Wednesday, 8 February 2012

కర్నూలు జిల్లాలో కేడీసీసీ బ్యాంకు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

కేడీసీసీ బ్యాంకు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఈ నెల 13, 14, 15వ తేదీల్లో కర్నూలులో జర గనున్నాయి. ముంబై కేంద్రంగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఆధ్వర్యంలో ఫైనల్ ఎంపిక జాబితా వెలువడనుం ది. ఈ మే రకు జిల్లాలోని 36 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు రాతపరీక్షలు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూలకు అర్హ త సాధించిన వారి జాబితా కేడీసీసీ బ్యాంకు అధికారులకు పంపించింది. మొత్తం 146 మందికి లేఖలు పంపినట్టు అధికార వర్గాల సమాచారం. ఇంటర్వ్యూలో త్రిసభ్య కమిటీ..కేడీసీసీ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ల ఉద్యోగాలకు త్రిసభ్య కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. చైర్మన్‌గా కాతా అంకిరెడ్డి, సభ్యులు గా జీఎం మరియు సీఈవో మోహన్‌రె డ్డి, నా బార్డు డీడీఎం శ్రీవత్స వ్యవహరించనున్నారు.మెరిట్‌కే పట్టం.. ఎంపికలో ఎలాంటి అవకతవకలుండవని కేడీసీసీ బ్యాంకు చైర్మన్ కాతా అంకిరెడ్డి అన్నారు. రాత పరీక్షలో ఇంటర్వ్యూకు ఎంపికైన వారి జా బితా మాత్రమే తమకు పంపించారని, మార్కు లు పంపలేదని వివరించారు. ఇంటర్వ్యూలో త్రి సభ్య కమిటీ 5 మార్కులను నిర్ణయిస్తుందన్నా రు. అర్హత పరిశీలనలో డిగ్రీలో 75 శాతం మా ర్కులు దాటిన వారికి మెరిట్ ప్రకారం 5 మార్కు లుండగా.. కంప్యూటర్ పరిజ్ఞానానికి 5 మార్కులుంటాయని చెప్పారు. బ్యాంకింగ్, మార్కెటింగ్, వ్యవసాయ రంగ అనుభవాలకు ఏడాదికి రెండు మార్కుల చొప్పున 5 సంవత్సరాలకు 10 మార్కులు ఇస్తారన్నారు.మార్కుల విధానం ఇలా.. కేడీసీసీ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ఎంపికకు మొత్తం మార్కులు 200. అందులో రాత పరీక్షకు 175 మార్కులుంటాయి. ఈ జవాబు పత్రాల మూల్యాంకనం ముంబై బ్యాంకింగ్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది.

అనంతపురం జిల్లా అన్నదాతలును ఆదుకోండి

వరుస కరువుతో అనంత అన్నదాతలు ప్రజలు కూలీలు, అల్లాడి పోతున్నారు. ఆ భారి నుంచి రక్షించి, ఆదుకోవాలంటూ కేంద్ర కరువు పరిశీలన బృందాలకు జిల్లా టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. నంపెట్టే రైతన్న ఆ కుటుంబ పోషణ కోసం కూలీగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా రైతులను ఆదుకోవడంలో పాలకులు,విఫలం చెందారన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి రైతులను ఆదుకోవాలని ప్రతిపక్షాలు గొంతెత్తి అరుస్తున్నా పట్టంచుకోవడం లేదన్నారు. పంటల భీమా, పంట నష్టపరిహారం సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. అరకొరగా వచ్చిన పరిహారం కూడా బ్యాంకర్లు పాత అప్పులకు జమచేసుకుంటున్నారని వాపోయ్యారు. వర్షాబావ పరిస్థితుల వల్ల భూగర్భ జాలాలు అడుగంటిపోయాయన్నారు. బోర్ల క్రింద పంటలు ఎండిపోవడంతో పాటు తాగడానికి నీరులేక అవస్థలు పడుతున్నామన్నారు. పేదలను ఆదుకోవడానికి ఉపా«ధి పథకం పెట్టినా పనులు కల్పించడంలేదన్నారు. దీంతో వలసలు వెళ్తున్నారని తెలిపారు. జిల్లాకు రావాల్సిన వాటా నీరు కూడా రావడంలేదన్నారు. అందుకే అనంతను ఆదుకోవాలని కోరారు. ముఖ్యంగా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా సహాయక చర్యలు చేపట్టాలని,నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.10వేలు పరిహారం అందించాలని, ఖరీఫ్‌లో వేరుశనగ విత్తనంతో పాటు ఇతర విత్తనాలు అందించాలని పశువుల కోసం పశుగ్రాసం,నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని . ఉపాధి పథకంను వ్యవసాయానికి సందానం చేయాలని టీడీపీ నేతలు కరువు బృందం ప్రతినిధులకు విన్నవించి వినతి పత్రం అందించారు.

దుకాణాలకు వ్యాపారానికి లెసైన్సు తప్పనిసరి

చిత్తూరు మున్సిపాలిటీలో చేసే ప్రతి వ్యాపారానికి అధికారుల నుంచి పొందిన లెసైన్సు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. లెసైన్సు లేకుండా ఎలాంటి వ్యాపారమైనా నిర్వహించడానికి వీల్లేదన్నారు. వ్యాపారాలకు సంబంధించి పలు విషయాలను వెల్లడించారు. పురపాలక చట్టం-1965 ప్రకారం పట్టణాల్లో వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరూ మున్సిలిటీ నుంచి లెసైన్సు తీసుకోవాలని తెలిపారు.
మున్సిపల్ గెజిట్‌లో దాదాపు 400 రకాల వ్యాపారాలున్నాయని చెప్పారు. టీ దుకాణం నుంచి బార్బర్ షాపు, హోటళ్లు, ఫ్యాక్టరీలు, సినిమా థియేటర్లు ఇలా అన్నీ డీ అండ్‌వో (డేంజరస్ అండ్ అఫెన్స్) ట్రేడ్స్ కిందకు వస్తాయన్నారు. వీటి నిర్వాహకులు ప్రతి ఏటా మున్సిపాలిటీ నుంచి లెసైన్సు తీసుకోవడానికి కనిష్టంగా రూ.115 నుంచి రూ.24,735 వరకు చెల్లించాలని తెలిపారు. పట్టణంలో ప్రస్తుతం ప్రతి ఏటా 2433 దుకాణాల నుంచి రూ.17 లక్షలు లెసైన్సు రుసుం కింద వసూలు చేస్తున్నామని చెప్పారు.  మొత్తం 3500 దుకాణాల నుంచి రూ.22 లక్షలు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దీనికి కార్యరూపం దాల్చడానికి ప్రణాళికయుతంగా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో వ్యాపారాలు చేసే ప్రతి దుకాణదారుడికీ  నోటీసులు జారీ చేస్తామని ప్రజారోగ్యశాఖ అధికారి తెలిపారు. చేసే వ్యాపారం ఆధారంగా ఎంత చెల్లించాలనే విషయం శానిటరీ ఇన్‌స్పెక్టర్లు చెబుతారన్నారు. ఆ మొత్తాన్ని ఈ నెలాఖరులోపు చెల్లించాలని చెప్పారు. ఇది ఒక సంవత్సరం చెల్లుబాటవుతుందని తెలిపారు. రెండో ఏడాది కూడా ఇంతే మొత్తాన్ని చెల్లించి రెన్యువల్ చేసుకోవాలని చెప్పారు. ప్రతి రెండేళ్ల తరువాత 15 శాతం రుసుం పెంచుతుంటామన్నారు. ఈ నెలాఖరులోపు రుసుం చెల్లించని వాళ్లు మార్చి 15వ తేదీ లోపు మొత్తం రుసుం మీద 25 శాతం అపరాధం చెల్లించాలని తెలిపారు. లేని పక్షంలో మార్చి 16 నుంచి దుకాణాలను తనిఖీ చేసి లెసైన్సు లేని వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. వ్యాపారులు సహకరించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.

త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి జట్టులోకి వస్తా...యువరాజ్

 బీజ కణ క్యాన్సర్‌తో బాధపడుతూ అమెరికాలో చికిత్స చేసుకుంటున్న యువరాజ్ మొదటి సారి ఓ ప్రముఖ ఛానల్‌తో ఫోన్‌లో ఛాట్ చేస్తూ "నాకే ఎందుకు ఇంత ఇబ్బంది కోలవేరి డి?" అని అన్నారు. అమెరికాలో ఉన్న బోస్టన్ క్యాన్సర్ హాస్పిటల్‌లో డాక్టర్లు నా ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారని అన్నాడు. డాక్టర్లు ఇచ్చే మెడిషన్‌కు బాగానే రెస్పాండ్ అవుతున్నానని అంటున్నారు. దేవుడి దయవల్ల నేను తొందరలోనే మీ ముందుకి వస్తానని తెలిపాడు.దీనితో పాటు తన ప్రైవసీని గౌరవిస్తున్నందుకు మీడియాకు కృతక్షతలు తెలిపాడు. తన ట్విట్టర్ ద్వారా నా దేశం జెర్సీ, క్యాప్ ధరించి.. దేశం తరుపున మళ్లీ ఆడేందుకు ప్రతి రోజూ ఎదురు చూస్తున్నానని యువరాజ్ ట్వీట్ చేశాడు. ఇక యువరాజ్ టీమ్‌మేట్స్ టీమిండియా సభ్యులలో ఒకడైన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 'యువీ అమెరికాలో కీమోథెరఫీ చికిత్స కోసం వెళ్లిన సంగతి తెలిసింది. అతడు త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి జట్టులోకి వస్తాడని ఆశిస్తున్నాం. యువీ సత్వరంగా కోలుకోవాలని జట్టు సభ్యులందరం ప్రార్ధిస్తున్నాం' అని పేర్కొన్నాడు.ట్రీట్‌మెంట్ మొదట్లో, నేను కోపంతో పాటు కొంత గందరగోళ పరిస్దితిలో ఉన్నాను. నేను నా జీవితంలో విభిన్నంగా కొన్ని పనులు చేసి ఉన్నానని ఆలోచిస్తూ ఉండిపోయాను. నేను క్యాన్సర్‌తో బాధ పడుతున్నట్లు తెలియగానే.. ఆ షాక్ నుండి తేరుకోవడానికి నాకు కౌన్సిలర్ చేసిన సహాయం మరువలేదని అన్నారు. ప్రస్తుతం నేను ఓ ఫైటర్‌ని. గతంలో మాదిరి కాకుండా నేను ఇంకా బలవంతుడి మాదిరి తిరిగి వస్తానని యువరాజ్ తెలిపాడు.టీమిండియాకు ప్రపంచ కప్‌ని సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషించిన ఎడమ చేతి వాటం యువరాజ్ సింగ్ ప్రస్తుతం అమెరికాలో కీమెధెరపీ చేయించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంలో తనకు అండగా నిలిచిన అభిమానులకు ప్రత్యేక కృతక్షతలు తెలిపాడు. తాను కోలుకోవాలంటూ ప్రార్దనలు చేస్తున్న కారణంగా తిరిగి వస్తానని యువరాజ్ ఆశాభావం వ్యక్తం చేసాడు



కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయను ...మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి

వైద్య-ఆరోగ్య శాఖను విభజించిన పద్ధతిపై ఆగ్రహోదగ్రులైన మంత్రి డి.ఎల్. మనసు మార్చుకున్నారు. అసంతృప్తితో రగిలిపోతున్న డి.ఎల్. మంత్రి పదవికి రాజీనామా చేస్తారన్న ఊహాగానాలకు ప్రస్తుతానికి ఆయన తెర దించారు. కొన్ని దురదృష్ట సంఘటనలు తమను బాధించాయని ఆయన చెప్పారు.మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తాను చెప్పలేదని, కఠిన నిర్ణయం తీసుకుంటానని మాత్రమే చెప్పినట్టు ఆయన గుర్తు చేశారు. పార్టీ అధిష్ఠానంతో మాట్లాడిన అనంతరం తమ కఠిన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు ఆయన చెప్పారు. మంత్రి డి.ఎల్. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ తమ ఆవేదనను వెల్లడించారు..కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయనని గుర్తు చేస్తూ పార్టీకి క్రమశిక్షణగల కార్యకర్తగా పనిచేశానని, గతంలో ఎన్నో కీలకమైన బాధ్యతలు నిర్వహించాననీ ఆయన వివరించారు. గతంలో ఎన్నడూ పల్లెత్తు మాట పడలేదని, మంత్రి పదవి తనకు గడ్డిపోచతో సమానం అని ఆయన వివరించారు. టెన్ జన్‌పథ్‌తో మాట్లాడానని, కఠిన నిర్ణయాన్ని మానుకున్నాననీ ఆయన వెల్లడిస్తూ, తన శాఖను విడగొట్టిన పద్ధతి బాధ పెట్టిందని చెప్పారు. ముందు రోజు రాత్రి శాఖ విభజన గురించి ముఖ్యమంత్రి చెప్పారని వెల్లడిస్తూ, శాఖ విభజించిన పద్ధతే మనస్తాపం కలిగించిందని ఆయన చెప్పారు, బుధవారం రాజీనామా చేస్తారని వచ్చిన ఊహాగానాలను ఈ సందర్భంగా మీడియా ప్రశ్నించగా, ఆ మాట తాను చెప్పలేదని ఆయన వివరించారు. మంత్రి పదవి ఇవ్వడం ఇవ్వకపోవడం, శాఖలను మార్చడంవంటివి ముఖ్యమంత్రి విచక్షణాధికారాలు ఉన్నాయని, దానిని ప్రశ్నించడంలేదని డి.ఎల్. అన్నారు