తిరుపతి ఆర్టీసీ బస్టాండుకు వచ్చిన తెలంగాణ బస్సులకు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళహారతులు పట్టి ఘనంగా స్వాగతం పలికారు. మంగళవారం శాప్స్ ఆధ్వర్యంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండులో తెలంగాణ నుండి వచ్చిన బస్సులను శుభ్రం చేసి, పూజలు నిర్వహించి , ఆ బస్సుల డ్రైవర్లకు పూలదండలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాప్స్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, రాజారెడ్డి మాట్లాడుతూ సకల జనుల సమ్మె పేరుతో తెలంగాణ వాదులు రైల్‌రోకో ఆర్టీసీలో సమ్మె, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో సమ్మె చేశారన్నారు. కోస్తాంధ్ర నుండి హైదరాబాదుకు వెళ్లేబస్సులపైన కోదాడ వద్ద , రాయలసీమ వైపు నుండి వెళ్లే బస్సులపై మహబూబ్‌నగర్ వద్ద నిలిపి రాళ్లతో దాడిచేస్తే అందులో ప్రయాణికులను భీతావహుల్ని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సకల జనుల సమ్మె వలన సాధించింది శూన్యమని వారు అన్నారు. సమ్మె వల్ల ప్రభుత్వ ఆస్తులకు చాలా నష్టం వాటిల్లిందన్నారు. చివరికి తెలంగాణలోనే తిరుగుబాటు రావడంతో విధిలేని పరిస్థితుల్లో సమ్మెను విరమించుకున్నారన్నారు. శాప్స్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సింధుజ మాట్లాడుతూ సకల జనుల సమ్మె సందర్భంగా దసరా పండుగను తెలంగాణలో బహిష్కరిస్తే ఆ తెలంగాణ బస్సులకు రాయలసీమ, ఆంధ్రలకు చెందిన బస్సుల డ్రైవర్లు, కండక్టర్లతో తాము దసరా జరుపుకున్నామన్నారు
Wednesday, 19 October 2011
తెలంగాణ బస్సులకు మంగళహారతులు పట్టి ఘనంగా స్వాగతం పలికారు
కర్నూలు వైద్యశాలలో వైద్యుల పోరు వీధికెక్కింది
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వైద్యుల పోరు వీధికెక్కింది. ఒకరినొకరు దూషించుకోవడంతో పాటు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లింది. సోమవారం జరిగిన సంఘటన చినికిచినికి గాలివానగా మారి పెద్దాసుపత్రిలో ఆధిపత్య పోరుకు మరోసారి ఆజ్యం పోసినట్లయింది. సోమవారం మధ్యాహ్నం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుదర్శన్, ప్రిన్సిపాల్ డాక్టర్ భవానీప్రసాద్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వనాథరెడ్డి తదితరులు కలెక్టరేట్‌లో డెంగ్యూపై ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌పై చర్చించుకుంటున్న సమయంలో గొడవ ప్రారంభమైంది.
మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల స్క్రూటినీ చేయడానికి కొందరు వైద్యులు రావడం లేదని.. మరోసారి ఇలా చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్ సుదర్శన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో డాక్టర్ రాధాకృష్ణ, డాక్టర్ శ్రీహరి తదితరులు సూపరింటెండెంట్ చాంబర్‌కు వచ్చి ఈ విషయమై ప్రశ్నించారు. తమకు సమాచారం తెలపకుండా స్క్రూటినీ చేయడం లేదని ఎలా చెబుతారని ప్రశ్నిం చారు. సమాచారమిచ్చామని అధికారు లు, లేదని వైద్యులు చెప్పడంతో మాటామాటా పెరిగింది. ఒక దశలో తాను ఈ సీటులో కూర్చోలేనని, రాజీనామా చేస్తానని డాక్టర్ సుదర్శన్ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. డాక్టర్ విశ్వనాథరెడ్డి వల్లే ఇదంతా జరుగుతుందన్న ధోరణిలో వైద్యులు మాట్లాడటంతో ఘర్షణ మరిం త తీవ్రమైంది

ఈ నెల 27 నుంచి కార్తీకమాసం భక్తులకు ఎలాంటి లోటు రాకుండా ఏర్పాట్లు
పవిత్రమైన కార్తీక మాసంలో వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి లోటు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక గంగాసదన్ కాన్ఫరెన్స్‌హాల్‌లో ట్రస్ట్‌బోర్డు చైర్మన్ ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు అన్ని విభాగాల శాఖాధిపతులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కార్తీక సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి తదితర పర్వదినాల్లో విపరీతమైన రద్దీ ఉంటుందన్నారు. వాటిని దృష్టిలో ఉంచుకుని భక్తులకు వసతి, దర్శన సౌకర్యాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. వచ్చిన భక్తులందరికీ మల్లన్న దర్శనభాగ్యం కల్పించడానికి వీలుగా స్వామివార్ల అలంకార (దూర)దర్శనాన్ని ఏర్పా టు చేస్తున్నామన్నారు. ఇటీవల ప్రతి శని, ఆది, సోమవారాలలో ఏర్పాటు చేస్తున్న సామూహిక అ భిషేకాలను ఈ కార్తీకమాసం నెలరోజులు అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అనవాయితీ ప్రకారం కార్తీకమాసంలో ముందస్తు అభిషేకం టికెట్ ధర రూ.1500, కౌంటర్‌లో విక్రయించే టికెట్ ధర రూ. 1,000 గా పెంచినట్లు పేర్కొన్నారు. రద్దీ రోజుల్లోపాటు పర్వదినాలలో స్వామివార్ల దర్శనార్థమై వచ్చే ముఖ్య అతిధులు, విశిష్ట వ్యక్తులకు ప్రత్యేకంగా బ్రేక్ దర్శనం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే ప్రతిరోజూ రాత్రి 7.30 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ప్రత్యేక బ్రేక్ దర్శనం ఉంటుందని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సమావేశంలో ఈఈ రమేష్, డీఈ నాగేశ్వరరావు, ఏఈఓలు రాజశేఖర్, సదానందం, కేశవరావు, హార్టికల్చర్ ఏడీ ఈశ్వరరెడ్డి, పర్యవేక్షకులు కృష్ణారెడ్డి, హరిదాస్, నాగభూషణం, కేశవరెడ్డి, డి మల్లయ్య, మోహన్, సీఎస్‌ఓ కరుణానిధి, వన్‌టౌన్ ఎస్సై నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
ఈ నెల 21న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రాయదుర్గం పర్యటన
రూ. 1050 కోట్లతో రాయదు ర్గం- టుంకూరు రైల్వేలైన్ నిర్మాణం ప నులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 21న శంకుస్థాపన చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు వ చ్చిన ఆయన పట్టణంలోని అర్అండ్ బీ అతిథిగృహంలో మంగళవారం వి లేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 21న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రాయదుర్గం పర్యటన ఖ రారు అయినట్లు ఆయన ప్రకటించా రు. ముఖ్యమంత్రితో పాటు, కేంద్ర రైల్వే క్యాబినెట్ మంత్రి దినేష్ త్రివేది, సహాయ మంత్రి మునియప్ప వస్తున్నట్లు తెలిపారు.
ప్రథమంగా రాయదుర్గం మండలంలోని బీఎన్‌హళ్ళికి రాష్ట్ర ముఖ్యమంత్రి మంగళవారం 9 గంటలకల్లా చేరుకుని ఇందిర జలప్రభ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపా రు. సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన రూ. 1050 కోట్ల రాయదుర్గం- టుం కూరు రైల్వేలైన్ నిర్మాణం పనులకు, రూ.13 కోట్లతో ఓబుళాపురంలో ని ర్మించనున్న 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, డ్వామా భవనానికి, రూ.15 కోట్లతో బీటీపీ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు.

Subscribe to:
Posts (Atom)