Friday, 21 October 2011

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దీపావళి రోజున ప్రత్యేకపూజ

                                  
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో 26వ తేదీన దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు. ఏటా అశ్వయుజమాసం అమావాస్య నాడు వచ్చే దీపావళి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలోని బంగారువాకిలిలో ఆరోజు ఉదయం 7-9గంటల మధ్య అర్చకులు ప్రత్యేక ఆస్థాన వేడుకలను నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా ఉభయ నాంచారులతో కూడి మలయప్పస్వామి ఘంటా మండపానికి వేంచేస్తారు. సర్వభూపాల వాహనంలో స్వామివార్లను గరుడాళ్వారులకు అభిముఖంగా ఏర్పాటు చేస్తారు. సేనాధిపతి విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ వైపున మరొక పీఠంపై దక్షిణ అభిముఖంగా వేంచేస్తారు. తరువాత స్వామివార్లకు ప్రత్యేకపూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ఆ రోజున శ్రీవారి ఆలయంలో నిర్వహించే నిత్య ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఎస్డీ సేవలను రద్దు చేశారు. మిగిలిన సేవలను యథావిధిగా నిర్వహించనున్నా

No comments:

Post a Comment