Monday, 2 January 2012
జగన్ అక్రమాస్తుల కేసులో తొలి అరెస్ట్...జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయిరెడ్డి
దూరంగా పొండి అంటూ మీడియాఫై...నాగార్జున ఫైర్
క్రికెట్‌లో సచిన్ గొప్ప బ్యాట్స్‌మన్‌గా గొప్పతనం...కెప్టెన్ క్లార్క్
|
ద్విచక్ర వాహనాలతో కాలేజీలకు వచ్చేవిద్యార్థులకు హెల్మెట్ తప్పనిసరి
కర్నూలు జిల్లా ఉప ఎన్నికల అభ్యర్థులపై పార్టీల కసరత్తు!
విద్యార్థిలా దర్శనమిచ్చిన ద్రవిడ్!
సీనియర్ బ్యాట్స్‌మన్‌గా టీమిండియాకు ఎనలేని సేవలు అందిస్తున్న ‘మిస్టర్
డిపెండబుల్’ రాహుల్ ద్రవిడ్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు
సాధించిన రెండవ మేటి బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కి ఉండవచ్చు. కానీ
క్రికెట్‌లో మాత్రం ద్రవిడ్ ఇప్పటికీ నిత్య విద్యార్థిగానే కొనసాగతున్నాడు.
ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్
(ఎస్‌సిజి)లో మంగళవారం నుంచి ప్రారభం కానున్న రెండో టెస్టు సన్నద్ధమవుతున్న
ద్రవిడ్ ఆదివారం ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొని మరోసారి
విద్యార్థిలా దర్శనమిచ్చాడు. బ్యాటింగ్‌లో కొత్త మెళకువలను నేర్చుకుంటూ
క్రికెట్ పట్ల తనకున్న నిబద్ధతను, అంకితభావాన్ని చాటుకున్నాడు. ఫీల్డింగ్
కోచ్ ట్రెవర్ పెన్నీ స్వల్ప దూరం నుంచి విసురుతున్న బంతులను ఎదుర్కొంటూ
సాధన చేసిన ద్రవిడ్ తన బ్యాటింగ్ తీరును నిశితంగా గమనించి తగిన సలహాలు,
సూచనలు ఇవ్వాల్సిందిగా టీమిండియా కోచ్ డంకన్ ఫ్లెచర్‌ను కోరాడు. ఈ
సిరీస్‌లో భాగంగా ఇంతకుముందు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన తొలి
టెస్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ క్లీన్‌బౌల్డ్‌గా పెవిలియన్‌కు చేరిన ద్రవిడ్
ఇప్పుడు నెట్స్‌లో తన బ్యాటింగ్ తీరును మరోసారి సమీక్షించుకుని లోపాలను
సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాడు. మైదానంలో ప్రత్యర్థి జట్టు బౌలర్లు
విసిరే బంతులను డిఫెన్సివ్ స్ట్రోక్స్ రూపంలో ఆఫ్ సైడ్‌కు తరలిస్తున్నప్పడు
తన బ్యాట్‌కు-ప్యాడ్‌కు మధ్య ఎందుకు గ్యాప్ ఏర్పడుతోందో
పరిశీలించుకున్నాడు. నెట్ ప్రాక్టీస్‌లో ద్రవిడ్ ఆటతీరును పరిశీలించిన
ఫీల్డింగ్ కోచ్ ట్రెవర్ పెన్నీ, జట్టు కోచ్ ఫ్లెచర్ పైన పేర్కొన్న లోపాన్ని
సరిదిద్దేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ద్రవిడ్‌తో పాటు
టీమిండియాలోని మిగిలిన సభ్యులు కూడా ఉదయం 9 గంటలకే మైదానంలోకి దిగి
ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్‌ను కొనసాగించారు. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర
సెవాగ్, ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్, సీనియర్ పేసర్ జహీర్ ఖాన్,
విరాట్ కోహ్లి నెట్స్‌లో ఎంతో ఉల్లాసంగా గడిపారు. బిసిసిఐ (్భరత క్రికెట్
కంట్రోల్ బోర్డు) సెలెక్టర్లు నరేంద్ర హీర్వాణి, మొహిందర్ అమర్‌నాథ్ కూడా
నెట్స్ వద్దకు వచ్చి ఆటగాళ్ల సాధనను పరిశీలించారు.
డీఎస్సీ నోటిఫికేషన్‌కు సీఎం ఆమోదం
రాష్ట్రంలో భారీగా టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఇచ్చింది. ఇప్పటికే ఖాళీగా 11 వేల పోస్టులతోపాటు మరో తొమ్మిదివేల పోస్టులకు
సీఎం ఆమోదం తెలిపారు. జనవరి 15 తేది తర్వాత 20 వేల పోస్టులతో డీఎస్సీ
నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేయనుంది. 11 వేల 139 ఖాళీలను ఇప్పటికే
గుర్తించారు. వాటిలో 7 వేలకు పైగా ఎస్‌జీటీ పోస్టులు, 2 వేలకు పైగా స్కూల్
అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ పోస్టులకు తోడుగా
మరో 9 వేల 659 పోస్టులను ఒకేసారి భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు
చేపట్టింది.
డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాలయసీమ జిల్లాల వారీగా ఉన్న టీచర్ పోస్టుల ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్తూరు- 528, కడప- 97, అనంతరపురం- 399, కర్నూలు- 625
డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాలయసీమ జిల్లాల వారీగా ఉన్న టీచర్ పోస్టుల ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్తూరు- 528, కడప- 97, అనంతరపురం- 399, కర్నూలు- 625
Subscribe to:
Posts (Atom)