భారత క్రికెట్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై తనకు గల వ్యతిరేకతను
మరోసారి బయటపెట్టారు పార్లమెంటు సభ్యుడు, భారత క్రికెట్ జట్టు మాజీ
కెప్టెన్ మొహ్మద్ అజరుద్దీన్. సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న ఇవ్వడానికి
అనువుగా నిబంధనలను సవరించిన నేపథ్యంలో ఆయన ఓ ప్రకటన చేశారు. హాకీ లెజెండ్
ధ్యాన్‌చంద్‌కు ఇవ్వకుండా సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న ఇవ్వకూడదని ఆయన
శనివారం అన్నారు. సచిన్ టెండూల్కర్ కన్నా ముందు ధ్యాన్‌చంద్‌కు భారతరత్న
రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. సచిన్ టెండూల్కర్, ధ్యాన్‌చంద్‌లను
భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు అర్హులను చేస్తూ నిబంధలను
సవరించారు. వారిద్దరికి ఆ అవార్డు లభించడానికి వీలు కల్పించే ఆ సవరణలను
దేశం యావత్తూ స్వాగతించింది. సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న రావాలని దేశం
మొత్తం ఆశిస్తోంది. ఈ సమయంలో అజరుద్దీన్ అందుకు విరుద్ధంగా
ప్రతిస్పందించారు
Monday, 19 December 2011
హంతకులు దొరికితే అక్కడే కాల్చేయండి...కర్నూలు జిల్లా ఎస్పీ
కర్నూలు
జిల్లాలో గత కొద్ది రోజులుగా పెద్ద యెత్తున హత్యలు జరుగుతున్నాయి. నెలకు
పది నుంచి 15 హత్యలు జరుగుతున్నట్లు సమాచారం. సోమవారం కూడా ఓ హత్య
జరిగింది. పోలీసులంటే భయం లేకుండా పోయిందని ఎస్పీ అభిప్రాయపడుతున్నారు. గత
15 రోజుల వ్యవధిలో ఆరు హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. రౌడీ షీటర్లు,
పాతకక్షలు పెట్టుకున్నవారు ఇష్టారాజ్యంగా హత్యలకు పాల్పడుతున్నారనే
విమర్శలున్నాయి.
కర్నూలు జిల్లాలో హత్యలు పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా
పోలీసు సూపరింటిండెంట్ (ఎస్పీ) సోమవారం పోలీసులకు సంచలన ఆదేశాలు జారీ
చేశారు. హత్యా స్థలంలో నిందితులు కనిపిస్తే కాల్చేయాలని ఆయన పోలీసులకు
ఆదేశాలు జారీ చేశారు. నిందితులు వాహనంలో పారిపోతుంటే వాహనం టైర్లను
పేల్చేయాలని ఆయన ఆదేశించారు. హత్య కేసుల్లో అలా చేస్తే విచారణ ఉండదని ఆయన
చెప్పారు. నిందితులకు నేరుగా శిక్ష వేయాలని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధుల
సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పోలీసూ ఆయుధాన్ని దగ్గర
ఉంచుకోవాలని, సాధారణ పౌరులకు ఇబ్బంది కలగకూడదని ఆయన అన్నారు.
అలీ, బ్రహ్మానందంలకు నో చెప్పిన పూరీ జగన్నాధ్?
పాతికేళ్ల తర్వాత సత్యసాయి ప్రశాంతి నిలయంలో విద్యుత్ కోత
ఎన్టీఆర్, చిరులపై విమర్శలున్న బుక్ రూ. 10 వేలు
ప్రముఖ సినీ నిర్మాత, రచయిత ఎంఎస్.రెడ్డి(మల్లెమాల) ‘ఇది నా కథ’ పేరుతో తన
ఆత్మకథ రాసి పుస్తక రూపంలో ఆ మధ్య విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ
పుస్తకంలో తన సినీ జీవితంతో పాటు పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి,
జూనియర్ ఎన్టీఆర్, గుణశేఖర్ లాంటి వారిపై విమర్శలు చేస్తూ...సాధారణ జనాలకు
వారి మనస్తత్వం గురించి తెలియని విషయాలను బట్టబయలు చేశారు. ఒక రకంగా
చెప్పాలంటే తెలుగు సినీ పరిశ్రమలో చీకటి కోణాల్ని కూడా తన పుస్తకంలో
ఆవిష్కరించారు మల్లెమాల. ఈ పుస్తకంపై పరిశ్రమలో రగడ రేగిన నేపథ్యంలో
ఎంఎస్.రెడ్డి తనయుడు శ్యాంప్రసాద్ రెడ్డి వెంటనే ఆ
పుస్తకాలన్నింటినీ...మార్కెట్ నుంచి వెనక్కి తెప్పించారు. ఇటీవల
ఎంఎస్.రెడ్డి మరణించిన నేపథ్యంలో....ఈ పుస్తకం మళ్లీ హాట్ టాపిక్ అయింది. ఆ
పుస్తకాన్ని దక్కించుకోడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నా...ఎక్కడా దొరకడం
లేదు. ఇదే అదునుగా తొలుత ఆ పుస్తకాన్ని దక్కించుకున్న కొందరు వ్యక్తలు,
ఆపుస్తకాన్ని మరిన్ని కాపీలు తయారు చేయించి రూ. 10వేల చొప్పున గుట్టు
చప్పుడు కాకుండా బ్లాక్‌లో అమ్ముతున్నట్లు ఫిల్మ్ నగర్ లో తాజాగా
వినిపిస్తున్న సమాచారం.
పరిటాల అనుచరుడు చమన్‌పై హత్య కేసు కొట్టివేత
ఆస్ట్రేలియాలో చలికాలం పోయి వేసవి...మహేంద్ర సింగ్ ధోనీ
Subscribe to:
Posts (Atom)