Sunday, 23 October 2011

చిరంజీవి సినిమా స్క్రిప్టు ఓకే చేసారు

                                
చిరంజీవి చివరకు స్క్రిప్టు ఓకే చేసారు.అయితే అది ఆయన నటించే చిత్రానికి కాదు..తన కుమారుడు రామ్ చరణ్ చిత్రానికి. వివి వినాయిక్ దర్సకత్వంలో రూపొందనున్న చిత్రానికి చెందిన స్క్రిప్టుని చిరంజీవి విని సంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక ఆ స్క్రిప్టుని ఆకుల శివ రాసారు. కోన వెంకట్ డైలాగులు రాసారు.కాజల్ హీరోయిన్ గా చేయబోయే ఈ చిత్రం ఓ యాక్షన్ ఎంటర్టైన్మెంట్. ఈ చిత్రం అనంతరం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ నిర్మించే చిత్రంలో రామ్ చరణ్ చేస్తారు. ప్రస్తుతం రామ్ చరణ్ మరో ప్రక్క రచ్చ చిత్రం బిజీలో ఉన్నారు. ఆ చిత్రం జనవరిలో విడుదల చేయాలని నిర్ణంయించుకున్నారు. ఏమైంది ఈ వేళ తో ప్రతిభావంతుడైన దర్శకునిగా పేరు తెచ్చుకున్న సంపత్‌నంది ఈ చిత్రానికి దర్శకుడు. మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్.వి.ప్రసాద్, పారాస్‌జైన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్నా ఇందులో హీరోయిన్ గా చేస్తోంది.. శ్రీలంక, బ్యాంకాక్‌ల్లో ఇప్పటికే భారీ షెడ్యూల్స్ చేశారు.

అనంత క్రీడా గ్రామంలో 57వ రాష్ట్రస్థాయి అండర్-17 బాల, బాలికల హాకీ పోటీలు

కృషితో రాణించాలని కలెక్టర్ దుర్గాదాస్ పిలుపునిచ్చారు. శనివారం అనంత క్రీడా గ్రామంలో 57వ రాష్ట్రస్థాయి అండర్-17 బాల, బాలికల హాకీ పోటీలు ఘనంగా ప్రా రంభమ య్యాయి. ముఖ్య అతిథుగా కలెక్టర్‌తో పాటు, ఏజేసీ చెన్నకేశవరావు, డీఎస్‌డీఓ సీఎల్‌న్‌రెడ్డి, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు అనంత చంద్రారెడ్డి హాజర య్యారు. కలెక్టర్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు ముఖ్యం కాదని, ప్రతిభ కనబర్చాలన్నారు

జిల్లాలోని 25 మండలాల్లో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు

జిల్లాలోని 25 మండలాల్లో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ చెప్పారు. శనివారం ఉదయం డిఆర్‌డిఎ సమావేశ మందిరంలో గ్రామ సమాఖ్య ప్రతినిధులు, ఎపిఎంలతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐకెపి ద్వారా మహిళా సంఘాలు ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నాయని తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు వల్ల పేద రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరడమేగాక స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా పరిపుష్టి అవుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఐకెపి సంఘాల ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు పెద్ద ఎత్తున విజయవంతంగా జరుగుతోందన్నారు. అనంతపురం జిల్లాలో కూడా ఇటీవల ఈ కార్యక్రమం ప్రారంభమైందని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో కూడా రామచంద్రాపురం, వెదురుకుప్పం, వాల్మీకిపురం, గుర్రంకొండ, కలికిరి, కలకడ, పిటిఎం, బి.కొత్తకోట, మదనపల్లి, నిమ్మనపల్లి, మొలకలచెరువు, తంబళ్లపల్లి, పెద్దపంజాణి, రామసముద్రం, సోమల, కుప్పం, తూర్పుప్రాంతాల్లోని తొమ్మిది మండలాలో కలిపి 25 మండలాల్లోకెపి సంఘాల ద్వారా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రతి సమాఖ్య ఐదుగురి సభ్యులతో సేకరణ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని ఈ కమిటీలకు రెండు రోజుల శిక్షణ ఇస్తామని తెలిపారు. ఎలాంటి ధాన్యం కొనుగోలు చేయాలి, ధాన్యంలో తేమ కొలవడానికి యంత్రాలు, ఎలక్ట్రానిక్ తూనిక పరికరాలు, గోనె సంచిలు అందజేస్తామని చెప్పారు. శిక్షణా కార్యక్రమంలో సమగ్రంగా అవగాహన కలిగిస్తామని చెప్పారు. వ్యవసాయ, రెవిన్యూ శాఖల ద్వారా రైతుల్లో కూడా అవగాహన కల్పించాలని తెలిపారు

కర్నూలు రాజధానిని పోగొట్టుకుని రాయలసీమ అంతా ఎంతో నష్టపోయింది

                                       
కర్నూలు ప్రజలను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది, వారు ఎంత దురదృష్టవంతులో ఇప్పుడు అర్థం అవుతుంది. కర్నూలు రాజధానిని పోగొట్టుకుని రాయలసీమ అంతా ఎంతో నష్టపోయింది అంటూ కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ అభివృద్ధిపై శనివారం కర్నూలులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మట్లాడుతూ కొందరు పాత రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం రాజధానిని హైదరాబాదుకు తరలించడమే రాయలసీమకు శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాదు రాజధాని అయ్యే నాటికి అక్కడ భూములు ఎకరా 20 రూపాయలు వుండేదని అదే సమయంలో రాయలసీమలో ఎకరా 800 రూపాయలకు క్రయ వియ్రాయలు జరిగేవని రికార్డులు చెబుతున్నాయని అన్నారు. అదే ఇప్పుడు హైదరాబాదు చుట్టుపక్కల భూమి కావాలంటే 20 కోట్ల రూపాయలు కావాలని, అదే రాయలసీమలో 20 లక్షలకు మించిపోవడం లేదని బాధపడ్డారు. కర్నూలు రాజధానిగా వుండి వుంటే హైదరాబాదులో జరిగిన అభివృద్ధి కారణంగా కడప, చిత్తూరు, అనంతపురం, తిరుపతి వంటి పట్టణాలతోపాటు మొత్తం రాయలసీమలోని ప్రతి వ్యక్తికి భారీ ఎత్తున సంపాదన ఆస్తి పాస్తులు వుండేవని, అదంతాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నాయకులు రాజకీయాలను పక్కనపెట్టి ఏకతాటిపైకి వచ్చి రాయలసీమ అభివృద్ధి కోసం కృషి చేయాలనుకోవడం సంతోషించదగ్గ పరిణామమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో పరిశ్రమల స్థాపనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. బ్రహ్మి కర్మాగారాన్ని కేంద్రం చేపట్టి తద్వారా రాయలసీమ వాసులకు ఉద్యోగావకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా వుందని అన్నారు. రాయలసీమలోని వనరులను వినియోగించి అభివృద్ధిపర్చేందుకు ఎంత పెట్టుబడి అయినా పెట్టి ప్రజల కోరికను, ఆకాంక్షను నెరవేర్చకపోతే అభివృద్ధి కోసం ఉద్యమాలు వచ్చే ప్రమాదం వుందని హెచ్చరించారు

సత్యసాయి సెంట్రల్ ట్రస్టు కీలకసమావేశం నేడు

                          
సత్యసాయి సెంట్రల్ ట్రస్టు కీలకసమావేశం నేడు ప్రశాంతినిలయంలో జరగనున్నట్లు సమాచారం తెలిసింది. సత్యసాయి శివైక్యం పొందిన తర్వాత పలుమార్లు ట్రస్టుసభ్యులు వివిధ అంశాలపై కీలకభేటీ నిర్వహించినప్పటికీ ఆదివారం నిర్వహించబోయే సమావేశం ప్రాధాన్యతను సంతరించుకోనుంది. ప్రధానంగా సత్యసాయి జన్మదిన వేడుకలు మరో మాసం గడువులో జరగనున్న దృష్ట్యా జన్మదిన ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా గతంలో జన్మదిన వేడుకల కు సంబంధించి ట్రస్టు వర్గాలు ఏర్పా ట్ల బాధ్యతను నిర్వహిస్తుండగా సత్యసాయిబాబా స్వీయపర్యవేక్షణలో ఆయన సూచనల మేరకు జన్మదిన వేడుకలు జరిగేవి. అయితే ఈ మారు భౌతికంగా సాయి లేని జన్మదిన వేడుకలు జరుగుతున్న దృష్ట్యా ఏ తరహా ప్రక్రియను అనుసరించాలనే అంశంపై కీలకభేటీలో విస్తృతంగా చర్చించే అవకాశముంది. ప్రధానంగా విజయదశమి వేడుకల సందర్భంగా ట్రస్టువర్గాలు సమావేశమై పలు అంశాలపై చర్చించినప్పటికీ కొన్ని అర్ధాంతర చర్చలకే పరిమితమైనట్లు సమాచారం. అయితే ఆదివారం నాటి సమావేశంలో ట్రస్టుసభ్యులతో పాటు మేనేజింగ్ ట్రస్టీసభ్యులు కూడా సమావేశమై విస్తృతంగా చర్చలు జరిపి జన్మదిన సందర్భంగా నిర్వహించాల్సిన ఏర్పాట్లపైన విస్తృతంగా చర్చించనున్నారు. దీనికి తోడు జన్మదిన సందర్భంగా గతంలో ప్రతిపాదించబడిన సత్యసాయి నిత్య అన్నదాన సేవాకార్యక్రమంపై కీలకభేటీలో ప్రధానంగా చర్చించి ఆ అంశాన్ని అమలుపరిచే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. నవంబర్ 18 నుండి ప్రారంభమయ్యే వేడుకలను పురస్కరించుకొని దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ సందర్శించే భక్తుల విషయాల్లో ఒక నిర్దిష్ణప్రణాళికతో కూడిన వ్యూహాన్ని రచించి జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలనే దిశలో ట్రస్టువర్గాలు ప్రధాన దృష్టినిలిపే అవకాశం వుందని తెలుస్తోంది

సీమ జిల్లాల్లో చైతన్యం తెద్దాం



సీమ జిల్లాల్లో చైతన్యం తెద్దాం కర్నూలు వేదికగా హాజరైన నేతలు ఇదే స్ఫూర్తితో రాయలసీమ జిల్లాలోని ప్రాంతాల్లో నిరంతర సదస్సులు ఏ ర్పాటు చేసుకొని ప్రజల్లోచైతన్యం తీసుకుని రావాలని నేతలు కోరారు. ఇప్పటి వరకు కడప, కర్నూలు వేదికగా జరిగి న సదస్సులు విజయవంతం కావడం తో అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో స దస్సులు నిర్వహించి సమైక్య నినాదా న్ని తెలంగాణ నినాదం కంటే బలోపే తం చేసేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.

పార్టీలకతీతంగా హాజరైన నేతలు సీమ జిల్లాల్లోని కాంగ్రెస్, తెలుగుదే శం, జగన్ పార్టీలకు చెందిన పలువురు నేతలు సమైక్యాంధ్ర నినాదాన్ని చాటా రు. రాయలసీమ హక్కుల ఐక్యవేదిక కన్వీనర్ టీజీ వెంకటేష్, కన్వీనర్‌సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు కేఈ కృష్ణమూర్తి, మైసూరారెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, వీర శివారెడ్డి, మీనాక్షినాయుడు, నిమ్మలకిష్టప్ప, కేఈ ప్రభాకర్, ఎస్‌వీ మోహన్‌రెడ్డి, లింగారెడ్డి, పల్లెరఘునాథరెడ్డి, ఎన్.తులసిరెడ్డి, ఆదినారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, గురునాథ్‌రెడ్డి, అ బ్దుల్‌ఘని, శ్రీకాంత్‌రెడ్డి, కాటసాని రా మిరెడ్డి, డాక్టర్ పి.రవి, సుబ్బారెడ్డి, వరదరాజులరెడ్డి, సుధాకర్‌బాబు, బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి, పోచంరెడ్డిసుబ్బారెడ్డి, చెన్నకేశవరెడ్డి, కమలమ్మ, టీజీ భ రత్ తదితరులు పాల్గొన్నారు