Saturday, 25 February 2012

రాయలసీమలో పోలీసుల రాజ్యం!


 అయితే జిల్లాలో ఇటీవల జరు గుతున్న కొన్ని పరిణామాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. బాధ్యత గల ఉద్యోగులమనే విషయం విస్మరించి వీధి గూండాల్లా వ్యవహరించారు. ఇతరులెవరైనా తగవులాడుకుంటే సర్ది చెప్పి పంపాల్సిన 'పెద్దరికం' వారిది. కానీ వారే కండకావరంతో కసాయిల్లా ప్రవర్తించారు. తమ 'నాగరికత' ఇదీ అని చాటుకున్నారు. ఇంతకాలం రౌడీషీటర్లను, ఫ్యాక్షనిస్టులను జిల్లా నుంచి పోలీసులు బహిష్కరించేవారు. ఇప్పుడు వారికే అలాంటి దుర్గతి ఏర్పడిందంటే కార ణం స్వయంకృతమే. ఇలాంటి పరిస్థితు ల్లో ఎస్పీ పట్టుదలకు పోకుండా నిష్పాక్షికతను నిరూపించుకోవాల్సి ఉంది. ఒకవేళ ఆయన తూతూ మం త్రంగా వ్యవహరిస్తే నష్టపోయేది పోలీ సు శాఖే. అయితే ఒత్తిళ్లకు తాము తలొగ్గబోమని, పద్ధతి ప్రకారం విచారణ జరిపించి చ ర్యలు తీసుకుంటామని  పేర్కొన్నారు. అదే స మయంలో కొందరు గ్రామస్థుల్లో మరో అభిప్రాయం కూడా వ్యక్తమవుతోందం టూ తన మనసులో మాట చెప్పకనే చె ప్పారు. కళ్లకు కనిపించే నగ్న సత్యానికి మించి సాక్ష్యమేమి కావాలి. 
 ప్రజాభిప్రాయానికి మిం చిన విచారణ మరొకటేముం టుంది? ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించడమంటే 'మసిపూసి మారేడు కాయ'చేసే ప్రయత్నమే అవుతుంది. ఒకసారి ప్రజల్లో విశ్వాసం కోల్పోయాక తిరిగి దాన్ని పాదుగొల్పడం అంత సులువైన పని కాదని గతవారం 'వ్యాఖ్యానం'లో చెప్పుకున్నాం. వృత్తి ధర్మాన్ని విస్మరించి పోలీసులు అసాంఘిక శక్తుల్లా నడుచుకుంటూపోయినంత కాలం వారు ప్రజాగ్రహానికి గురవుతూనే ఉంటారు. తర చూ ఇలాంటి సంఘటనలు జిల్లాలో జరుగుతు న్నాయంటే మన పోలీసులు ఎటువైపు పయనిస్తున్నట్లు? ఎస్పీ ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కితే ఇక పో లీసు 'బూచి' ఇక తొలగేదెన్నడు? సమాజమేగతి బాగుపడేను? పిల్లలను దారిలోకి తెచ్చుకోవడానికి ఒకప్పుడు తల్లిదండ్రులు పోలీసులను 'బూచి'గా చూపే వారు. అప్పట్లో ఖాకీలంటే ఉండే భయం అదీ.. స్వాతంత్య్రం రాక ముందు బ్రిటిష్ పోలీసులు ఎంతో కర్కశంగా వ్యవహరించే వారు. వారి అరాచకాలు, అఘాయిత్యాలకు అంతు ఉండేది కాదు. అందుకే వారంటే జనం జడుసుకునేవారు. దాని ప్రభావమే 'బూచి' రూపంలో అలా వ్యక్తమ య్యేది. రానురాను పరిస్థితుల్లో మార్పు వచ్చింది. పోలీసులు, ప్రజల మధ్య కొంతవరకు సంబం ధాలు మెరుగుపడ్డాయి. పోలీసులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం అలవరుచు కున్నారు. ప్రజలతో మమేకం కావడానికి ప్రయత్నించారు. అలాగని అంతా సస్వరులయిపో యారని చెప్పలేం గానీ కొంతలో కొంత మార్పయితే వచ్చింది.  దొంగలతో పోలీసులు చేతులు కలపడమంటే వింతగానూ, విడ్డూరంగానూ లేదూ? వారితో దొంగతనాలు, దోపిడీలు చేయిస్తూ వాటాలు పంచుకునేవారంటే జుగుప్స కలిగించడం లేదూ? అంతెందుకు? జిల్లాలో సంఘ టనను మానవమాత్రులెవరైనా సమర్థిస్తారా? ఏమి జరిగిందని అక్కడి పోలీసులు పూనకం వచ్చి నట్లు ప్రవర్తించారో అర్థం కావడం లేదు. తాము పోలీసులమనే అహంతో కన్నూమిన్నూ కాన కుండా నడుచుకున్నారు. 
అనంతపురం జిల్లాలో
'మా వాళ్లతోనే పెట్టుకుం టారా?' అన్నట్లు ఉంది ఆయన వ్యవహార సరళి. తాము మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నామనే స్పృహ కూడా వారికి కలగలేదు. ప్రజాస్పందనను గురించిన ఆలోచన కూడా వారికి ఏమాత్రం వచ్చినట్లు లేదు. తాము ఏమి చేసినా చెల్లుబాటవుతుందనుకున్నారు. అయితే ఆ తరువాత పరిస్థితి వారి చేయి దాటిపోయిం ది. గ్రామస్థులంతా ఏకమయ్యా రు. ఒక్కసారిగా పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. ఏకధాటిగా 8 గంటల పాటు కొత్తచెరువును దిగ్బంధించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఒక డీఎస్పీ, ఎనిమిది మంది సీఐ లు, పో లీసు అదనపు బలగాలు రంగంలోకి ది గాల్సి వచ్చింది.
   
 

అనంతపురం జిల్లాలో కరవు పరిస్థితి కమిటీ దృష్టికి

జిల్లా కరవుకు ప్రత్యామ్నాయంగా మెరుగైన వ్యవసాయ, అభివృద్ధి ప్రణాళిక తయారీ, రూపకల్పన కోసం జిల్లాలో శనివారం నుంచి జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ పర్యటిస్తున్నారని, కమిటీ పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ వి. దుర్గాదాస్ అధికారులను ఆదేశించారు. ప్రతి సంవత్సరం కరవుతో తల్లడిల్లుతున్న జిల్లా రైతులకు మేలు కలిగే విధంగా కరవుకు ప్రత్యామ్నాయంగా వ్యవసాయ అభివృద్ది ప్రణాళిక రచనకు అనుగుణంగా జిల్లాలో నెలకొన్న వాస్తవ కరవు, వ్యవసాయం గురించి కమిటీకి వివరించాలన్నారు. డాక్టర్ అయ్యప్పన్ కమిటీ జిల్లా పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ వి.దుర్గాదాస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి డాక్టర్ యన్.రఘువీరారెడ్డి చొరవ వల్లే డాక్టర్ అయ్యప్పన్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎకె సింగ్ ఆధ్వర్యంలోని కమిటీ ఈనెల 25, 26న జిల్లాలో పర్యటిస్తుందన్నారు. ఇందులో దాదాపుగా 20 మంది వరకూ వ్యవసాయ, దాని అనుబంధ రంగాలలో నిపుణులైన శాస్తవ్రేత్తలు, అధికారులు ఉంటారన్నారు. డాక్టర్ ఎకె సింగ్ ఆధ్వర్యంలో ఒక కమిటీ గత నెల 18, 19, 20వ తేదీల్లో జిల్లాలో పర్యటించిందన్నారు. దేశంలోనే అత్యున్నతమైన వ్యవసాయ పరిశోధన మండలి ఐసిఎఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ కూడా స్వయానా జిల్లా పర్యటనకు వస్తున్నందున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగ పరచుకోవాలన్నారు. వ్యవసాయ, దాని అనుబంధ శాఖల అధికారులందరూ ఈ పర్యటనను సద్వినియోగం చేసుకొని జిల్లాకు గరిష్టంగా ఉపయోగం కలిగే విధంగా కమిటీకి వివరాలను నివేదించాలని కలెక్టర్ కోరారు. గత 20 సంవత్సరాల నుంచి వర్షపాతం, వర్షాభావం, కరవు, పంటల సాగు, దిగుబడి, నేలల స్వభావం, భూగర్భ జల వనరుల స్థితిగతులు, పాడిపరిశ్రమ, పండ్లతోటలు, పశుగ్రాసం, తాగునీరు తదితర విషయాలు, సమస్యలపై విపులంగా కమిటీకి ఆయా శాఖల అధికారులు వివరించాలని కలెక్టర్ కోరారు. కమిటీ పర్యటిస్తున్న ప్రతి ప్రాంతానికీ ఒక సీనియర్ జిల్లా అధికారిని లైజన్ అధికారిగా నియమించామని కలెక్టర్ వివరించారు. డాక్టర్ అయ్యప్పన్ కమిటీ పర్యటన శనివారం ఉదయం 10.30 గంటలకు పెనుకొండ గొర్రెల పెంపకం కేంద్రంలో ఫొటో ఎగ్జిబిషన్, రైతులతో చర్చా కార్యక్రమంతో ప్రారంభం అవుతుందన్నారు. అనంతరం కళ్యాణదుర్గంలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి అధికారులు, రైతులతో చర్చించి అదే రోజు సాయంత్రం 4.15 నుంచి ఆరు గంటల వరకు రెవెన్యూ భవన్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, కమిటీ రిపోర్టును కన్వీనర్ చదివి వినిపిస్తారన్నారు.

జూ ఎన్టీఆర్ తాజా సినిమా ‘బాద్ షా’ 12 కోట్ల ఆఫర్ !

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ త్వరలో శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బాద్ షా’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ సినిమాకు ‘యాక్షన్’ అనే టైటిల్ అనుకున్నప్పటికీ చివరకు ‘బాద్ షా’ అనే టైటిల్ ఖారారు చేశారు. తాజాగా ఈచిత్ర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారయింది. మార్చి 18 పూజా కార్యక్రమం, ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్కు జరుగుతోంది. దర్శకుడు శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్ ఇటీవల ఈచిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్కు పూర్తి చేశారు. దూకుడు సినిమాకు పని చేసిన సాంకేతిక బృందం మొత్తం ‘బాద్ షా’ చిత్రానికి పని చేయనున్నారు. సినిమా మొత్తం యాక్షన్ అండ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నిర్మాత కెఎస్. రామారావు నిర్మించే చిత్రంలోనటిస్తున్నారని, ఈ సినిమాకు సదరు నిర్మాత జూ ఎన్టీఆర్‌కు రూ. 12 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి దర్శకుడు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తో ఆది, అదుర్స్ లాంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించిన వివి వినాయక్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది.

జట్టులో విభేదాలు లేవు...ధోని

బీసీసీఐ మరోవైపు జట్టుకు క్లాస్ ..!
భారత జట్టులో అభిప్రాయ భేధాలు కాని, కమ్యూనికేషన్ గ్యాప్ లేదని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పష్టం చేశారు. ఇలాంటి వార్తలు డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లకు ఇబ్బందిగా మారుతాయన్నారు. సెహ్వాగ్‌తో విభేధాలున్నాయన్న వార్తల్ని ధోని ఖండించారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయన్నారు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా మంగళవారం జరుగనున్న కీలక మ్యాచ్‌లో ప్రయోగాలకు చోటివ్వకుండా.. ముగ్గురు ఓపెనర్లతో బరిలోకి దిగుతామని ధోని వెల్లడించారు.వ్యక్తిగత విభేదాలతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న టీ మిండియా సారథి ధోనీ, వైస్ కెప్టెన్ సెహ్వాగ్ మధ్య ఎలాంటి గొడవలూ లేవని చెబుతున్న బీసీసీఐ మరోవైపు జట్టుకు క్లాస్ పీకుతోంది. గొడవలు మాని.. ఆటపై దృష్టిపెట్టండంటూ ఆటగాళ్లకు చురకలంటించినట్టు సమాచారం. వారిని అసలు మాట్లాడొద్దని (మీడియాతో) సూచించాం. మిగిలిన రెండు వన్డేలపై దృష్టిపెట్టాలని కోరాం. భారత జట్టుకు బీసీసీఐ నుంచి ఓ మెసేజ్ కూడా వచ్చింది. గొడవలన్నీ పక్కనబెట్టి మెరుగైన ప్రదర్శన చేయండని ధోనీ, వీరూలకు ప్రత్యేకంగా చెప్పామ'ని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నాడు.

రాజకీయాలంటే ఆసక్తి...అక్కినేని నాగార్జున

తనకు రాజకీయాలంటే ఆసక్తి అని టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున మీడియాకు వెల్లడించారు. తిరుపతిలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలంటే తనకు ఆసక్తి ఉందని.. రాజకీయాల్ని తాను అనుసరిస్తు ఉంటానన్నారు. అయితే తాను రాజకీయాలకు సరిపోతానో లేదో తెలియదని ఆయన అన్నారు.శనివారం తిరుపతిలోని కళ్యాణ్‌జ్యువెలరీ ప్రారంభోత్సవంలో నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని అన్నారు.తనకు భక్తిరస ఆధ్యాత్మిక చిత్రాలు చేయడమంటే ఇష్టమని నాగార్జున తెలిపారు. షిరిడి సాయిబాబా చిత్రంలో నియమనిష్టలతో పాల్గొంటున్నాని అన్నారు. తమ చిన్న కుమారుడు అఖిల్ సినిమాల్లోకి వచ్చేది లేనిది ఆయన ఇష్టమని, త్వరలోనే ఢమరుకం చిత్రం విడుదల అవుతుందని నాగ్ పేర్కొన్నారు.

కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి అనుచరులు దారుణ హత్య

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చిన్నచింతకుంట గ్రామంలో గత రాత్రి ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి అనుచరుడైన కష్ణారెడ్డి కుటుంబం నిద్రిస్తుండగా ప్రత్యర్థులు కారంపొడి చల్లి వేటకొడవళ్లతో దాడి చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన ఫ్యాక్షన్ హత్యల్లో చనిపోయిన కుటుంబాలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమా నాగిరెడి, శోభానాగిరెడ్డిలు పరామర్శించారు. ఆస్తి తగాదాల కారణంగా జరిగిన ఫ్యాక్షన్ .ఈ ఘటనలో కష్ణారెడ్డి (49), అతడి భార్య గోవిందమ్మ( 45), దుబ్బోడు (40) మతి చెందారు. కష్ణారెడ్డి కొడుకు మల్లికార్జునరెడ్డి (23), మామ రామసుబ్బారెడ్డి (60) పరిస్థితి విషమంగా ఉంది. వీరిని చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కాగా ఈ ఘటనకు పాతకక్షలు కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చింతకుంటలో 144 సెక్షన్‌ను విధించారు.