తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు చిత్తూరు జిల్లా నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో 50 శాతం మంది ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. రెండు నెలల్లోనే ఈ జిల్లాలో పార్టీకి విశేష స్పందన అభించింది. ఈ నియోజకర్గంలో 1,27,250 మంది ఓటర్లు ఈ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం వివరాలను జగన్మోహన రెడ్డికి అందజేశారు. 43 పంచాయతీల నుంచి నమోదైన సభ్యత్వం వివరాలను ఆయన తెలియజేశారు
Saturday, 15 October 2011
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు చిత్తూరు జిల్లా నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో 50 శాతం మంది ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. రెండు నెలల్లోనే ఈ జిల్లాలో పార్టీకి విశేష స్పందన అభించింది. ఈ నియోజకర్గంలో 1,27,250 మంది ఓటర్లు ఈ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం వివరాలను జగన్మోహన రెడ్డికి అందజేశారు. 43 పంచాయతీల నుంచి నమోదైన సభ్యత్వం వివరాలను ఆయన తెలియజేశారు
రాష్ట్రం విడిపోవడమంటే మన హృదయాన్ని పగులగొట్టడమేనన్నారు
కడప నగరంలో శుక్రవారం జరిగిన సీమ సమైక్యాంధ్ర సదస్సులో రాయలసీమ జిల్లాల నుండి మేధావులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థి సంఘం నాయకులు, మహిళా నాయకురాళ్లు కదం తొక్కారు. ఈ సందర్భంగా జెఎసి కన్వీనర్ సిహెచ్. చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ నాయకులు తమ ఉద్యమంతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజనకు ముందే నికర జలాల సమస్య, పెండింగ్ ప్రాజెక్టుల సమస్య తేల్చాల్చిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ విభజన రెండవ అంశంగా భావిస్తామన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ తెలంగాణ కన్నా రాయలసీమే అన్నింట వెనుకబడి ఉందన్నారు. పోతిరెడ్డిపాడుకు 30 రోజులు వరద నీళ్లు పారితే ప్రస్తుతం మనకు నీళ్లు వచ్చాయన్నారు. గాంధీగిరి అంటునే కెసిఆర్ రౌడీయిజం చేస్తున్నాడన్నారు. రాయలసీమ వాసులుగా మనం ఏం పోగొట్టుకున్నామో వారికి చెప్పవలసిన అవసరం ఉందన్నారు. మాజీ మంత్రి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో కూడా ఇలాంటి ఉద్యమాలు జరిగాయన్నారు. రాష్ట్రం విడిపోవడమంటే మన హృదయాన్ని పగులగొట్టడమేనన్నారు. మరో మాజీ మంత్రి రామమునిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విడిపోతే దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లుతుందన్నారు. ఉయ్యలవాడ నరసింహారెడ్డి అల్లూరు సీతారామరాజుకన్నా ముందే బ్రిటిష్ వారిపై పోరాడాడన్నారు. తెలంగాణ వారు మన మంచి తనాన్ని బలహీనతగా తీసుకుంటున్నారన్నారు. రాయలసీమ జర్నలిస్టు సంఘం నాయకులు రమేష్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడగొట్టే దమ్ము ఎవరికి లేదన్నారు. జెఎసి తీసుకునే ఎలాంటి నిర్ణయాలనైనా మీడియా అమలు చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే మనకు నీళ్లుండవు, ప్రాజెక్టులు కూడా వారే కట్టుకుంటారన్నారు. అందుకే మన భావాన్ని ఢిల్లీకి గట్టిగా తెలపాలన్నారు. మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ వారు నెల రోజులుగా పోరాటం చేస్తుంటే మనం చోద్యం చూడడం దురదృష్టకరమన్నారు. కర్నూలు టిడిపి నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ వారికి బుద్ధి వచ్చేలా మనం ఉద్యమించాలన్నారు. మైనార్టీ నాయకులు షేక్ హుస్సేన్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనను కోరటం మనం చేసిన త్యాగాలకు ఫలితమా అన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపే ప్రతిపాదనను ఖండించాలన్నారు. మైనార్టీ నాయకులు అమీర్‌బాబు మాట్లాడుతూ సమైక్యతే ముస్లింల మనోభావమన్నారు. లక్ష మంది పొట్టి శ్రీరాముల లాంటి వారు త్యాగాలకు సిద్ధంగా ఉన్నారన్నారు. అవసరమైతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధమన్నారు. ప్రొద్దుటూరు భార్ అసోసియేషన్ అధ్యక్షులు నూరుల్లా మాట్లాడుతూ రాయలసీమ ఉద్యమ కారులపై పోలీసులు పెట్టే ఎలాంటి కేసులైన తమ భార్ అసోసియేషన్ ఉచితంగా వాధిస్తుందన్నారు. మహిళా నాయకురాలు చిక్కేరు జానకి మాట్లాడుతూ తెలంగాణ పోరాటం స్వార్థపూరిత పోరాటమన్నారు. ప్రతి రోజు రాయలసీమ ఉద్యమం ఉండాలన్నారు. మరో నాయకురాలు అల్లె ప్రభావతి మాట్లాడుతూ ఉద్యమంలో ఉద్యమంలో మహిళల మనోభావం దెబ్బతింటోందని ఉద్యమంలో మా పాత్రే ముందుండాలన్నారు
ఆంధ్రప్రదేశ్ అంధేరా ప్రదేశ్‌గా మారిందన్నారు
విభజన పేర రాయలసీమను అడ్డంగా నరకొద్దని కళాకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, సినీ నటుడు నరేష్ అన్నారు. నగరంలోని రోడ్లు భవనాల అతిధి గృహంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన పేర వేల సంవత్సరాల చరిత్ర ఉన్న రాయలసీమను విడదీయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. రాజకీయ లబ్దికోసం, సీట్లసంఖ్య పేర ప్రభుత్వం సీమను విడదీయాలని చూస్తోందన్నారు. అదే జరిగితే పూర్తిగా నష్టపోయేది సీమవాసులేనన్నారు. ఇప్పటికే ప్రతేకవాదులు సీమవారిని గూండాలుగా చిత్రీకరిస్తున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో సీమలోని మేథావులు, విద్యార్థుల, రైతులు సీమ హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ ఉద్యమం బలపడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేని పరిస్థితికి వచ్చిందని, ఫలితంగా ఆంధ్రప్రదేశ్ అంధేరా ప్రదేశ్‌గా మారిందన్నారు.
సీమలో తాగు, సాగునీటి సమస్య, కరవు, ఫ్యాక్షన్ నెలకొన్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో సీమను విడదీస్తే అనంతపురం జిల్లా ఎడారిగా మారడం ఖాయమన్నారు. సీమ అభివృద్ధికి ప్రభుత్వం 30 టిసింఎంల నీరు కేటాయించాలని, రూ.50 వేల కోట్లతో ఇండస్ట్రియల్ అండ్ టూర్ ప్యాకేజీ ప్రకటించాలన్నారు. రాష్ట్రాన్ని విభజించాలనుకుంటే సీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని నరేష్ డిమాండ్ చేశారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను తిరుపతి రాజధానిగా విశాల రాయలసీమ రాష్ట్రాన్ని ప్రకటించాలన్నారు. తాను గతంలో బిజెపిలో ఉన్నపుడే ఈ ప్రతిపాదన చేశానన్నారు. విశాల రాయలసీమ కోసం త్వరలో రాజకీయాలకు అతీతంగా వేదిక ఏర్పాటుచేసి మేథావులు, రైతులు, విద్యార్థులతో చర్చించి ఉద్యమాన్ని మందుకు తీసుకువెళ్తామన్నారు. బిసి కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ విభజన పేర సీమను విడదీస్తే ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతామన్నారు. విశాల రాయలసీమ కోసం రథయాత్రలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో పెనుకొండ కాంగ్రెస్ నాయకులు రమేష్, జాకీర్‌హుసేన్, సరోజమ్మ, సుధాకర్, అమర్, కబీరయాదవ్ తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి వెనకాడము
రైతు సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రాక పోతే ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి వెనకాడమని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల వేరుసెనగ పంట దెబ్బతిన్న రైతులకు అండగా నిలవడం కోసం టిడిపి పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కరువు యాత్ర కార్యక్రమంలో శుక్రవారం లత్తవరణ పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, జిల్లా టిడిపి అధ్యక్షులు పార్థసారధిలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటు గొప్పలు చెబుతోందని, రైతులను ఆదుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని వారు ఆరోపించారు. రైతుల పక్షాన టిడిపి అండగా ఉంటుందని అన్నారు. రైతులకు పంట నష్టపరిహారం అందచేయలేదన్నారు. జిల్లా రైతులను ఆందుకోవడం కోసం ఈ సమస్యలను హైదరాబాద్ వరకు తీసుకెళ్లి మొండి ప్రభుత్వం మెడలు వంచడానికి దశలుగా టిడిపి అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని వారు తెలిపారు. పంట దెబ్బతిన్న రైతులకు పరిహరం పంపిణీ చేస్తామని, పంటల బీమా అందచేస్తామని ప్రభుత్వం ఇప్పటి వరకు రైతుల ఖాతా జమ చేయలేదన్నారు. జిల్లా రైతులను ఆదుకోవడం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని, రైతులకు రుణ మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎకరానికి 10 వేల రూపాయలు చొప్పున పరిహారం అందచేయాలని వారన్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులున్నప్పమటికీ రైతు గురించి మాట్లాడిన పాపాన పోలేదన్నారు. జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించి రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు. అప్పటికి ప్రభుత్వం దిగిరాక పోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు
Subscribe to:
Posts (Atom)