అనంతపురం జిల్లాలో ఔషధ తనిఖీ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. నిబంధనలు పాటించని 41మందుల దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. అనంతపురంలో 30, హిందూపురంలో 11షాపులను సీజ్ చేశారు. రోగుల బంధువులుగా అధికారులే మందులు కొనుగోలు చేశారు. దీంతో దుకాణదారుల నిజస్వరూపం బయటపడింది. డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేకపోయినా అమ్మకాలు జరపడం, బీ ఫార్మసి లేకపోయినా యధేచ్చగా విక్రయాలు కొనసాగించడాన్ని గుర్తించారు. దీంతో సంబంధిత దుకాణదారులపై కేసులు నమోదు చేశారు. అధికారుల వరుస దాడులతో హడలి పెద్దఎత్తున మెడికల్ షాపులు మూసేసుకున్నారు. మెడికల్ షాపుల యాజమాన్యాలు నిబంధనలు పాటించడంలేదని సాక్షాత్ వైద్యఆరోగ్య మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అంగీకరించారు. రాష్ట్రంలోని 90శాతానికి పైగా దుకాణాల్లో క్వాలిఫైడ్ ఫార్మసిస్టులు లేరని తెలిపారు. అయితే నిబంధనలు పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు
Wednesday, 30 November 2011
‘అధినాయకుడు’ చిత్రంలో బాలకృష్ణకి బామ్మగా జయసుధ
రామ్ చరణ్.... బ్యాచులర్ పార్టీకి ఘనంగా ఏర్పాట్లు
బెజవాడ రిలీజ్... పోలీసులు అప్రమత్తం
ప్రొద్దుటూరు కోర్టుకు నిర్మాత సింగనమల రమేష్
ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు నోటీసులు !!
ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసే విధంగా.. సాక్షులను భయాందోళనలకు గురిచేసేలా తప్పుడు కథనాలను ప్రచురిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను కట్టడి చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. పరిశోధనాత్మక జర్నలిజం పేరుతో సాక్షుల వాంగ్మూలాలంటూ దర్యాప్తును తప్పుదోవ పట్టించే కథనాలను ప్రచురిస్తున్నారన్న ఆరోపణలపై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల యాజమాన్యాలకు హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్ చేసిన ఆరోపణలకు సీబీఐ హైకోర్టుకు వివరణ ఇచ్చుకుంది. దర్యాప్తుకు సంబంధించిన వివరాలను తామెవ్వరికీ లీక్ చేయటం లేదని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. దీనిపై సంతృప్తి చెందని న్యాయమూర్తి.. పిటిషనర్ ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని సీబీఐకి స్పష్టం చేశారు. సీబీఐ తన దర్యాప్తు వివరాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు లీక్ చేస్తోందని, సిటింగ్ జడ్జి లేదా రిటైర్డ్ న్యాయమూర్తితో దర్యాప్తు చేయించాలని కోరుతూ ఎమ్మార్ హిల్స్ ప్లాట్ కొనుగోలుదారు కె.రఘురామకృష్ణరాజు గత వారం హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పి.మునికృష్ణారెడ్డి వాదనలను వినిపిస్తూ.. ఎమ్మార్ వద్ద ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పట్ల ప్రజల్లో ద్వేషభావం కలిగేలా.. సీబీఐ జాయింట్ డెరైక్టర్, అతని సహచరులు దర్యాప్తునకు సంబంధించి అతి సున్నితమైన అంశాలను ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు చేరవేస్తున్నారని తెలిపారు. చట్టబద్ధంగా ప్లాట్లు కొనుగోలు చేసిన తన క్లయింటు లాంటి కొనుగోలుదారులను నేరస్తులుగా చిత్రీకరించేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని కోర్టుకు నివేదించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు సాక్షుల వాంగ్మూలాలు, వారి ప్రకటనలు, నేరాంగీకారాలు తదితర అంశాలను యథాతథంగా ప్రచురిస్తూ.. సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల యాజమాన్యాలు జర్నలిజం విలువలను కాలరాసి, అనైతిక చర్యలకు పాల్పడుతున్నాయని వివరించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలు ఇప్పటి వరకు ప్రచురించిన తప్పుడు కథనాలను సీబీఐ అధికారులు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఖండించలేదని.. తద్వారా సీబీఐ అధికారులే కీలక సమాచారాన్ని ఆ రెండు పత్రికలకు లీక్ చేస్తున్నారని అర్థమవుతోందని పేర్కొన్నారు. ఈ సమయంలో సీబీఐ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం లేదని, తాము ఎవ్వరికీ ఎటువంటి సమాచారాన్ని లీక్ చేయలేదని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల యాజమాన్యాలకు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డెరైక్టర్, సీబీఐ జాయింట్ డెరైక్టర్, ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్స్ ప్రయివేట్ లిమిటెడ్ తదితరులకు నోటీసులు జారీ చేశారు. ఈ పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కోర్టు ముందు ఉంచాలని సీబీఐ తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు.
రేపు ముంబయి నగరంలో టీటీడీ సమాచార కేంద్రం ప్రారంభం
ముంబయి నగరంలోని సైమాన్ ఏరియాలో గురువారం టీటీడీ సమాచార కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. శ్రీవారి భక్తులకు కోరిన సమాచారాన్ని అందించేందుకు అత్యాధునిక సమాచార వ్యవస్థ, మౌలిక సదుపాయాలతో ఈ సమాచార కేంద్రాన్ని నెలకొల్పారు. గురువారం కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్ పాటిల్ చేతుల మీదుగా ఈ సమాచార కేంద్రం ప్రారంభమవుతుందని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఆర్‌వై.గైక్వాడ్, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎల్‌వీ.సుబ్రమణ్యం, పాలక మండలి సభ్యులు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారని టీటీడీ పేర్కొంది
Tuesday, 29 November 2011
తిరుచానూరు పద్మావతి అమ్మవారికి భక్తులు పోటెత్తారు
హరికృష్ణను చంద్రబాబు కార్నర్ చేసినట్లేనా?
త్వరలో బాలీవుడ్ తెరపై మహేంద్ర సింగ్ ధోని?
జనవరి 30న విఆర్ ఓ, విఆర్ ఏ పరీక్షలు
జనవరి 30న విఆర్ ఓ, విఆర్ ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు. ఉదయం విఆర్ ఓ, మధ్యాహ్నం విఆర్ ఏ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు దరఖాస్తు ఖరీదు 200 రూపాయలు. ఎస్ సి, ఎస్టీలకు వంద రూపాయలు. ఈ పరీక్షల ద్వారా 1172 విఆర్ ఓ పోస్టులు, 6063 విఆర్ఏ పోస్టులు భర్తీ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలలో వయోపరిమితి సడలింపుపై రేపు జరిగే మంత్రి మండలి సమావేశంలో చర్చిస్తామని మంత్రి చెప్పారు.
|
పెరిగిన గ్రూప్-1 పోస్టుల సంఖ్య
గ్రూప్-1 పోస్టులను మరో 41 పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంటూ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. గ్రూప్-1 సంబంధించి 263 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ తాజాగా మరో 39 ఎంపీడీవోలు, 2 డిఎస్పీ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో గ్రూప్-1 పోస్టుల సంఖ్య 304కు పెరిగింది. గ్రూప్-1 పరీక్షకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) సోమవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 19 విభాగాల్లో 263 పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 27న ప్రిలిమినరీ పరీక్ష, అక్టోబర్ 3న మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని బోర్డు తెలిపింది. డిసెంబర్ 9 నుంచి జనవరి 8 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు బోర్డు ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.
కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో ఉద్రిక్తత
జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ అలజడి మొదలైంది. కప్పట్రాళ్లలో వెంకటప్పనాయుడు ఇంటిపై మద్దిలేటి వర్గీయులు దాడి చేశారు. ఈ విషయం తెలిసి పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. కప్పట్రాళ్లలో ఉద్రికత నెలకొంది దేవనకొండ మండలపరిధిలోని ఫ్యాక్షన్ గ్రామమైన కప్పట్రాళ్లగ్రామాన్ని కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి అన్న కుమారుడు పరప్ప నాయుడుపై ప్రత్యర్థులు దాడికి పాల్పడినందున వారి స్వగ్రామమైన కప్పట్రాళ్ల గ్రామాన్ని డిఎస్పీ సందర్శించి అక్కడ పరిస్థితిని ఆయన స్వయంగా పరిశీలించారు. వెంకటప్పనాయుడు, పరప్ప నాయుడు, మద్దిలేటి నాయుడు ఇండ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎవరు హత్యలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని డిఎస్పీ తెలియజేశారు. గ్రామంలో ప్రజలందరూ పొలం పనులకు వెళ్లడం వలన గ్రామ వీధులన్ని నిర్మాణుషంగా మారాయని చెప్పారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు పోలీసులను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఐదుమంది ఎపిఎస్‌పి పోలీసులు, నల్గురు సివిల్ పోలీసులను గ్రామంలో బందోబస్తుగా ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ తెలియజేశారు.
చరణ్ తేజ్-ఉపాసన డిసెంబర్ 1న నిశ్చితార్థం
Monday, 28 November 2011
ఎడ్లబండి ఎక్కిన వైయస్ జగన్
అంతకు ముందు తన ఓదార్పు యాత్రలో ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పత్రి రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆయన అన్నారు. పత్తి పంట దిగుబడి 15 క్వింటాళ్ల వరకు ఉండేదని, ఇప్పుడు విద్యుత్ లేకపోవడం వల్ల నాలుగు క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆయన అన్నారు. గత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 6 వేల రూపాయల గిట్టుబాటు ధర కల్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం 3 వేల 600 రూపాయలతో సరిపెడుతోందని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో గ్రామీణ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, అయినా పట్టించుకునే వారే లేరని ఆయన అన్నారు
ఓబుళాపురం గనుల కేసులో ఐ.ఎ.ఎస్. శ్రీలక్ష్మి అరెస్టు
కర్నూలు జిల్లాలో మరో ఫ్యాక్షన్ హత్య
కర్నూలు జిల్లాలో మరో ఫ్యాక్షన్ హత్య జరిగింది. తుగ్గలి మండలం కనుమకుంట్లలో కాంగ్రెస్ నేత అనిమిరెడ్డి సోమవారం ఉదయం దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దాడి చేసి దారుణంగా నరికి చంపారు. మృతుడు ఓ హత్యకేసులో నిందితుడు. పాతకక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు
గ్రూప్-1 పరీక్షకు నోటిఫికేషన్ విడుదల
గ్రూప్-1 పరీక్షకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) సోమవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 19 విభాగాల్లో 263 పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.మే 27న ప్రిలిమినరీ పరీక్ష, అక్టోబర్ 3న మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని బోర్డు తెలిపింది. డిసెంబర్ 9 నుంచి జనవరి 8 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు బోర్డు ప్రకటనలో పేర్కొంది
'ఈనాడు'ను ఏకిపారేసిన 'ఆంధ్రభూమి'
పెట్టుబడికి కట్టుకథకు
పుట్టిన విషపుత్రిక
-అంటూ సంసారపక్షపు నడిపాత ఆంధ్రపత్రికనే చడామడా దులిపాడు శ్రీశ్రీ! కూడబలుక్కున్నట్టు చెలరేగి తెలుగు జనానికి పిచ్చెత్తేలా బుద్ధి శుద్ధి చేస్తున్న గొప్ప పత్రికల దూకుడును ఈ కాలంలో చూసి ఉంటే మైకం ఠక్కున దిగి మహాకవి ఏమి చేసేవాడో! ఏమి రాసేవాడో!!
ప్రపంచం ఎంతో ముందుకు పోయినా, జర్నలిజం గురించి మన అవగాహన మాత్రం తాతలకాలం దగ్గరే ఆగిపోయింది. ఇది చాలా బోలెడు ఘోరం. కాకి బంగారపు దీపాల్లా ధగధగ వెలుగుతున్న రాజా పత్రికలను చూసైనా నిక్కమైన పత్రికా రచన అంటే ఏమిటో, ఎలా ఉండాలో తెలుసుకోవటం ప్రతి తెలుగువాడి తక్షణ కర్తవ్యం.
ఉదాహరణకు - ప్రజలకు దారి చూపాల్సిన పత్రికను నడిపే వాడికి కొంచెం నీతి, కాస్త నిజాయతి, రవంత వృత్తి నిబద్ధత, ఆవగింజలో వెయ్యోవంతు నిష్పాక్షికత, సత్యసంధత ఉంటాయని, ఉండాలని మనం చాదస్తంగా అనుకుంటున్నాం.
తప్పు! పత్రికను నడిపించేవాడికి కనీసం కిరోసిన్‌ను స్మగ్లింగ్ చేసిన లోకోత్తర పూర్వానుభవమైనా ఉండి ఉండాలి. వెధవది కిరసనాయిలునే సరిహద్దు దాటించి వేరే రాష్ట్రానికి చేరవేయలేనివాడు ప్రజాప్రయోజనాలను సమస్యలు దాటించి సురక్షిత గమ్యానికి ఎలా చేరవేయగలడు?
అలాగే - పాచినోటితో లోకానికి నీతులు ఉపదేశించే పత్రికాధిపతికి కనీసం ఒక పొలిటికల్ పార్టీలో పాలేరుగా పనిచేసి, ఓ మహానేతాశ్రీ పనుపున డబ్బు మూటలు బట్వాడా చేసిన పావన చరిత్ర ఉంటే మంచిది. మొన్నటిదాకా పూటకు ఠికానాలేని వాడివి ఏకంగా పెద్ద పత్రికనే ఎలా కొట్టెయ్యగలిగావంటే గాండ్రించి, డబాయించి, మీదపడి కరిచి నోళ్లు మూయించగల సత్తా ఉండటం బెటరు. తనకు ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు నడమంత్రపు సిరితో కంపరం పుట్టేలా మిడిసిపడి, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎంతటి వాళ్లన్నయినా గడ్డిపరకల్లా తీసిపారేసి, లక్షలమందికి ఆరాధ్యులైన వారి మీద కూడా గిట్టనివారి పురమాయింపుపై అభాండాల బండలు రువ్వగలిగిన గొప్ప సంస్కారం ఎంత ఉంటే అంత మేలు.
అదే మాదిరిగా - పత్రికారంగాన్ని ఉద్ధరించేందుకే భూమి మీద అవతారమెత్తిన మహానుభావుడికి కనీసం తనది కాని భూమిని దర్జాగా కబ్జా చేసి, రామప్పంతులులా కేసులు బనాయించి, అసలు హక్కుదారులను బతికినంతకాలం ఏడిపించి, ఉసురు పోసుకోగలిగినంత మంచితనమైనా కంపల్సరీ! ఎన్నివేల ఎకరాలను ఎంత అప్పనంగా కాజేస్తే, ఎన్ని కంపెనీలు పెట్టి ఎన్ని నిబంధనల నడ్డి విరగ్గొట్టి ఎన్ని అక్రమాలకు పాల్పడితే... ఊసరవెల్లికి సిగ్గొచ్చేలా సమయానికి తగ్గట్టు ఎన్ని రంగులు మారిస్తే అంత పేరు! అంత పొగరు!!
గోబెల్స్, గోబెల్స్ అని అందరూ తెగ అంటారు కాని గోబెల్స్ గాడిది ఏమి గొప్ప? ఒక అబద్ధం పదేపదే చెబితే నిజమైపోతుందని కనిపెట్టటమే కదా అతగాడు ఊడబొడిచిందల్లా?! అదే మన పుణ్యఫలం కొద్దీ మన పాలబడ్డ పత్రికారాజాలను చూడండి. నిజాన్ని తిరగవేసి అబద్ధంగా, అబద్ధాన్ని మరగవేసి నికార్సయిన నిజంగా చూపించి... గోరంతను కొండంతగా, కొండంతను గోరంతగా అవసరాన్నిబట్టి, ఆయా వ్యక్తులనుబట్టి, వారి మీద తమ ఇష్టానిష్టాలనుబట్టి, కులదైవాల ప్రయోజనాలనుబట్టి, పక్కా వ్యాపార స్వార్థాలనుబట్టి ఎలా తారుమారుగా తిమ్మినిబమ్మి చేసెయ్య వచ్చో తెలుగు పత్రికా మణిదీపాలను చూసే ఎవరైనా నేర్చుకోవాలి!
మాటవరసకు - ఉషోదయంతో అసత్యం నినదించుగాక అని శపథం పట్టిన నీతుల మారి పెద్ద పత్రిక ఒకానొక గాలిరెడ్డి అవినీతి గనుల్ని కూలీ అడక్కుండా కష్టపడి, కళ్లు తిరిగేలా తవ్విపోసింది. ఫలానా గనుల్లో ఎన్ని వేల కోట్లు గోల్‌మాల్ అయిందీ కచ్చితంగా కాకుల లెక్క గట్టి వెరిజనాన్ని ఔరా అనిపించింది. నాలుగు రోజుల తరవాత మళ్లీ అదే నోటితో, అంతే నేర్పుతో... సదరు గనుల ఖనిజం బహు నాసిరకమని, దాని పేరు చెప్పుకుని వేరే రాష్ట్రంలో ఇంకెక్కడో తవ్వకాలు జరిగాయనీ కొత్త కథను అల్లింది. ఔను మరి! ఎప్పుడూ ఒకే కథ అయితే చదివేవాళ్లకు బోరు కదా?!
జగన్ అనే పరమపాపికి ఫలానా అధికారులు నోటీసు ఇచ్చారని సంబరంగా రాసే పత్రిక... అదే పరిస్థితి తమ అభిమాన నాయకుడికి ఎదురైతే ‘‘ఏదో లేఖ రాసారంతే’’ అని తక్కువ చేసేస్తుంది.
పుణ్యాత్ముడు బాబు మీద తస్మదీయుల కేసు అయితేనేమో ‘‘వై.ఎస్. విజయ పిటీషన్ విచారణకు స్వీకరణ’’ అని చప్పగా చెప్పే మేటి పత్రిక అదే తాము పగబట్టిన పాపాత్ముడిపై అస్మదీయుల కేసులో అలాంటి నిర్ణయమే వస్తే ‘‘సిబిఐ బోనులో జగన్’’ అని ఉత్సాహంగా ఉరకలేస్తుంది. తాము పగబట్టిన వాడికి ఎమ్మెల్యేలు జై కొట్టినా, మిడిమేలపు మీడియాకు అది చీకొట్టినట్టే వినపడుతుంది.
పాపిష్టి విరోధి ఢిల్లీకి వెళితే అక్కడి పెద్దల కాళ్లావేళ్లా పడి దేబిరించినట్టు!
మహారాజశ్రీ బాబుగారు అలాంటి టూరే చేస్తేనేమో జాతీయ నాయకులతో భేటీ వేసినట్టు!
మన వాళ్ల మీద దృష్టి పెడితే అది ‘కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్’!
అదే మన పగవాళ్లమీద కన్ను వేస్తేనేమో అది నిప్పులాంటి నిష్ఠాగరిష్ఠ దర్యాప్తు సంస్థ. ఇలా ప్లేటు మారుస్తారేమిటంటే - హైకోర్టు ఆర్డరు ప్రకారం దర్యాపు కాబట్టి వంకలేదని వింత వివరణ! ‘తమరు కళ్లకద్దుకుంటున్న ఆర్డరును ప్రసాదించిన వారికి వేరేదో పెద్ద కుర్చీ దక్కిందట కదా’ అని మనం అడగాకూడదు. వారు విననూ కూడదు!
సిబిఐ కచేరీ తమ సొంత టీవీ స్టూడియో అయినట్టు, సర్కారీ పత్తేదారులు తమ కొలువులోని యాంకర్లు అయినట్టు, అక్కడ ఎవరిని ఏమి అడిగేదీ, ఎవరు ఏమి చెప్పేదీ, తరవాత ఏమి జరగబోయేదీ కెమెరాలు పెట్టి ప్రత్యక్ష ప్రసారం చేయిస్తున్నట్టు అమాయక జనానికి చెవిలో పూలు పెట్టటం తెలుగు మీడియా మోతుబరుల ప్రత్యేకత! ముఖ్యమంత్రి మహాశయుడు ఎక్కడికి వెళ్లినా ఎదురయ్యే నిరసన నినాదాలను జయజయ ధ్వానాలుగా చిత్రించి... ప్రతిపక్ష మహానాయకుడితో భుజం కలిపి ఏలినవారి పల్లకి మోసి తరించే మీడియాను వీక్షించటం మన పూర్వజన్మ సుకృతం. శత్రువును పాతరెయ్యటం కోసం ఎంతకైనా బరితెగించి, ఎన్ని నిలువుల లోతైనా నిజాన్ని పాతిపెట్టగలగటమే ఈ కాలపు పత్రికా ధర్మం!

రఘువీరాకు లోకాయుక్త పిలుపు!
మేఘమథనంలో అవినీతికి పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలపై మంత్రి రఘువీరారెడ్డిని తన ఎదుట హాజరు కావాలని లోకాయుక్త ఆదేశించింది. డిసెంబర్ 23న దీనిపై విచారణ జరుగుతుందంటూ నోటీసులు జారీ చేసింది. మేఘ మథనంలో రఘువీరా అవినీతికి పాల్పడ్డారంటూ.. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన టీడీపీ నేత నారాయణ స్వామి అక్టోబర్ 27న లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. మేఘమథనం ద్వారా రూ.200కోట్ల వరకు దుర్వినియోగం చేశారని, అందులో రూ.70 కోట్ల దాకా మంత్రికి ముట్టిందని నారాయణస్వామి ఆరోపించారు. దీనిపై లోకాయుక్త స్పందించింది. డిసెంబర్ 23న హాజరుకావాలని రఘువీరారెడ్డికి లోకాయుక్త నోటీసు పంపిందని నారాయణ స్వామి, టీడీపీ అనంతపురం జిల్లా ప్రధానకార్యదర్శి వరదాపురం సూరి ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మంత్రి అవినీతికి సంబంధించిన ఆధారాలతో తాము లోకాయుక్త ముందు హాజరవుతామని వారు చెప్పారు. అక్కడ న్యాయం జరగని పక్షంలో హైకోర్టుకు, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో కేవలం రూ.15 కోట్లు మేఘ మథనానికి ఖర్చుచేశామని పేర్కొన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రి రఘువీరారెడ్డి కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
Subscribe to:
Posts (Atom)