Monday, 5 March 2012

కర్నూలు జిల్లా ఉపఎన్నికకు నేతల ఆధిపత్య పోరు

ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజక వర్గంలో ఆది నుంచి గంగుల, భూమా కుంటుంబాల మధ్య ఫ్యాక్షన్, గ్రూపు రాజకీయాలు నడుస్తూన్నాయి. పార్టీల కన్నా గంగుల, భూమా గ్రూపు ఆధిపత్య రాజకీయమే ఆళ్లగడ్డలో కీలకం. అయితే స్థానిక ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి రాజీనామాను రెండురోజుల క్రితం అసెంబ్లీ స్వీకర్ ఆమోదించడంతో ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానంలో ఉపఎన్నికకు తెర లేచింది. దీంతో అందరి దృష్టి ఆళ్లగడ్డవైపు మళ్లింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలతో పాటు స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డిలు కూడా తమ గ్రూపులను ఇప్పటి నుంచే ఉపపోరుకు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా రెండు ప్రధాన గ్రూపుల ఆధిపత్య పోరు మధ్య అధికారుల నలిగిపోతున్నారు. ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధికారులతో సమావేశమై కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, ఆళ్లగడ్డ నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులతో పాటు గ్రామపంచాయితీ నిధులు కూడా తాము సూచించిన వారికే కేటాయించాలని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్న విషయాన్ని ప్రజలకు తెలుపాలన్నదే తమ ఉద్దేశ్యం అని కాంగ్రెస్‌పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి కూడా అన్ని శాఖల అధికారులతో సమావేశమై ప్రభుత్వ నిబంధనలమేరకు ఉపాధి హామీ పనులు చేయాలని సూచించారు. రాజకీయ వత్తిళ్లకు తలవంచి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పరోక్షంగా హెచ్చరిక జారీ చేశారు.

జగన్ కేసు విషయం సీబీఐ చూసుకుంటుంది...సీఎం

ఉప ఎన్నికల విషయమై ఎన్నికల కమిషనన చూసుకుంటుందని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా సోమవారం మీడియాతో సీఎం మాట్లాడుతూ ప్రత్యేక కారణాలవల్ల ఈ ఎన్నికలు జరుగుతున్నందున ప్రభుత్వానికి రెఫరెండం కాదని అన్నారు. ఉప ఎన్నికల ప్రచారం విషయం పీసీసీ పరిశీలిస్తోందని, అవసరమైన చోట తమతోపాటు ఇతర నేతలు ప్రచారానికి వెల్తారని కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యనేతలు ప్రచారం చేస్తే లాభాలతోపాటు, నష్టాలు కూడా ఉండవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేశారు.రాజ్యసభ సీట్ల వ్యవహారాన్ని అధిష్టానం చూస్తుందని సీఎం తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు అక్రమాస్తుల వ్యవహారం సీబీఐ చూస్తోందని, ప్రభుత్వానికి సంబంధం లేదని, పార్టీలో ఇతర నేతల వ్యాఖ్యలపై తాను స్పందించనని మీడియాముఖ్యమంత్రి తెలిపారు. తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి ఎక్కడున్నా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగమేనని సీఎం పేర్కొన్నారు.

జగన్ అరెస్ట్ ఖాయం జేసీ సంచలన వ్యాఖ్యలు

జగన్‌ను అరెస్ట్ చేయక తప్పదని,  స్పష్టత లేదని అసెంబ్లీ ఆవరణలో జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేశారు.వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయక తప్పదని అనంతపురం జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి సోమవారం అన్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం జెసి టిడిఎల్పీ గదికి వచ్చారు. ఆయన టిడిపి నేతలు మోత్కుపల్లి నర్సింహులు, పయ్యావుల కేశవ్‌తో పిచ్చాపాటిగా మాట్లాడారు. జగన్‌ను అరెస్టు చేయడం తప్పదని, అయితే అది కొవ్వూరు ఎన్నికలకు ముందా లేక తర్వాత అన్న దానిపై స్పష్టత లేదని చెప్పారు. ప్రభుత్వ మాజీ సలహాదారు కెవిపి రామచంద్ర రావును ఎందుకు అరెస్టు చేయడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును మీరు బాగా ఇరుకున పెడుతున్నారని మోత్కుపల్లికి జెసి కితాబిచ్చారు. మీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన దానికి ఇప్పుడు మేం ఫలితం అనుభవిస్తున్నామని వారితో అన్నారు. అధికారులు అవినీతి విషయంలో బాగా బరి తెగించారని అరోపించారు. కాగా కెసిఆర్‌కు వ్యతిరేకంగా తాను చేపట్టబోయే పాదయాత్ర వివరాలను మోత్కుపల్లి ఆయనకు వివరించారు.కేసీఆర్ ను ఘాటుగా విమర్శిస్తున్నారని మోత్కుపల్లిని ప్రసంశించారు.