Tuesday, 14 February 2012

భయపడేది లేదు మా సమ్మె ఆగదు...జూనియర్ డాక్టర్లు

తమ డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేవరకు సమ్మెని కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. ఎటువంటి పరిస్థితులలో సమ్మెని ఆపే ప్రసక్తిలేదని వారు తెగేసి చెప్పారు. సమ్మె విరమణ విషయంలో జూనియర్ డాక్టర్లు పట్టు బిగిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే సీనియర్లు తమను బెదరిస్తున్నారని, సమ్మె విరమించేది లేదని జూనియర్ డాక్టర్లు అంటున్నారు. సమ్మె విరమించాలని తెలంగాణ వైద్యుల సంఘం వారిని డిమాండ్ చేస్తోంది. అయితే, ప్రభుత్వం అంగీకరించే విషయాలపై తమకు రాతపూర్వకమైన హామీ ఇస్తే తాము సమ్మె విరమిస్తామని జూనియర్ డాక్టర్లు అంటున్నారు. సమ్మెను మరింత ఉధృతం చేస్తామని జూనియర్ డాక్టర్లు అంటున్నారు.  అయితే, జూనియర్ డాక్టర్లు వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు. జూనియర్ డాక్టర్లతో మంగళవారం తెలంగాణ వైద్యుల సంఘం ప్రతినిధులు చర్చలు జరిపారు. రాతపూర్వకమైన హామీ కోసం జూనియర్ డాక్టర్లు పట్టుబడుతున్నారు. తమ డిమాండ్లను సాధించే వరకు సమ్మెను విరమించబోమని చెబుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు ఉద్యమాన్ని నీరు గార్చడానికి ప్రయత్నిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు.

చిరంజీవిపై పయ్యావుల ఛలోక్తి

తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవిపై మంగళవారం చలోక్తి విసిరారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఉదయం శాసనసభను బుధవారానికి వాయిదా వేశారు. అనంతరం సభ్యులంతా బయటకు వచ్చారు. ఈ సమయంలో అసెంబ్లీ ప్రాంగణంలో పయ్యావులకు చిరంజీవి కనిపించారు. ఆయనతో పిచ్చాపాటిగా మాట్లాడారు. అసెంబ్లీలో ఈ రోజు మీరే స్పెషల్ అంటూ ఆయనతో అన్నారు. దానికి చిరంజీవి అదేలా అని ప్రశ్నించారు. ఈ రోజు వాలెంటైన్స్ డే కదా మీరే హాట్ ఫేవరెట్ అని చెబుతూ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ ఐ లవ్యూ అంటూ మీ వెంట పడుతున్నారు కదా అని అన్నారు. దానికి చిరంజీవి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లి పోయారు.కాగా అంతకుముందు మంగళవారం సమావేశమైన అసెంబ్లీ మూడుసార్లు వాయిదా పడింది. విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. దీంతో టిఆర్ఎస్, బిజెపి, తెలంగాణ తెలుగుదేశం నేతలు తెలంగాణ కోసం, సీమాంధ్ర టిడిపి నేతలు మద్యంపై చర్చ జరగాలంటూ పట్టుబట్టారు. దీంతో స్పీకర్ సభను అరగంట వాయిదా వేశారు. ఆ తర్వాత ఇదే సీన్ రిపీట్ కావడంతో మరో పదిహేను నిమిషాలు వాయిదా వేశారు. మూడోసారి స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు.

సోషల్ నెట్‌వర్కింగ్ ఫేస్‌బుక్‌లో రైల్వే సమాచారం

ఈ సౌకర్యంపై ప్రయాణికులకు అవగాహన కల్పించాలన్నదే తమ ధ్యేయమని, దీనికి ప్రచారం లేకపోవడంతో అసాంఘిక శక్తులు దీనిని దుర్వినియోగం చేస్తున్నాయని వివరించారు. అంతేనా.. అత్యవసరంగా ప్రయాణించాల్సిన సమయాల్లో రైలు బయలుదేరే స్టేషన్లోని కరెంట్ రిజర్వేషన్ కౌంటర్లో ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని రైల్వే శాఖ సూచించింది. రిజర్వేషన్ చార్టు తయారైన తర్వాత ఖాళీగా ఉన్న సీట్లను రైలు బయలుదేరడానికి ముందే.. ఆయా స్టేషన్లలోని కరెంట్ రిజర్వేషన్ కౌంటర్లో బుక్ చేసుకోవచ్చని తెలిపారు. సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ పరిధి మరింత విస్తృతమైంది. ఇకపై దాని లో రైళ్ల సమయాలు, బెర్తుల అందుబాటు తదితర అం శాలనూ తెలుసుకోవచ్చు. ఈ మేరకు రైల్వే శాఖలోని ఢి ల్లీ డివిజన్ ఫేస్‌బుక్‌లో ప్రత్యేకంగా ఓ పేజీని తెరిచింది. రైళ్ల రాకపోకలు, బెర్తుల అందుబాటు తదితర వివరాలను ప్రయాణికులకు సమాచారం ఇచ్చేందుకు ఫేస్‌బుక్‌లో ఓ పేజీని తెరిచామని, దీనిని నేషనల్ ట్రైన్ ఇంక్వైరీ సర్వీస్‌తో లింక్ చేస్తున్నామని, ఎప్పటికప్పుడు దీనిని అప్‌డేట్ చేస్తామని ఢిల్లీ డివిజన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అలాగే, న్యూ ఢిల్లీ, నిజాముద్దీన్, ఓల్డ్ ఢిల్లీ స్టేషన్లకు ఏయే రైళ్లు ఏ సమయానికి, ఏ ప్లాట్‌ఫామ్‌కు వస్తాయనే వివరాలు కూడా ఇందులో ఉంటాయని తెలిపారు. అందుబాటులో ఉన్న సీట్లను 'అసాంఘిక శక్తులు' దుర్వినియోగం చేయకుండా నిరోధించడమే దీని ధ్యేయమన్నారు. ఇటువంటి సృజనాత్మక చర్యలకు శ్రీకారం చుట్టాలని, ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి విస్తృ త ప్రచారం కల్పించాలని ఇతర డివిజన్లకు రైల్వే శాఖ సూచించింది.

ఎస్‌ఎమ్‌యస్ టికెట్ లేకపోతే రూ. 50 జరిమానా!

ఈ- టికెట్ విధానం ద్వారా రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు నిబంధనల్ని దక్షిణ మధ్య రైల్వే బోర్డు ప్రకటించింది. ఈ - టికెట్ ద్వారా రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు వారికి వచ్చిన ఎస్‌ఎమ్‌ఎస్‌ను పూర్తి సమాచారంతో చూపించని యెడల రూ. 50 అపరాధ రుసుము చెల్లించాల్సింటుందని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఐఆర్‌టీసీ వెబ్‌సైట్‌లో ఈ- టికెట్ ద్వారా టికెట్ రిజర్వేషన్ చేసుకున్న వారికి వచ్చిన ఎస్‌ఎమ్‌ఎస్‌లను చూపిస్తే రైలులోకి అనుమతిస్తామని రైల్వే బోర్డు తెలిపింది. తమ ఈఆర్‌ఎస్ టికెట్‌ను కోల్పోయిన లేదా ప్రయాణ సమయంలో తమ టికెట్‌ను చూపించకపోతే ప్రయాణికులకు రూ. 50 జరిమానా విధిస్తామని తెలిపింది. తమ ప్రయాణానికి ముందు వారితో పాటుగా గుర్తింపు కార్డు, ఫాన్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్, ఫోటో గుర్తింపు కార్డు, ఫాస్‌పోర్టు, లేదా స్టూడెంట్ ఐడి కార్డు, బ్యాంక్ పాస్‌బుక్‌లను ప్రయాణికులు చూపించాల్సింటుందని రైల్వే బోర్డు పేర్కొంది.

ఎన్టీ రామారావు తర్వాత వైయస్ మాత్రమే...వైయస్ జగన్

వైయస్ రాజశేఖర రెడ్డి కన్నా ముందు ఈ రాష్ట్రాన్ని పాలించిన పెద్ద మనిషి చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని అంటే నష్టపరిహారం కోసం చనిపోతున్నారని అవహేళన చేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 200 మంది చేనేత కార్మికులు చనిపోయారని, వారి కుటుంబాలకు కూడా లక్ష రూపాయలేసి నష్టపరిహారం చెల్లించాలని వైయస్ రాజశేఖర రెడ్డి జీవో జారీ చేశారని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి కన్నా ముందు చేనేత కార్మికులకు ఏమైనా చేశారంటే ఎన్టీ రామారావేనని ఆయన అన్నారు. చేనేత కార్మికుల కోసం ఎన్టీ రామారావు జనతా పథకాన్ని ప్రవేశపెట్టారని ఆయన చెప్పారు. చేనేత కార్మికుల సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 48 గంటలపాటు చేపట్టిన దీక్షని ఆయన ఈ సాయంత్రం విరమించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన జనవాహినిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నేతన్నలకు అండగా తనతోపాటు ఉన్న నేతలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నూలు, జరీ, రేషన్, రంగుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చేనేత కార్మికులు తయారు చేసిన చీరల ధరలు మాత్రం కనీస స్థాయిలో పెరగడంలేదన్నారు. వారికి గిట్టుబాటు ధర లభించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల ఉపాధి దెబ్బతినకుండా ఉండేందుకు 11 రకాల ఉత్పత్తులను చేనేత కార్మికులకు కేటాయించారు. ఆ ఉత్పత్తులను ఇతరులు ఉత్పత్తి చేయకుండా ఈ ప్రభుత్వాలు ఆపలేకపోతున్నాయని తెలిపారు.
చేనేత కార్మికుల సమస్యలపై అనంతపురం జిల్లా ధర్మవరంలో రెండు రోజుల పాటు చేపట్టిన దీక్షను ఆయన మంగళవారం సాయంత్రం విరమించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి అల్లుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జనతా పథకాన్ని ఎత్తేశారని ఆయన విమర్శించారు. చేనేత కార్మికుల సంక్షేమ కోసం వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జారీ జీవోల గురించి ఆయన వివరించారు. చేనేత కార్మికుల గురించి, చదువుకునే విద్యార్థుల గురించి ఆలోచించే నాథుడు రాష్ట్రంలో లేకుండా పోయారని ఆయన అన్నారు.

స్వతంత్ర అభ్యర్థిగా గుర్తించండి... జగన్ వర్గం ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి

తమను స్వతంత్ర సభ్యురాలిగా గుర్తించాలని, లే దా రాజీనామా ఆమోదించాలని జగన్ వర్గం ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి స్పీకర్‌ను కోరారు. మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఆమె స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.పీఆర్పీని ఇంకా ఎంతకాలం ప్రత్యేక పార్టీగా గుర్తిస్తారని స్పీకర్‌ను ప్రశ్నించారు. తనను ఇండిపెండెంట్ గా గుర్తిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంద సభ్యురాలిగా కొనసాగిస్తానని శోభానాగిరెడ్డి పేర్కొన్నారు.