Tuesday, 6 December 2011

అనంతపురంలో డర్టీ సినిమా నిలిపివేత

అనంతపురంలోని గౌరి థియేటర్‌లో ప్రదర్శిస్తున్న డర్టీ పిక్చర్‌ను AISF, AIYF అడ్డుకుని నిలిపివేశారు. యువతను పెడత్రోవ పట్టించేలా ఉన్నాయంటూ.. సినిమా పోస్టర్లను చించివేసి కాల్చారు. థియేటర్‌ ముందు బైఠాయించి ప్రదర్శనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

శ్రీవారి సేవలో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ

కేసులు.. విచారణలతో నిత్యం బిజీగా ఉండే సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మంగళవారం శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా తిరుమల వచ్చారు. ఉదయం తిరుమల చేరుకున్న ఆయన కాసేపు విశ్రాంతి పొందారు. అనంతరం శ్రీవారి పాదాలు, శిలాతోరణం, పాపవినాశనం, జాపాలి, వేణుగోపాలస్వామి ఆలయం తదితర సందర్శక ప్రాంతాలలో పర్యటించారు. రాత్రి విరామ సమయంలో ఆయన కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. తన కుమారుడికి త్వరలో పరీక్షలు జరగనుండటంతో శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమల వచ్చినట్లు సమాచారం.

త్వరలో చిరంజీవి 150వ సినిమా మురుగదాస్ ద్శకత్వం?

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి చాలా రోజులుగా ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 150వ సినిమా డైరెక్ట్ చెయ్యబోతున్నారంటూ చాలామంది డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. ఆ మధ్య వివి వినాయక్ ఫైనల్ అయినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే మతాజా సమాచారం ప్రకారం గజిని, సెవెన్త్ సెన్స్ చిత్రాల దర్శకుడు ఎఆర్ మురుగదాస్ పేరు ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది. సెవెన్త్ సెన్స్ తర్వాత చిరంజీవి ఆబ్లిగేషన్ వల్ల మురుగదాస్ కి అతని 150వ చిత్రానికి స్ర్కిప్ట్ రెడీ చెయ్యాల్సిన అవసరం ఏర్పడిందట. గతంలో చిరంజీవితో స్టాలిన్ చేసిన మురుగదాస్ ఇప్పుడు 150వ సినిమాకి కూడా స్ర్కిప్ట్ రెడీ చేసే పనిలోనే ఉన్నాడని, త్వరలోనే అతని డైరెక్షన్ లో సినిమా ప్రారంభం కాబోతోందన్న వార్త ఫిలింనగర్ లో వినిపిస్తోంది.

పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర జైదేవ్

పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు జైదేవ్ అలియాస్ జై. కలకత్తా నేపథ్యంలో మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అడివి శేష్ మరియు జాకీష్రాఫ్ విలన్ గా నటిస్తున్నారు. పవన్‌కళ్యాణ్‌-విష్ణువర్ధన్‌ కాంబినేషన్‌లోని ‘పంజా’లో బ్రహ్మానందం ఓ ముఖ్య పాత్రలో నటించారు. ఈ నెల 9న సినిమా రిలీజ్‌ సందర్భంగా పంజా సినిమాలో బ్రహ్మానందం యాక్షన్ చాలా హైలెట్ గా ఉంటుందట. అసలు పంజా సినిమాలో బ్రహ్మనందం క్యరెక్టర్ కొత్తగా ఉంటుందని ఫిలింనగర్ లో అనుకుంటున్నారు.పంజా సినిమాలో పవన్ క్యరెక్టర్ తో పాటు ..బ్రహ్మనందం కూడా పోలిస్ ఇన్సెపక్టర్ పాపరావుగా నటిస్తున్నాడట. ఆయన నటనతో పంజా సినిమా కథ నడుస్తుందని ఫిలిం వర్గాలు అంటున్నాయి. గతంలో బ్రహ్మానందం నటించిన సినిమాలు చూస్తే.. ‘డీ’ మంచు విష్ణుతో, అలాగే ‘రెడీ’ సినిమాలో హీరో రామ్ తో కలిసి నటించి, బ్రహ్మానందం ఆ రెండు సినిమాలకు మంచి హిట్ తెచ్చిపెట్టాడు. ఆ రెండు సినిమాల్లో.. కథ మొత్తం బ్రహ్మానందం చుట్టు తిరుగుతుంది. సినిమా మొదటి నుండి చివరు వరకు ఆయన కామెడీతో.. ప్రేక్షకులను..ఆనందింప చేసిన విషయం తెలిసిందే.

సచిన్ టెండూల్కర్ ఒపస్ అభిమానుల నుండి భారీ స్పందన

సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రపంచానికి దేవుడు. క్రికెట్ రంగంలో భారతీయులు గర్వంగా చెప్పుకునే పేరు సచిన్. అలాంటి సచిన్ టెండూల్కర్ క్రికెట్ చరిత్రలో సృష్టించని రికార్డు లేదు. దీంతో సచిన్ టెండూల్కర్ జీవిత విశేషాలను సంబంధించిన అరుదైన ఫోటోలతో రూపొందిస్తున్న 'సచిన్ టెండూల్కర్ ఒపస్' తొలి పుస్తకాన్ని సొంతం చేసుకునేందుకు గాను ఫేస్‌బుక్లో సచిన్ వీరభిమాని 3 లక్షల 50 వేల డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ. కోటి 80 లక్షలు)కు బిడ్ వేశాడు. సచిన్ ఒపస్ పేరుతో రూపొందించిన ఈ ఫేస్ బుక్ ఎకౌంట్‌ని సుమారు 50 లక్షల మంది ఫాలో అవుతున్నారు.ఫేస్‌బుక్లో ఇండియాలో ఏఆర్ రెహామాన్ పేజి తర్వాత ఎక్కువ మంది ఫాలో అవుతున్న ఫేస్‌బుక్ పేజి ఇదే కావడం విశేషం. 2010వ సంవత్సరంలో ఈ పుస్తకం కోసం ఒక వ్యక్తి రూ 35. 2 లక్షలకు బిడ్ వేయడం జరిగింది. సచిన్ వందో సెంచురీ పూర్తి అయిన వెంటనే ఈ పుస్తకాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ పుస్తకం 95 శాతం పూర్తి అయిందని ఒపస్ మీడియా గ్రూప్ సీఈవో కార్ల్ ఫోలర్ పేర్కొన్నారు.ఇక ఈ పుస్తకం విశేషాలను గనుక గమనించినట్లైతే 37 కేజీల బరువుతో పాటు 700 పేజీలు ఇందులో ఉంటాయి. ప్రపంచంలో మొట్టమొదటి సారి ఓ క్రికెటర్‌పై పుస్తకం రావడం ఇదే మొట్టమొదటి సారి. ఈ పుస్తకంలో ఉన్న ప్రతి పేజీ కూడా 18*18 సైజులో ఉంటుంది. మంచి నాణ్యతతో రావాలనే ఉద్దేశంతో దీన్ని యంత్రాలతో కాకుండా చేతితోనే బైండింగ్ చేస్తున్నారు. సచిన్ గురించి ఆయా రంగాల్లో ప్రముఖుల వ్యాఖ్యానాలు ఉంటున్నప్పటికీ ఈ పుస్తకానికి ఫొటోలే ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఇప్పటికే మాస్టర్‌ను ఏడడుగుల ఎత్తుండే పొలరాయిడ్ కెమెరాతో షూట్ చేశారు. ప్రపంచ ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ గ్జెనాన్ టెక్సేరియా ఈ ప్రాజెక్టులో పనిచేశాడు.

శ్రీశైలం మల్లన్న గాలిగోపురానికి బీటలు

పాలకుల పర్యవేక్షణలోపం... అధికారుల నిర్లక్ష్యం వెరసి శ్రీశైలం మల్లన గాలిగోపురం పాలిటశాపంలా తయారైంది. పురాతన కాలంనాటి ఆయలగోపురశిఖరాలపై అధికార యంత్రాంగం నిర్లక్ష్యపు దోరణితో వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. శ్రీశైలం మల్లన్న గాలిగోపురం పిచ్చిమొక్కలతో కళావిహీనంగా తయారైంది.
గాలి గోపురాన్ని పునరుద్ధరించే విషయంలో పాలకమండలి, అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శులు వెల్లువెత్తున్నాయి. నిత్యం రద్ధీగా ఉండే శ్రీశైల క్షేత్రంలో గాలిగోపురాలు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. గోపురాలపై ఉన్న శిల్ప సంపదను కాపాడే విషయంలో అధికారు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్తర ద్వారంగాఉన్న శివాజీ గోపురం శిధిలావస్థకు చేరుకుందని రెండేళ్లక్రితం నిపుణుల కమిటీ నిర్థారించింది. గోపురాన్ని పునరుద్ధరించాలనే సూచనను పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. గోపురం బీటలు వారుతున్న పట్టించుకునే నాథుడే కరవయ్యాడని భక్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. గోపురాలపై శిల్పాలు విరిగిపోవడంతోపాటు పిచ్చిమొక్కలతో కళావిహీనంగా ఉన్నాయి. పురాతన కాలంనాటి శిల్ప సంపదను కాపాడే విషయంలో అధికారులు చొరవతీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

నిమ్స్ సెగలు కడప రిమ్స్‌ను కూడా తాకాయి

హైదరాబాద్ నిమ్స్ సెగలు కడప రిమ్స్‌ను కూడా తాకాయి. నిమ్స్‌లో ఖైదీలకు వైద్యంపై జరిగిన కుంభకోణం లాంటిదే కడప రిమ్స్‌లోనూ చోటుచేసుకుంది. దీంతో విచారణ జరిపిన సర్కార్, రిమ్స్ ఆర్ఎంఓ, సూపర్నెంట్‌లను సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారం కడపలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. విచారణలో ఉన్న ఖైదీలకు ఎలాంటి అనారోగ్యం లేకున్నా వైద్యం కోసం కడప రిమ్స్‌లో చేర్చుకున్నారు. అలాగే వారిని హైదరాబాద్ నిమ్స్‌కు రెఫర్ చేశారు. చాపాడు మండలం శెట్టిపల్లికి చెందిన జయరాం రెడ్డితో పాటు, మరో ఇద్దరు ఓ మర్డర్ కేసులో నిందితులు. విచారణ ఖైదీలుగా ఉన్న వీరిని కడప రిమ్స్‌లో చేర్చుకోవడమే గాకుండా మరింత వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్‌కు రిఫర్ చేశారు. ఈ ఘటనలో నిమ్స్ వైద్యులు సస్పెండ్ కాగా, కడపలో కూడా విచారణ ఎదుర్కొంటున్న ఆర్‌ఎంఓ, సూపర్నెంట్‌లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రిమ్స్ వైద్యుల సస్పెన్షన్‌తో డాక్టర్ల చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అవసరం ఉన్నా లేకున్నా ప్రలోభాలకు లోబడి చికిత్సలకు రిఫర్ చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు.

శ్రీవారికి బంగారు కత్తిని బహుకరణ

తిరుమల శ్రీవేంకటేశ్వరునికి రెండు వేల సంవత్సరాల తర్వాత ఓ బంగారు కత్తిని బహుకరించారు. పీఠాధిపతి త్రిదండి రామానుజ రామచంద్ర జీయర్ శ్రీవారికి యజ్ఞాయాగాదులు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కానుకలతో స్వామివారికి సూర్య ఖఠారిని బహుకరించారు. తిరుమల శ్రీవారికి బీమవరం మఠాధిపతి శ్రీత్రిదండి రామానుజ రామచంద్ర జీయర్ స్వామి 75 లక్షలు విలువ చేసే బంగారు కత్తిని బహుకరించారు. గత సంవత్సర కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్మీ కటాక్షయజ్ఞం నిర్వహించగా వచ్చిన కానుకలతో శ్రీవేంకటేశ్వరునికి బంగారు కత్తిని తయారు చేయించి ఇచ్చారు. నిన్న రాత్రి ఆలయంలో తోమలసేవ కార్యక్రమంలో స్వామి వారి పాదాల ముందు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి బహుకరించిన కత్తికి ప్రత్యేక పూజలు చేసారు. అటు తర్వాత భక్తులు, టీటీడీ చైర్మెన్ బాపిరాజు, పూజారులు పూజలందుకున్నారు. స్వామి వారికి బహుకరించిన కత్తిని చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. వచ్చే శుక్రవారం జరిగే అభిషేకం అనంతరం శ్రీవారికి అలంకరించాలని టీటీడీ అధికారులను పీఠాధిపతి కోరారు. ఆయన వినతిని టీటీడీ అధికారులు అంగీకరించారు. వాయిస్. రెండు వేల సంవత్సరాల క్రితం తిరుమల వెంకన్నకు మొదటి సారిగా అప్పటి రాజులు బహుకరించారు. తిరిగి స్వామి వారికి సూర్య కఠారిని బహుకరించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డిపై చర్యలు...చిరంజీవి

పార్టీ విప్ ధిక్కరించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి మంగళవారం చెప్పారు. ఆయన పిఆర్పీ ఎమ్మెల్యేలతో తన నివాసంలో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సాయంత్రం స్పీకర్‌ను కలిసి విప్ ధక్కరించిన ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు తన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారన్నారు. స్వార్థానికి అతీతంగా ప్రజల పక్షాన మేం నిలబడతామని చెప్పారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించినందుకు సంతోషంగా ఉందన్నారు.ప్రజలు అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, అవినీతి ఎవరు చేస్తున్నారో అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. తమ ఎమ్మెల్యేలు ప్రజలకు ఉపయోగ పడే విధంగా ఏం చేసినా తప్పు కాదన్నారు. సిఎం పాలనపై తమకు విశ్వాసం ఉందన్నారు. పిఆర్పీ ఎమ్మెల్యేలను కొందరు ప్రలోభాలకు గురి చేశారని కానీ అవి సఫలం కాలేదన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రతిపక్షాలు అవిశ్వాసం పెట్టాయని విమర్శించారు. పడగొట్టి కుర్చీ ఎక్కాలనుకున్న వారి కోరికను మేం నెరవేరకుండా చేశామన్నారు. నిన్నటి అవిశ్వాసం ఘటన విపక్షాలకు చెంపపెట్టు అన్నారు.

అంతా మా ఇష్టం..!

అధికారం ఉండగానే అందినంత దండుకోవాలన్నది వారి లక్ష్యం..! అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ అక్రమార్జనలో చెలరేగుతున్నారు.. వారి దెబ్బకు అధికారులు హడలెత్తిపోతున్నారు. ఒత్తిళ్లకు తాళలేక.. మాటలు పడలేక మనస్థాపం చెందిన అధికారులు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోతున్నారు. తాజాగా రోడ్లు, భవనాల శాఖ ఎస్‌ఈ పి.వెంకటరమణారెడ్డి మూడు నెలల దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఇదే శాఖకు చెందిన మరో ఇద్దరు డీఈలు కూడా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడానికి సమాయత్తమవుతున్నారు.

‘ఇఫ్కో’ ఆధ్వర్యంలో ఆదర్శరైతులకు ఉచితంగా సిమ్‌కార్డులు

ప్రముఖ ఎరువుల కంపెనీ ‘ఇఫ్కో’ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆదర్శరైతులకు ఉచితంగా సిమ్‌కార్డులు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా  మధ్యాహ్నం స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో జేడీఏ కె.సాంబశివరావు కొంతమంది ఆదర్శరైతులకు గ్రీన్‌కార్డు పేరిట ఎయిర్‌టెల్ సిమ్‌కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వడానికి గ్రీన్‌కార్డు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకుని రైతులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఇఫ్కో జిల్లా ప్రతినిధి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ మొదటివిడత మండలానికి ఐదుగురు ఆదర్శరైతుల చొప్పున 273 మందికి గ్రీన్‌కార్డులు అందజేస్తున్నామన్నారు. దశల వారీగా అందరికీ పంపిణీ చేస్తామన్నారు. వ్యవసాయం, 16 అనుబంధ రంగాలకు సంబంధించి రోజూ ఐదు వాయిస్ మెసేజ్‌లు ఉచితంగా అందజేస్తామన్నారు. మరింత సమాచారం కోసం 534351 అనే హెల్ప్‌లైన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ రవి, ఇఫ్కో ప్రతినిధులు సతీష్‌కుమార్, రఘునాథరెడ్డి పాల్గొన్నారు.

అనర్హత వేటు వేయండి...ఉప ఎన్నికలకు సిద్ధం ...వైఎస్ జగన్‌

అసెంబ్లీలో సోమవారం జరిగిన అవిశ్వాస తీర్మానం దేశ చరిత్రలోనే చారిత్రాత్మక ఘటన అని వైఎస్ఆర్ పార్టీ నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభివర్ణించారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో తొలి సారిగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పదవులు పోతాయని తెలిసినా ప్రజల పక్షాన నిలబడిన తన ఎమ్మెల్యేలకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు.రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో అవిశ్వాసానికి మద్దతు తెలిపామని ఆయన పేర్కొన్నారు. అసలు అసెంబ్లీలో చంద్రబాబు అవిశ్వాస తీర్మానాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా పెట్టారా లేక రైతు సమస్యలపై పెట్టారా అని అనుమానం వచ్చిందని జగన్ అన్నారు. దివంగత నేతను తిట్టేందుకే చంద్రబాబు ఎక్కువ సమయం కేటాయించారని, తమ ఎమ్మెల్యేలను చంద్రబాబు రెచ్చగొట్టారని విమర్శించారు.

జగన్ బలం ఎంతో తేలిపోయింది... మంత్రి శైలజానాథ్

అవిశ్వాసంలో ఓడిపోయామన్న బాధలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారని మంత్రి శైలజానాథ్ వ్యాఖ్యానించారు. మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ బలం ఎంతో నిన్నటి అవిశ్వాసంలో తేలిపోయిందన్నారు. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని మంత్రి శైలజానాథ్ తెలిపారు.