మంత్రులు
చెప్పినట్లు చేయడానికి ఐఏఎస్ అధికారులేం చిన్న పిల్లలు కాదని మాజీ మంత్రి,
అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు జెసి దివాకర్
రెడ్డి ఆదివారం న్యూఢిల్లీలో అన్నారు. మంత్రులు చెప్పినట్లు తాము చేశామని
చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు. అక్రమాలలో తమ బాధ్యత లేదని చెప్పడం
సరికాదన్నారు. మంత్రుల బాధ్యత ఉందని చెబుతున్న ఐఏఎస్ అధికారుల ఏ మంత్రి
అవినీతికి పాల్పడ్డారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఆపద వచ్చిందని
మంత్రుల పైకి తప్పు నెట్టేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి
తలెత్తడం దురదృష్టకరమన్నారు. మేం ఎన్నిక ఎలెక్ట్ అయిన వారమని, వారు
సెలెక్ట్ అయిన వారని, ఇరువురం ప్రజా సేవ కోసమే ఉన్నామన్నారు. తాము చిన్న
చేపలమని వారు ఒప్పుకున్నారు కదా అని అన్నారు.
కాగా అంతకుముందు రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్
విజయవాడలో ఐఏఎస్‌ల తీరును తప్పు పట్టిన విషయం తెలిసిందే. రాజకీయ నేతల్లాగే
ఐఏఎస్ అధికారులపై ప్రజలకు నమ్మకం పోవడం బాధాకరమన్నారు. ఐఏఎస్‌లు తీసుకునే
నిర్ణయాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. సిబిఐ విచారణపై ఐఏఎస్
అధికారులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలవడాన్ని ఆయన తప్పు పట్టారు.
అక్రమాలలో తమ తప్పు లేదని చెప్పడం అధికారులకు సరికాదన్నారు. కనీస ప్రాథమిక
సూత్రాలు కూడా మరిచిపోయి వ్యవహరించిన వారి తీరు చాలా విచారకరమన్నారు.
చట్టాలు రాజకీయ నాయకులు చేసినా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు.
Sunday, 5 February 2012
యువరాజ్ సింగ్ కు క్యాన్సర్
భారత క్రికెట్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. భారత జట్టు డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్
సింగ్ అభిమానులకు ఇది మరింత ఆందోళన కలిగించే వార్త. యువరాజ్ సింగ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడని సమాచారం. ఈ మేరకు ఆయన అమెరికాలో కీమోథెరపీ చికిత్స పొందుతున్నారు. భారత్ కు మరోసారి ప్రపంచకప్ వచ్చేందుకు కారణమయిన యువరాజ్ సింగ్ ఆ తరువాత క్యాన్సర్ ఉందని తెలిసినట్లు సమాచారం.
సింగ్ అభిమానులకు ఇది మరింత ఆందోళన కలిగించే వార్త. యువరాజ్ సింగ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడని సమాచారం. ఈ మేరకు ఆయన అమెరికాలో కీమోథెరపీ చికిత్స పొందుతున్నారు. భారత్ కు మరోసారి ప్రపంచకప్ వచ్చేందుకు కారణమయిన యువరాజ్ సింగ్ ఆ తరువాత క్యాన్సర్ ఉందని తెలిసినట్లు సమాచారం.
మార్చి వరకు ఆయనకు కీమోథెరపి చికిత్స జరుగుతుందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆయనకు క్యాన్సర్ మొదటి దశలోనే ఉందని, ఆయనకు ఎలాంటి ప్రమాదంలేదని యువీ వ్యక్తిగత వైద్యుడు చెబుతున్నాడు. కీమోథెరపీ చికిత్స మూడుదశల్లో జరుగుతుందని వైద్యుడు జతిన్ చౌదరి చెబుతున్నారు. తన ఆటతీరుతో, అందచందాలతో బాలీవుడ్ భామల మనసులు దోచుకున్న యువరాజ్ క్రికెట్ లో తన సత్తా చాటుకున్నాడు. ఆయనకు క్యాన్సర్ ఉందన్న వార్తలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.
గత అక్టోబర్ లోనే గుండెకు, ఊపిరితిత్తుల మధ్య వైద్యులు కణితిని గుర్తించారు. అయితే అది అంత ప్రమాదకరం కాదని మొదట అనుకున్నారు. క్రమేణా అది ఇబ్బందిగా మారడంతో చికిత్సను ప్రారంభించారు.
దీనికి సంబంధించి నమస్తే రాయలసీమ .కం గతంలోనే ఓ వార్తను ప్రచురించింది. ఆ వార్త లింక్ ఇది ... archive story
Subscribe to:
Posts (Atom)