Wednesday, 23 November 2011

సత్యసాయిబాబా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి సత్యసాయిబాబా జయంతి వేడుకలకు సిద్దమైంది. బాబా శివైక్యం పొందిన తరువాత మొదటి సారి జరుగుతున్న వేడుకలకు సత్యసాయి ట్రస్టు చర్యలు చేపట్టింది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి భక్తులు చేరుకున్నారు. మరోవైపు సత్యసాయిడీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సం ఇవాళ జరుగనుంది. అనంతపురం జిల్లా పుట్టపర్తి సత్యసాయిబాబా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ట్రస్టు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బాబా భౌతికంగా దూరమైన తరువాత నిర్వహించే మొదటి జన్మదిన వేడుక ఇది. ప్రతిసారి సాయిపుట్టిన రోజున బాబాను దర్శించుకొని భక్తులు పులకించిపోయేవారు. బాబా ప్రకటించే సేవాకార్యక్రమాలకోసం ఉత్కంఠంగా ఎదురు చూసేవారు. ఈసందర్భంగా ఆయన ప్రత్యేక రథంలో ఊరేగి అందరిని దీవించే వారు. భక్తులు బాబా పాదాలను తాకి పరవశించిపోయేవారు. ఈ సారి బాబా భౌతికంగా లేకపోవడాన్ని భక్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. బాబా పుట్టిన రోజు వేడుకలను చూసి తరచేందుకు దేశ, విదేశాలనుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆయన తమతో లేకపోయిన సాయి దివ్యసమాధిని దర్శించుకునేందుకే ఇక్కడికి వచ్చామంటున్నారు. సత్యసాయిబాబా డీమ్డ్ యూనివర్సిటీ 30వ స్నాతకోత్సవం వేడుక ఇవాళ జరగనుంది. ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ మందిరంలో చాన్స్‌లర్ జస్టిస్ భగవతి అధ్యక్షతన ఈ వేడుకలు జరుగనున్నాయి. ముఖ్యఅతిధిగా బెంగుళూరుకు చెందిన పరిశోధనా శాఖ డైరెక్టర్ బలరాం పాల్గొంటారు. ప్రతిభకనబరిచిన విద్యార్ధులకు బంగారు పతకాలను బహూకరిస్తారు.

శ్రీరామ రాజ్యం సినిమాలో బాలకృష్ణకే ఈ క్రెడిట్ మొత్తం:నయనతార

బాలకృష్ణ, నయనతార కాంబినేషన్ లో బాపు రూపొందించిన శ్రీరామ రాజ్యం చిత్రం రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అందరికన్నా సీతగా వేసిన నయనతారకే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణకే ఈ క్రెడిట్ మొత్తం దక్కుతుందన్నారు. ఆమె మాటల్లోనే... గతంలో మేమిద్దరం కలిసి సింహా సినిమాకి పనిచేసాం. శ్రీరామ రాజ్యం వంటి సినిమాలో చెయ్యటానకి ఆయనే కారణం. ఆయనే నేను సీత పాత్రకు న్యాయం చేయగలనని నమ్మి ఆ పాత్రను రికమెండ్ చేయటం జరిగింది

తాను రక్తం అమ్ముకునే రకం కాదని:మెగాస్టార్ చిరంజీవి

 
తాను రక్తం అమ్ముకునే రకం కాదని కాంగ్రెసు శానససభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మెగా రక్త దాన శిబిరాన్ని ఆనయ బుధవారం ప్రారంభించారు. తన బ్లడ్ బ్యాంకుపై గతంలో వచ్చిన ఆరోపణలపై ఆయన ఈ సందర్భంగా తీవ్రంగా స్పందించారు. తన బ్లడ్ బ్యాంకులో అక్రమాలు జరగలేదని ప్రభుత్వం నియమించిన కమిటీ తేల్చేసిందని, తాను రక్తం అమ్ముకోవడం లేదని ఈ రోజు తేలిపోయిందని ఆయన అన్నారు. తన సొంత డబ్బులతో చిరంజీవి రక్త దాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. బ్లడ్ బ్యాంక్ నిర్వహణకు తాను ఎవరి నుంచి కూడా విరాళాలు వసూలు చేయలేదని అన్నారు. ఇతర బ్లడ్ బ్యాంకుల కన్నా తక్కువ ధరకే తమ బ్లడ్ బ్యాంక్ రక్తాన్ని ఇస్తోందని, అందుకు తనకు గర్వంగా ఉందని ఆయన అన్నారు. తాను బ్ల్డడ్ బ్యాంక్ నిర్వహణకు ఇతరుల నుంచి నయాపైసా తీసుకోలేదని చెప్పారు. తనకు నటన కన్నా బ్లడ్ బ్యాంక్ నిర్వహణ ముఖ్యమని ఆయన అన్నారు

పవన్ కళ్యాణ్ తో కలిసే ఉన్నామని:అల్లు అర్జున్ వివరణ ఇచ్చారు

                                          Danayya In Mega Compound 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా కుటుంబంతో విడిపోయారు అని రెండు మూడు రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను అల్లు అర్జన్ ఖండించారు. వాటిలో నిజం లేదని...తామంతా పవన్ కళ్యాణ్ తో కలిసే ఉన్నామని, ఆయన ఒంటరి కాదని  మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. పంజా ఆడియో సమయంలో చిరంజీవి ఢిల్లీలో ఉన్నారని, రామ్ చరణ్ చైనాలో ఉన్నారని, తాను షూటింగు నుంచి తిరి వచ్చేసరికి లేటైందని...అందుకే ఆ ఫంక్షన్ కు హారు కాలేక పోయామని అల్లు అర్జున్ వివరణ ఇచ్చారు. అన్ని ఫంక్షన్ లకు అందరూ రావడం వీలు కాదని, ఒక ఫంక్షన్ కు రానంత మాత్రాన అలా రాసేస్తారా? అంటూ మీడియా తీరుపై అర్జున్ అసహనం వ్యక్తం చేశారు. మీడియా కథనాలు తనను చాలా బాధించాయని చెప్పకొచ్చారు. ఇటీవల జరిగిన పంజా ఆడియో వేడుకకు మెగా కుటుంబం నుంచి ఎవరూ హాజరు కాక పోవడానికి తోడు, తనకు అన్నయ్య వారసత్వం అవసరం లేదని పవన్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో.....మెగా కుటుంబంతో పవన్ విడిపోయారనే ఊహాగానాలకు కారణమైంది. అయితే ఈ వార్తలపై పవన్ కళ్యాణ్ స్పందించక పోవడం గమనార్హం

108 సర్వీసుల్ని నడుపలేం: జీవీకే సంస్థ లేఖ

108 సర్వీసుల్ని నడుపలేమంటూ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డికి జీవికే సంస్థ లేఖ రాసింది. తక్షణం బకాయిలు చెల్లించకపోతే ... 108 సర్వీసులు ఆగిపోయే పరిస్థితి వస్తుందని మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డికి జీవీకే సంస్థ లేఖలో తెలిపారు. ప్రభుత్వం నుంచి 31 కోట్ల 25 లక్షల రూపాయల బకాయిని జీవికే సంస్థకు చెల్లించాల్సి ఉంది. జీవీకే సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వమే ఉల్లంఘిస్తోందని జీవీకే సంస్థ లేఖలో పేర్కోంది

అవిశ్వాసం తీర్మానం పెడుతాం: ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

ప్రభుత్వం తప్పించుకోలేకుండా అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెడుతామని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. నిబంధనల ప్రకారమే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతామన్నారు. నవంబర్ 30 తేదిన జరిగే టీడీఎల్పీ సమావేశం తర్వాత అవిశ్వాస తీర్మానం ఎప్పుడు ప్రవేశపెట్టేది
తెలియచేస్తామన్నారు

టీటీడీకి పెద్ద షాక్:రూ.20 కోట్లిస్తే నీళ్లిస్తాం

తిరుమలలో ఏర్పడిన నీటి ఇబ్బందులను అధిగమించడానికి టీటీడీ కసరత్తు చేస్తోంది. తిరుపతి కార్పొరేషన్ సహాయంతో రోజుకు 10 లక్షల గ్యాలన్ల నీటిని కొండకు తరలించే ఆలోచన చేసిన టీటీడీకి అక్కడి నుంచి పెద్ద షాక్ తగిలింది. రూ.20 కోట్లిస్తే నీళ్లిస్తాం అనే షరతు ఎదురు కావడంతో దేవస్థానం అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు.తిరుమలకు వచ్చే యాత్రికులు, సిబ్బంది, స్థానికుల అవసరాల కోసం రోజుకు 28 నుంచి 30 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతోంది. తిరుమలలోని కుమారధార-పసుపుధార, పాపవినాశనం, గోగర్భం జలాశయాలతో పాటు శ్రీవారి మెట్టు సమీపంలోని కల్యాణి డ్యాంలో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్న సమయంలో యాత్రికుల అవసరం మేరకు టీటీడీ నీటిని అందిస్తోంది. కొంత కాలంగా వర్షాలు ముఖం చాటేయడంతో తిరుమల, కల్యాణి జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొండ మీద నీటి తిప్పలు తప్పవనే అంచనాతో టీటీడీ అధికారులు నీటి పొదుపునకు చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం అన్ని మార్గాల్లో రోజుకు 16 నుంచి 17 లక్షల గ్యాలన్ల నీటిని మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా కైలాసగిరి రిజర్వాయర్, తిరుపతి కార్పొరేషన్ నుంచి రోజుకు 10 లక్షల గ్యాలన్ల నీటిని తిరుమలకు తీసుకెళ్లేందుకు టీటీడీ ఆలోచించింది. అలిపిరి మార్గంలో ఉన్న పైప్‌లైన్ల ద్వారా తమ సంప్‌లకు నీటిని అందిస్తే రివర్స్ పంపింగ్‌తో తాము తిరుమలకు తీసుకెళతామని ప్రతిపాదించింది.మంచి తరుణం మించిన దొరకదనుకున్న కార్పొరేషన్ అధికారులు కైలాసగిరి రిజర్వాయర్ నుంచి రోజూ అదనంగా 10 లక్షల గ్యాలన్ల నీటిని పంపింగ్ చేసి అందించడానికి అవరమైన మరమ్మతులు, పైప్‌లైన్ పనుల కోసం రూ.20 కోట్లు అందచేయాలని టీటీడీకి టెండర్ పెట్టారని తెలిసింది. తాము తిరుమలకు నీరివ్వాలని అడిగితే తిరుపతి నీటి ఎద్దడి మొత్తం తీర్చేందుకు అవసరమయ్యే సొమ్ము కార్పొరేషన్ అధికారులు అడుగుతున్నారంటూ దేవస్థానం ఉన్నతాధికారులు ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనను విరమించుకున్నట్టు సమాచారం. అయితే తిరుపతి వాసుల దాహార్తి తీర్చాల్సిన బాధ్యత టీటీడీ మీద కూడా ఉందంటూ కార్పొరేషన్ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ఈ సొమ్ము రాబట్టుకునే యోచనలో ఉన్నారు. సీఎం సమక్షంలో ఇటీవల జరుపతలపెట్టిన తిరుపతి టాస్క్‌ఫోర్స్ సమావేశంలో ఈ కోరికను వెల్లడించాలని భావించారు. ఈ సమావేశం రద్దు కావడంతో ఇతర మార్గాల్లో ప్రభుత్వానికి తమ విన్నపాన్ని వినిపించాలనే ఆలోచన చేస్తున్నారు. కొండకు నీళ్లడిగితే కార్పొరేషన్‌కు కోట్ల రూపాయలు ఎదురివ్వాల్సి వస్తుందనే భయంతో టీటీడీ అధికారులు తిరుమలలో నీటి పొదుపునకు శ్రీకారం చుట్టారు

(ఎస్కేయూ) దూరవిద్య పీజీ ప్రశ్నపత్రాలు లీక్

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ (ఎస్కేయూ) దూరవిద్య పీజీ ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. దీంతో బుధవారం నుంచి జరగాల్సిన పరీక్షలను రద్దు చేశారు. మంగళవారం ఇంగ్లీషు పరీక్ష రాశారు. ఎస్కేయూ దూరవిద్య కేంద్రం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరీక్ష కేంద్రాలకు పంపిన ప్రశ్నపత్రాల్లో ప్రకాశం జిల్లాలో ఓ కాలేజీ వద్ద బుధవారం జరగాల్సిన తెలుగు పేపర్ లీక్ అయినట్లు వార్తలు వచ్చాయి. అనంతపురం జిల్లాలో కూడా ప్రశ్నపత్రం బయటపడడంతో యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్, దూరవిద్య కేంద్రం డెరైక్టర్లు అవాక్కయ్యారు. ఎక్కడ పరీక్ష పేపర్ లీక్ అయిందో తెలియకపోవడంతో వీసీ ఆచార్య రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శికి విషయాన్ని వివరించారు. వారి ఆదేశాల మేరకు కలెక్టర్, ఎస్పీలతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేరుగా ఎస్కేయూకి చేరుకుని దూరవిద్య కేంద్రం డెరైక్టర్‌తో పాటు రిజిస్ట్రార్, ఇతర దూరవిద్య కేంద్రం అధికారులతో రాత్రి 9.30 వరకు సమావేశమయ్యారు. తెలుగు పేపర్ ఒక్కటే లీక్ అయిందా లేక అన్ని పేపర్లూ లీక్ అయ్యాయా అన్న విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ సూచనల మేరకు బుధవారం నుంచి జరగాల్సిన దూరవిద్య పీజీ పరీక్షలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. లీకైన ఘటనపై విచారణ చేస్తామని చెప్పారు.

మూడు రోజుల్లోనే తత్కాల్ పాస్‌పోర్ట్

ఇకపై దరఖాస్తు చేసిన మూడు రోజుల్లోనే తత్కాల్ పాస్‌పోర్ట్ జారీ చేస్తామని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి డాక్టర్ శ్రీకర్‌రెడ్డి వెల్లడించారు. 30 రోజుల్లోగా ఆర్డినరీ పాస్‌పోర్ట్‌లు అందచేస్తామని చెప్పారు. పాస్‌పోర్ట్ సేవాకేంద్రం(పీఎస్‌కే)లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 25వ తేదీన రాష్ట్రంలో మరో మూడు పాస్‌పోర్ట్ సేవాకేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకూ మాన్యువల్‌గా స్వీకరిస్తున్న దరఖాస్తులను ఇకపై పీఎస్‌కేలలో ఇ-ప్రాసెసింగ్ ద్వారా తీసుకుంటామని తెలిపారు