రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్ బిఐ) వడ్డీ రేటుని మళ్లీ పెంచింది. రెపో రేటు పావు శాతం పెంచింది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకే ఆర్ బిఐ మళ్లీ వడ్డీరేటుని పెంచింది. పొదుపు ఖాతాల వడ్డీపై నియంత్రణని ఎత్తివేసింది. సేవింగ్స్ ఖాతాదారులకు లబ్దిచేకూరుతుంది. ముందుగా చెల్లించే ఇంటి రుణాలకు అదనపు చార్జీలను రద్దు చేశారు. వడ్డీ రేటుని ఇక పెంచకపోవచ్చని భావిస్తున్నారు
Tuesday, 25 October 2011
రిజర్వు బ్యాంక్ వడ్డీ రేటుని మళ్లీ పెంచింది
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్ బిఐ) వడ్డీ రేటుని మళ్లీ పెంచింది. రెపో రేటు పావు శాతం పెంచింది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకే ఆర్ బిఐ మళ్లీ వడ్డీరేటుని పెంచింది. పొదుపు ఖాతాల వడ్డీపై నియంత్రణని ఎత్తివేసింది. సేవింగ్స్ ఖాతాదారులకు లబ్దిచేకూరుతుంది. ముందుగా చెల్లించే ఇంటి రుణాలకు అదనపు చార్జీలను రద్దు చేశారు. వడ్డీ రేటుని ఇక పెంచకపోవచ్చని భావిస్తున్నారు
రైలు టిక్కెట్ల ధరలను పెంచాలి !!
కొన్నేళ్లుగా రైలు టిక్కెట్టు ధరలను పెంచని కారణంగా రైల్వే ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఎస్సీ రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ ప్రధాన కార్యదర్శి, ఆలిండియా రైల్వేమెన్ ఫెడరేషన్ సహాయ కార్యదర్శి శంకర్ రావు పేర్కొన్నారు. సోమవారం ఉదయం గుంతకల్లుకు వచ్చిన ఆయన కోజీ రైల్వే గెస్ట్ హౌస్‌లో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మట్లాడుతూ భారత రైల్వేల ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందన్నారు.
లాలూ హయాం నుంచి ఇప్పటిదాకా రైలు టిక్కెట్ల ధరలను పెంచకపోగా, తగ్గించారన్నారు. ఈ కారణంగా రైల్వేల ఆదాయం గణనీయంగా తగ్గిందన్నారు. తొమ్మిదేళ్లుగా టిక్కెట్టు ధరలు పెంచకపోగా, రైల్వే నిర్వహణ వ్యయం దాదాపు నాలుగింతలైందన్నారు. ఈ కారణంగా రైల్వేలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కొత్త రైలు మార్గాలు, స్టేషన్ల ఆధునికీకరణ, విద్యుద్దీకరణ, వ్యాగన్లు, కోచ్ ఫ్యాక్టరీల నిర్మాణ పనులు శంఖుస్థాపనలకే పరిమితమౌతున్నాయిగానీ, పూర్తికావడం లేదన్నారు. భధ్రతకు సంబంధించిన అంశమైన ఉద్యోగ ఖాళీలను సైతం పూర్తిచేయలేని దుస్థితిలో రైల్వే ఉందన్నారు.

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను నవంబర్ 21 నుంచి 29వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను నవంబర్ 21 నుంచి 29వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని అధికారులను టీటీడీ ఈవో ఎల్‌వి.సుబ్రమణ్యం ఆదేశిం చా రు. ఆయన సోమవారం దేవస్థానం పరిపాలన భవనంలో టీటీడీ, పంచాయ తీ, పోలీసు, ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు వివిధ విభాగాధిపతులు చేయాల్సిన విధులను, సూచనల ను చేశారు. తిరుమలలో విద్యుద్దీపాలంకరణలు ఏవిధంగానైతే భక్తులను ఆకట్టుకున్నాయో అదే రీతిలో ఏర్పాట్లు ఉండాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని టీటీడీ పారిశుద్ధ్య విభాగం, తిరుచానూరు పంచాయతీ అధికారులకు సూచించారు.
బ్రహ్మోత్సవాల సందర్బంగా అమ్మవారి ఆలయం లో నవంబర్ 15వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించాలని అధికారులను ఆదేశిం చారు. భక్తులను అలరించేలా వివిధ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ కళాకారులచే వివిధ కళారూపాలను హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య, ఆళ్వారు దివ్యప్రంబంధ ప్రాజెక్టు ఏర్పాట్లు చేస్తాయని ఈవో ఎల్‌వి. సుబ్రమణ్యం తెలిపారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల నుంచి తిరుచానూరుకు రోజుకు 60 ట్రిప్పులు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇందుకు ఆర్టీసీ అధికారులు అంగీకరించారు. ఈ సమీక్ష సమావేశం లో జేఈవో కెఎస్.శ్రీనివాసరాజు, వెంకటరామిరెడ్డి, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు
Subscribe to:
Posts (Atom)