Tuesday, 3 January 2012
2012లో సచిన్ వందో సెంచరీ చేస్తాడా...?
కెప్టెన్ ధోనీకి ఫెయిర్ ప్లే అవార్డు
తారకరత్నపై జూ ఎన్టీఆర్ సీరియస్!
జగన్ లక్ష్యంగా విజయ సాయిరెడ్డి అరెస్టు?
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి
ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి అరెస్టు
వెనుక పెద్ద కథ నడిచినట్టుగా విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలిసిందని జగన్‌కు
చెందిన సాక్షి దిన పత్రిక రాసింది. అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు
జరగనుండటం, మరో పదహారు మంది ఎమ్మెల్యేలపై అనర్హత ఫిర్యాదు స్పీకర్ వద్ద
పెండింగులో ఉందని, ఈ నేపథ్యంలో జగన్‌ను ఏదోలా ఇరుకున పెట్టే యత్నంలో
భాగంగా, సిఎం కిరణ్ కుమార్ రెడ్డి తాజా ఢిల్లీ పర్యటన, కేంద్ర హోంమంత్రి
చిదంబరంతో ఆయన చర్చల పర్యవసనంగానే ఈ అరెస్టు చోటు చేసుకుందన్న వాదన
వినిపిస్తోందని రాసింది. విచారణలో సిబిఐకి సాయి రెడ్డి పూర్తిగా
సహకరించారని, క్రమం తప్పకుండా ఆయన విచారణకు హాజరవుతున్నప్పటికీ అరెస్టు
చేయడం వెనుక రాజకీయమైన ఒత్తిళ్లు పని చేశాయనే అనుమానం వ్యక్తం చేసింది.అవిశ్వాసం
సందర్భంగా కాంగ్రెసు విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తే
జరగబోయే ఉప ఎన్నికలు కాంగ్రెసు, టిడిపికి ఇబ్బందికరమేనని, ఈ నేపథ్యంలో
జగన్ ప్రతిష్టను దెబ్బతీయాలన్న లక్ష్యం, ఒత్తిళ్ల కారణంగానే అరెస్టు
జరిగిందని వాదనలు వినిపిస్తున్నాయని పేర్కొంది. ఏడాదిగా సొంత పార్టీ
తలనొప్పులతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి ఎదురవుతున్న పెను
సవాళ్ల నేపథ్యంలో తాజాగా సిఎం ఢిల్లీలో చిదంబరంతో సుదీర్ఘంగా చర్చించిన
క్రమంలో వ్యూహాత్మకంగానే సాయి రెడ్డి అరెస్టు దిశగా అడుగులు పడినట్టు
విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. దీనికి రెండు రోజుల ముందే
సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారని
పేర్కొంది.
టీటీడీకీ శతవిధాలా శఠగోపం కిలో రూపాయి బియ్యం
ధార్మిక సంస్థ టీటీడీకి గుత్తేదారులు శతవిధాలా శఠగోపం పెడుతున్నారు. కిలో
రూపాయి సర్కారీ బియ్యానికి పాలిష్‌చేసి టీటీడీకి అంటగడుతున్నారనే ఆరోపణలు
వెల్లువెత్తాయి. పౌరసరఫరాల బ్యాగుల్లోనే వచ్చిన వేలాది కిలోల బియ్యాన్ని
టీటీడీ మార్కెటింగ్ అధికారులు పక్కన పెట్టారు. వాటి నమూనాలు తీసి పరీక్షల
నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. టీటీడీకి బియ్యం సరఫరా టెండరుదారైన
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన గంగాదేవి మోడ్రన్ రైస్‌మిల్
నిర్వాహకులు శనివారం రెండు లారీల్లో 50 కిలోల బరువున్న 2,220 బియ్యం
బ్యాగులు టీటీడీ మార్కెటింగ్ గోడౌన్‌కు పంపారు. మార్కెట్‌లో కిలో రూ.30లు
పలుకుతున్న సోనా మసూరి బియ్యాన్ని రూ.21.06 లకు సరఫరా చేస్తామని గుత్తేదారు
టెండర్ దక్కించుకున్నారు. నెలకు 50 లారీల బొప్పున 6 నెలలకు 300 లోడ్ల
బియ్యం వారు సరఫరా చేయాల్సి ఉంది. మూడు నెలలుగా 150 లారీల బియ్యాన్ని సరఫరా
చేశారు. కాగా అర్మూర్ రైస్ మిల్లు నుంచి వచ్చిన బియ్యం సంచులు
పౌరసరఫరాల శాఖ రేషన్‌షాపు డీలర్లకు సరఫరా చేసే బ్యాగులు కావడం, వాటిపై
అగ్‌మార్క్ ముద్ర లేకపోవడంతో టీటీడీ అధికారులకు అనుమానం వచ్చింది. అవి
కిలో రూపాయి సబ్సిడీ బియ్యమనే భావించి వాటిని పక్కన పెట్టారు. పరీక్షల
నిమిత్తం వాటిని టీటీడీ ల్యాబ్‌కు పంపినట్లు టీటీడీ మార్కెటింగ్ ఆఫీసర్
శ్రీహరి తెలిపారు.
రూ.7 లక్షలిస్తే పోస్టు గ్యారంటీ!
‘మీరు పరీక్షకు హాజరైతే చాలు. మిగతా సంగతి మేము చూసుకుంటాం. మాకు తెలిసిన
ఒక మంత్రి ద్వారా పోస్టు వచ్చేలా చూస్తాం. రూ.7 లక్షలిస్తే పోస్టు
గ్యారంటీ’ అంటూ వీఆర్వో, వీఆర్‌ఏ ఉద్యోగార్థులను దళారులు
మభ్యపెడుతున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీకి చెందిన
కొందరు దళారులు రంగంలోకి దిగారు. మరోవైపు ప్రభుత్వం ఈ పరీక్షను అవకతవకలకు
తావులేకుండా నిర్వహిస్తామని చెబుతోంది. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా
అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. మూల్యాంకనం సైతం అందుబాటులో ఉన్న సాంకేతిక
విధానం ద్వారా నిర్వహిస్తారు. ఈ విషయం తెలియని కొందరు అమాయక నిరుద్యోగులు
దళారుల మాయలో పడి మోసపోతున్నారు. కొందరైతే అప్పు చేసి మరీ దళారుల చేతుల్లో
పెడుతున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు దళారుల అవతారమెత్తి నిరుద్యోగుల
జీవితాలతో ఆడుకుంటున్నారు. జిల్లాలో వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టులకు విపరీతమైన
పోటీ నెలకొంది. ఒక్కో పోస్టుకు సగటున 440 మంది పోటీ పడుతున్నారు. ఈ నెల 30న
జిల్లా కేంద్రంలో రాత పరీక్ష జరగనుంది. ఆరోజు ఉదయం వీఆర్వో, మధ్యాహ్నం
వీఆర్‌ఏ అభ్యర్థులకు పరీక్ష ఉంటుంది. ప్రశ్నపత్రాన్ని రూపొందించే బాధ్యత
జేఎన్‌టీయూకు అప్పగించారు. జిల్లాలో పర్యవేక్షణలో రాత
పరీక్ష నిర్వహిస్తారు.
పరిటాల కుటుంబం నుంచి ప్రాణహాని...సూరి భార్య గంగుల భానుమతి
Subscribe to:
Posts (Atom)