Sunday, 27 November 2011

పవన్ కళ్యాణ్ బాబాయ్ కి విషెష్.....రామ్ చరణ్

రామ్ చరణ్ తాజాగా విడుదలైన పంజా ఆడియోని ఉద్దేశించి ట్వీట్ చేసారు. ఆయన మాటల్లోనే...కళ్యాణ్ బాబాయ్ కి విషెష్,విష్ణు వర్ధన్ మరియు పంజా టీమ్ కి ఆల్ ది బెస్ట్. మిగతా బాబాయి సినిమాల సంగీతం లాగానే పంజా ఆడియో కూడా సక్సెస్ అవుతుంది.బాబాయ్ కు నా శుభాకాంక్షలు.చైనాలో నేను షూటింగ్ లో బిజీగా ఉన్నాను.నేను ఆడియో ఫంక్షన్ కి మిస్సయ్యాను. మీరంతా ఈవెంట్ ని,మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తున్నారని భావిస్తున్నాను.పంజాలో పాటలు విన్నాను. అవి సింపుల్లీ సూపర్బ్.ముఖ్యంగా ఓపినింగ్ సాంగ్ గురించి చెప్పుకోవాలి.మెగా ఫ్యాన్స్ తరుపున యవన్ శంకర్ రాజా కు కంగ్రాట్స్ చెప్తున్నాను అన్నారు. రామ్ చరణ్ ..రీసెంట్ గా జరిగిన పంజా ఆడియో కి రామ్ చరణ్ మరియు మెగా కుటుంబం లో ఎవరూ రాకపోవటంతో మీడియాలో ఇదో చర్చనీయాంశమైంది. దీనికి వివరణగా ఈ ట్వీట్ ని ఆయన చేసినట్లు అర్దమవుతోంది 

మరో నెలలో రెండో పెళ్లికి ....సిద్దార్థ్

సిద్దార్థ్ 2003లో తన గర్ల్‌ఫ్రెండ్ మేగ్నాను పెళ్లి చేసుకున్నారు. ఆమెతో 2006లో విడాకులు పొందారు. ఇప్పుడు మళ్లీ రెండో పెళ్లికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.మరో నెలలో ఇందుకు సంభందించిన ప్రకటన రానుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని మీడియా వారు అడిగితే.. మీరీ ప్రశ్న వేస్తారని తెలుసు. విశే షమేమిటనేది నెల తర్వాత చెబుతా అన్నారు. ఇక గత కొంత కాలంగా హీరోయిన్ శృతిహాసన్‌తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇక రీసెంట్ గా ఆయన నటించిన చిత్రం ఓ మై ప్రెండ్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం పెద్దగా వర్కవుట్ కాలేదు. అందులో శృతి హాసన్,సిద్దార్ధ కేవలం స్నేహితులుగానే కనిపిస్తారు. తాము కలిసి పెరిగి,తిరిగినంత మాత్రాన ప్రేమ కాదని, స్నేహమేనని ఒప్పించే ప్రయత్నం చేస్తారు

కర్నూలు నగర ప్రజలకు ఉచిత మినరల్ వాటర్

కర్నూలు తాగునీటి సమస్య ప్రధానంగా ఉన్న కర్నూలు నగరం లో పేదవారికి కూడా మినరల్ వాటర్ అందుబాటులో కి వచ్చింది. ప్రధాన కూడళ్లలో చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేరుతో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లు వెలిశాయి. నగర ప్రజలు ఎదుర్కొంటున్న తా గునీటి సమస్యను దృష్టిలో ఉంచుకున్న టీజీ వెంకటేష్ స్థలం, షెల్టరు, నీరు అందిస్తే 20 మినరల్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తానని మున్సిపాలిటీకి దరఖాస్తు చేశారు. వాటర్ ప్లాంటుకు అవసరమైన మిషనరీ, కూలర్, నిర్వహణ బాధ్యతలను తానే భరిస్తానని దరఖాస్తులో పేర్కొన్నారు. కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో ఇందుకు ఆమోదం లభించింది.అనంతరం నగరంలో ఇప్పటిదా కా 13 వాటర్‌ప్లాంట్లను నెలకొల్పారు. దాని ద్వారా ఉచితంగా మినరల్ వాటర్‌ను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు. దీంతో నగరానికి వచ్చిన గ్రామీణులకు, స్థానికులకు దప్పిక తీర్చే కేంద్రాలుగా మినరల్ వాటర్ ప్లాంట్లు నిలుస్తున్నాయి. టీజీవీ కుమారుడు భరత్ ఈ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతను చూస్తున్నారు.ఇక ఎండాకాలంలో గొంతులెండవు.. ఇక ఎండాకాలంలో నగర ప్రజలకు గొంతులెండే పరిస్థితులుండవని పలువురంటున్నారు. ప్రతిరోజూ 15నుంచి 20వేల మంది ఉపయోగించుకుంటున్నారని నిర్వాహకులు చెబుతున్నారు

సామాజిక సేవలో.... ఎన్‌సీసీ


సామాజిక సేవలో.... ఎన్‌సీసీ కేడెట్లకు కేవలం కవాతు, ఫైరింగ్ లాంటి శిక్షణ ఇవ్వడమే గాక సామాజిక సేవలో ఎన్‌సీసీ కేడెట్లు ముందుండే విధంగా కూడా శిక్షణ ఇస్తారు. అనేక సందర్భాలలో వరద లు, భారీ వర్షాలకు అతలాకుతలమైన ప్రాంతాల్లో నిస్వార్థంగా సేవలు అం దించి ఎంతో మందిని సురక్షిత ప్రాం తాలకు చేర్చిన ఘన చరిత్ర ఎన్‌సీసీ కేడెట్లకు ఉంది. ప్రజల్లో కాన్సర్, ఎయిడ్స్, డెంగ్యూ లాంటి ప్రాణాంతక వ్యాధులపై అవగాహన కలిగించేందు కు ర్యాలీ నిర్వహించి మారుమూల ప్రాంతీయుల్లో చైతన్యం తీసుకొస్తూ ప్రజలను రుగ్మతల నుంచి దూరం చే సే ప్రయత్నం చేస్తుంటారు. ప్రాథమిక చికిత్సపై ఎన్‌సీసీ కేడెట్లకు పూర్తి అవ గాహన ఉన్నందున ప్రమాదం ఉన్న వారికి ముందుగా ప్రధమ చికిత్స చేస్తారు.ప్రత్యేక అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌సీసీలో చేరి 'సి' సర్టిఫికెట్ సాధించిన విద్యార్థులకు ఉన్నత చదువులకు ప్రత్యేక అవకాశాలు కల్పి స్తోంది. ఇంజనీరింగ్ కళాశాలల్లో ఒక శాతం రిజర్వేషన్ ఉంటుంది. అంటే ఏటా ఏడేనిమిది వందల మంది ఇంజనీరింగ్ సీట్లు, 0.25 శాతం మెడిసిన్ సీట్లు పొందేందుకు ఎన్‌సీసీ కేడెట్ల రిజర్వేషన్ ఉంది. ఎంబీఏ, ఎన్‌సీఏ, పోస్టు గ్రాడ్యుయేషన్, ఎల్ఎ ల్‌బీ, డైట్, బీఎడ్ కళాశాలల్లో ఒక శా తం ఎన్‌సీసీ కెడెట్లకు ప్రత్యేక రిజర్వేషన్ ఉండడం విశేషం.ఉద్యోగాలు ఎన్‌సీసీ 'సి' సర్టిఫికెట్ పొంది డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీలో ఇం డియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ) డెహడూన్‌లో 64 పోస్టులు, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ) చెన్న య్‌లో 100 పోస్టులు రిజర్వ్ చేస్తారు. నావీలో 6 పోస్టులు రిజర్వ్ చేసి ఉం టారు. అంతే కాక 2 నుంచి 10 శాతం పోస్టులను ఎన్‌సీసీ 'సి' సర్టిఫికెట్ వారి కోసం బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్, కోస్టుగార్డ్, ఐటీబీపీల్లో రిజర్వ్ చేస్తారు. 

కడప జిల్లా పులివెందుల్లో సోలార్ విద్యుత్ కేంద్రం

రాష్ట్రంలోనే మొట్టమొదటి సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లో ఏర్పాటవుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 5 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కానుంది. ఇందుకోసం సుమారు 100 కోట్ల రూపాయలను వెచ్చించనున్నారు. ఈ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని వెల్స్‌పన్ సోలార్ ఎపి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చే స్తోంది. ఒక్కొక్క మెగావాట్ సోలార్ విద్యుదుత్పత్తికి 14 కోట్ల రూపాయల వ్యయం కానుందని మొత్తం 5 మెగావాట్లకు 70 కోట్ల రూపాయలు అవసరం కానుండగా పులివెందుల పారిశ్రామికవాడలో 40 ఎకరాల భూమి, భవన నిర్మాణాలకు మరో 30 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. మూడు నెలల క్రితమే పనులు ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ప్యానల్ వర్క్ తదితర పనులు సాగుతున్నాయి. మరోవైపు సోలార్ విద్యుదుత్పత్తికి అవసరమైన ప్యానల్ బోర్డులు సహా ఇతరత్రా పరికరాలు ఉత్పత్తి కేంద్రానికి చేరుకున్నాయి. మరో 40, 50 రోజుల్లో ఈ పనులన్నింటిని పూర్తి చేసి డిసెంబర్ చివరిలో లేదా జనవరిలో విద్యుదుత్పత్తిని ప్రారంభించనున్నట్లు ఆ ప్రతినిధి పేర్కొన్నారు

శ్రీవారికి ట్రాన్స్‌ట్రోయ్ రూ. 1,72,42,625 కోట్ల విరాళం

తిరుమల శ్రీవారి అన్నదానం కోసం హైదరాబాద్‌లో ఉన్న ట్రాన్స్‌ట్రోయ్ (ఇండియా) లిమిటెడ్ సంస్థ ఒక కోటి డభ్భై రెండు లక్షల నలభై రెడువేల ఆరువందల ఇరవై ఐదు రూపాయల (1,72,42,625/-) విరాళం ఇచ్చింది

రైతు సమస్యలపై డిసెంబర్ 8న అనంతపురం జిల్లా బంద్

రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన కరువు మండలాల జాబితాలో జిల్లాను పరిగణించకుండా, వరుస కరువులతో అల్లాడుతున్న "అనంత''కు వేయికోట్లిచ్చి ప్రత్యేక ప్యాకేజీతో జిల్లాను ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర రైతు సంఘ అధ్యక్షులు కే.రామక్రిష్ణ డిమాండ్ చేశారు. వరుస కరువులతో అల్లాడుతున్న అనంత ప్రజలను ఆదుకోడానికి శాశ్వత కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అన్ని రంగాల ఫీజుల మాఫీ చేసి, ఉపకారవేతనాలివ్వాలన్నారు. బ్యాంకుల్లోని వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేయాలన్నారు. సాగు, తాగునీరు అందించడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కోరారు. వర్షపాతానికి అనుగుణంగా పంటలు సాగు చేసేందుకు నిపుణులు, శాస్త్రవేత్తలు రైతులతో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. రైతులు కరువుబారిన పడకుండా సూక్ష్మ సేద్య పరికరాలన్నింటినీ ఉచితంగా అందివ్వాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 8న జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నామన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చేపడుతున్న జిల్లా బంద్‌లో రైతులు, విద్యార్థులు, మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.