Tuesday, 29 November 2011

తిరుచానూరు పద్మావతి అమ్మవారికి భక్తులు పోటెత్తారు

తిరుచానూరు పద్మావతి అమ్మవారికి మంగళవారం జరిగిన పంచమితీర్థం ఉత్సవానికి భక్తులు పోటెత్తారు. పద్మసరోవరం, పరిసరాల్లో ఎటు చూసినా భక్తులతో నిండిపోయింది. అశేష భక్తజనావళి ఆనందోత్సాహాలు, గోవిందనామస్మరణ మధ్య ఈ వేడుక జరిగింది. కార్తీక మాసం శుక్లపక్షంలో పంచమి తిథి తిధి రోజున పద్మసరోవరంలో అమ్మవారు ఉద్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ ప్రకారం.. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగడం ఆనవాయితీ. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించారు. 8 గంటలకు అమ్మవారిని, చక్రతాళ్వార్ ను బంగారు తిరుచ్చిపై తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకొచ్చి మంటపంలో కొలువుదీర్చారు. తిరుమల నుంచి గజరాజులపై ఊరేగింపుగా సారె (పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పసుపు, కుంకుమ, చందనం) తీసుకొచ్చారు. వీటితో అమ్మవారి ఉత్సవమూర్తికి, చక్రతాళ్వార్‌కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం భక్తకోటి గోవింద నామస్మరణల మధ్య కుంభలగ్నంలో 12.48 గంటలకు చక్రతాళ్వార్ పంచమితీర్థం నిర్వహించారు.

హరికృష్ణను చంద్రబాబు కార్నర్ చేసినట్లేనా?

బెజవాడ రాజకీయ వేడిలో దూకుడుగా వ్యవహరించి చంద్రబాబుకు హరికృష్ణ సవాల్ విసిరారు. తనకు తోడుగా పార్టీ నాయకులు వల్లభనేని వంశీకృష్ణ, కొడాలి నాని ఉన్నారని అనుకున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన దేవినేని ఉమామహేశ్వర రావుపై వారి చేత తిరుగుబాటు చేయించారు. కాస్తా రాజకీయం రంజుగా సాగుతుండగానే చంద్రబాబు తన చాణక్యనీతిని ప్రదర్శించి, సీన్‌ను తిరిగేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ వెనక్కి తగ్గి, చంద్రబాబు ఆదేశాలకు తలొగ్గారు. అయితే, ఆ తర్వాతనైనా హరికృష్ణ పరిస్థితి చక్కబడిందా అంటే లేదనే చెప్పాల్సి వస్తుంది. దాదాపుగా హరికృష్ణను చంద్రబాబు కార్నర్ చేసినట్లే కనిపిస్తోంది. హరికృష్ణ ఆది, సోమవారాల్లో విజయవాడలో ఉన్నారు. కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన విజయవాడలో ఉన్నారు. ఆయనను తెలుగుదేశం నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదు. దేవినేని ఉమా మహేశ్వర రావు సరేసరి, తనకు అత్యంత ఆప్తులని భావించిన వల్లభనేని వంశీ, కొడాలి నానీల అడ్రస్ కూడా లేకుండా పోయింది. గతంలో కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన హరికృష్ణను పట్టించుకోలేదనే నెపంతోనే వంశీ, కొడాలి నానీ ఉమామహేశ్వరరావుపై సమరానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు సమరానికి సమాయత్తం కావడం మాట అటుంచి, వారే హరికృష్ణ పక్కన నిలబడలేని స్థితి వచ్చేసింది. దీంతో హరికృష్ణను చంద్రబాబు కార్నర్ చేశారని అనుకుంటున్నారు. మళ్లీ తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ ద్వారా హరికృష్ణ విజృంభిస్తాడా, చూడాల్సిందే.

త్వరలో బాలీవుడ్ తెరపై మహేంద్ర సింగ్ ధోని?

మహేంద్ర సింగ్ ధోని త్వరలో బాలీవుడ్ తెరపై మెరవబోతున్నాడు. బాలీవుడ్ దర్శకుడు డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘హుక్ యా క్రూక్ ’ సినిమాలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంతో కలిసి ధోనీ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. ఇందు కోసం ఇప్పటికే ధోనీ వద్ద డేట్స్ తీసుకున్నారని, ధోనీ ఇందులో ముఖ్యమైన అతిపాత్రలో ధోనీ కనిపించనున్నాడని తెలుస్తోంది. సత్తా ఉన్న క్రికెటర్ గా, సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా దూసుకెలుతున్న ధోనీ....ఇప్పటికే వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ తన హవా కొనసాగిస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ ఎంట్రీతో ఒకే సారి మూడు రంగాల్లో రాణిస్తున్న వ్యక్తిగా ధోనీ రికార్డులకు ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కనుక సక్సెస్ అయితే ఆయకు అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడటం ఖాయం. ప్రస్తుతం ధోనీ సంపాదన సంవత్సనికి వందల కోట్లలోనే. వాణిజ్య ప్రకటనల్లో నటించడం ద్వారానే ధోనీ ప్రపంచంలోనే అత్యంత ఎక్కవ ఆదాయం గల టాప్ టెన్ ప్లేయర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఇక బాలీవుడ్ లోనూ క్లిక్ అయితే ధోనీ ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్లి పోతాడేమో..?

జనవరి 30న విఆర్ ఓ, విఆర్ ఏ పరీక్షలు

జనవరి 30న విఆర్ ఓ, విఆర్ ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు. ఉదయం విఆర్ ఓ, మధ్యాహ్నం విఆర్ ఏ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు దరఖాస్తు ఖరీదు 200 రూపాయలు. ఎస్ సి, ఎస్టీలకు వంద రూపాయలు. ఈ పరీక్షల ద్వారా 1172 విఆర్ ఓ పోస్టులు, 6063 విఆర్ఏ పోస్టులు భర్తీ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలలో వయోపరిమితి సడలింపుపై రేపు జరిగే మంత్రి మండలి సమావేశంలో చర్చిస్తామని మంత్రి చెప్పారు.

పెరిగిన గ్రూప్-1 పోస్టుల సంఖ్య

గ్రూప్-1 పోస్టులను మరో 41 పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంటూ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. గ్రూప్-1 సంబంధించి 263 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ తాజాగా మరో 39 ఎంపీడీవోలు, 2 డిఎస్పీ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో గ్రూప్-1 పోస్టుల సంఖ్య 304కు పెరిగింది. గ్రూప్-1 పరీక్షకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) సోమవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 19 విభాగాల్లో 263 పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 27న ప్రిలిమినరీ పరీక్ష, అక్టోబర్ 3న మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని బోర్డు తెలిపింది. డిసెంబర్ 9 నుంచి జనవరి 8 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు బోర్డు ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.

కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో ఉద్రిక్తత

జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ అలజడి మొదలైంది. కప్పట్రాళ్లలో వెంకటప్పనాయుడు ఇంటిపై మద్దిలేటి వర్గీయులు దాడి చేశారు. ఈ విషయం తెలిసి పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. కప్పట్రాళ్లలో ఉద్రికత నెలకొంది దేవనకొండ మండలపరిధిలోని ఫ్యాక్షన్ గ్రామమైన కప్పట్రాళ్లగ్రామాన్ని   కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి అన్న కుమారుడు పరప్ప నాయుడుపై ప్రత్యర్థులు దాడికి పాల్పడినందున వారి స్వగ్రామమైన కప్పట్రాళ్ల గ్రామాన్ని డిఎస్పీ సందర్శించి అక్కడ పరిస్థితిని ఆయన స్వయంగా పరిశీలించారు. వెంకటప్పనాయుడు, పరప్ప నాయుడు, మద్దిలేటి నాయుడు ఇండ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎవరు హత్యలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని డిఎస్పీ తెలియజేశారు. గ్రామంలో ప్రజలందరూ పొలం పనులకు వెళ్లడం వలన గ్రామ వీధులన్ని నిర్మాణుషంగా మారాయని చెప్పారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు పోలీసులను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.  ఐదుమంది ఎపిఎస్‌పి పోలీసులు, నల్గురు సివిల్ పోలీసులను గ్రామంలో బందోబస్తుగా ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ  తెలియజేశారు.

చరణ్ తేజ్-ఉపాసన డిసెంబర్ 1న నిశ్చితార్థం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్-ఉపాసన కామినేని నిశ్చితార్థం డిసెంబర్ 1న జరుగనున్న విషయం తెలిసిందే. అయితే నిశ్చితార్థ వేడుక ఎక్కడ జరుగుతుందనే విషయమై ఇప్పటి వరకు సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. నిన్నమొన్నటి వరకు ఈ వేడుక దోమకొండ కోటలో అని ఒకసారి, గోల్కొండ రిసార్ట్స్ లో జరుగుతుందని మరొక సారి ప్రచారం జరిగింది. అయితే అది వాస్తవం కాదని తాజాగా మంగళవారం మెగాకుటుంబ సన్నిహితుల నుంచి అందిన సమాచారం.మొయినాబాద్ మండలం, చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్డులో ఉన్న ఫామ్‌హౌస్‌లో జరగనున్న ఈ నిశ్చితార్ధానికి ఇరు కుంటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు, బం«ధువులు మాత్రమే పాల్గొంటారని సమాచారం.