Sunday, 20 November 2011

కడప జిల్లాలో రేపటి నుంచి రైళ్లు దారి మళ్లింపు

 జిల్లా వాసుల దశాబ్దాల నాటి కల ఈ నెల 21వ తేదీన నెరవేరనున్నది. ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకూ వారం రోజుల పాటు కడప-ముద్దనూరు మధ్య డబ్లింగ్ పనులను రైల్వే అధికారులు పూర్తి చేయనున్నారు. డబ్లింగ్ పనులు ప్రారంభకానున్న దృష్ట్యా ముంబాయి, చెన్నై, చెన్నై-ముంబాయి, హైదరాబాద్-చెన్నై, చెన్నై-హైదరాబాద్, తిరుపతి-హుబ్లీ, హుబ్లీ-తిరుపతి రైళ్లను రైల్వే శాఖ ఉన్నతాధికారులు దారి మళ్లించారు. ఈ వారం రోజులు ప్రయాణికుల సౌకర్యార్థం ఎపిఎస్ ఆర్టీసీ వారు కడప నుండి సుదూర ప్రాంతాలకు అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. దక్షిణ మధ్య రైల్వేలో గుంతకల్లు, రేణిగుంట రైల్వేలైన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండు జంక్షన్ల మధ్య డబుల్ లైన్ కోసం ఈ ప్రాంత ప్రజలు దశాబ్దాల నుంచి కంటున్న కల నెరవేరే రోజు రానే వచ్చింది. ఈ ప్రాంతంలో రైల్వేశాఖకు అత్యధిక ఆదాయం తెచ్చే డివిజన్‌గా గుర్తింపు ఉంది. ముఖ్యంగా ముడి సరకు రవాణకు ముంబాయి, చెన్నై రైల్వేలైన్‌గా చెప్పుకోవచ్చు. కడప జిల్లాలో తయారయ్యే సిమెంట్ పరిశ్రమ నుంచి ఇతర రాష్ట్రాలకు సిమెంట్ ఎగుమతి వీటితో పాటు దేశంలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుంచి వెళ్తున్న ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉంది. వీటితో పాటు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థాన దర్శనానికి ఈ లైన్ మీదుగా పలు రైళ్లు ఉన్నాయి. రేణిగుంట, గుంతకల్లు మధ్య ఉన్న సుమారు 300 కిలోమీట్ల పొడవునా డబుల్ లైన్ వెరిఫికేషన్ పూర్తి చేసేందుకు సుమారు రూ. 800 కోట్లతో పనులు జరుగుతున్నాయి. రేణిగుంట నుంచి కమలాపురం వరకు 2010 అక్టోబర్ నాటికి పూర్తయ్యాయి. అయితే కమలాపురం-కొండాపురం మధ్య డబ్లింగ్ లైన్ విద్యుత్‌లైన్ పనులు ప్రారంభంకానున్నాయి. రైల్వే అధికారులు అనుకున్న సమయానికి ముందుగానే ఈ పనులు పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 21వ తేదీన పనులు ప్రారంభించి 26వ తేదీ నాటికి పనులు పూర్తి చేయనున్నారు. ఇందుకు ఎర్రగుంట్లలో ఇప్పటికే పనులు వేగవంతం చేశారు. నూతన లైన్, విద్యుదీకరణ పనులు అనుసంధానం చేసి ఇంటర్ లాకింగ్ సిస్టం పనులు పూర్తి కానున్నాయి. రేణిగుంట నుంచి కమలాపురం వరకూ డబ్లింగ్ పనులు పూర్తయ్యాయి. నవంబర్ 26 నాటికి ముద్దనూరు వరకూ డబ్లింగ్ పనులు పూర్తవుతాయి. జనవరి 31వ తేదీ నాటికి ఈ స్టేషన్ల మధ్య విద్యుదీకరణ పనులు పూర్తి చేయనున్నారు. కమలాపురం నుండి ఎర్రగుంట్ల, ముద్దనూరు వరకూ రైల్వే స్టేషన్‌లో ఉన్న రెండవ లైన్‌ను అత్యంత ఆధునీకరణతో నిర్మించడంతో పాటు రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంలు కూడా ఆధునీకరించనున్నారు. నవంబర్ 21వ తేదీ నుంచి తిరుపతి-కాచిగూడ, కాచిగూడ-తిరుపతి, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, చెన్నై-కాచిగూడ, ఎగ్మోర్-కాచిగూడ, తిరుపతి-హుబ్లీ మధ్య నడిచే ఇంటర్‌సిటీ, ముంబాయి-త్రివేండ్రం మధ్య నడిచే రైళ్ల రూట్లను రైల్వే అధికారులు దారి మళ్లించారు. చెన్నై-హైదరాబాద్, చెన్నై-ముంబాయి వెళ్లే రైళ్లను రేణిగుంట నుంచి గూడూరు మీదుగా మళ్లించారు. అలాగే ముంబాయి-త్రివేండ్రం, చెన్నై-ముంబాయి రైళ్లను ధర్మవరం మీదుగా మళ్లించారు. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను కూడా తిరుపతి-్ధర్మవరం మీదుగా మళ్లించారు. 26వ తేదీ పనులు పూర్తయిన వెంటనే 27వ తేదీ నుంచి డబుల్ లైన్లల్లో రైళ్ల రాకపోకలు జరుగుతాయని రైల్వే అధికారులు తెలిపారు. డబ్లింగ్ పనులు పూర్తయితే క్రాసింగ్ సమస్యలు తీరడంతో పాటు, రైళ్ల రాకపోకలు వేగవంతం కానున్నాయి

చంద్రబాబూ.. నిజాయితీ నిరూపించుకో:మంత్రి శైలజానాథ్

 తొమ్మిదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు అవినీతి, ఆరోపణలపై నిజాయితీని నిరూపించుకునే అవకాశం, అవసరం ఉందని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో మంత్రి విలేఖరులతో మాట్లాడారు. హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ దర్యాప్తు చేపట్టిందని, సిబిఐ దర్యాప్తుకు, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. చంద్రబాబుకు భయంగా ఉంటే కోర్టుకు వెళతారని, నిజాయతీని నిరూపించుకోవాలనుకుంటే విచారణకు సహకరించాలన్నారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. జాతీయస్థాయిలో చర్చ తర్వాతనే పూర్తిస్థాయి నిర్ణయం వస్తుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రస్తుతం ఉన్న పాఠ్యాంశాలతోపాటు కొన్ని పాఠ్యాంశాలను మాత్రమే మార్పులు చేస్తున్నామని మంత్రి వివరించారు

సమైక్యాంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతం రాయలసీమ

సమైక్యాంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతం రాయలసీమ ఒక్కటే అని శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో తెలిపిందని రాయలసీమ యువసేన రాష్ట్ర నాయకులు శీలం శేషు అన్నారు.  వెలుగోడు తెలుగుగంగ అతిథి గృహంలో మండల అడహక్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం మూడు ముక్కలుగా విడిపోతే లేనిపోని అనర్థాలు జరుగుతాయని కొంతమంది స్వార్థపరులు భయపెడుతున్నారన్నారు. వాస్తవానికి ప్రత్యేక రాయలసీమ ఏర్పడితే రాయలసీమ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం వుందన్నారు. అన్ని రకాల గనులు, పుణ్య క్షేత్రాలు, అడవులు వున్న రాయలసీమ ప్రాంతం 1956 నవంబర్ 1వ తేదీ నుండి కర్నూలు రాజధానిని కోల్పోయిందన్నారు. నాటి నుండి నేటి వరకు పాలకులు హైదరాబాద్‌ను విపరీతంగా అభివృద్ధి చేశారన్నారు. ప్రత్యేక తెలంగాణ కావాలన్న వారిని సంతోషపెట్టడం కొరకు వారి ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు కానీ రాయలసీమ అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఏ చిన్న పనికావాలన్నా హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితులు నేడు నెలకొన్నాయన్నారు. మన సమీప ప్రాంతంలోనే పరిపాలన సౌలభ్యం వుంటే ప్రజలకు చాలా సౌకర్యవంతంగా వుంటుందన్నారు. తెలుగు ప్రజలు మూడు రాష్ట్రాలుగా విడిపోవడం సబబుకాదని చాలామంది వాదిస్తున్నారు. హిందీ మాట్లాడే ప్రజలు ఆరు రాష్ట్రాలుగా విడిపోయారు వారేమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. దేశంలో హిందీ తరువాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. తెలుగువారు మూడు రాష్ట్రాలుగా విడిపోతే అభివృద్ధి పథం వైపు సాగిపోతారే తప్ప ఎలాంటి ఇబ్బందులు పడరన్నారు. మన ప్రాంతంలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టాలన్నా, ఒక పెద్ద పరిశ్రమ స్థాపించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. సాగునీరు లేక ఇక్కడి పొలాలు బీడులైపోయినా పట్టించుకునే వారే లేరు. ప్రత్యేక రాష్ట్రం కొరకు కాకపోయినా మన రాయలసీమ అభివృద్ధి కొరకైనా మనం పార్టీలకతీతంగా పోరాడాల్సిన అవసరం వుందన్నారు. అనంతరం వెలుగోడు మండల అడహక్ కమిటీ అధ్యక్షుడుగా ఎస్.రఘురాముడు, గౌరవాధ్యక్షుడుగా ఖాశింసాహెబ్, ఉపాధ్యక్షుడుగా చండ్రా వెంకటేశ్వరరెడ్డి, కార్యదర్శిగా టి.రహంతుల్లా, సహ కార్యదర్శిగా షేక్ పాపాభై, కోశాధికారిగా భాస్కరగౌడ్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

అత్యవసర రోగుల కోసం ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీ న్ సిగ్నల్

కర్నూలు సర్వజన ప్రభుత్వ వైద్యశాలలో అత్యవసర రోగుల కోసం ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీ న్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా బయట నుంచి వచ్చే మెడికల్ ఆక్సిజన్ లో కల్తీ వస్తున్నట్లు ఆరోపణలు వచ్చా యి. ఇటీవల పెద్దాసుపత్రిలోని చిన్న పిల్లల విభాగంలో ఆక్సిజన్ అందక చి న్నారులు మరణించారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం హైదరాబాద్‌లో ని గాంధీ, నిజామ్ ఆసుపత్రి తరహా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయటానికి నిర్ణయించింది. ఇందుకోసం రూ. 60 లక్షలతో బ్రిటీష్ ఆక్సిజన్ కంపెనీతో ప్రభుత్వం 15 ఏళ్లు ఒప్పందాన్ని చేసుకొంది. దీంతో ఆసుపత్రిలోని క్యాజువాల్టీ వెనుక భాగన ఖాళీ పార్కు స్థలం లో ఫ్లాంట్ పనులను ప్రారంభిస్తున్నా రు.ఇక్కడి నుంచి పైప్‌లైన్ల ద్వారా ఆ సుపత్రిలో ఏఎంసీ క్యాజువాల్టీ, చిన్న పిల్లల వార్డు, టీబీ వార్డు, ఆపరేషన్ థి యేటర్లు, ఇతర విభాగాలకు అన్ని వేళ లో ఆక్సిజన్ అందుతుంది. ప్లాంట్‌లో ఒకేసారి 10 కేఎల్ గ్యాస్ సామర్థ్యం ఉంటుంది. ఇది 10 రోజుల వరకు సరఫరా చేసే అవకాశం ఉంటుంది. నాలు గు రోజుల ముందుగానే బ్రిటీష్ ఆక్సిజ న్ కంపెనీ ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. దీంతో ఆక్సిజన్ కొరత సమస్యే ఉండ దు. ఈ ప్లాంట్ ద్వారా ప్రభుత్వానికి రూ. లక్షలు ఆదా అవుతుంది

ఘనంగా మహిళా దినోత్సవం

 స్థాని క సాయికుల్వంత్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం ఘ నంగా నిర్వహించారు. దేశ విదేశాల నుంచి మహిళలు పాల్గొన్నారు. సత్యసాయిబాబా స్ఫూర్తితో తాము సైతం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామ ని ఈ సందర్భంగా వారు పేర్కొన్నా రు. ఈశ్వరమ్మ వెల్ఫేర్ ట్రస్టు ప్రతినిధులు మాట్లాడుతూ.. సత్యసాయిబా బా ఆధ్యాత్మిక బోధనలతోపాటు పేదలకు విద్య, ఖరీదైన వైద్యం, స్వచ్ఛమై న తాగునీరు అందించారన్నారు. సత్యసాయి భౌతికంగా లేకపోయినా భక్తు ల హృదయాల్లో ఉన్నారన్నారు. సత్యసాయి చూపిన సేవామార్గాన్ని విడనాడరాదని, సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. మాతృమూ ర్తి ఈశ్వరమ్మ కోరిక మేరకే సత్యసాయి వైద్య, విద్య, తాగునీరు అందించారన్నారు. మాతృమూర్తి సేవలో తరించాలన్నారు. ఈ సందర్భంగా టీవీఎస్ మల్లికా శ్రీనివాసన్ మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగాలనీ, సుగుణాలతో విలువలతో కూడిన జీవనం సాగించాలన్నారు. సహనం, త్యాగం, సేవానిరతికి మహిళలు ప్రతీకలుగా నిలవాలన్నారు. కాగా సత్యసాయిని స్ఫూర్తిగా తీసుకుని తమ దేశాల్లో సేవలు చేస్తున్నామని, వీటిని నిరంతరం కొనసాగిస్తామని విదేశీ మహిళలు తెలిపారు. ఆయా దే శాలలో వారు చేపట్టిన సేవాకార్యక్రమాలు వివరించారు. విద్యార్థులు మం గళవాయిద్యాలతో సత్యసాయి మహాసమాధికి పూజలు చేశారు. సమాధితోపాటు దర్శనహాలును ప్రత్యేకంగా అలంకరించారు. సాయంత్రం సంగీతకచేరి నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు

గ్రేటర్ రాయలసీమతోనే అభివృద్ధి:సినీ నటుడు నరేష్

 రా ష్ట్ర విభజన జరిగితే రాయలసీమ జి ల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమగా ఏర్పాటుచేస్తే అభివృద్ధి సాధ్యమని రాయలసీమ వికాస సమితి వ్యవస్థాపకుడు, సినీ నటుడు నరేష్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆదర్శసొసై టీ భవనంలో రాయలసీమ వికాససమితి సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. రాష్ట్రం సమైక్యంగా ఉన్నపుడే అభివృద్ధి సాధ్యమనీ, ఒకవేళ విడిపో తే గ్రేటర్ రాయలసీమగా ఏర్పాటు చేయాలన్నారు.రాయలసీమ వెనుకబడిన విషయాన్ని శ్రీకృష్ణకమిటీ సై తం స్పష్టంచేసిన విషయం గుర్తు చే శారు. రాయలసీమ జిల్లాలను విడదీసి తెలంగాణ, కోస్తాంధ్రల్లో కలపాలనే చూస్తే సహించేది లేదన్నారు. ప్ర జలలో చైతన్యం తీసుకురావడానికి త మ సమితి పర్యటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో సమితి సభ్యులు రమేష్‌బాబు, లక్ష్మీనారాయ ణ, పార్వతమ్మ, చంద్రశేఖర్‌యాదవ్, రఘునాథరెడ్డి, రమేష్‌గౌడ్, రమణ, శ్రీనివాసులు పాల్గొన్నారు