Thursday, 1 December 2011
ఉపాసన డామినేట్ చేస్తే సంతోషిస్తా: రామ్ చరణ్
ప్రపంచంలోనే తొలి సెక్స్ స్కూల్ !
సెక్స్ పాఠాలు సాధారణంగా రహస్యంగా ఇంటి గోడల మధ్యనే నేర్చుకుంటారనే అభిప్రాయం ఇప్పటి వరకు ఉంటూ వచ్చింది. కానీ స్వీడన్‌కు చెందిన మహిళా స్కూల్ మాస్టర్ మరో విధంగా భావిస్తున్నారు. మంచి ప్రేమికులు కావడానికి ఆవసరమైన శృంగార కళను నేర్పేందుకు యివా - మారియా థాంప్సన్ ప్రపంచంలోనే తొలి సెక్స్ స్కూల్‌ను ప్రారంభించినట్లు డైలీ మెయిల్ రాసింది. వియన్నాలోని ఈ ఆస్ట్రియా అంతర్జాతీయ సెక్స్ స్కూల్ పాఠాలకు 1,400 పౌండ్లు వసూలు చేస్తోంది. అప్లయిడ్ సెక్స్‌వాలిటీ విద్యాసంస్థలో 16 ఏళ్ల వయస్సు పైబడినవారెవరైనా చేరవచ్చునని విద్యాసంస్థ ప్రధానాచార్యురాలు చెబుతున్నారు. విద్యార్థులు కో ఎడ్యుకేషన్ డొర్మెటరీ బ్లాక్‌లో పాఠాలు నేర్చుకుంటారు. వాళ్ల హోంవర్క్‌ను ప్రాక్టీస్ చేస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తారు. తమ విద్య థియరీ కాదని, ప్రాక్టికల్ అని స్కూల్ హెడ్ అంటున్నారు. శృంగార భంగిమలు, ఇతర పద్ధతులు, శారీరక లక్షణాలు వంటివాటిలో పాఠాలు ఉంటాయని అంటున్నారు. ఈ స్కూల్ ఇప్పటికే వివాదంలో చిక్కుకుంది. శృంగారంలో పాల్గొంటున్న స్త్రీపురుషుల వాణిజ్య ప్రకటన తీవ్రమైన వివాదాన్ని సృష్టించింది
పూల మొక్కలతో నిండుగా కనిపిస్తున్న తిరుమల
సమ్మె విరమించిన త్రిపుల్ ఐటీ ఉద్యోగులు
కడపజిల్లా
ఇడుపాయల ట్రిపుల్ ఐటీ ఉద్యోగుల నలభై ఐదు రోజుల సమ్మె ఎట్టకేలకు ముగిసింది.
డిప్యూటీ సీఎం రాజనర్సింహ ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చలు ఫలించడంతో ఉద్యోగులు
సమ్మె విరమించారు.ఉద్యోగులకు జిల్లా కలెక్టర్
నిమ్మరసం ఇచ్చి సమ్మె విరమింపజేశారు. దీంతో ఇవాళ్టి నుంచి విధులకు హాజరుకావాలని
త్రిపుల్ ఐటీ ఉద్యోగులు నిర్ణయించారు.
పవన్ కొత్త కారులో నిశ్చితార్ధానికి వెళ్లనున్నరామ్‌చరణ్
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌తేజ్
నిశ్చితార్ధానికి హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఫాంహౌస్ లోపలికి ఎంటర్
అవ్వాలంటే కూడా బార్‌కోడింగ్‌తో ఉన్న యాక్సెస్ కార్డు కావలసిందే. ఇందుకోసం ఎటిఎమ్
కార్డు సైజులో ఉన్న ఈ యాక్సెస్ కార్డులను అహ్వానితులకు అందజేశారు. అంతేకాదు కార్‌పార్కింగ్
దగ్గర కూడా భారీ భద్రత ఏర్పాటుచేశారు. మరోవైపు పవన్‌కళ్యాణ్ ఈ మధ్యనే కొత్తగా
కొన్న కారులో రామ్‌చరణ్‌ను తానే స్వయంగా నిశ్చితార్ధానికి తీసుకెళ్ళనున్నారు.
కేవలం అబ్బాయి ఎంగేజ్‌మెంట్ కోసమే, ఈమధ్యనే ఇండియాలో లాంచ్ అయిన మెర్సిడెస్ బెంజ్ ఎస్‌యువి వాహనాన్ని పవన్
కొన్నట్లు సమాచారం
కర్నూలు నగరం ద్విచక్ర వాహనానికి 28 సీట్లట
ద్విచక్ర వాహనానికి 28 సీట్ల కెపాసిటీ ఉన్నట్లు వాహన యజమానికి కర్నూలు రవాణా శాఖ అధికారులు ఆర్‌సీ జారీ చేసి రికార్డు బద్దలు కొట్టారు. మినీ బస్సులకు మాత్రమే 28 సీట్ల సామర్థ్యం ఉంటుంది. కానీ పక్క చిత్రంలో కనిపించే ద్విచక్ర వాహనానికి 28 సీట్ల కెపాసిటీ ఉన్నట్లు రికార్డు(ఆర్‌సీ) జారీ చేయడం రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం. కర్నూలు నగరం బీక్యాంప్ నివాసి అయిన శివకుమార్ పిళ్లై గత ఏడాది ఏప్రిల్ 30 న ద్విచక్ర వాహనాన్ని రవాణా శాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆర్‌సీలో సీటింగ్ కెపాసిటీ 28 ఉన్నట్లు పొందు పరిచి జారీ చేశారు. సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఆలస్యంగా గమనించిన వాహన యజమాని శివకుమార్ పిళ్లై కార్యాలయానికి వెళ్లి తప్పును సరిదిద్దాలని కోరగా కంప్యూటర్‌లో తప్పు పడింది.
మమ్మల్ని ఏం చేయమంటావు అంటూ బుకాయిస్తూ ప్రభుత్వానికి చలానా కట్టండి సవరిస్తామంటూ కార్యాలయం చుట్టూ ఏడాది కాలంగా తిప్పుకుంటున్నారు. సిబ్బంది చేసిన తప్పునకు విని యోగదారుడు విలవిల్లాడుతున్నాడు. జరిగిన పొరపాటుకు దండించి సిబ్బందిని గాడిలో పెట్టాల్సిన అధికారులు పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో కార్యాలయంలో పరిపాలన దారి తప్పింది. మోటార్ క్యాబ్, టూరిస్ట్ క్యాబ్, మోటార్ కార్లకు కూడా ఛాసిస్ నంబర్లు, ఇంజన్ నంబర్లు రికార్డుల్లో తప్పులు కొట్టి జారీ చేస్తుండటంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలను మరొకరి పేరుతో బదలాయించేటప్పుడు ఇలాంటి తప్పులు దొర్లుతున్నాయి. ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ల సమయంలో కూడా వాహనానికి ఉన్న ఛాసిస్, ఇంజిన్ నంబర్లకు బదులు వేరే నంబర్లు పొందు పరుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. షోరూం వాళ్లు ఇచ్చిన పేపర్లను చూపించి రికార్డుల్లో తప్పులను సరి చేయాలని యజమానులు కోరుతున్నప్పటికీ చలానా కట్టాలని దబాయిస్తున్నారు
మమ్మల్ని ఏం చేయమంటావు అంటూ బుకాయిస్తూ ప్రభుత్వానికి చలానా కట్టండి సవరిస్తామంటూ కార్యాలయం చుట్టూ ఏడాది కాలంగా తిప్పుకుంటున్నారు. సిబ్బంది చేసిన తప్పునకు విని యోగదారుడు విలవిల్లాడుతున్నాడు. జరిగిన పొరపాటుకు దండించి సిబ్బందిని గాడిలో పెట్టాల్సిన అధికారులు పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో కార్యాలయంలో పరిపాలన దారి తప్పింది. మోటార్ క్యాబ్, టూరిస్ట్ క్యాబ్, మోటార్ కార్లకు కూడా ఛాసిస్ నంబర్లు, ఇంజన్ నంబర్లు రికార్డుల్లో తప్పులు కొట్టి జారీ చేస్తుండటంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలను మరొకరి పేరుతో బదలాయించేటప్పుడు ఇలాంటి తప్పులు దొర్లుతున్నాయి. ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ల సమయంలో కూడా వాహనానికి ఉన్న ఛాసిస్, ఇంజిన్ నంబర్లకు బదులు వేరే నంబర్లు పొందు పరుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. షోరూం వాళ్లు ఇచ్చిన పేపర్లను చూపించి రికార్డుల్లో తప్పులను సరి చేయాలని యజమానులు కోరుతున్నప్పటికీ చలానా కట్టాలని దబాయిస్తున్నారు
మద్దతు ధరకే వరి ధాన్యాన్ని కొనుగోలు...ఇందిరక్రాంతి పథం(ఐకేపీ)
రైతులు నష్టపోకుండా కనీస మద్దతు ధరకే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వం ఇందిరక్రాంతి పథం(ఐకేపీ) సభ్యుల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. జిల్లా పౌర సరఫరాల సంస్థ, డీఆర్‌డీఏ, మార్కెటింగ్ శాఖ ఆ దిశగా కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి ఐకేపీ సభ్యులకు డిసెంబరు మొదటి వారంలో శిక్షణ ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నాయి. రెండోవారంలో కేంద్రాలు ప్రారంభించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఖరీఫ్‌లో కేసీ కెనాల్ కింద 22,322 హెక్టార్లు, బోర్ల కింద 25,437 హెక్టార్లు, చెరువుల కింద 1020 హెక్టార్లలో వరి సాగు చేశారు. సరాసరిన ఎకరాకు 20 బస్తాల దిగుబడి రానున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. డిసెంబరు మొదటివారం నుంచి వరి నూర్పిళ్లు ప్రారంభం కానుండటంతో రైతుల వద్ద ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో వరిసాగు ఎక్కువగా ఉన్న ఎనిమిది మండలాలను గుర్తించి మొదట విడతగా అందులో 12 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాలు
గూడెంచెరువు, సున్నపురాళ్లపల్లె (జమ్మలమడుగు)
భూమయ్యగారిపల్లె, పాతూరు (ఖాజీపేట)
మైదుకూరు, అన్నలూరు (మైదుకూరు)
మండల కేంద్రాలైన చాపాడు, దువ్వూరు, చెన్నూరు
కొర్రపాడు (రాజుపాళెం)
కొనుగోలు కేంద్రాలు
గూడెంచెరువు, సున్నపురాళ్లపల్లె (జమ్మలమడుగు)
భూమయ్యగారిపల్లె, పాతూరు (ఖాజీపేట)
మైదుకూరు, అన్నలూరు (మైదుకూరు)
మండల కేంద్రాలైన చాపాడు, దువ్వూరు, చెన్నూరు
కొర్రపాడు (రాజుపాళెం)
బెజవాడ సినిమా....రివ్యూ
రక్త చరిత్ర హిందీలో ఫ్లాపు..
తమిళంలోనూ ఫ్లాపు.. కానీ తెలుగులో మాత్రం హిట్టు.. ఎందుకంటే ఆ కథాంశంపై రాష్ట్ర ప్రజలకు
అంత ఆసక్తి. ఆ సినిమాకు స్ఫూర్తిగా తీసుకున్న పాత్రలో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండటం వల్లే..
అంతే తప్ప అదేదో గొప్ప సినిమా అని కాదు. రక్త చరిత్ర విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు
వర్మ మరో ప్రాంత చరిత్రతో జనాల ముందుకు వచ్చాడు. అదే ‘బెజవాడ’. మరి ఇందులోనూ ఆ ఎమోషనల్
అటాచ్మెంట్ ఉందా.. ప్రేక్షకులు దీంతోనూ కనెక్ట్ అయ్యారా.. రక్తచరిత్రలాగే దీనికీ బ్రహ్మరథం
పడతారా?
బెజవాడ నేపథ్యాన్ని పక్కనబెట్టి
చూస్తే.. ఈ సినిమాలో ఏ ప్రత్యేకతా లేదు. కొన్ని వందలసార్లు చూసిన ప్రతీకార కథ ఇది.
తన గాయం సినిమానే కొంచెం మార్చి వివేక్ కృష్ణతో రక్తచరిత్ర తీయించాడు వర్మ. ఇక టేకింగేమైనా
కొత్తగా ఉందా అంటీ అదీ లేదు. రక్తచరిత్ర మూడో పార్టు చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఐతే
రక్తచరిత్రకు ఉన్న ప్లస్.. ఈ సినిమాకు లేదు. అదే.. ఎమోషనల్ అటాచ్మెంట్. చలసాని పండు
హత్య జరిగిన వెంటనే ‘బెజవాడ రౌడీలు’ అంటూ టైటిల్ ప్రకటించి తన మొండి ధైర్యం చూపించిన
వర్మ.. సినిమా తీయడంలో మాత్రం ఆ ధైర్యం చూపలేకపోయాడు. షూటింగ్ సమయంలోనే తీవ్ర నిరసనలు
వ్యక్తమైన నేపథ్యంలో బెజవాడ నేపథ్యాన్ని, నిజజీవిత క్యారెక్టర్లను సినిమాలో చూపించడానికి
వర్మ బృందం సాహసించలేదు. కేవలం కొన్ని సంఘటనల్ని సినిమాలో జొప్పించడానికి ప్రయత్నించారు
తప్ప.. రక్తచరిత్రలో లాగా నిజజీవిత చరిత్రల్ని, క్యారెక్టర్లను ఇందులో చూపించలేదు. మామూలుగానే పరిటాల రవి-సూరిల పగ గురించి ఉన్నంత ఆసక్తి రంగా-నెహ్రూ
శత్రుత్వంపై జనాలకు లేదు. అందులోనూ బెజవాడలో పోల్చుకోదగ్గ క్యారెక్టర్లేమీ లేకపోవడంతో
జనాలకు ఎమోషనల్ అటాచ్మెంట్ కలగదు. హింస ఎక్కువైందని మహిళా సంఘాలు, పౌర సంఘాల వాళ్లు గొడవ చేయాలి
తప్ప.. మా నాయకుణ్ని కించపరిచారంటూ ఎవరూ గొడవకు దిగరు. కాబట్టి రక్తచరిత్రకు వచ్చినట్లు
ఫ్రీ పబ్లిసిటీ ఈ సినిమాకి రాదు. ఓపెన్ మైండ్ తో చూసినా జనాలకు ఈ సినిమా నచ్చడం కష్టమే.
ఎందుకంటే సినిమాలో ఏ కొత్తదనం లేదు. అసలు ఏ ప్రతీకార కథ అయినా ప్రేక్షకులు ముందు ఫీలైతేనే
ఆ ఎమోషన్ తో కనెక్ట్ అవుతారు. బెజవాడకు అంత సీన్ లేదు. హీరో వర్గం గొప్పదని, వాళ్లకు అన్యాయం జరిగిందని ప్రేక్షకులకు
అనిపించే అవకాశం లేదు. అసలు హీరో క్యారెక్టర్ నాగచైతన్యకు నప్పలేదు. గాయం సినిమాలో
జగపతిబాబు తరహా పాత్రలో నాగచైతన్యను చూడటం ఇబ్బందే. అతనికి వయసుకు మించిన పాత్రలా అనిపిస్తుంది.
అతను చెప్పే డైలాగులు కూడా ఆ క్యారెక్టర్ పరిణతికి మించినట్లు ఉన్నాయి.
వివేక్ కృష్ణ కొత్తగా చేసిందేమీ
లేదు. తన ముద్ర వేయడానికి అతనెక్కడా ప్రయత్నం చేయలేదు. గురువు రాంగోపాల్ వర్మను ఫాలో
అయిపోయాడు. రక్తచరిత్రను తిరగరాశాడు. వర్మ లాగే ఎక్కువగా క్లోజప్ షాట్లతోనే సినిమా
నడిపించాడు. టేకింగ్ విషయంలో కొత్త శైలి చూపకపోయినా పదునైన, అర్థవంతమైన మాటలు రాసినందుకు
మాత్రం వివేక్ ను అభినందించాలి. కాళిని రాజకీయాల్లో చేరమంటే.. ‘‘జనాలు నా దమ్ము చూసి
నా దగ్గరికి వస్తున్నారు.. ఇప్పుడు నేను వాళ్ల దగ్గరికెళ్లి మీరే నా దమ్ము అని చెప్పాలా’’
అనడం.. హీరో ‘‘వాడు కొడితే మీరు పడతారేమో.. కానీ నేను కొడితే వాడు పడి..పోతాడు’’ అనడం..
‘‘కిరాయి కోసం కాల్చేవాడి గురి తప్పుతుంది కానీ.. కడుపు మండి కాల్చేవాడి గురి తప్పదు’’
‘‘డేంజర్ మనకు కొత్త కాదు.. అన్నయ్య కత్తి పట్టినపుడే అది మన ఫ్యామిలీలో మెంబరైపోయింది’’
లాంటి డైలాగులు ఆకట్టుకుంటాయి. కానీ సన్నివేశాలు పండక, ఈ డైలాగులు వృథా అయ్యాయి.
మాస్ హీరోగా నిలబడాలన్న నాగచైతన్య
ప్రయత్నం ఈ సినిమాతో కొంచెం నెరవేరినట్లే. క్యారెక్టర్లో వెయిట్ లేదు కానీ.. అతను బాగానే
చేశాడు. మాస్ లుక్స్, మేనరిజమ్స్ తో కొత్త ఇమేజ్ కు దగ్గరగా వచ్చాడు. క్లోజప్ షాట్స్
లో గత చిత్రాల కంటే మెరుగయ్యాడు. అమలాపాల్ చేసిందేమీ లేదు. హీరోతో కొంచెం రొమాన్స్
చేసున్నా సినిమాకు ఉపయోగపడేది. కానీ దర్శకుడు ఆ ప్రయత్నం చేయలేదు. ఇలాంటి సినిమాలకు
అవసరం లేని రెండు డ్యూయెట్లకు మాత్రమే ఆమె ఉపయోగపడింది. అభిమన్యు సింగ్ మరోసారి భయానక
పాత్రలో జీవించాడు. అతని పాత్ర రక్తచరిత్రకు పొడిగింపులా ఉంది. కోట, అజయ్, ప్రభు, ముకుల్ దేవ్ లు తమ పరిధి మేరకు
నటించారు. స్కెచ్ గోపిగా బ్రహ్మానందం చేసిన కామెడీ అంతగా పండలేదు. రక్తచరిత్ర థీమ్
సాంగ్ వినిపిస్తుండగా బ్రహ్మి బండిమీద వస్తున్నపుడు మాత్రం థియేటర్ హోరెత్తిపోయింది.
కానీ బ్రహ్మిని సరిగా వాడుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడు.
అమర్ మొహిలే పాటల్లో ‘అడగకు
నన్నేమి’ పాట మాత్రమే వినసొంపుగా ఉంది. ఐతే రక్తచరిత్ర లాగే ఈ సినిమాకూ పాటలు లేకపోయినా
తేడా ఏమీ ఉండేది కాదు. ఏదో పెట్టాలని పెట్టారే తప్ప హీరోహీరోయిన్ల మధ్య డ్యూయెట్లు
సినిమాకు ఏమీ ఉపయోగపడలేదు. బాపి-టుటిల్ ల నేపథ్య సంగీతం రక్తచరిత్రకు కొనసాగింపు మాత్రమే.
అక్కడక్కడా టైటిల్ సాంగ్ థీమ్ వాడటాన్ని మినహాయిస్తే యాజిటీజ్ అదే బ్యాగ్రౌండ్ స్కోర్
ను బెజవాడకు వాడేశారు.హీరోహీరోయిన్లు ముచ్చట్లు చెప్పుకుంటున్నపుడు కూడా సీరియస్ బ్యాగ్రౌండ్
స్కోర్ (టైటిల్ సాంగ్ థీమ్) ఎందుకో దర్శకుడికే తెలియాలి.
మోటార్ సైకిల్ సైలెన్సర్ నోట్లో
పెట్టి ఎక్సలేటర్ రైజ్ చేస్తూ చంపడం ఎక్కడైనా చూశారా.. జీపు పక్కగా కత్తి కట్టి.. అవతల
మనిషిని మోకాలిపై నిల్చోబెట్టి బండి ముందుకు తీసుకెళ్లి తల తెగ్గొట్టడం ఎప్పుడైనా కన్నారా..
చీలల్ని నోట్లోకి కుక్కి ప్రాణాలు తీయడం ఇంతకుముందు చూశారా.. వివేక్ కృష్ణ తన క్రియేటివిటీని
ఇలా ఉపయోగించాడు. ఇలాంటి సన్నివేశాల ద్వారా జనాలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు.. ఇలా
కూడా చంపొచ్చని క్రిమినల్స్ కు కొత్త కొత్త ఐడియాలిస్తున్నారా? ఇలాంటి సన్నివేశాల్ని చూసి ఎంజాయ్
చేయగలిగేంత గొప్ప మనసు మీకుంటే.. వర్మ గతంలో అన్నట్లు ‘హింస కూడా వినోదమే’ అని గట్టిగా
నమ్మేవారైతే ‘బెజవాడ’ చూడండి!
రేటింగ్
1.5/5
Subscribe to:
Posts (Atom)