ఎస్సై పోస్టులను భర్తీ చేసేందుకు పోలీసు నియామక బోర్డు ప్రకటన జారీ చేసింది. సివిల్, ఎస్పీఎఫ్, ఫైర్ సర్వీసుల్లో 2296 ఎస్సై పోస్టులను భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది
Thursday, 3 November 2011
2296 ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఎస్సై పోస్టులను భర్తీ చేసేందుకు పోలీసు నియామక బోర్డు ప్రకటన జారీ చేసింది. సివిల్, ఎస్పీఎఫ్, ఫైర్ సర్వీసుల్లో 2296 ఎస్సై పోస్టులను భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది
మంత్రి పదవి ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను- చిరంజీవి
పార్టీ అధిష్టానం తనకు ఏ పదవి ఎక్కడ ఇచ్చినా స్వీకరిస్తానని తిరుపతి కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు చిరంజీవి బుధవారం అన్నారు. ఆయన తన నియోజకవర్గంలో ఉదయం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని చెప్పారు. రాష్ట్రంలో గానీ, కేంద్రంలో గానీ తనకు ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానని చెప్పారు. మంత్రి పదవి ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.
తిరుపతిలో రూ.20 కోట్లతో శాశ్వతంగా తాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. పార్టీకి విధేయుడిగా ఉంటానన్నారు. ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టినా తాము ధీటుగా ఎదుర్కొంటామని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు చిరంజీవి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తమ సమస్యలను ఆయనకు విన్నవించుకుందామని వస్తే పట్టించుకోలేదని ధ్వజమెత్తారు

రామ్ చరణ్ బాలకృష్ణ వార్
శ్రీరామరాజ్యం ఆడియో కార్యక్రమంలో తాను రామ్ చరణ్‌ను ఉద్దేశించి అనలేదని వివాదాస్పద వ్యాఖ్యలపై హీరో బాలకృష్ణ విరవరణ ఇచ్చారు. తాను చిరింజీవి అన్యోన్యంగా ఉంటామని, తాను ఎవరి గురించి వ్యాఖ్యానించానో చిరంజీవి, మోహబాబులకు తెలుసునని బాలకృష్ణ తెలిపారు.

తెలుగు ఇండస్ట్రీని చులకన చేస్తే తట్టుకోలేనని ఆయన అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, తనపై తెలంగాణ వ్యతిరేక ముద్రవేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని బాలయ్య ఆవేదన వ్యక్తపరిచారు. అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవిస్తానని బాలకృష్ణ చెప్పారు.

Subscribe to:
Posts (Atom)