తిరుచానూరులో వెలసిన శ్రీ పద్మావతి అమ్మవారితిరుచానూరులో వెలసిన ఆలయరథానికి కొన్ని మరమ్మతులు చేసి, శుక్రవారం ట్రయల్‌రన్ నిర్వహిస్తుండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రథ చక్రాలకింద కాళ్లు నలిగిపోయి ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈనెల 21న ప్రారంభం కానున్నాయి. ఆలయ బ్రహ్మరథం చక్రాలు శిథిలావస్థకు చేరుకోవడంతో వాటిని మార్చి హైడ్రాలిక్ బ్రేక్ సిస్టమ్ కలిగిన చక్రాలను అమర్చేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది.ఈ చక్రాల మార్పిడి కార్యక్రమాన్ని ప్రముఖ ఇంజీనింగ్ కంపెనీ 'భెల్'కు అప్పగించింది.ఇందుకు అయ్యే ఖర్చులో రూ.18 లక్షల రూపాయలు టీటీడీ అందించగా మిగతా రూ.22 లక్షలు భెల్ కంపెనీ భరించే విధంగా టీటీడీ ఒప్పందం చేసుకుంది. మూడు రోజులుగా రిపేర్ల నిర్వహించి భెల్ ఇంజనీరింగ్ సిబ్బంది రథ చక్రాలను మార్పిడి చేశారు. బ్రహ్మోత్సవ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా తిరుమాడవీధుల్లో శుక్రవారం ట్రయిల్ రన్ నిర్వహించారు. ఒక పరిభ్రమణం పూర్తయి తిరిగి యధాస్థానానికి చేర్చేందుకు తీసుకువస్తుండగా ఆస్థాన మండపం వద్ద అదుపుతప్పిన రథం పక్కనే ఉన్న అన్నదానం క్యూలైన్‌పైకి దూసుకుపోయింది
Friday, 4 November 2011
ఈరోజు 'మీసేవ' కార్యక్రమాన్నిప్రారంభించారు ముఖ్యమంత్రి
మహతి ఆడిటోరియంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు 'మీసేవ' కార్యక్రమాన్నిప్రారంభించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలలో అవినీతిని అరికట్టేందుకు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఇక నుండి ప్రజలు ధృవీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ ఉదయం చిత్తూరు జిల్లా తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో మీ కోసంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మీ కోసం ద్వారా ప్రజలు ఇక నుండి సులభంగా పది రకాల ధృవీకరణ పత్రాలు తీసుకోవచ్చునని చెప్పారు. ఇంతకుముందు మాదిరి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల కోసం చట్టాన్ని మార్చి దీనిని తీసుకు వచ్చామన్నారు. ప్రస్తుతం కృష్ణా, చిత్తూరు జిల్లాలో దీనిని ప్రవేశ పెడుతున్నామని, వచ్చే సంవత్సరం మార్చి 31వ తేదీలోగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రవేశ పెడతామని చెప్పారు
.
ఈ సందర్భంగా మాట్లాడిన తిరుపతి కాంగ్రెసు శాసనసభ్యుడు చిరంజీవి లోగో విషయంలో ఓ సలహా ఇచ్చారు. లోగో చాలా అద్భుతంగా కనిపిస్తోందని అయితే లోగో కింద ఉన్న త్వరగా తేలిగ్గా అనే పదాల కంటే సులభంగా వేగంగా అని ఉంచితే బాగుండేదని సూచించారు. సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా ఉంటుందనే తాను ఈ సలహా ఇస్తున్నానని ఈ విషయంలో ఆలోచించాలని ఆయన కోరారు. అన్నీ ప్రింట్ అయిపోయినందున ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు
పవన్ కళ్యాణ్ 'పంజా' ఆడియో రిలీజ్ నవంబర్ 19కు వాయిదా వేసారు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ‘పంజా’ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుకను ఈ నెల 13న గచ్చిబౌలి స్టేడియంలో జరపడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఆడియో వేడుక వాయిదా పడే అవకాశముందనే వార్తలు అందుతున్నాయి. దీనికి కారణం పవన్ కళ్యాన్ 'పంజా' సినిమాకు సంగీత దర్శకుడుయువన్ శంకర్‌రాజా. యువన్ శంకర్‌రాజా మదర్ జీవా (58) గత సోమవారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. టి నగర్ స్వగృహంలో ఉండగా రాత్రి ఆమెకు గుండెపోటు రావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు. కనుక ఈ సమయంలో ఆడియో వేడుకను జరపాలా వద్దా అనే సందిగ్ధంలో చిత్ర యూనిట్ ఉన్నారు. కానీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన ఈ వేడుకను ఆపొద్దని యువన్ శంకర్ రాజా ఈ యూనిట్ కి చెప్పాడని సమాచారం. యువన్ శంకర్ రాజా ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కుమారుడు.మొదట నవంబర్ 13న పవన్ కళ్యాణ్ 'పంజా' ఆడియో రిలీజ్ అనుకున్నారు. లాస్ట్ మినిట్ వర్క్ చాలా వుంటుంది కాబట్టిపై కారణం వలన నవంబర్ 19కు వాయిదా వేసారు
చంద్రబాబును విచారించండి:వైఎస్ జగన్ సీబీఐకి విజ్ఞప్తి చేశారు
ఓఎంసీ వ్యవహారంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడును కూడా విచారించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐకి విజ్ఞప్తి చేశారు. జగన్ శుక్రవారం ఉదయం కోఠీలోని సీబీఐ కార్యాలయానికి సాక్షిగా హాజరై తన వాదనలు వినిపించారు. సుమారు రెండు గంటల విచారణ అనంతరం బయటకు వచ్చిన జగన్ మీడియాతో మాట్లాడుతూ 2002 సంవత్సరంలోనే ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి 64.2 ఎకరాల భూమి లీజు ను బదిలీ చేశారన్నారు.అందుకు సంబంధించిన జీవో ప్రతిని ఆయన చూపించారు.
1996 సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాంమ్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఈ భూమిని గనుల లీజుకు ఇచ్చారని అన్నారు. అదే చంద్రబాబు 2002లో రాంమ్మోహన్ రెడ్డి నుంచి ఆ లీజును ఓఎంసీకి బదిలీ చేశారని జగన్ వివరించారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమని, వారి విచక్షణ మేరకే నిర్ణయాలు జరిగాయని ఓఎంసీకి గనుల లీజును బదిలీ చేసింది చంద్రబాబే అయినప్పుడు, ఏడాదిన్నరగా ఇదే అంశంపై విచారిస్తున్న సీబీఐ చంద్రబాబును కూడా విచారించాలని తాను అభ్యర్థించానని జగన్ అన్నారు. జీవో కాపీని సీబీఐ అధికారులకు అందచేసినట్లు కూడా ఆయన చెప్పారు
నకిలీ వనితా కార్డులపైన కడప డిపో అసిస్టెంట్ మేనేజర్ సంతకం
పేద, మధ్య తరగతి ప్రజలను ఆర్టీసీకి మరింత దగ్గర చేసే నిమిత్తం ఆర్టీసీ యాజమాన్యం తెల్లరేషన్ కార్డుదారులకు 100 రూపాయలకే వనితా కార్డు పేరిట క్యాట్ కార్డులను అందజేసిన సంగతి తెలిసిందే. ఈ కార్డు ద్వారా కుటుంబంలోని మొత్తం సభ్యులందరికీ 10 శాతం రాయితీతో ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ యాజమాన్యం కల్పించింది. ప్రజలకెంతో ఉపయోగకరంగా వుండటంతో పాటు ఆర్టీసీకి కూడా వనితా క్యాట్ కార్డు ఎంతో లాభదాయకంగా ఉంది. కానీ ఇటీవల కొంత మంది అసలైన వనితా కార్డులను కలర్ జిరాక్స్ చేసి ప్రయాణికులకు అమ్మారు. నకిలీ వనితా కార్డులపైన కడప డిపో అసిస్టెంట్ మేనేజర్ సంతకం కూడా చేసినట్లుంది
.
ఫలితంగా నకిలీ కార్డుల వల్ల ఆర్టీసీకి నష్టం వాటిల్లుతుంది. ముందుగా కార్డులను పరిశీలించి సంతకాలు పెట్టాల్సిన డిపో అసిస్టెంట్ మేనేజర్లు తమ విధులను సక్రమంగా చేయకపోవడం వల్లే నకిలీ వనితా కార్డులు పుట్టుకొస్తున్నాయి. ఈ నకిలీ వనితా కార్డుల అవినీతిలో డిపో అసిస్టెంట్ మేనేజర్లకు భాగస్వామ్యం ఉంటుందనే సందేహం కార్మికుల్లో వ్యక్తమవుతోంది. వనితా క్యాట్ కార్డులోని ఫొటోలను, కార్డులపై ఆర్టీసీ అధికారులు పెట్టిన సంతకాలు, వేసిన సీలును మాత్రమే కండక్టర్ పరిశీలిస్తారు. అంతేగాని డ్యూటీలో ఉన్న కండక్టర్ ఆ కార్డు ఒరిజినల్, లేక నకిలీ అని పరిశీలించే పరిస్థితి ఉండదు. కొంతమంది అవినీతి సీఐలు చేసిన మోసాల తప్పిదాలకు కండక్టర్లపై అక్రమ కేసులు బనాయించి బాధ్యులను చేస్తున్నారు
.
ఫలితంగా నకిలీ కార్డుల వల్ల ఆర్టీసీకి నష్టం వాటిల్లుతుంది. ముందుగా కార్డులను పరిశీలించి సంతకాలు పెట్టాల్సిన డిపో అసిస్టెంట్ మేనేజర్లు తమ విధులను సక్రమంగా చేయకపోవడం వల్లే నకిలీ వనితా కార్డులు పుట్టుకొస్తున్నాయి. ఈ నకిలీ వనితా కార్డుల అవినీతిలో డిపో అసిస్టెంట్ మేనేజర్లకు భాగస్వామ్యం ఉంటుందనే సందేహం కార్మికుల్లో వ్యక్తమవుతోంది. వనితా క్యాట్ కార్డులోని ఫొటోలను, కార్డులపై ఆర్టీసీ అధికారులు పెట్టిన సంతకాలు, వేసిన సీలును మాత్రమే కండక్టర్ పరిశీలిస్తారు. అంతేగాని డ్యూటీలో ఉన్న కండక్టర్ ఆ కార్డు ఒరిజినల్, లేక నకిలీ అని పరిశీలించే పరిస్థితి ఉండదు. కొంతమంది అవినీతి సీఐలు చేసిన మోసాల తప్పిదాలకు కండక్టర్లపై అక్రమ కేసులు బనాయించి బాధ్యులను చేస్తున్నారు
తిరుపతి నగరంలో రూ.20 కోట్లతో కృషిచేస్తానని ఎమ్మెల్యే చిరంజీవి ప్రకటించారు
తిరుపతి నగరంలో రూ.20 కోట్లతో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే చిరంజీవి ప్రకటించారు. కండలేరు నుంచి తిరుపతికి తాగునీటిని సరఫరా చేసేందుకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి తెస్తానన్నారు. తిరుపతిలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. జంగాలపల్లి శ్రీనివాసులు కుమారుడు మదనమోహన్, టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఓవీ రమణ కుమార్తె మాధురి వివాహాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.అనంతరం న్యూ ఇందిరా నగర్, బా లాజీ కాలనీ, ఉప్పంగి దళితవాడ, అయ్యప్ప కాలనీ, చింతలచేనుల్లో రూ.1.8కోట్లతో చేపట్టే డ్రైన్లు, సీసీ రోడ్లు, పాఠశాల భవనానికి ఆయన భూమిపూజ చేశారు. వివిధ ప్రాం తాల్లో మాట్లాడారు. అందరిలా తాను హామీలిచ్చి మరచిపోయే వాడిని కాదని, మాటకు కట్టుబడి అభివృద్ధి చేస్తానని స్పష్టంచేశారు. నగరంలో కాలువలు, రోడ్ల నిర్మాణానికి ప్రా ధాన్యమిస్తామన్నారు.
అయ్యప్ప కాలనీలో తాగునీటి సమస్య, ఇంటి పట్టాలు, మహిళల కు రుణాలు అందించడానికి చర్యలు తీసుకుంటానన్నారు. ఇప్పటికే 330 బోర్లను మరమ్మతులు చేసి నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. కార్పొరేషన్ టిప్పర్ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అవుట్ సోర్సింగ్ కింద ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. దీనికి సంబంధించిన ఉత్తవర్వలను జారీ చేసినట్లు కమిషనర్ ప్రసాద్ తెలిపారు. చింతలచేను చౌకదుకాణంలో కిలో రూపాయి బియ్యం పథకాన్ని చిరంజీవి ప్రారంభించారు
చంద్రబాబునాయుడుకు తిరుపతిలడ్డూను అందజేశారు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తిరుపతి తెలుగుదేశంనాయకులు తిరుపతిలడ్డూను అందజేశారు. నిత్యం కరువుతో సతమతమవుతున్న అనంతపురం జిల్లా రైతులకు అండగా టీడీపీ అధినేతచంద్రబాబునాయుడు పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ తిరుపతికి చెందిన తెలుగుదేశంపార్టీ బృందం వెంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని అందజేశారు. చంద్రబాబునాయుడు బుధవారం ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం మండలం సీసీ.కొత్తకోట నుంచి రైతన్నలకు ఆత్మస్థైర్యం కల్పించడంలో భాగంగా 20 కి.మీ పాదయాత్ర చేపట్టారు
Subscribe to:
Posts (Atom)