Sunday, 19 February 2012

రైతు కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధం....జయప్రకాష్ నారాయణ

లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ రెండో రోజు రైతు సత్యాగ్రహ పాదయాత్రను కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి ప్రారంభించారు. వచ్చేవారం ఆంక్షలు ఉల్లంఘించి ధాన్యాన్ని పొరుగు రాష్ర్టాలకు తరలిస్తామని ఈ సందర్భంగా మాట్లాడిన జయప్రకాష్ నారాయణ తెలిపారు. నిజామాబాద్ నుంచి నాందేడ్, శ్రీకాకుళం నుంచి ఒడిశా, ధర్మపురి నుంచి తమిళనాడుకు తరలిస్తామన్నారు. రైతులు తమ పంట ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోనివ్వకుండా ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 65 ఏళ్ల దుర్మార్గపు పాలనతో నగరం, పల్లెల్లోనూ రైతులు యాచకులుగా మారిపోయారని ఆయన విమర్శించారు.నిత్యావసర సరుకుల చట్టం ప్రకారం ఆహార ధాన్యాలను ఎక్కడ నుంచి ఎక్కడికైనా తరలించవచ్చని, ఆ విధానం దేశమంతటా అమలవుతున్నా రాష్ట్రప్రభుత్వం మాత్రం రైతుకు సంకెళ్లు వేసిందని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం చేసిన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించడం నేరం కాదా అని ప్రశ్నించారు. పంటలకు లాభసాటి ధర కోసం పోరాడే తనను ధైర్యముంటే అరెస్టుచేయాలని జేపీ కోరారు. ఆంక్షల ఉల్లంఘన పర్యవసానం కూడా తనకు తెలుసునన్నారు. అరెస్టు అయి కేసు నమోదైతే శాసనసభ సభ్యత్వం పోతుందన్నారు. అయినా ప్రస్తుతం తనకు రైతు కష్టాలే ముఖ్యమన్నారు. ఇందుకోసం తాను దేనికైనా సిద్ధమన్నారు. 82 ఏళ్ల క్రితం పూజ్య బాపూజీ ఆంగ్లేయులు వేసిన ఉప్పు పన్నును వ్యతిరేకించి సత్యాగ్రహం చేశారన్నారు. జేపీ చేపట్టిన పాదయాత్రకు అన్నివర్గాల నుంచి విశేష స్పందన లభించింది. పార్టీలకతీతంగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 70ఎద్దుల బండ్లతో ర్యాలీ కూడా నిర్వహించారు.

" రాయలసీమ" ఎస్‌ఐ పరీక్ష ఫలితాల విడుదల

ఎస్‌ఐ అభ్యర్థుల తుది జాబితాను డీఐజీ కర్నూలు డీ ఐజీ కార్యాలయం శనివారం విడుదల చేసింది. నాలుగో జోన్‌కు ఎస్సైలుగా(సివిల్) 193 మంది ఎన్నికయ్యారు. ఇందులో నాలుగో జోన్ పరిధిలో 181 మంది అభ్యర్థులు ఎన్నిక కాగా, ఇతర జోన్‌ల నుండి నాలుగో జోన్‌కు మరో 12 మంది అభ్యర్థులు ఎన్నికయ్యారు. ఎన్నికైన వారు ఈ నెల 24వ తేది కర్నూలులో బీ క్యాంపులో ఉన్న డీఐజీ కార్యాలయానికి రావాలని డీఐజీ కార్యాలయం తరుపున రఘునందన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. నాలుగో జోన్ పరిధిలో కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం అభ్యర్థులు ఉన్నారు. వీరు 2011 మేలో జరిగిన ఎస్‌ఐ పోస్టుల పరీక్షలు రాశారు
సూచనలు:
ప్రెసిడెంట్, జూనియర్ ఆఫీసర్స్‌మెస్, అప్పా, హైదరాబాద్ పేరుపై 12,000 రూపాయల డిమాండ్ డ్రాప్ట్‌ను తీసుకుని రావాలి.
ఒరిజినల్ సర్టిఫికెట్స్ తమ వెంట తెచ్చుకోవాలి.
8 పాస్‌పోర్టుసైజు ఫోటోలు, ఓ స్టాంప్ సైజు ఫోటో తీసుకురావాలి.
ఇండెమ్‌నిటి బాండును వంద రూపాయల విలువ చేసే బాండుపై టైపు చే సి తీసుకు రావాలి. మోడల్ బాండు పేపరు ఈనెల 21 నుండి కర్నూలు డీఐజీ ఆఫీసులో పొందవచ్చు.
అభ్యర్థులందరూ వారితో పాటు వారి హాల్‌టిక్కెట్, సర్వీసు బుక్ తీసుకురావాలి.
వైద్య పరీక్షలకు అవసరమయ్యే నగదును తెచ్చుకోవాలి.
ఎంపిక జాబితా ఇలా:
131585 134020 134128 134192 134237 134415 134555 134560 134649 134883 135241 135243 135321 135407 135464 135578 135885 135294 135956 136015 136063 136107 136115 136156 136323 136359 136455 136456 136457 136529
136575 136609 136616 136647 136905 136940 136941 136945 136954 136956 137153 137400 137546 137674 137811 137943 137964 138298 138355 138592 138747 139015 139104 139422 139503 139600 139605 140017 140035 140037 140232 140373 130465 140870 140927 141066 141191 141192 141225 141379 141469 141494 141531 141541 141570 141615 141786 142124 142405 142406 142534 142561 142809 142826 142832 142844 142849 142853 143345 143482 143490 143527 143615 143815 143817 144016 144046 144094 144141 144179 144221 144239 144352 144356 144562 144570 144814 144843 145001 145059 145111 145186 145193 145321 145478 145488 146071 146079 146084 146259 146518 146520 146616 146943 146946 147080 147205 147459 147540 148025 148088 148224 148261 148316 148354 148438 148442 148484 148523 148558 148561 148582 148611 148620 148975 172836 176217 177698 180270 181325 193675 193750 201267 201283 201289 201623 201660 201685 201691 201748 205684 205783 206220 206360 206454 207605 207606 207720 208105 546315 550599
నాల్గవ జోన్‌కు ఇతర జోన్‌ల నుంచి ఎన్నికైన అభ్యర్థుల రిజిస్ట్రేషన్ నెంబర్లు
136965, 140910, 145272, 146662, 146666, 146675, 147074, 147413, 148372, 152332, 201604, 207788.

కడప జిల్లాలో పోలీసులు, ఖైదీల మధ్య ఘర్షణ

పోలీసులకు, బెయిల్‌పై విడుదలైన ఖైదీల మధ్య  రాత్రి ఘర్షణ చెలరేగింది. సంఘటనలో ఖాసీం అనే ఖైదీకి స్వల్ప గాయాలయ్యాయి. ప్రొద్దుటూరు సమీపంలో జరిగిన జంట హత్యల కేసుల్లో పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి, ఖాసీం బెయిల్‌పై శుక్రవారం విడుదలయ్యారు. వెంటనే వారు గ్రామానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి గ్రామానికి వెళ్లి.. ‘డీఎస్పీ పిలుస్తున్నారు. స్టేషన్‌కు రావాలని’ కోరారు. అయితే తాము ఇప్పుడు రాలేమని, ఉదయమే వస్తామని చెప్పడంతో ఎస్‌ఐ వారిపై కోప్పడ్డారు. దీంతో వారి మధ్య స్పల్ప ఘర్షణ జరిగినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. సంఘటనలో ఖాసీం తలకు గాయాలు కావడంతో వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ మహమ్మద్ షరీఫ్ ఏమంటున్నారంటే...హత్య కేసుల్లోని నిందితులు బెయిల్‌పైగ్రామాలకు వెళ్లినప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. అందులో భాగంగా జంట హత్యల కేసులోని పైన పేర్కొన్న నిందితులు బెయిల్‌పై గ్రామానికి వచ్చినట్లు తెలియగానే ముందు జాగ్రత్తగా పెద్దముడియం ఎస్‌ఐ నెమళ్లదిన్నెకు వెళ్లారు. పోలీసులకు సహకరించాల్సింది పోయి అడ్డం తిరగడం మంచిది కాదన్నారు.

భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు...మంత్రి సీ. రామచంద్రయ్య

‘టీటీడీ అతి పెద్ద వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో చిన్నచిన్న లోపాలు ఉంటాయి. ఆగమాలకు ఆనుగుణంగానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు. అంత మాత్రాన భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం మంచిది కాదు.’ అని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి సీ. రామచంద్రయ్య తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టీటీడీపై, తిరుమలపై విమర్శలు చేసేవారు ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. తిరుపతి పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్లో శనివారం రాత్రి రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్యను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవాలయ ఆస్తుల పరిరక్షణకు పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రజలు, నాయకులు, న్యాయస్థానాలు సహకరించాలని కోరారు. ప్రస్తుత రాజకీయాల్లో దిగజారుడుతనం తాండవిస్తోందని విమర్శించారు. అవకాశవాద రాజకీయాలు, వ్యక్తిగత విమర్శలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ధర్మాన్ని నిలబెట్టే విధంగా, శక్తి వంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు. ప్రజాసేవ కంటే ముందు మాధవసేవ చేయమని ఆ దేవుడే దేవదాయమంత్రి పదవి ఇప్పించాడని అన్నారు. దేవదాయ మంత్రి పదవి తీసుకుంటే రాజకీయ భవిష్యత్ ఉండదని అందరూ అన్నారని చెప్పారు. మన పనిని చిత్తశుద్ధితో చేస్తే అన్నీ మంచే జరుగుతాయని అన్నారు.