటర్‌బోర్డు సర్టిఫికెట్ తప్పనిసరి అని
చెప్పారు. డిప్లొమాలు, దూరవిద్యలో డిగ్రీ పూర్తిచేసిన వారు ఈ పోస్టుకు
అనర్హులని స్పష్టం చేశారు.రెవెన్యూ పోస్టుల భర్తీలో బీసీ
క్రీమీలేయర్‌ను పరిగణనలోకి తీసుకోబోమని చెప్పారు. దరఖాస్తుల స్వీకరణ,
హాల్‌టికెట్ల జారీ పూర్తిగా ఆన్‌లైన్ (ఛిఛిజ్చూ.ఛిజజ.జౌఠి.జీn) ద్వారానే
జరుగుతుందన్నారు. దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 29 గడువు ముగుస్తున్నా..
అంతకంటే ముందుగానే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సత్యనారాయణ సూచించారు.
"29వ తేదీ వరకు గడువు ఉంది కదాని అందరూ అదే రోజు దరఖాస్తు చేస్తే.. లోడ్
ఎక్కువై సైట్ స్తంభించే ప్రమాదం ఉంది. కాబట్టి ముందే దరఖాస్తు చేసుకోవడం
మంచిది'' అని ఆయన సూచించారు.దరఖాస్తుల సమయంలో ఆన్‌లైన్‌లో కుల
«ద్రువీకరణ పత్రాల పరిశీలన ఉండదని చెప్పారు. రాతపరీక్ష అనంతరం అభ్యర్థులను
ఎంపికచేశాక కుల «ద్రువీకరణ పత్రాలను పరిశీలిస్తామన్నారు. ఎవరైనా తప్పుడు
కుల «ద్రువీకరణలతో పరీక్షలు రాసినట్లు తేలితే చట్టపరంగా కఠినచర్యలు
తీసుకుంటామని స్పష్టం చేశారు.
Saturday, 10 December 2011
తిరుపతి-అమరావతి- బైవీక్లీ సూపర్‌ఫాస్ట్
ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా కొత్తగా తిరుపతి-అమరావతి-తిరుపతి
బైవీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించాలని దక్షిణమధ్య రైల్వే
అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ నెల 13వ తేదీ నుంచి ఈ రైలును
ప్రవేశపెట్టనున్నారు. కాగా శనివారం అమరావతిలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఈ
ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో
కే.సాంబశివరావు తెలిపారు. తిరుపతి-అమరావతి సూపర్‌ఫాస్ట్
ఎక్స్‌ప్రెస్(నంబర్ 12765) తిరుపతి నుంచి మంగళ, శనివారాల్లో మధ్యాహ్నం 3.10
గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు అమరావతి చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో అమరావతి-తిరుపతి ఎక్స్‌ప్రెస్(నంబర్ 12766) అమరావతి
నుంచి సోమ, గురువారాల్లో ఉదయం 6.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం
6.40గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
రెవెన్యూశాఖలో మొదలైన పోస్టుల భర్తీపై దళారులు కన్నేశారు!
అభ్యర్థులలో తీవ్ర ఆందోళన
కోవాలని సూచించారు. సుదీర్ఘకాలం తర్వాత రెవెన్యూశాఖలో మొదలైన పోస్టుల భర్తీపై దళారులు కన్నేశారు. అభ్యర్థుల అమాయకత్వమే ఆసరాగా.. భారీగా సొమ్ము నొక్కేస్తున్నారు. స్వయంగా రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, సీసీఎల్ఏ జె.సత్యనారాయణ రంగంలోకి దిగి.. దళారులను నమ్మొద్దని చెప్పాల్సి వచ్చింది. అయినా కూడా.. వీరి మాటలకంటే దళారుల దగాకోరు కబుర్లే ఆశావహులను ఆకర్షిస్తున్నాయి. లక్షల్లో బేరసారాలు మొదలయ్యాయి.చివరకు ఆ అభ్యర్థి ఏం చెప్పారో తెలుసా? ఓ ట్రయల్ వేస్తే పోలా? ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన అభ్యర్థి వీఆర్వో పోస్టు కోసం దళారిని ఆశ్రయించాడు. లక్షన్నర ఇస్తే పోస్టు ఖాయమని దళారి చెప్పాడు. డబ్బులు ముట్టాయి. ఈ డీల్ కుదిరేనాటికి వీఆర్వో పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయాలనే ఆలోచన పరిశీలనలో ఉంది. ఇప్పుడు రాతపరీక్ష ద్వారా భర్తీచేస్తున్నారు. దీంతో అభ్యర్థి దళారిని కలిసి... పరీక్ష పెడితే పోస్టు రాదు కదా అని ఆందోళన వ్యక్తం చేశారు. దళారి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి పీఏతో ఫోన్ చేయించి నమ్మబలికించారు దందాలో మచ్చుకు కొన్ని... హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రజాప్రతినిధి దగ్గర పనిచేసే అధికారి పోస్టులు ఇప్పిస్తారని ప్రకాశం జిల్లా మార్కాపురంలో బాగా ప్రచారం జరుగుతోంది. పోస్టుకు రెండు లక్షలిస్తే సరిపోతుందని దళారులు చెబుతున్నారు. అభ్యర్థులకు నమ్మకం కలిగించేందుకు ఏకంగా హైదరాబాద్‌లో ఉన్న అధికారితో ఫోన్‌లో మాట్లాడిస్తున్నారు. "ఆ వ్యక్తిని నమ్మండి. పనైపోతుంది. పరీక్ష గురించి భయపడొద్దు. సార్‌కు కోటా ఉంది. దాంట్లో మీకు ఇప్పిస్తాం. అంతా సార్ చూసుకుంటారు'' అని సదరు అధికారి అభ్యర్థులకు చెబుతున్నారు.ఈ సంభాషణ ముగిసిన తర్వాత అభ్యర్థి తనకు తెలిసిన రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేత ఒకరికి ఫోన్ చేశారు. " డబ్బులు పెట్టుకుంటే పోస్టులు వస్తాయట కదా.. హైదరాబాద్‌లో ఓ ప్రజాప్రతినిధి దగ్గర పనిచేస్తున్న అధికారితో ఫోన్‌లో మాట్లాడించారు. ఆయన్ను నమ్మొచ్చంటారా?'' అని ప్రశ్నించారు. ఆయన ఆరాతీసి.. అలా పనులు కావని, ప్రతిభ నే నమ్ము
.
Subscribe to:
Posts (Atom)