Monday, 20 February 2012

సచిన్ టెండుల్కర్ కు ఎమ్మారై స్కాన్

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు వైద్యులు ఎమ్మారై స్కాన్‌ తీశారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో బ్రెట్‌ లీ బౌలింగ్‌లో ఓ బంతి సచిన్‌ హెల్మెట్‌కు బలంగా తాకింది. మాస్టర్‌ కుడి కన్నుపై తగలడంతో ముందు జాగ్రత్తగా స్కాన్‌ తీస్తే మంచిదని వైద్యులు సూచించారు. బంతి తగిలిన తర్వాత కూడా అలాగే బ్యాటింగ్‌ చేసిన మాస్టర్‌ కాసేపటికే ఔటయ్యాడు. పెవిలియన్‌లో అతనికి ఐస్‌ ట్రీట్‌మెంట్ చేశారు.  బ్రెట్‌లీ వేసిన బంతికి తగిన సమయంలో అతను జవాబు చెప్పలేకపోయాడు. దీంతో బంతి ముందు జాగ్రత్తగా ఎంఆర్ఐ స్కాన్ తీయించుకునే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు. బ్రెట్‌లీ రెండో ఓవరు చివరి బంతి పేస్‌ను అంచనా వేయలేకపోవడంతో అది అతని హెల్మెట్ గ్రిల్‌కు తగిలింది. దానివల్ల సచిన్ టెండూల్కర్ నుదటికి దెబ్బ తగిలినట్లు అనుమానిస్తున్నారు. అతను బ్యాటింగును కొనసాగించాడు. అయితే ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే అతను అవుటయ్యాడు. డ్రెసింగ్ రూంలో సచిన్ టెండూల్కర్‌కు ఐస్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. నుదురు ఉబ్బినట్లు చెబుతున్నారు. పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ ఎంఆర్ఐ స్కాన్‌కు వైద్యులు సలహా ఇచ్చారు. భారత జట్టులోని రాజకీయాలు, రోటేషన్ పద్ధతి వల్ల పక్కన కూర్చోవాల్సి రావడం, వందో శతకం చేయాలనే ఒత్తిడి సచిన్ టెండూల్కర్‌ను ఈ స్థితికి తెచ్చినట్లు చెబుతున్నారు.

తిరుమలలో భారీ అగ్నిప్రమాదం

తిరుమలలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీవారి ఆలయం సమీపంలో టిటీడీ మినీ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడుతుండడంతో భక్తులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో 10 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదుగానీ, సుమారు 25 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్‌సర్య్యూట్‌వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలియవచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

శ్రీశైలం పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిట

శ్రీశైలం పుణ్య క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. రాత్రి 7 గంటలకు నందివాహనసేవతో స్వామివారి గ్రామోత్సవం, ఎదుర్కోల్ల ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. రాత్రి 10:30 గంటలకు లింగోద్భోవకాల మహాన్వసపూర్వక రుద్రాభిషేకం, రాత్రి 12 గంటలకు భ్రమరాంభిక-మల్లికార్జుస్వామి వారి కల్యాణోత్సవం జరగనుంది. చిత్తూరు  మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయం భక్తులతో పోటెత్తింది. ముక్కోటిని దర్శించుకోడానికి వేలాది మంది భక్తులు బారులు తీరారు. తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనం సుమారు ఆరు గంటల సమయం పడుతోంది.