Sunday, 8 January 2012
108 వాహనాల నిర్వహణ రవాణా శాఖ పరిధిలోకి
విభేదాలున్నా సర్దుకుంటా...టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు
మహేష్ బాబు-కాజల్ మధ్య ఘాటైన లిప్ లాక్ సీన్లపై. ..నమ్రత ఓకే!
బిజినెస్‌మేన్ సినిమాలో మహేష్‌ది కంత్రీ క్యారెక్టర్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్‌పై ఫైర్ ...మంత్రి టిజి వెంకటేష్
వెంకన్న సొమ్ముతో ప్రైవేట్ బ్యాంక్‌ల వ్యాపారం
శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను విక్రయించే ఓ ప్రైవేటు బ్యాంక్ టిక్కెట్ల
విక్రయంతో వచ్చిన సోమ్మును సొంత ఖాతాలో వేసుకుని తన వ్యాపారానికి
(రొటేషన్) వినియోగించుకుంటున్న వైనం ఇటవల ఎల్‌ఎఫ్ ఆడిట్‌లో వెలుగు చూసింది.
దీంతో టిటిడి యాజమాన్యం బ్యాంక్ అధికారులను పిలిచి ప్రశ్నించింది. తమను
నిలదీస్తే టిక్కెట్ల విక్రయాలు తాము చేయలేమని, ఆ బాధ్యతల నుండి
తప్పుకుంటామని బ్యాంకు అధికారులు బెదిరింపు ధోరణిలో చెప్పటంతో టిటిడి
అవాక్కయింది. ఆర్జిత సేవా టిక్కెట్ల విక్రయాల గత రెండు దశాబ్దాలుకు పైగా ఓ
ప్రైవేటు బ్యాంకుకు అప్పగించిన విషయం విదితమే. అయితే ఈ టిక్కెట్ల
విక్రయానికి బ్యాంకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి, వారి జీతబత్యాల
చెల్లింపు, ఇతర వౌలిక సదుపాయాల కల్పనకు ఏటా కొన్ని లక్షల రూపాయల ఆర్థిక
భారాన్ని భరిస్తోంది. ఈ నేపథ్యంలో 2009-10 సంవత్సరంలో ఆర్జిత సేవా
టిక్కెట్ల విక్రయం ద్వారా 54 కోట్ల రూపాయలు టిటిడి ఖాతాలో జమ చేయాల్సి
ఉంది. అయితే ఆ ప్రైవేటు బ్యాంకు కేవలం 52 కోట్ల రూపాయలను మాత్రమే జమ చేసి
మిగిలిన రెండు కోట్ల రూపాయలను బ్యాంక్ ఖాతాలోనే ఉంచుకున్నట్లు ఎల్‌ఎఫ్
ఆడిట్‌లో వెలుగు చూసింది. తద్వారా 2 కోట్ల రూపాయలపై వెంకన్నకు రావలసిన
వడ్డీ డబ్బులు సదరు బ్యాంకు ఖాతాలోకే చేరుతున్నాయి. ఇది పలు విమర్శలకు దారి
తీస్తోంది. ఓ వైపు కోట్ల రూపాయల టిటిడి సోమ్మును తమ ఖాతాలో వేసుకుని,
తిరిగి తాము భక్తులకు, టిటిడికి సేవ చేస్తున్నామంటూ ప్రచారం చేసుకోవడాన్ని
ఉద్యోగులు తప్పుపడుతున్నారు. ఓ వైపు వ్యాపార దృక్పథంతో తిరుమలలో బ్యాంకును
ఏర్పాటు చేసుకుని, మరో వైపు సేవగా చెప్పుకోవడాన్ని ఉద్యోగ సంఘాలు
ఖండిస్తున్నాయి. ఇదిలా వుండగా ఈ విషయంపై టిటిడి అధికారులను
ప్రశ్నించినప్పుడు తాము గట్టిగా ఒత్తిడి చేస్తే, వారు టిక్కెట్ల విక్రయ
సేవలు నిలిపివేస్తామంటూ హెచ్చరిస్తున్నారని వాపోయారు. అలా నిలిపి వేస్తే
తిరిగి మరో బ్యాంక్ టిక్కెట్ల విక్రయానికి ఆసక్తి చూపుతుందా.. అనే
అనుమానాలు కూడా టిటిడిలో వ్యక్తమవుతున్నాయి. అవసరమయితే ఇందుకు సంబంధించి
టిటిడినే మరో సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది
సీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి
రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక
ప్యాకెజీ ఇవ్వాలని
ఐఎన్‌టియుసి రాష్ట్ర అధ్యక్షులు రాఘవరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే సమగ్రాభివృద్ధి సాధ్యవౌతుందన్నారు.
కర్నూలు నగరంలోని నేతాజీ కాంప్లెక్స్ సెంటర్‌లో ఐఎన్‌టియుసి
జిల్లా, నగర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాఘవరాజు
మాట్లాడుతూ సంఘటిత, అసంఘటిత కార్మికుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర
ప్రభుత్వాలు సోనియాగాంధీ ఆలోచన విధానాలకు అనుగుణంగా చిత్తశుద్ధితో కృషి
చేస్తున్నాయని అన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం ఖాయిలాపడ్డ చక్కెర
కార్మాగారాలు, వివిధ పరిశ్రమల పునరుద్ధరణకు 740 కోట్ల రుణ సదుపాయాన్ని
కల్పించడం హర్షణీయమన్నారు. కార్మికులు, పేదల సంక్షేమాన్ని దృష్టిలో
పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టాన్ని అమలులోకి తెస్తున్న ఘనత
కాంగ్రెస్ పార్టీదే అన్నారు. ఐఎన్‌టియుసి యూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు
విశ్వశాస్ర్తీ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఐఎన్‌టియూసిని బలోపేతం చేసి
కార్మికుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా సభ్యులు పని చేయాలని పిలుపునిచ్చారు.
గుంటూరు జిల్లా ఐఎన్‌టియుసి అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్
మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చేనత కార్మికులకు
వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఐఎన్‌టియుసి
అధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని మున్సిపాలిటీ ప్రాంతాల్లో
వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో యూనియన్‌ను విస్తరించి కార్మిక రంగానికి,
అభివృద్ధికి అండగా నిలుస్తామన్నారు. నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర
అధ్యక్షులు రాఘవరాజు ప్రకటిస్తూ నియామక ఉత్తర్వులు జారీ చేశారు
రాయలసీమ జిల్లాలో రాజీవ్ యువ కిరణాలు నీరుగారి పోతోంది
అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ గ్రామాల్లో పోలీసుల సోదాలు
ధర్మవరం రూరల్ పోలీసుసర్కిల్ పరిధిలోని పలు ఫ్యాక్షన్ గ్రామాల్లో దిగ్భంద
సోదాలు నిర్వహిస్తున్నట్లు సిఐ గంగయ్య తెలిపారు. స్థానిక రూరల్
పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్కిల్
పరిధిలోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి మండలాల్లోని ఫ్యాక్షన్
గ్రామాల్లో ఇప్పటికే పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించి ముఠాతగాదాలతో జరిగే
అనర్థాలు ప్రజలకు వివరించామన్నారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ గ్రామాలైన ధర్మవరం
మండలంలోని రేగాటిపల్లి, నేలకోట, ఓబుళనాయునిపల్లి, సిసి కొత్తకోట,
కామిరెడ్డిపల్లి, బత్తలపల్లి మండలంలోని గరిశలపల్లి, తాడిమర్రి మండలంలోని
దాడితోట గ్రామాల్లో దిగ్భంద సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ
సోదాల్లో భాగంగా ఉదయానే్న పోలీసులు గ్రామాల్లో ప్రవేశించి గ్రామస్థులను
గ్రామం వెలుపలికి వెళ్ళనివ్వకుండా ఇతరులను గ్రామంలోకి అనుమతించకుండా
పకడ్బందీగా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో అనుమానం వచ్చిన
వారి ఇళ్ళతో పాటు పశువులపాకలను, గడ్డివాములు తదితర ప్రాంతాలను సైతం
క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శనివారం ధర్మవరం మండలంలోని
ఓబుళనాయునిపల్లి గ్రామం లో ఎస్‌ఐ అబ్దుల్‌కరీం ఆధ్వర్యంలో దిగ్భందసోదాలు
నిర్వహించగా తాడిమర్రి మండలంలో ఎస్‌ఐ శేఖర్ ఆధ్వర్యంలో దాడితోట గ్రామంలో
దిగ్భందసోదాలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే బత్తలపల్లి మండలంలోని
గరిశలపల్లి గ్రామంలో పిఎస్‌ఐ రఘురాంప్రసాద్ ఆధ్వర్యంలో పల్లెనిద్ర
నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యంగా పల్లెనిద్ర దిగ్భందసోదాల కార్యక్రమాల
వల్ల ముఠా తగాదాల జోలికి ప్రజలను వెళ్ళకుండా చైతన్యపరుస్తూ వాటివల్ల జరిగే
అనర్థాలను వివరిస్తున్నట్లు ఆయన తెలిపారు.
నేడు శ్రీశైలం మల్లన్న వార్షిక ఆరుద్రోత్సవం
పరమశివుని జన్మనక్షత్రమైన ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం
రాత్రి శ్రీమల్లికార్జున స్వామికి వార్షిక ఆరుద్రోత్సవ
నిర్వహిస్తున్నట్లు ఈఓ హనుమంతరావు తెలిపారు. ఈ ఉత్సవంలో
భాగంగా ఆదివారం రాత్రి 10.30 గంటలకు స్వామివార్లకు లింగోద్భవకాల,
మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అన్నాభిషేకం, 9వ తేదీ సోమవారం స్వామివార్ల
ప్రాతఃకాల పూజలనంతరం 5.30 గంటలకు ఉత్తరద్వార దర్శనం ఉంటుందన్నారు. అనంతరం 6
గంటలకు స్వామి అమ్మవార్లను నంది వాహనంపై వేంచేయించి పురవీధుల్లో
గ్రామోత్సవం నిర్వహిస్తారని తెలిపారు. సోమవారం వేకువజామున 3.30 గంటలకు ఆలయ
ఉత్తరద్వారమైన శివాజీ గోపురాన్ని తెరచి 4 గంటలకు సుప్రభాతసేవ, 5 గంటలకు
మహామంగ ళహారతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వార్షిక ఆరుద్రోత్సవాన్ని
పురస్కరించుకుని సోమవారం వేకువజామున జరిగే సుప్రభాత, మహామంగళహారతి సేవా
టికెట్లను నిలుపుదల చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి ఉత్సవంలో ఆలయ
మహాద్వారమైన కృష్ణదేవరాయ గోపురం (తూర్పుద్వారం) మీదుగా గ్రామోత్సవానికి
తరలివేళ్లే స్వామివారు ధనుర్మాసంలో వచ్చే ముక్కొటిఏకాదశి, వార్షిక
ఆరుద్రోత్సవం రోజులలో మాత్రమే ఉత్తరద్వారం గుండా తరలి వెళ్లడం
విశేషమన్నారు. స్వామివార్ల ప్రాతఃకాల ఉత్తర ద్వార దర్శనానంతరం 6 గంటలకు
తూర్పుద్వారమైన శ్రీకృష్ణదేవరాయ రాజగోపురద్వారాలను తెరచి భక్తులకు దర్శన,
ఆర్జితసేవలకు అనుమతిస్తున్నట్లు ఈఓ పేర్కొన్నారు
Subscribe to:
Posts (Atom)