ఉప ఎన్నికల సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ తరఫున ప్రచారంలో పాల్గొంటానని
మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. అయితే పార్టీ నేతలు వద్దని చెబుతున్నారని
అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు
కల్వకుంట్ల చంద్రశేఖర రావు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని
కొవ్వూరు నియోజకవర్గంలో ఆంధ్ర ప్రజా సమితి పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు
వస్తే తాను కాంగ్రెసు తరఫున ప్రచారం చేసేందుకు వెళతానని చిన్న నీటి పారుదల
శాఖ మంత్రి టిజి వెంకటేష్ బుధవారం చెప్పారు. కెసిఆర్ కొవూరులో ప్రచారం
చేస్తే అదే సమయంలో నేను అక్కడ సభను ఏర్పాటు చేస్తానని చెప్పారు. కెసిఆర్
అక్కడ ప్రత్యేక వాదం వినిపిస్తే తాను సమైక్యవాదం వినిపిస్తానని చెప్పారు.
ఆయనపై ఎవరూ దాడి చేయకుండా చూస్తానని చెప్పారు. కెసిఆర్ అక్కడ ఏర్పాటు చేసే
సభకు ఎక్కువ జనం వస్తే రావొచ్చునని.. అడవి మనుషులను చూసేందుకు కూడా జనం
అధికంగా వస్తారని విమర్శించారు.
Wednesday, 29 February 2012
కెసిఆర్‌కు పోటీ సభ పెడతా... టిజి వెంకటేష్
ఉప ఎన్నికల సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ తరఫున ప్రచారంలో పాల్గొంటానని
మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. అయితే పార్టీ నేతలు వద్దని చెబుతున్నారని
అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు
కల్వకుంట్ల చంద్రశేఖర రావు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని
కొవ్వూరు నియోజకవర్గంలో ఆంధ్ర ప్రజా సమితి పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు
వస్తే తాను కాంగ్రెసు తరఫున ప్రచారం చేసేందుకు వెళతానని చిన్న నీటి పారుదల
శాఖ మంత్రి టిజి వెంకటేష్ బుధవారం చెప్పారు. కెసిఆర్ కొవూరులో ప్రచారం
చేస్తే అదే సమయంలో నేను అక్కడ సభను ఏర్పాటు చేస్తానని చెప్పారు. కెసిఆర్
అక్కడ ప్రత్యేక వాదం వినిపిస్తే తాను సమైక్యవాదం వినిపిస్తానని చెప్పారు.
ఆయనపై ఎవరూ దాడి చేయకుండా చూస్తానని చెప్పారు. కెసిఆర్ అక్కడ ఏర్పాటు చేసే
సభకు ఎక్కువ జనం వస్తే రావొచ్చునని.. అడవి మనుషులను చూసేందుకు కూడా జనం
అధికంగా వస్తారని విమర్శించారు.
ఏప్రిల్ నుంచి సచిన్‌కు మంచిరోజులు
సచిన్ టెండూల్కర్‌కు 39వ పడిలోకి అడుగుపెడితే అతనికిక అన్నీ మంచిరోజులేనని
కేరళకు చెందిన ఎంకే దామోదరన్ అనే ఓ జ్యోతిష్కుడు నొక్కి వక్కాణిస్తున్నాడు.
ఏప్రిల్ 24న సచిన్ పుట్టినరోజని, ఆ రోజు తర్వాత అతను వందో శతకం
సాధించేస్తాడని అన్నాడు. రాబోయే ఏడాదికాలంలో సచిన్ శతకాల సంఖ్య 102కు
చేరుతుందని కూడా చెబుతున్నాడు. కాబట్టి సచిన్ తొందరపడి రిటైర్మెంట్
ప్రకటించకూడదన్నాడు. భారత జ ట్టు 2011 వరల్డ్‌కప్ గెలుస్తుందని ముందే
చెప్పానన్నాడు.
అసెంబ్లీలో బడ్జెట్ పై ప్రసంగం...వైయస్ విజయమ్మ
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై ఏమైనా కక్ష ఉంటే తమపై చర్యలు
తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల
శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ బుధవారం అసెంబ్లీలో అన్నారు. ఆమె ప్రభుత్వం
ప్రవేశ పెట్టిన బడ్జెట్ పైన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...
వైయస్ఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం నీరుగారుస్తుందని
విమర్శించారు. వైయస్ కాంగ్రెసును రెండుసార్లు అధికారంలోకి తీసుకు
వచ్చారన్నారు. అలాంటి వ్యక్తి పైన కక్ష ఉంటే మాపై తీసుకోండి కానీ ఆయన పేదల
కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలపై కాదన్నారు. ఆరోగ్యశ్రీని ప్రభుత్వం
ఎందుకు నడపలేక పోతుందన్నారు. పెట్రోలు, గ్యాస్ ధరలు ఎన్నిసార్లు పెరిగాయో
అందరికీ తెలుసన్నారు.దేశానికి వెన్నుముక అయిన వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం బాధకరమని విజయమ్మ
ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమమే ధ్యేయంగా నడిచిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్
హయాంను ఆమె గుర్తు చేసుకున్నారు. బరువైన హృదయంతో.. ఉద్వేగంగా పదిహేను
నిమిషాలపాటు మాట్లాడిన విజయమ్మ ప్రసంగాన్ని సభ్యులు శ్రద్దగా విన్నారు.
ప్రజా సమస్యలపై విజయమ్మ చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తిగా ఉందని పలువురు
ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ప్రశంసించారు.వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి నుంచి పోటీ చేయను... జేసీ దివాకర్‌రెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి బుధవారం సంచలన
వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అనిశ్చితి నెలకొందని, శాసనసభ బడ్జెట్
సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చలు జరగడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీని చూస్తుంటే భరించలేకపోతున్నానని, శాసనసభకంటే రాజ్యసభే బాగుందని,
అయితే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని జేసీ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను తాడిపత్రి నుండి పోటీ చేయనని దివాకర్‌రెడ్డి
చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
కూడా రాజ్యసభకు తమ అభ్యర్థిని నిలబెట్టే అవకాశముందన్నారు. జగన్ వర్గం
ఎమ్మెల్యేల వేటు విషయమై స్పీకర్ చూసుకుంటారని జేసీ పేర్కొన్నారు.
Tuesday, 28 February 2012
ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే స్వాగతిస్తాం....జెసి దివాకర్ రెడ్డి
తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే స్వాగతిస్తానని మాజీ
మంత్రి, అనంతపురం
జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి మంగళవారం
స్పష్టం చేశారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక అభివృద్ధి మండలి
ఏర్పాటు చేస్తున్నట్టు తనకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.
అయితే వెనుకబడిన ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం మాత్రం సబబేనని ఆయన
చెప్పారు. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు, రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఉన్న
నేపథ్యంలో నిర్ణయం ఎప్పుడో చెప్పలేమని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ఉప
ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ పరిస్థితి బాగుంటుంది ఆయన
అభిప్రాయపడ్డారు.కాగా తెలంగాణ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం
అభివృద్ధి మండలి,
ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే దిశలో ఆలోచిస్తుందనే వార్తలు వచ్చిన విషయం
తెలిసిందే. అయితే తెలంగాణవాదులు మాత్రం తమకు ఎలాంటి ప్రత్యేక ప్యాకేజీలు,
అభివృద్ధి మండళ్లు అవసరం లేదని తెలంగాణ రాష్ట్రమే కావాలని డిమాండ్
చేస్తున్నారు. తెలంగాణ తప్ప ఎలాంటి ప్రత్యామ్నాయాలకు తాము ఆమోదించే
ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నారు.బాలయ్యతో సినిమా చేయడం లేదు...వైవిఎస్ చౌదరి
నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా ‘కామన్ మ్యాన్’ చిత్రం రూపొంద బోతోందని,
దర్శకుడు కృష్ణ వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని, వైవిఎస్ చౌదరి
ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు వారి బ్యానర్‌పై నిర్మిస్తున్నారని ప్రచారం
జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై పలు టీవీ ఛానళ్లలో కూడా జోరుగా
ప్రచారం మొదలైంది. రాజకీయాలను టార్గెట్ చేస్తూ ఈ చిత్రం రూపొందుతోందని,
త్వరలో రాజకీయ తెరంగ్రేటం చేయబోతున్న బాలయ్యకు ఈ సినిమా ప్లస్సవుతుందనే
ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వార్తలు అభిమానులను కూడా ఊత్సాహ పరిచాయి.అయితే
అందరికీ షాక్ ఇస్తూ ఈ వార్తలను వైవిఎస్ చౌదరి ఖండించారు. తాను బాలకృష్ణతో
గానీ, కృష్ణ వంశీతో గానీ ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయడం
లేదని....‘సీఎం(కామన్ మ్యాన్)’ సినిమా తాను నిర్మిస్తున్నట్లు జరుగుతున్న
ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఈ సినిమాతో తనకు గానీ, బొమ్మరిల్లు
బ్యానర్ కు గానీ ఎలాంటి సంబంధం లేదని వైవిఎస్ చౌదరి స్పష్టం చేశారు.అనంతపురం జిల్లాకు జాతీయ అవార్డు
ఓటరు గుర్తింపుకార్డుల జారీలో మొదటిసారి వందశాతం పూర్తీచేసినందుకు భారత
ఎన్నికల కమిషన్ జిల్లాకు జాతీయ అవార్డు ప్రకటించింది. ఈమేర కు ఎన్నికల
కమిషన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ
తీసుకోవడంతో 2011 లో రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాప్రప్రథమంగా వందశాతం ఓటరు
గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ పూర్తీ చే సింది.దీంతో రాష్ట్రంలో మొదటిసారి అనంతపురం జిల్లాలో వందశాతం ఓ టరు గుర్తింపు
కార్డుల జారీ జరిగింది. ఈ ఘనత సాధించినందుకు ప్రస్తుత రాష్ట్ర పురపాలక సంఘం
డైరెక్టర్ జనార్థన్‌రెడ్డిని ఎన్నికల కమిషన్ ప్రశంసించింది. తాను
పనిచేసిన సమయంలో జిల్లాకు జాతీయ అవార్డు రావటం గర్వకారణంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. వ్యక్తిగత సర్వీసు రికార్డులో ఈ
విషయాన్ని చేర్చామని ఎన్నికల కమిషన్ సూచించటం ఆనందం కలిగిస్తోందన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియ
బలోపే తం చేయటంతో పాటు ఎన్నికల సక్ర మ నిర్వాహణకు దోహదపడే గుర్తింపు
కార్డుల జారీని సమర్థవంతంగా నిర్వహించగలిగింది. 2011లో అప్పటి కలెక్టర్
జనార్థన్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. వందశాతం గుర్తింపుకార్డులు
జారీచేయాలని యంత్రాంగంతో ప్రణాళిక రూపొందించి పని చేయించా రు.కోహ్లీని యువరాజ్ సింగ్ అభినందించారు.
భారత యువ ఆటగాడు విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్‌పై
యువరాజ్ సింగ్
ప్రశంసల వర్షం కురిపించాడు. అమెరికాలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చికిత్స
తీసుకుంటున్న యువరాజ్.. 86 బంతుల్లో 133 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన
విరాట్ కోహ్లీని అభినందించారు. చీకూ(సపోటా పండు) కోహ్లీది గ్రేట్
ఇన్నింగ్స్ అని.. నిద్రకు ముందు సపోటా జ్యూస్‌ను తీసుకో అంటూ ట్విట్టర్‌లో
మెసేజ్ పోస్ట్ చేశారు. బొస్టన్‌లో చికిత్స పొందుతున్న యువరాజ్‌ను గతవారంలో
అలాగే తన స్నేహితుడు, నటుడు రణ్‌విజయ్ సింగ్ కూడా ఈ విధంగానే యువీ
దగ్గరకు వెళ్లి పరామర్శించాడు. ఇద్దరూ కలిసి 'అందాజ్ అప్నా అప్నా' మూవీ
చూశామని యువీ అన్నాడు. క్యాన్సర్ కణితికి కీమోతెరపీ తీసుకుంటున్న యువీ
ఆరోగ్యం రోజురోజుకూ కుదుటపడుతోంది. తొలి దశ కీమోతెరపీ తర్వాత కణితి దాదాపు
పోయిందని అతడికి చికిత్స అందిస్తున్న డాక్టర్ లారెన్స్ రిపోర్టు ఇచ్చాడు.
ఇప్పుడు రెండో దశ కీమోతెరపీ జరుగుతోంది. మార్చి చివరి కల్లా యువీ
కీమోతెరపీ ముగుస్తుందని మే నెల లోపు గ్రౌండ్‌లోకి అడుగుపెట్టే
అవకాశాలున్నాయని అన్నారు.శ్రీలంకపై భారత్ ఘన విజయం
భారత్ - శ్రీలంక మద్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 86 బంతులలో
(133)సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్
కోహ్లీకి ఇది తొమ్మిదవ సెంచరీ కాగా.. శ్రీలంకపై రెండవ సెంచరీ కావడం విశేషం.
అంతక ముందు శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లకు గాను 320 పరుగులు చేయగా.. 321
పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్‌మెన్ శ్రీలంక
బౌలర్స్‌ని చితకబాదారు. టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విరాట్
కోహ్లీ రాణించి సెంచరీ నమోదు చేయగా.. ఓపెనర్ గౌతమ్ గంభీర్ 63 పరుగుల వద్ద
పెవిలియన్‌కు చేరాడు. శ్రీలంక బౌలర్స్‌లలో మలింగ, మహారూఫ్ తలో వికెట్
తీసుకున్నారు.భారత్ 36.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసి 7 వికెట్ల
తేడాతో గెలుపొందింది. విరాట్ కోహ్లీ 88 బంతులలో 133 పరుగులు చేసి నాటౌట్‌గా
నిలవగా, గౌతమ్ గంభీర్ 63, సచిన్ : 39, సెహ్వాగ్ : 30 పరుగులు చేశారు. కాగా
టీంఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.అంతకు ముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల
నష్టానికి 320 పరుగులు చేసి 321 పరుగుల విజయలక్ష్యాన్ని ఇండియా
ముందుంచింది. మ్యాచ్ ప్రారంభం నుంచి నిలకడగా ఆడిన శ్రీలంక భారీ స్కోర్
చేసింది. దిల్షాన్ సంగక్కర పరుగుల వర్షం కురిపించి ఇండియా బౌలర్లకు చెమటలు
పట్టించారు.
Monday, 27 February 2012
యువరాజ్‌ను కలిసిన... కుంబ్లే
ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతూ అమెరికాలో చికిత్స పొందుతున్న భారత
క్రికెట్ ఆటగాడు యువరాజ్ సింగ్‌ను భారత మాజీ కెప్టెన్, స్పిన్నర్ అనిల్
కుంబ్లే స్వయంగా పరామర్శించారు. జంబో రాకతో ఆశ్చర్యానికి గురయ్యానని..
కుంబ్లేతో కలిసిన రోజు చాలా సంతోషంగా ఉన్నానని.. ఆయన ఇచ్చిన మనోధైర్యం తనలో
కొత్త ఉత్సాహాన్ని నింపిందని యువరాజ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. శనివారం
రోజున తనని కలువడానికి నటుడు రణ్‌విజయ్ సింగ్ వచ్చాడని.. రణ్ విజయ్‌తో
అందాజ్ అప్నా అప్నా చిత్రాన్ని చూశానని ట్విట్టర్‌లో తెలిపాడు.
ఫ్యాన్స్‌కు పవన్ కళ్యాణ్ పలకరింపు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ట్విట్టర్ అకౌంట్ లేదు. మరి ఆయన తన ట్విట్టర్
అభిమానులను ఎలా పలకరించారంటే..? తన అభిమాని, హీరో నితిన్ నటించిన ‘ఇష్క్’
సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఆ చిత్రం మంచి సక్సెస్ సాధించిన
నేపథ్యంలో ఇటీవల నితిన్ పవర్ స్టార్‌ను కలిశాడట. పవర్ స్టార్‌తో తన
అనుభవాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు ఈ యువహీరో.ఇష్క్
సినిమా విజయవంతం కావడంపై పవర్ స్టార్ నాకు కంగ్రాట్స్ చెప్పారు. త్వరలోనే
నా సినిమా చూస్తానన్నారు. అదే విధంగా ట్విట్టర్ ను ఫాలో అయ్యే తన
అభిమానులకు హాయ్ చెప్పమని చెప్పారు. అంటూ తన ట్విట్టర్లో వ్యాఖ్యానించారు
నితిన్. ఈ విషయం ట్విట్టర్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ స్టార్
ఫ్యాన్‌కు పాకి..సర్వత్రా సచర్చనీయాంశం అయిందికెసిఆర్ తాడిపత్రి వస్తే స్వాగతం...జెసి దివాకర్ రెడ్డి
అనంతపురం జిల్లా సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి సోమవారం జోస్యం
చెప్పారు. దీనిపై జెసి స్పందించారు. టిఆర్ఎస్ పోటీ పెట్టదని చెప్పారు.
ఒకవేళ అభ్యర్థిని పెట్టినా తాము స్వాగతిస్తామని చెప్పారు. అసెంబ్లీ తీరు
చూస్తుంటే సమావేశాలకు వెళ్లాలని అనిపించడం లేదని అన్నారు. కెసిఆర్
సీమాంధ్రలో ఎక్కడైనా పర్యటించవచ్చునని ఆయన అన్నారు. స్వతంత్ర భారతావనిలో
ఎవరు ఎక్కడైనా తిరగవచ్చునని చెప్పారు. కెసిఆర్ సీమాంధ్రలో సభ పెట్టి
మాట్లాడినా తమకు అభ్యంతరం లేదన్నారు. తాడిపత్రిలో సభ పెడతానంటే తాను అన్ని
ఏర్పాట్లు చేస్తానని చెప్పారు. మైకు, స్టేజ్ అన్ని అరెంజ్ చేస్తానన్నారు.
కెసిఆర్‌ను అక్కడకు ఆహ్వానిస్తానని చెప్పారు.రాయలసీమ నదీ జలాల సమష్టి కృషి....వివేకానందరెడ్డి
రాయలసీమ నదీ జలాల సమగ్ర అభివృద్ధికి పార్టీలకు అతీతంగా సమష్టి కృషి
చేస్తామని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. స్థానిక ఒక
ప్రయివేట్ స్కూల్‌లో ఆదివారం రాయలసీమ జలాల అభివృద్ధికి చేపట్టాల్సిన
చర్యలపై చర్చా వేదిక నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రాయలసీమ వెనుకబాటుతనానికి శాశ్వత పరిష్కారం కనుగొనాలంటే ప్రస్తుతం
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌ల ద్వారా కృష్ణా నది జలాలను తరలించడం ఒక్కటే
మార్గమన్నారు. దీనికి ఈ ప్రాంత నాయకుల సమన్వయంతో సాధ్యమవుతుందన్నారు.
కర్ణాటక రాష్ట్రం అల్మట్టి డ్యాం ఎత్తు పెంచడాన్ని ట్రిబ్యునల్
ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సవాల్
చేస్తూ పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పై రాష్ట్రాల వాటా పెరిగి తీవ్ర
నష్టం సంభవిస్తోందని, దీంతో మిగులు జలాలను ప్రస్తుతం వినియోగించుకొనే
స్వేచ్చను కోల్పోతున్నామన్నారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ సిఎం...శోభా నాగి రెడ్డి
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే
అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్
జగన్మోహన్ రెడ్డి వర్గం ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి సోమవారం
తిరుపతిలో అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలు
ఆకాంక్షిస్తున్నారని ఆమె అన్నారు. తమపై వేటు వేసి ఉప ఎన్నికలకు వెళ్లే
ధైర్యం లేకే కాంగ్రెసు ప్రభుత్వంపై తమపై చర్యలు తీసుకోవడం లేదని ఆమె
అన్నారు. కాంగ్రెసుకు దమ్ముంటే తమపై వేటు వేసి వెంటనే ఉప ఎన్నికలకు సిద్ధం
కావాలన్నారు.కేటాయించిన ఇరిగేషన్ బడ్జెట్ ను కాలవ్యవధిలో ఖర్చు చేయాలని ఆయన డిమాండ్
చేశారు. జలయజ్ఞం ప్రాజెక్టులపై తాజాగా తెచ్చిన జివోను ప్రభుత్వం రద్దు
చేయాలన్నారు. ప్రాజెక్టులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.
ఆలస్యమైతే పెద్ద ఎత్తున వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉద్యమిస్తుందన్నారు.రాజకీయాలకు సూట్ కాను ....నాగార్జున
రాజకీయాలంటే ఇష్టమని చెప్పానుకాని, వస్తానని చెప్పలేదని యువసామ్రాట్
నాగార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
రాజకీయాలకు ఓ నమస్కారం అంటూ తను రాజకీయాల్లోకి రావడంలేదని ఆయన స్పష్టం
చేశారు. తనకు రాజకీయాలు అంటే చాలా
ఇంట్రెస్ట్ అని, వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటానని చెప్పారు. మంచి
రాజకీయ నాయకులు మనకు అవసరమని చెప్పారు. అయితే తాను రాజకీయాలకు సూట్ కానని
నాగార్జున చెప్పారు. తాను రాజకీయాల్లోకి రానని చెప్పారు.అయితే ఆయన
చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. నాగార్జున త్వరలో
రాజకీయాల్లోకి రానున్నారని, అందుకే ఆయన ఇలాంటి కామెంట్స్ చేశారని చెప్పారు.
టాప్ హీరోల్లో చిరంజీవి ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. బాలకృష్ణ కూడా 2014
ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. అదే దారిలో
ఇప్పుడు నాగార్జున రానున్నారని జోరుగా ప్రచారం జరిగింది. నాగార్జున మాత్రం
తాను రాజకీయాల్లోకి రానని మరోసారి స్పష్టం చేసి చర్చకు తెరదించే ప్రయత్నాలు
చేశారు. అసలు నాగార్జున రాజకీయాలపై కామెంట్ చేసిన రోజే తాను రానని స్పష్టం
చేసినప్పటికీ ఆరంగేట్రంపై జోరుగా చర్చ జరగడం విశేషం.
Sunday, 26 February 2012
రాజీనామాకు మంత్రి డిఎల్ రెడీ?
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆరోగ్య శాఖ
మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నట్లు
సమాచారం. మంత్రి పదవికి మాత్రమే కాకుండా శాసనసభా సభ్యత్వానికి రాజీనామా
చేయడానికి అనుమతించాలని కోరుతూ ఆయన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి
లేఖ రాశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో రాజీనామా చేయడానికి అనుమతించాలని
ఆయన సోనియాను కోరారు.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్ష
నిర్ణయాల వల్ల తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల, పథకాల వల్ల ప్రస్తుత
ప్రభుత్వం విశ్వసనీయతను, ప్రతిష్టను కోల్పోయిందని ఆయన ఆ లేఖలో
విమర్శించారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్
రవీంద్రా రెడ్డితో మాట్లాడినట్లు, తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని
సూచించినట్లు చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత
అధిష్టానం తగిన నిర్ణయం తీసుకుంటుందని, అప్పటి వరకు వేచి ఉండాలని ఆయన
చెప్పినట్లు తెలుస్తోంది. పది రోజుల పాటు సెలవులో ఉన్న మంత్రి
శుక్రవారం శాసనసభకు హాజరయ్యారు. ఆ తర్వాత కడప జిల్లాకు వెళ్లిపోయారు.
సోమవారం కూడా ఆయన సభకు వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు ప్రభావాన్ని కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కిరణ్
కుమార్ రెడ్డి విఫలమయ్యారని డిఎల్ సోనియాకు రాసిన లేఖలో విమర్సించినట్లు
తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్ష వైఖరికి, నిర్లక్ష్యానికి
సంబంధించిన పలు సంఘటనలను కూడా ఆయన లేఖలో ఉదహరించినట్లు సమాచారం.రాయలసీమలో కరెంటు కష్టాలు
మార్చి నెల ప్రారంభానికి ముందే కరెంటు కష్టాలు మొదలయ్యాయి.
దాదాపు నెల
రోజుల నుంచి కరెంటు కోత లేక పోవడంతో ఊపీరి పీల్చుకున్న ప్రజలకు మళ్లీ
‘ఉక్కపోత’ మొదలైంది. రాష్ట్రంలోని ఆర్టీపీపీ, కెటిజిఎస్, ల్యాండ్‌కో,
కాకతీయ థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు తగ్గిపోవడంతో
రాష్ట్ర వ్యాప్తంగా 1100 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి లోటు ఏర్పడింది.
దీంతో కోతలు మొదలైనట్లు అధికారులు చెబుతున్నారు. నగరంలో ఉదయం 9 నుంచి
10 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు కరెంటు కోత
విధిస్తున్నారు. ఇక మున్సిపాలిటీల్లో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు
మధ్యాహ్నం 12
గంటల నుంచి 1 గంట వరకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు విద్యుత్ కోత
విధిస్తున్నారు.ఇక మండలాల్లో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మధ్యాహ్నం 12
గంటల నుంచి 2
గంటల వరకు కోత విధిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కేవలం వ్యవసాయానికి
విద్యుత్ సరఫరా ఉన్నప్పుడు మాత్రమే కరెంటు వస్తోందని స్థానికులు
చెబుతున్నారు. చీకటి పడితే తప్ప గ్రామీణ ప్రాంతాల్లో బల్బు వెలగడడం లేదు.
ఇక రైతన్నలు కరెంట్ కోసం రాత్రి పూట జాగారం చేయాల్సి వస్తోంది.మరోవైపు
వేసవి కాలం మరింత ముదిరితే మరిన్ని గంటలు కోత ఉంటుందని అధికారులు
చెబుతున్నారు. విద్యుత్ వినియోగం ఎక్కువ కావడంతో అందుకు తగ్గట్టు ఉత్పత్తి
లేకపోవడంతో కోత విధించాల్సిన అవసరం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే విద్యుత్ కోత కారణంగా ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు
ఎదుర్కొంటున్నారు. భవిష్యత్తులో కోత సమయం మరింత పెరిగితే ప్రజలు బాధలు
వర్ణణాతీతం. త్వరలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఇటు వంటి తరుణంలో విద్యుత్ కోత కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు
ఎదుర్కొంటున్నారు.అనంతపురం పోలీస్ శాఖ ప్రతిష్ట దిగజార్చకండి ...జిల్లా ఎస్పీ
మంచి పనిచేస్తే సహకారం, ప్రశంసలుంటాయని, చెడు పని చేస్తే చర్యలు తప్పవని
జిల్లా ఎస్పీ షహనవాజ్ ఖాసీం పోలీసు అధికారులకు ఘాటైన హెచ్చరిక చేశారు.
ఇందులో హోం గార్డులైనా, అధికారులైనా ఉపేక్షించేది లేదన్నారు. ఎవరికైనా
15 రోజులు గడువిస్తానని, ఆ లోపు బాధ్యతరహితంగా మెలిగే వారు, చెడు ప్రవర్తన
కలిగిన వారు తమ పద్ధతులను మార్చుకోవాలన్నారు. లేని పక్షంలో చర్యలు తీవ్రంగా
ఉంటాయని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి శనివారం
సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ శాఖ సిబ్బంది,
అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. చిన్న సమస్యకు పెద్ద రాద్ధాంతం
చేయవద్దన్నారు. ఎస్‌హెచ్ఓలు హుందాగా పనిచేయాలన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్టను
దిగజార్చే విధంగా వ్యవహరించవద్దన్నారు. అందుకు అవకాశం కూడా
ఇవ్వకూడదన్నారు. సిబ్బందిపై నియంత్రణ, ప్రజలతో సత్సబంధాలు
కొనసాగించాలన్నారు.అలాగే నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీ, ఎస్‌ఐలకు సూచనలు చేశారు.
అనంతరం స్థానిక వన్ టౌన్ సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో
మాట్లాడుతూ జిల్లాలో ముఖ్యంగా కదిరి ప్రాంతంలో యువతులకు ట్రాఫికర్లు
మాయమాటలు చెప్పి నగరాల్లోని వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారని తెలిపారు.
వీరిని గుర్తించడంలో సరైన ప్రగతి సాధించలేక పోయామని, ప్రత్యేక బృందాలను
ఏర్పాటు చేశామని త్వరలో మంచి ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
జిల్లాలో నేరాలు పూర్తిస్థాయిలో తక్కువయ్యాయని, అయితే కదిరి-బత్తలపల్లి
మధ్య చిత్తూరుకు చెందిన చోరీ ముఠా సంచరిస్తుందని, వారిని పట్టుకునేందుకు
ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేశామన్నారు. గుంతకల్లు రూరల్ సర్కిల్
పరిధిలో మిస్టరీగా మారిన గుర్తు తెలియని మహిళల హత్య సంఘటనలకు సంబంధించి
ప్రశ్నించగా దశబ్దాలు గడిచిన వాటి సమాచారం బయటకు రావడం ఇబ్బందికరమని
నమ్ముతానని దాటవేశారు. ధర్మవరం, గుంతకల్లులో ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల
ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. పోలీసుల సంక్షేమంలో భాగంగా
ఉరవకొండ సర్కిల్ పరిధిలో పోలీసు స్టేషన్, పోలీసు క్వార్టర్స్ నిర్మాణాలు
చేపట్టినట్లు తెలిపారు. కిందిస్థాయి సిబ్బంది ఎవరైనా అదుపు తప్పి ప్రవర్తిస్తే
అలాంటి వారిపై ఆ ప్రాంత అధికారులు దృష్టి పెట్టాలన్నారు. అప్పటికీ వారిలో
మార్పు రాకపోతే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. ఐడీ పార్టీ పోలీసులైనా ...ఇతర
సిబ్బంది అయినా క్రమశిక్షణతో మెలగాలన్నారు. అక్రమాలకు పాల్పడితే కేసులు
నమోదు చేయిస్తానన్నారు. ఎవరో ఒకరు చేసే తప్పిదం ప్రభావం పోలీసు శాఖపైనే
పడుతుందనే విషయాన్ని గ్రహించి మసలుకోవాలన్నారు.దీర్ఘకాలంగా పనిచేస్తున్న
సిబ్బంది జాబితా సిద్ధం చేయాలని ఆయన అదనపు ఎస్పీని ఆదేశించారు. శాంతి
భద్రతల పరిరక్షణలో విఫలమయ్యే అవకాశమున్న ప్రాంతాలు, అవినీతి, అక్రమాలకు
పాల్పడే అధికారులపై దృష్టి పెట్టాలని సూచించారు.
సచిన్ టెండూల్కర్‌కు ఎస్‌సీజీ గౌరవ సభ్యత్వం
భారత్ ఓటమి, టోర్ని నుంచి ఔట్!
ముక్కోణపు వన్డే సిరిస్‌లో భాగంగా భారత్ - ఆస్టేలియా మద్య జరుగుతున్న
మ్యాచ్‌లో టీమిండియాపై ఆసీస్ 87 పరుగుల విజయంతో విజయాన్ని సొంతం చేసుకుంది.
దీంతో టీమిండియాని ఓడించడంతో ముక్కోణపు సిరిస్‌లో ఆసీస్ ఫైనల్‌కు చేరగా
టీమిండియా ఇంటి బాట పట్టనుంది. మొదట టాస్ గెలిచి ఆస్టేలియా జట్టు బ్యాటింగ్
ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి గాను 252
పరుగులు చేసింది. ఆస్టేలియా ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ అత్యధికంగా 68
పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్‌లో డేవిడ్ హస్సీ 54, వేడ్ 56 పరుగులు
చేశారు. ఇక ఇండియన్ బౌలర్స్‌లలో సెహ్వాగ్ 3 వికెట్లు తీసుకోగా, ప్రవీణ్
కుమార్, యాదవ్‌లు రెండేసి వికెట్లు తీసుకున్నారు.253 పరుగుల విజయ
లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ 5, సచిన్
టెండూల్కర్ 14 పరుగులకే పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన
గంభీర్ 23, కోహ్లీ 21 పరుగులతో నిష్క్రమించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు
వచ్చిన ధోని తనదైన శైలిలో ఆటను ప్రదర్శించినప్పటికీ హిల్ఫన్‌హాస్ వేసిన
బంతిలో ఎల్ బిడబ్ల్యు గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. టీమిండియా ఆల్
రౌండర్ రవీంద్ర జడేజా 8, స్పిన్నర్ రవిచంద్రన్ ఆశ్విన్ 26, ఇర్పాన్ పఠాన్
22 పరుగులతో పెవిలియన్‌కు చేరుకున్నారు. ఆసీస్ బౌలర్స్‌లలో షేన్ వాట్సన్,
దోహార్తి, హిల్ఫన్‌హాస్ రెండేసి వికెట్లు తీసుకోగా... క్రిస్టేన్, మెక్ కే,
బ్రెట్ లీ తలో వికెట్ తీసుకున్నారు. ఆస్టేలియాలో అత్యధికంగా పరుగులు చేసిన
డేవిడ్ వార్నర్ 68 కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.టీమిండియాపై
ఆసీస్ విజయం సాధించడం ద్వారా పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో
అగ్రస్దానంలోకి వెళ్లడమే కాకుండా ముక్కోణపు వన్డే సిరిస్ ఫైనల్ బెర్తుని
ఖరారు చేసుకుంది. ఇక శ్రీలంక 15 పాయింట్లతో రెండవ స్దానంలో ఉంది. మంగళవారం
టీమిండియాకి శ్రీలంకతో మ్యాచ్‌లో ఫైనల్‌కు చేరే అవకాశాలు లేవు.
Saturday, 25 February 2012
రాయలసీమలో పోలీసుల రాజ్యం!
అయితే జిల్లాలో ఇటీవల జరు గుతున్న
కొన్ని పరిణామాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. బాధ్యత గల ఉద్యోగులమనే
విషయం విస్మరించి వీధి గూండాల్లా వ్యవహరించారు.
ఇతరులెవరైనా తగవులాడుకుంటే సర్ది చెప్పి పంపాల్సిన 'పెద్దరికం' వారిది.
కానీ వారే కండకావరంతో కసాయిల్లా ప్రవర్తించారు. తమ 'నాగరికత' ఇదీ అని
చాటుకున్నారు. ఇంతకాలం రౌడీషీటర్లను, ఫ్యాక్షనిస్టులను జిల్లా నుంచి
పోలీసులు
బహిష్కరించేవారు. ఇప్పుడు వారికే అలాంటి దుర్గతి ఏర్పడిందంటే కార ణం
స్వయంకృతమే. ఇలాంటి పరిస్థితు ల్లో ఎస్పీ పట్టుదలకు పోకుండా నిష్పాక్షికతను
నిరూపించుకోవాల్సి ఉంది. ఒకవేళ ఆయన తూతూ మం త్రంగా వ్యవహరిస్తే నష్టపోయేది
పోలీ సు శాఖే. అయితే ఒత్తిళ్లకు తాము తలొగ్గబోమని, పద్ధతి ప్రకారం విచారణ
జరిపించి చ ర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అదే స మయంలో కొందరు గ్రామస్థుల్లో మరో అభిప్రాయం కూడా వ్యక్తమవుతోందం టూ
తన మనసులో మాట చెప్పకనే చె ప్పారు. కళ్లకు కనిపించే నగ్న సత్యానికి మించి
సాక్ష్యమేమి కావాలి.
ప్రజాభిప్రాయానికి మిం చిన విచారణ మరొకటేముం
టుంది? ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించడమంటే 'మసిపూసి మారేడు
కాయ'చేసే ప్రయత్నమే అవుతుంది. ఒకసారి ప్రజల్లో విశ్వాసం కోల్పోయాక తిరిగి
దాన్ని పాదుగొల్పడం అంత సులువైన పని కాదని గతవారం 'వ్యాఖ్యానం'లో
చెప్పుకున్నాం. వృత్తి ధర్మాన్ని విస్మరించి పోలీసులు అసాంఘిక శక్తుల్లా
నడుచుకుంటూపోయినంత కాలం వారు ప్రజాగ్రహానికి గురవుతూనే ఉంటారు. తర చూ
ఇలాంటి సంఘటనలు జిల్లాలో జరుగుతు న్నాయంటే మన పోలీసులు ఎటువైపు
పయనిస్తున్నట్లు? ఎస్పీ ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కితే ఇక పో లీసు
'బూచి' ఇక తొలగేదెన్నడు? సమాజమేగతి బాగుపడేను?
పిల్లలను దారిలోకి తెచ్చుకోవడానికి ఒకప్పుడు తల్లిదండ్రులు పోలీసులను
'బూచి'గా చూపే వారు. అప్పట్లో ఖాకీలంటే ఉండే భయం అదీ.. స్వాతంత్య్రం రాక
ముందు బ్రిటిష్ పోలీసులు ఎంతో కర్కశంగా వ్యవహరించే వారు. వారి అరాచకాలు,
అఘాయిత్యాలకు అంతు ఉండేది కాదు. అందుకే వారంటే జనం జడుసుకునేవారు. దాని
ప్రభావమే 'బూచి' రూపంలో అలా వ్యక్తమ య్యేది. రానురాను పరిస్థితుల్లో మార్పు
వచ్చింది. పోలీసులు, ప్రజల మధ్య కొంతవరకు సంబం ధాలు మెరుగుపడ్డాయి.
పోలీసులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం అలవరుచు కున్నారు. ప్రజలతో
మమేకం కావడానికి ప్రయత్నించారు. అలాగని అంతా సస్వరులయిపో యారని చెప్పలేం
గానీ కొంతలో కొంత మార్పయితే వచ్చింది. దొంగలతో పోలీసులు చేతులు
కలపడమంటే వింతగానూ, విడ్డూరంగానూ లేదూ? వారితో దొంగతనాలు, దోపిడీలు
చేయిస్తూ వాటాలు పంచుకునేవారంటే జుగుప్స కలిగించడం లేదూ? అంతెందుకు?
జిల్లాలో సంఘ టనను మానవమాత్రులెవరైనా సమర్థిస్తారా? ఏమి జరిగిందని
అక్కడి పోలీసులు పూనకం వచ్చి నట్లు ప్రవర్తించారో అర్థం కావడం లేదు. తాము
పోలీసులమనే అహంతో కన్నూమిన్నూ కాన కుండా నడుచుకున్నారు.
అనంతపురం జిల్లాలో 'మా వాళ్లతోనే పెట్టుకుం టారా?' అన్నట్లు ఉంది ఆయన వ్యవహార సరళి. తాము మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నామనే స్పృహ కూడా వారికి కలగలేదు. ప్రజాస్పందనను గురించిన ఆలోచన కూడా వారికి ఏమాత్రం వచ్చినట్లు లేదు. తాము ఏమి చేసినా చెల్లుబాటవుతుందనుకున్నారు. అయితే ఆ తరువాత పరిస్థితి వారి చేయి దాటిపోయిం ది. గ్రామస్థులంతా ఏకమయ్యా రు. ఒక్కసారిగా పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. ఏకధాటిగా 8 గంటల పాటు కొత్తచెరువును దిగ్బంధించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఒక డీఎస్పీ, ఎనిమిది మంది సీఐ లు, పో లీసు అదనపు బలగాలు రంగంలోకి ది గాల్సి వచ్చింది.
అనంతపురం జిల్లాలో కరవు పరిస్థితి కమిటీ దృష్టికి
జిల్లా కరవుకు ప్రత్యామ్నాయంగా మెరుగైన వ్యవసాయ, అభివృద్ధి ప్రణాళిక తయారీ,
రూపకల్పన కోసం జిల్లాలో శనివారం నుంచి జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి
డైరెక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ పర్యటిస్తున్నారని, కమిటీ పర్యటనకు
ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ వి. దుర్గాదాస్ అధికారులను
ఆదేశించారు. ప్రతి సంవత్సరం కరవుతో తల్లడిల్లుతున్న జిల్లా రైతులకు మేలు
కలిగే విధంగా కరవుకు ప్రత్యామ్నాయంగా వ్యవసాయ అభివృద్ది ప్రణాళిక రచనకు
అనుగుణంగా జిల్లాలో నెలకొన్న వాస్తవ కరవు, వ్యవసాయం గురించి కమిటీకి
వివరించాలన్నారు. డాక్టర్ అయ్యప్పన్ కమిటీ జిల్లా పర్యటన ఏర్పాట్లపై
శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ వి.దుర్గాదాస్
సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర
రెవెన్యూ శాఖ మంత్రి డాక్టర్ యన్.రఘువీరారెడ్డి చొరవ వల్లే డాక్టర్
అయ్యప్పన్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎకె సింగ్ ఆధ్వర్యంలోని కమిటీ
ఈనెల 25, 26న జిల్లాలో పర్యటిస్తుందన్నారు. ఇందులో దాదాపుగా 20 మంది వరకూ
వ్యవసాయ, దాని అనుబంధ రంగాలలో నిపుణులైన శాస్తవ్రేత్తలు, అధికారులు
ఉంటారన్నారు. డాక్టర్ ఎకె సింగ్ ఆధ్వర్యంలో ఒక కమిటీ గత నెల 18, 19, 20వ
తేదీల్లో జిల్లాలో పర్యటించిందన్నారు. దేశంలోనే అత్యున్నతమైన వ్యవసాయ
పరిశోధన మండలి ఐసిఎఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ కూడా స్వయానా
జిల్లా పర్యటనకు వస్తున్నందున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగ
పరచుకోవాలన్నారు. వ్యవసాయ, దాని అనుబంధ శాఖల అధికారులందరూ ఈ పర్యటనను
సద్వినియోగం చేసుకొని జిల్లాకు గరిష్టంగా ఉపయోగం కలిగే విధంగా కమిటీకి
వివరాలను నివేదించాలని కలెక్టర్ కోరారు. గత 20 సంవత్సరాల నుంచి వర్షపాతం,
వర్షాభావం, కరవు, పంటల సాగు, దిగుబడి, నేలల స్వభావం, భూగర్భ జల వనరుల
స్థితిగతులు, పాడిపరిశ్రమ, పండ్లతోటలు, పశుగ్రాసం, తాగునీరు తదితర విషయాలు,
సమస్యలపై విపులంగా కమిటీకి ఆయా శాఖల అధికారులు వివరించాలని కలెక్టర్
కోరారు. కమిటీ పర్యటిస్తున్న ప్రతి ప్రాంతానికీ ఒక సీనియర్ జిల్లా
అధికారిని లైజన్ అధికారిగా నియమించామని కలెక్టర్ వివరించారు. డాక్టర్
అయ్యప్పన్ కమిటీ పర్యటన శనివారం ఉదయం 10.30 గంటలకు పెనుకొండ గొర్రెల పెంపకం
కేంద్రంలో ఫొటో ఎగ్జిబిషన్, రైతులతో చర్చా కార్యక్రమంతో ప్రారంభం
అవుతుందన్నారు. అనంతరం కళ్యాణదుర్గంలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని
సందర్శించి అధికారులు, రైతులతో చర్చించి అదే రోజు సాయంత్రం 4.15 నుంచి ఆరు
గంటల వరకు రెవెన్యూ భవన్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, కమిటీ రిపోర్టును
కన్వీనర్ చదివి వినిపిస్తారన్నారు.
జూ ఎన్టీఆర్ తాజా సినిమా ‘బాద్ షా’ 12 కోట్ల ఆఫర్ !
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ త్వరలో శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బాద్ షా’ అనే
చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ సినిమాకు ‘యాక్షన్’ అనే
టైటిల్ అనుకున్నప్పటికీ చివరకు ‘బాద్ షా’ అనే టైటిల్ ఖారారు చేశారు. తాజాగా
ఈచిత్ర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారయింది. మార్చి 18 పూజా కార్యక్రమం,
ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్కు జరుగుతోంది. దర్శకుడు శ్రీను వైట్ల,
రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్ ఇటీవల ఈచిత్రానికి సంబంధించిన స్క్రిప్టు
వర్కు పూర్తి చేశారు. దూకుడు సినిమాకు పని చేసిన సాంకేతిక బృందం మొత్తం
‘బాద్ షా’ చిత్రానికి పని చేయనున్నారు. సినిమా మొత్తం యాక్షన్ అండ్ ఎంటర్
టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్
ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్స్
ప్రొడక్షన్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నిర్మాత కెఎస్. రామారావు నిర్మించే
చిత్రంలోనటిస్తున్నారని, ఈ సినిమాకు సదరు నిర్మాత జూ ఎన్టీఆర్‌కు రూ. 12
కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ చిత్రానికి దర్శకుడు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. జూనియర్
ఎన్టీఆర్ తో ఆది, అదుర్స్ లాంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించిన వివి
వినాయక్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది.
జట్టులో విభేదాలు లేవు...ధోని
బీసీసీఐ మరోవైపు జట్టుకు క్లాస్ ..!
భారత జట్టులో అభిప్రాయ భేధాలు కాని, కమ్యూనికేషన్ గ్యాప్ లేదని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పష్టం చేశారు. ఇలాంటి వార్తలు డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లకు ఇబ్బందిగా మారుతాయన్నారు. సెహ్వాగ్‌తో విభేధాలున్నాయన్న వార్తల్ని ధోని ఖండించారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయన్నారు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా మంగళవారం జరుగనున్న కీలక మ్యాచ్‌లో ప్రయోగాలకు చోటివ్వకుండా.. ముగ్గురు ఓపెనర్లతో బరిలోకి దిగుతామని ధోని వెల్లడించారు.వ్యక్తిగత విభేదాలతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న టీ మిండియా సారథి ధోనీ, వైస్ కెప్టెన్ సెహ్వాగ్ మధ్య ఎలాంటి గొడవలూ లేవని చెబుతున్న బీసీసీఐ మరోవైపు జట్టుకు క్లాస్ పీకుతోంది. గొడవలు మాని.. ఆటపై దృష్టిపెట్టండంటూ ఆటగాళ్లకు చురకలంటించినట్టు సమాచారం. వారిని అసలు మాట్లాడొద్దని (మీడియాతో) సూచించాం. మిగిలిన రెండు వన్డేలపై దృష్టిపెట్టాలని కోరాం. భారత జట్టుకు బీసీసీఐ నుంచి ఓ మెసేజ్ కూడా వచ్చింది. గొడవలన్నీ పక్కనబెట్టి మెరుగైన ప్రదర్శన చేయండని ధోనీ, వీరూలకు ప్రత్యేకంగా చెప్పామ'ని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నాడు.
భారత జట్టులో అభిప్రాయ భేధాలు కాని, కమ్యూనికేషన్ గ్యాప్ లేదని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పష్టం చేశారు. ఇలాంటి వార్తలు డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లకు ఇబ్బందిగా మారుతాయన్నారు. సెహ్వాగ్‌తో విభేధాలున్నాయన్న వార్తల్ని ధోని ఖండించారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయన్నారు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా మంగళవారం జరుగనున్న కీలక మ్యాచ్‌లో ప్రయోగాలకు చోటివ్వకుండా.. ముగ్గురు ఓపెనర్లతో బరిలోకి దిగుతామని ధోని వెల్లడించారు.వ్యక్తిగత విభేదాలతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న టీ మిండియా సారథి ధోనీ, వైస్ కెప్టెన్ సెహ్వాగ్ మధ్య ఎలాంటి గొడవలూ లేవని చెబుతున్న బీసీసీఐ మరోవైపు జట్టుకు క్లాస్ పీకుతోంది. గొడవలు మాని.. ఆటపై దృష్టిపెట్టండంటూ ఆటగాళ్లకు చురకలంటించినట్టు సమాచారం. వారిని అసలు మాట్లాడొద్దని (మీడియాతో) సూచించాం. మిగిలిన రెండు వన్డేలపై దృష్టిపెట్టాలని కోరాం. భారత జట్టుకు బీసీసీఐ నుంచి ఓ మెసేజ్ కూడా వచ్చింది. గొడవలన్నీ పక్కనబెట్టి మెరుగైన ప్రదర్శన చేయండని ధోనీ, వీరూలకు ప్రత్యేకంగా చెప్పామ'ని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నాడు.
రాజకీయాలంటే ఆసక్తి...అక్కినేని నాగార్జున
తనకు రాజకీయాలంటే ఆసక్తి అని టాలీవుడ్ హీరో అక్కినేని
నాగార్జున మీడియాకు
వెల్లడించారు. తిరుపతిలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో
మాట్లాడారు. రాజకీయాలంటే తనకు ఆసక్తి ఉందని.. రాజకీయాల్ని తాను అనుసరిస్తు
ఉంటానన్నారు. అయితే తాను రాజకీయాలకు సరిపోతానో లేదో తెలియదని ఆయన
అన్నారు.శనివారం తిరుపతిలోని కళ్యాణ్‌జ్యువెలరీ ప్రారంభోత్సవంలో నాగార్జున
పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని
అన్నారు.తనకు భక్తిరస ఆధ్యాత్మిక చిత్రాలు చేయడమంటే ఇష్టమని నాగార్జున
తెలిపారు.
షిరిడి సాయిబాబా చిత్రంలో నియమనిష్టలతో పాల్గొంటున్నాని అన్నారు. తమ చిన్న
కుమారుడు అఖిల్ సినిమాల్లోకి వచ్చేది లేనిది ఆయన ఇష్టమని, త్వరలోనే ఢమరుకం
చిత్రం విడుదల అవుతుందని నాగ్ పేర్కొన్నారు.
కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి అనుచరులు దారుణ హత్య
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చిన్నచింతకుంట గ్రామంలో గత రాత్రి ముగ్గురు
దారుణ హత్యకు గురయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి
అనుచరుడైన కష్ణారెడ్డి కుటుంబం నిద్రిస్తుండగా ప్రత్యర్థులు కారంపొడి
చల్లి వేటకొడవళ్లతో దాడి చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన ఫ్యాక్షన్ హత్యల్లో చనిపోయిన కుటుంబాలను
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమా నాగిరెడి, శోభానాగిరెడ్డిలు
పరామర్శించారు. ఆస్తి తగాదాల కారణంగా జరిగిన ఫ్యాక్షన్ .ఈ ఘటనలో కష్ణారెడ్డి (49), అతడి
భార్య గోవిందమ్మ( 45), దుబ్బోడు (40) మతి చెందారు. కష్ణారెడ్డి కొడుకు
మల్లికార్జునరెడ్డి (23), మామ రామసుబ్బారెడ్డి (60) పరిస్థితి విషమంగా
ఉంది. వీరిని చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. పోలీసులు ఘటనా
స్థలానికి వెళ్లి పరిశీలించారు. కాగా ఈ ఘటనకు పాతకక్షలు కారణమై ఉంటాయని
పోలీసులు అనుమానిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చింతకుంటలో
144 సెక్షన్‌ను విధించారు.
Friday, 24 February 2012
రామ్ చరణ్ తేజ్ సినిమా 'ఎవడు'
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ఎవడు సినిమా సరిగ్గా నెల
తర్వాత, మార్చి 24న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వంశీ పైడిపల్లి
దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం కొన్ని రోజుల క్రితమే లాంఛనంగా ప్రారంభం
అయింది. చిరంజీవి-సురేఖ తొలి షాట్ క్లాప్ కొట్టారు. ప్రముఖ నిర్మాత
దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని
నిర్మిస్తున్నారు. హాట్ హీరోయిన్ సమంత లీడ్ హీరోయిన్ గా, సెక్సీ బ్రిటన్
మోడల్ అమీ జాక్సన్ ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దేవిశ్రీ
ప్రసాద్ తొలిసారిగా రామ్ చరణ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. హీరో రామ్
చరణ్ ను ఈ చిత్రంలో సరికొత్త కోణంలో హాట్ అండ్ రొమాంటిక్ చూపించే ప్రయత్నం
చేస్తున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్
లుక్ ఫోస్టర్ విభిన్నంగా ఉండటమే ఇందుకు నిదర్శనం.
భద్రాద్రి రాముని పాత్ర అవకాశం వస్తే తప్పక నటిస్తా బాలకృష్ణ
ప్రేక్షకులు కొత్తదనంను కోరుకుంటున్నారు, అందుకు నిదర్శనం శ్రీరామరాజ్యం
విజయమేనని ఆ చిత్ర హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. శ్రీరామరాజ్యం సినిమా
వంద రోజులు పూర్తయిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం భద్రాచలంలోని శ్రీ
సీతారామచంద్రస్వామిని దర్శించేందుకు ఆయన చిత్ర నిర్మాత యలమంచిలి సాయిబాబా
వచ్చారు.ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం
వేద పండితులు ఆశీర్వచనం పలికారు. అనంతరం నందమూరి బాలకృష్ణ విలేకరులతో
మాట్లాడుతూ చిత్రం విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీరామరాజ్యం
ఆడియో వేడుక భద్రాద్రిలోనే నిర్వహించామని, తిరిగి శతదినోత్సవం
పురస్కరించుకొని భద్రాద్రి రావడం జరిగిందన్నారు. మంచి చిత్రాలను ప్రజలు
ఆదరిస్తారరనడానికి ఈ చిత్ర వజయమే నిదర్శనమన్నారు. ఇందుకు సహకరించిన చిత్ర
నిర్మాత యలమంచిలి సాయిబాబు, సహచర కళాకారులు, సాంతికేక సిబ్బంది, మీడియాకు,
ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
సచిన్‌కు ఎవరి సలహాలు అక్కర్లేదు...వెంగ్ సర్కార్
ఎప్పుడు రిటైర్ కావాలనే విషయమై సచిన్‌కు ఎవ రూ సలహాలు
ఇవ్వనక్కర్లేదని
మాజీ కెప్టెన్ వెంగ్‌సర్కార్ అన్నాడు. 39 ఏళ్ల వయస్సులో కూడా సచిన్ పూర్తి
ఫిట్‌గా ఉన్నాడన్నాడు. ఒకవేళ సచిన్ రిటైరైనా..అతని స్థానాన్ని భర్తీచేసే
ఆటగాడు లేనేలేడని వెంగీ చెప్పాడు. సచిన్ తక్షణమే వన్డేలనుంచి రిటైర్
కావాల్సిందిగా మరో మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ సూచించిన సంగతి తెలిసిందే.
మాస్టర్ స్దానాన్ని భర్తీ చేయడం దాదాపు అసాధ్యమేనని వెంగ్ సర్కార్
తెలిపాడు. సచిన్‌కి ఎప్పుడు రిటైర్ కావాలో బాగా తెలుసని, ఇందులో ఎవరి
సలహాలు అక్కర్లేదని అన్నారు. ఇటీవల కపిల్ దేవ్ మాట్లాడుతూ సచిన్ ప్రపంచకప్
తర్వాత రిటైర్ కావాల్సిందన్న విషయం తెలిసిందే. ముక్కోణపు టోర్నీల
వరుస వైఫల్యాలు చవిచూస్తున్న సచిన్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాలని
కపిల్‌దేవ్ చేసిన సూచనను వెంగ్‌సర్కార్ తప్పు పట్టాడు. సచిన్
ఫిట్‌నెస్‌పై ఎవరు సందేహించాల్సిన అవసరం లేదన్నాడు. జట్టు మొత్తం వైఫల్యం
చవిచూస్తున్నప్పుడూ ఒక్క సచిన్‌పైనే విమర్శలు చేయడం తగదన్నాడు. సచిన్‌పై
అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని వెంగ్‌సర్కార్ పరోక్షంగా
కపిల్‌ని ఉద్దేశించి అన్నాడు. 39 యేళ్ల వయసులోనూ సచిన్ చక్కని
ఫిట్ నెస్‌తో... ఆటతీరుని ప్రదర్శిస్తున్న విషయాన్ని గుర్తించుకోవాలని
అన్నాడు. పైగా భారత బ్యాటింగ్ లైనప్ బలహీనంగా ఉందని, ప్రస్తుత
పరిస్థితుల్లో సచిన్ వన్డేలకు రిటైర్‌మెంట్ ప్రకటిస్తే, ఆ స్థానాన్ని
ఎవరూ భర్తీ చేయలేరని వెంగీ అన్నాడు. ప్రపంచ క్రికెట్‌కు దొరికిన గొప్ప
ఆటగాళ్లలో సచిన్ ఒకడు. క్రికెట్ ఆట పట్ల సచిన్ అంకిత భావం, నిబద్దత.. ఆడిన
ఆట భవిష్యత్ తరాలకు ఆదర్శమని వెంగ్ సర్కార్ కొనియాడారు.
మద్యం సిండికేట్లపై అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటన
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో శుక్రవారం మద్యం సిండికేట్ల వ్యవహారంపై
ప్రభుత్వం ప్రకటన చేసింది. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య వాదప్రతివాదనలు
జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తరఫున మంత్రి కన్నా
లక్ష్మినారాయణ వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎసిబి 350 సిండికేట్ల దుకాణాలపై
మాత్రమే దాడులు జరిపిందన్నారు. 34 సిండికేట్లపై దాడులు జరిగాయని, ఎసిబి
నిష్పక్షపాతంగా విచారణ చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి
చిత్తశుద్ధి లేకపోతే రిమాండ్ రిపోర్టులు కోర్టులకు వెళ్లవని కన్నా
పేర్కొన్నారు.మద్యం ముడుపుల అంశంపై శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మధ్య వాడి వేడిగా వాగ్వాదం జరిగింది. బాబు
ప్రసంగిస్తున్న సమయంలో మంత్రులు అడ్డు తగిలారు. మద్యం ముడుపులపై
రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుందని, ప్రజల అనుమానాలు నివృత్తి చేయాలని
చంద్రబాబు అన్నారు. ఎసిబి రిపోర్టులోని వాస్తవాలను సభ దృష్టికి తీసుకు
రావాలని ఆయన అన్నారు. రూ.15వేల కోట్ల ముడుపులు అందాయన్నారు. మద్యం
ముడుపులపై ప్రభుత్వానికి సిగ్గుంటే సమాధానం చెప్పాలి.. కానీ దాటవేత ధోరణి
సరికాదన్నారు. ముడుపులతో సంబంధమున్న అధికారులు జైళ్లో ఉంటే నేతలు మాత్రం
దర్జాగా బయట, సభలో ఉన్నారన్నారు. వాస్తవాలు ప్రభుత్వం తారుమారు
చేసిందన్నారు. ఎసిబి 140 మంది ప్రజాప్రతినిధులపై ఆరోపణలు వచ్చాయన్నారు.
నున్నా రమణ కాంగ్రెసు నేత అని, ఆయన మీ పార్టీ నేతలకు ప్రకటనలు కూడా
ఇచ్చారన్నారు. రాంరెడ్డి అనుచరుడు అన్నారు. అందుకు రాంరెడ్డి వెంకట రెడ్డి
స్పందిస్తూ తనను వివాదంలోకి లాగవద్దన్నారు. మా అమ్మ కర్మకు 75వేల మంది
వచ్చారని అన్నారు. రమణతో తనకు సంబంధం లేదన్నారు. ఖమ్మం వస్తే అక్కడ
నిజానిజాలు తెలుస్తాయన్నారు.
ఏసీబీ రిమాండ్ రిపోర్టు బయటపెట్టాలి..చంద్రబాబు డిమాండ్
రిమాండ్
రిపోర్టులో 7వ పేజీ కనిపించడంలేదని, ఆ రిపోర్టును బయట పెట్టాలని, ఓ
మంత్రిని కాపాడటానికి సీఎం ఇలా చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఈ విషయంలో
మరో మంత్రి బహిరంగగా చెప్పారన్న విషయాన్ని బాబు గుర్తుచేశారు.దీంతో సభలో
టీడీపీ నేతలు నిరసన తెలిపారు. దీనిపై ముద్దుకృష్ణమ మాట్లాడుతూ
తనపై పోలీసుల కేసు ఉంటే వివరాలు చెప్పాలని, దేనికైనా సిద్దంగా ఉన్నాన ని
సవాల్ చేశారు. ఏసీబీ రిపోర్టుపై చర్చ జరపాల్పిందే అని, ఏసీబీ రిపోర్టు సభలో
పెట్టాలని డిమాండ్ చేశారు. తన సామాజికవర్గానికి చెందిన మంత్రిని
కాపాడుకోడానికి మోపిదేవిని ఇరికించారని స్వయానా మంత్రి డీఎల్ అన్నారని గాలి
తెలిపారు. దేశంలోనే మద్యం కుంభకోణం అతిపెద్దదని ముద్దకృష్ణమ అన్నారు.మద్యం సిండికేట్ల వ్యవహారంపై మంత్రి కన్నా ఇచ్చిన వివరణపై
టీడీపీ అసంతృప్తి
వ్యక్తం చేసింది. ఏసీబీ రిమాండ్ రిపోర్టు బయటపెట్టాలని, ముడుపులు
తీసుకున్న ప్రజాప్రతినిధులు సభలో దర్జాగా కూర్చున్నారని, అధికారులు జైల్లో
ఉన్నారని ఇది ఎంతవరకు సమంజసమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు
ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈ వ్యవహారంపై శుక్రవారం సభలో చంద్రబాబునాయుడు
మాట్లాడుతూ నున్న వెంకట రమణ
ముమ్మాటికీ కాంగ్రెస్ కార్యకర్తే అంటూ సభలో ఆధారాలను చూపించారు.కర్నూలు జిల్లాలో చిరుతను బంధించిన గ్రామస్థులు
కర్నూలు జిల్లాలో ఓ చిరుత హల్‌చల్ చేసింది. ముప్పుతిప్పలు పెట్టి
ఎట్టకేలకు గ్రామస్తుల చేతిలో బందీగా మారింది. డోన్ మండలం చనుగొడ్ల
గ్రామంలో గొర్రెల కోసం వచ్చిన చిరుతను కుక్కలు వెంబడించటంతో భయపడిన చిరుత
చెట్టు పైకెక్కింది. ఇది చూసిన గ్రామస్తులు చిరుతను పట్టుకునేందుకు
ప్రయత్నించారు.పారిపోతున్న చిరుతను గ్రామస్తులంతా రాళ్లతో దాడిచేసి
ప్రాణాలతో పట్టుకున్నారు. కొనఊపిరితో ఉన్న చిరుతను గ్రామంలో ఊరేగింపు
నిర్వహించిన అటవీశాఖ అధికారులకు అప్పగించారు. నెలరోజులుగా చిరుత
సంచరిస్తోందని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని గ్రామస్తులు
చెప్తున్నారు.Thursday, 23 February 2012
'అనంత' రైతులను అ కారణంగా చితకబాదిన ఎస్ఐ
న్యాయం చేయాల్సిన పోలీసులే అకారణంగా రెచ్చిపోయారు. ఇద్దరు రైతులపై
ప్రతాపం చూపించారు. ఏ తప్పూ చేయకున్నా వారిని ఇష్టారాజ్యంగా కొట్టారు. తమనే
ప్రశ్నిస్తావా అంటూ ఓ రైతుని... తమ వాహనాన్ని ఢీకొట్టాడంటూ మరో రైతును
విచక్షణా రహితంగా చితకబాదారు. పోలీసు స్టేషన్‌లోనే వారిని తీ వ్రస్థాయిలో
దుర్భాషలాడారు. అక్కడి తో ఆగకుండా ఇష్టం వచ్చినట్లు చితకబాదారు. దీంతో గ్రా
మం మొత్తం ఏకమైంది.అప్పటికే పో లీసుల తీరుపై అసహనంగా ఉన్న గ్రా
మస్థులు వారి వ్యవహారాన్ని సహించలేకపోయారు. అకారణంగా రైతుపై పోలీసులు
ఝులుం ప్రదర్శించారం టూ స్థానిక పోలీసు స్టేషన్‌ని ముట్టడించారు. ఎనిమిది
గంటలపాటు రా స్తారోకో నిర్వహించారు. రైతులను అ కారణంగా చితకబాదిన
కొత్తచెరువు ఎస్ఐ ఇస్మాయిల్, కానిస్టేబుళ్లు బా బా, చెన్నకేశవులుపై చర్యలు
తీసుకో వాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.ఎనిమిది గంటలపాటు ఆందోళన..
ఉదయం పదకొండు గంటల సమయంలో ఇదంతా జరిగింది. మధ్యా హ్నం 12గంటల నుంచి రాత్రి
ఏడువరకు గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎనిమిది గంటలపాటు
పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించా రు. నెహ్రూసర్కిల్లో రాస్తారోకో చేశా రు.
రైతు గోపాల్, నాగేంద్ర ఏమి త ప్పుచేశారని పోలీసులు చితకబాదారం టూ
ప్రశ్నించారు. ఎటువంటి వివాదాలకు వెళ్లని తనభర్తను రోడ్డువెంబడి కొ
ట్టుకుంటూ పోలీసు స్టేషన్‌కి తీసుకువచ్చారంటూ గోపాల్ భార్య గిరిజ ఆవేదన
వ్యక్తం చేసింది. పలువురు గ్రామస్థులు ఆమెకు మద్దతుగా తరలివచ్చా రు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పో లీసుస్టేషన్‌పై దాడులకు దిగే స్థాయి లో
గ్రామస్థులు ఉద్యమించారు. ఆం దోళనకారుల నిరసనలతో కొత్తచెరువు
అట్టుడికిపోయింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ నవాబ్‌జాన్, ఎనిమిది మంది
సీఐలు కొత్తచెరువుకు చేరుకున్నారు. భారీఎత్తున అదనపు పోలీసు బలగాలు
మోహరించాయి. డీఎస్పీ, సీఐలు గ్రామస్థులతో చర్చించి, ఆందోలనకారులకు
సర్దిచెప్పే ప్రయత్నం చే సినా ఫలితం లేకపోయింది. ఓ సందర్భంలో నేరుగా ఎస్పీ
షహనవాజ్‌ఖా సీం జోక్యం చేసుకుని ఫోన్‌ద్వారా గ్రా మంలోని పెద్దలతో
చర్చించారు. ఎస్ ఐ ఇస్మాయిల్ చేష్టలతో విసిగిపోయిన ప్రజలు ఏమాత్రం వెనక్కు
తగ్గకుండా ఆందోళనకు సిద్ధపడ్డారు. ఎస్ఐని స స్పెండ్ చేయాలని డిమాండ్
చేశారు. తమ దెబ్బలకు గాయపడిన రైతులు గ్రామస్థుల కంట పడకుండా పోలీసు లు పలు
స్టేషన్లకు తరలించారు. గా యపడ్డ రైతులను తీసుకురావాలని గ్రామస్థులు
పట్టుపట్టడంతో సాయం త్రం ఆరుగంటలకు వారిని గ్రామస్థులకు చూపించారు. అనంతరం
పెనుకొండ ఆస్పత్రికి తరలించారు.ప్రత్యేక విచారణకు ఆదేశం..
కొత్తచెరువులో రైతులను ఎస్ఐ, కానిస్టేబుళ్లు చితకబాదడంపై ఎస్పీ
షహనవాజ్‌ఖాసీం ప్రత్యేక విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా పెనుకొండ
డీఎస్పీని నియమించినట్లు గ్రా మప్రముఖులతో ఎస్పీ ఫోన్‌ద్వారా వివరించారు.
జైలుకు పంపించాలని కాంగ్రెస్ కుట్ర....చంద్రబాబు
శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు
మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఎమ్మార్ పాపం చంద్రబాబుదేనని సీఎం కిరణ్
చేసిన వ్యాఖ్యలతో సభలో కలకలం చెలరేగింది. ముఖ్యమంత్రి తనను బ్లాక్ మెయిల్
చేస్తున్నారని చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ సభ్యులు
సీఎం ప్రసంగానికి పదేపదే అడ్డుతగిలారు. కిరణ్ ప్రసంగాన్ని కొనసాగిస్తూనే
వాస్తవాలు వినేందుకు టీడీపీ సభ్యులు సిద్ధంగా లేరని అన్నారు. గుమ్మడికాయ
దొంగ అంటే చంద్రబాబు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. దీంతో
టీడీపీ సభ్యులు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. స్పీకర్ పోడియం వద్ద
నిల్చుని నినాదాలు చేశారు. స్పీకర్ కోరినప్పటికీ అక్కడి నుంచి కదలలేదు.
దీంతో సభ కొన్ని నిమిషాల పాటు స్తంభించింది. నన్ను జైలుకు పంపించాలని కాంగ్రెస్ నాయకులు ఎప్పటినుంచో విఫల యత్నం
చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు
ఆరోపించారు. నన్ను జైలుకు పంపించడం ఎవరి తరమూ కాదని కూడా ఆయన
హెచ్చరించారు.రాష్ట్ర శాసన సభలో గురువారంనాడు జరిగిన చర్చలో తమపై వచ్చిన ఆరోపణలకు
సమాధానం చెబుతూ తాము చేసిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్ కుళ్లుకుంటోందని ఆయన
అన్నారు. రాష్ట్రానికి కన్వెన్షన్ సెంటర్‌లు తీసుకువచ్చిన ఘనత తమదేనని
వివరిస్తూ, గచ్చిబౌలి స్టేడియంను తాము తీసుకువస్తే, కాంగ్రెస్ నాయకులు ఈ
ప్రతిష్ఠాత్మకమైన స్టేడియంను సమావేశాలకు వాడుకుంటూ ఆ స్టేడియంను నాశనం
చేసేశారని ఆయన వివరించారు. వీటిని హైదరాబాద్‌కు తీసుకువచ్చిన ఘనత మాకే
చెందుతుందని చంద్రబాబు నాయుడు వివరిస్తున్నప్పుడు అధికార పక్ష సభ్యులు గొడవ
సృష్టించారు.
Wednesday, 22 February 2012
టీమిండియా క్రికెట్ జట్టులో అంతర్గత పోరు!
టీమిండియాలోని అంతర్గత పోరు నిజమేనని తేలిపోయింది. రొటేషన్ కారణంగా విభేదాల
గుట్టు రట్టయింది. ధోనీకి వీరేంద్ర సెహ్వాగ్ చురకలు వేయడం ద్వారా
విభేదాలను బయట పెట్టారు. సీనియర్ల ఫీల్డింగ్‌పై ధోనీ చేసిన వ్యాఖ్యలపై
ఇప్పటికే సీనియర్లు మండిపడుతున్నారు. తాజాగా, సెహ్వాగ్ గొంతు విప్పాడు.
మంగళవారం లంక తో ఓటమితో అనంతరం మీడియా సమావేశంలో నేరుగా ధోనీపై విమర్శలు
చేశాడు. ఫీల్డింగ్‌లో మందకొడిగా ఉంటున్నామని తనకు కాని ఇతర సీనియర్లకు కానీ
ఎప్పు డూ చెప్పలేదని ఆయన అన్నాడు. 'అతను ధోనీ ఏమి మాట్లాడాడో, మీడియాలో ఏ
కథనాలు వస్తున్నాయో నాకు తెలీదు. వచ్చే ప్రపంచ కప్ ఇక్కడ జరుగనుండడంతో ఆ
టోర్నీలో ఆడే జూనియర్లకు వన్డేల్లో అవకాశమివ్వాలని మాతో చెప్పాడు' అని
సెహ్వాగ్ చెప్పాడు.సచిన్, వీరూ, గంభీర్ వల్ల ఫీల్డింగ్ సమస్యలు
ఎదురవుతున్నాయని, అందువల్లే వీరిని రొటేషన్ పద్ధతిలో పక్కనపెడుతున్నామని
ధోనీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, వైస్ కెప్టెన్ వీరేంద్ర
సెహ్వాగ్‌కు మధ్య వివాదానికి సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి
వచ్చింది. శ్రీలంకపై జరిగిన మ్యాచుకు ముందు తుది జట్టు కూర్పుపై ఇరువురి
మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. తుది జట్టులోకి
తీసుకోవాల్సిన 11 మంది ఆటగాళ్లపై వారిద్దరి మధ్య వివాదం చోటు చేసుకున్నట్లు
తెలుస్తోంది. శ్రీలంకపై ఆడే జట్టులోకి రోహిత్ శర్మను తీసుకోవాలని
ధోనీ సూచించగా, ఆ మ్యాచుకు కెప్టెన్సీ చేసిన సెహ్వాగ్ ముగ్గురు సీనియర్
ఆటగాళ్లతో ఆడడానికి మొగ్గు చూపాడు. ఈ వివాదం తెలిసి బిసిసిఐ దిగ్భ్రాంతికి
గురైనట్లు చెబుతున్నారు. డ్రెసింగ్ రూంలోనే వివాదాన్ని పరిష్కరించుకోవాలని
బిసిసిఐ వారికి సూచించింది. ఈ సంఘటన తమను తీవ్ర కలవరానికి గురి చేసిందని,
సీనియర్ ఆటగాళ్లు ఆ విధంగా ప్రవర్తించడం తాము ఇది వరకు చూడలేదని బిసిసిఐ
వర్గాలు వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. పైగా, శ్రీలంకపై ఘోరంగా ఓటమి
పాలైన తర్వాత కెప్టెన్‌గా వ్యవహరించిన సెహ్వాగ్ ధోనీపై తీవ్ర వ్యాఖ్యలు
చేశాడు.కిరణ్-చంద్రబాబు శాసనసభలో తీవ్ర వాగ్వివాదం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, చంద్రబాబునాయుడికి మధ్య బుధవారం
శాసనసభలో తీవ్ర వాగ్వివాదం జరిగింది. బాబు శానససభలో ప్రసంగిస్తుండగా
ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని - చంద్రబాబు వాడిన భాషపై అభ్యంతరం తెలిపారు.
మాటిమాటికీ దోచుకున్నారని, దోపిడీ చేశారని చంద్రబాబు అంటున్నారని, అదేదో
గొప్పని అనుకుంటున్నారని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఆవేశంతో
ఉన్నారని, అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారని, అయితే ప్రజా తీర్పును
చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఏ విధంగా
మాట్లాడాలో ఆలోచించుకుని మాట్లాడాలని ఆయన అన్నారు.శాంతి భద్రతలు పరిస్థితి
అధ్వాన్నంగా తయారయిందన్నారు. భానుకిరణ్ ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి
ఏర్పడిందన్నారు. మైలవరం దుర్ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని
ప్రశ్నించారు. ప్రాణహిత-చేవెల్ల ప్రాజెక్టుకు జాతీయహొదా కల్పించలేకపోవడం
ప్రభుత్వం చేతగానితనంగా పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి
అన్యాయం జరిగిపోయిందన్నారు. రాష్ట్రంపై కేంద్రం ఎందుకు వివక్ష చూపుతోందని
ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. అవినీతి మంత్రులు
ఎందుకు రాజీనామా చేయరని ఆయన ప్రశ్నించారు. మద్యం సిండికేట్ లో ప్రమేయం
ఉన్నట్లు ఆరోపణలు వచ్చినా మంత్రి రాజీనామా చేయలేదన్నారు. ముఖ్యమంత్రి కూడా
ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. ఈ ప్రభుత్వం అవినీతిని
నియంత్రించలేకపోతుందన్నారు. 4700 కోట్ల రూపాయల విలువైన పోలవరం ప్రాజెక్టు
కాంట్రాక్ట్ ని అర్హతలేని కంపెనీకి ఇచ్చి, ఆ తరువాత రద్దు చేశారన్నారు.
మంత్రుల మాటలు విన్న అధికారులు జైళ్లలో ఉన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ
అవినీతి వల్ల వోక్సు వ్యాగన్ పూనేకు వెళ్లిందన్నారు. ఒక్క పరిశ్రమ కూడా
ఇక్కడకు రావడంలేదని బాధపడ్డారు. రాజీవ్ గృహ కల్పపేరుతో డబ్బు వసూలు చేసి
ఇళ్లు కట్టించలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం రైతులకు సాయం చేస్తుందంటే నమ్మాలా అని చంద్రబాబు ప్రశ్నించారు.
మిగిలిన రాష్ట్రాల్లో రైతుకు మద్దతు ధర ఉంటే మన రాష్ట్రంలోనే లేదన్నారు.
కాంగ్రెసు మాటలు కోటలు దాటేలా ఉన్నా చేతలు గడప దాటడం లేదన్నారు. ఢిల్లీలో
పదవుల కోసం పైరవీలే తప్ప ప్రజా సమస్యలు వీరికి పట్టడం లేదన్నారు.
గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్నారన్నారు. రాష్ట్రం నుండి 32
మంది పార్లమెంటు సభ్యులు ఉన్నప్పటికీ రైల్వే బడ్జెట్ విషయంలో కేంద్రంపై
ఒత్తిడి తేలేక పోతున్నారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు భారీగా ఉన్నాయన్నారు.
చివరకి సిఎం పేషీలో కూడా కరెంట్ లేని పరిస్థితి ఉందన్నారు.తొలిసారిగా నేపాల్‌లో శ్రీవారి కల్యాణాం
తొలిసారిగా పొరు గు దేశమైన నేపాల్‌లో ఈ నెల 25న శ్రీవారి 108వ కల్యాణా
న్ని టీటీడీ నిర్వహించనున్న ది. ఇందుకోసం పటిష్ఠమైన బందోబస్తు మధ్య
శ్రీదేవి, భూదేవి సహిత శ్రీనివాసుల కల్యాణ మూర్తులు ఉన్న బ స్సు తిరుమల
నుంచి నేపాల్ కు బయలుదేరింది. ఈ సందర్భంగా వాసుదేవాచార్య మా
ట్లాడుతూ ఇప్పటికి టీటీడీ ఆధ్వర్యంలో కల్యాణ మూర్తులకు 107 కల్యాణ ఉత్సవాలు
జరిగాయని, 108వ కల్యాణోత్సవం నేపాల్‌లో జరపాలని ఆ దేశపు రాజు కోరడంతో
అక్కడకు వెళుతూ మార్గమధ్యంలో విజయవాడలో బస చేశారన్నారు.స్వయంగా
స్వామివారి కల్యాణ ఉత్సవ మూర్తులు ఇక్కడకు రావడంతో తాము తలవని తలంపుగా
ప్రాతఃకాల పూజలను నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. టీటీడీ
విజిలెన్స్, సెక్యూరిటీ అధికారి సుదర్శన్ మాట్లాడుతూ కోదాడ, కరీంనగర్
మీదుగా నాగపూర్ వెళ్ళి, అక్కడ నుంచి నేపాల్ చేరుకుంటామన్నారు. నేపాల్‌లో ఈ
నెల 25 వ తేదీన శ్రీవారి కల్యాణం జరుగుతుందని చెప్పారు. బస్సులో అర్చకులతో
సహా మొత్తం 15 మంది సిబ్బంది ఉన్నారు.
Tuesday, 21 February 2012
రాయలసీమలో మహాశివరాత్రి ఘనంగా నిర్వహించారు
శ్రీశైలం
శిరిగిరిపై వెలసిన శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి వార్ల కల్యాణం సోమవారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని కనులారా చూసి తరించేందుకు సుమారు 8 లక్షల మందికి పైగా భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. మహాశివరాత్రి పర్వదినమైన సోమవారం ఉదయం నుంచే శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, సేవలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారికి పల్లకీ సేవ నిర్వహించిన అనంతరం తిరుమల వెంకన్న తరపున టిటిడి అధికారులు స్వామి, అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించడంతో కల్యాణోత్సవ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి కల్యాణానికి సిద్దం చేశారు. రాత్రి 9 గంటల సమయంలో చీరాలకు చెందిన నేత కళాకారుడు పృధ్వీ వెంకటేశ్వర్లు నేసిన సుమారు 150 గజాల పాగాను కుటుంబ సభ్యులతో కలిసి మేళతాళాల మధ్య ఆలయ ప్రదక్షణ చేశారు. అనంతరం పాగాలంకరణకు సిద్ధమవగా ఆలయ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపి వేశారు. దీంతో చిమ్మ చీకట్లో పృధ్వీ వెంకటేశ్వర్లు దిగంబరంగా ఆలయంపై ఉన్న నవనందులు, ఆలయ గోపురాన్ని కలుపుతూ పాగా అలంకరించారు. పాగాలంకరణ, రుద్రాభిషేకం, కల్యాణోత్సవం తిలకించేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయింది.
శ్రీకాళహస్తి
మహాశివరాత్రి పర్వదినమైన సోమవారం ఉదయం శ్రీకాళహస్థీశ్వర స్వామి, శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవి సర్వభూషితాలంకారులై ఇంద్రవిమానం, చప్పరం వాహనాలపై కొలువుదీరి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తూ ఆశీర్వదిస్తూ చిద్విలాసాన్ని ప్రదర్శించారు. అదే విధంగా సోమవారం రాత్రి శ్రీకాళహస్థీశ్వరుడు నంది వాహనం, గజవాహనంపై జ్ఞానప్రసూనాంబికా దేవిలు ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. వాహనాల ముందు కేరళ పంచవాయిద్యాలు, తప్పెటగుళ్లు, లంబాడీల నృత్యాలు, కోలాటాలు, భజనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను కళాకారులు ఆనందోత్సాహాలతో నృత్యం చేశారు. అదే విధంగా ఏనుగులు, గుర్రాలు, వృషభాలు కూడా వాహనాల ముందు నడుస్తూ భక్తులను అలరించాయి. మొత్తంమీద ఉత్సవాల ఊరేగింపుతో మహాశివరాత్రి పర్వదినం నాడు శ్రీకాళహస్తి పట్టణం నాలుగుమాడావీధులు భక్తుల హరహర ధ్వానాలతో పులకించాయి.
తిరుపతి
తిరుపతిలోని శ్రీకపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజైన సోమవారం మహాశివరాత్రి పర్వదినం రావడంతో భక్తులు పెద్దఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున రెండుగంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. 2.30గంటల నుండి 4.30గంటల వరకు అభిషేకం, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం 7గంటల నుండి 9గంటల వరకు రథోత్సవం(బోగితేరు) కన్నులపండుగా జరిగింది. ఆత్మరథికుడు, శరీరమే రథం, బుద్ధిసారధి, మనస్సుపగ్గం. ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు, ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూలశరీరం వేరని, సూక్ష్మశరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. ఉదయం 9గంటల నుండి 11గంటల వరకు అర్చకులు స్నపనతిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీసోమస్కందమూర్తి, కామాక్షి దేవి అమ్మవార్లకు పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. కాగా సాయంత్రం 6గంటల నుండి రాత్రి 10గంటల వరకు నంది వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా జూలకంటి బాలసుబ్రమణ్యం రచించిన, టిటిడి ముద్రించిన ‘కమనీయక్షేత్రం కపిలతీర్థం’ అనే పుస్తకాన్ని టిటిడి ఇఓ ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు జాగారం చేసేందుకు రాత్రి 10గంటల నుండి 12గంటల వరకు హరికథా కాలక్షేపం ఏర్పాటు చేశారు. ఆ తరువాత రాత్రి 12గంటల నుండి మంగళవారం తెల్లవారుజామున 4గంటల వరకు లింగోద్భవకాల అభిషేకాలు నిర్వహించారు.
శిరిగిరిపై వెలసిన శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి వార్ల కల్యాణం సోమవారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని కనులారా చూసి తరించేందుకు సుమారు 8 లక్షల మందికి పైగా భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. మహాశివరాత్రి పర్వదినమైన సోమవారం ఉదయం నుంచే శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, సేవలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారికి పల్లకీ సేవ నిర్వహించిన అనంతరం తిరుమల వెంకన్న తరపున టిటిడి అధికారులు స్వామి, అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించడంతో కల్యాణోత్సవ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి కల్యాణానికి సిద్దం చేశారు. రాత్రి 9 గంటల సమయంలో చీరాలకు చెందిన నేత కళాకారుడు పృధ్వీ వెంకటేశ్వర్లు నేసిన సుమారు 150 గజాల పాగాను కుటుంబ సభ్యులతో కలిసి మేళతాళాల మధ్య ఆలయ ప్రదక్షణ చేశారు. అనంతరం పాగాలంకరణకు సిద్ధమవగా ఆలయ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపి వేశారు. దీంతో చిమ్మ చీకట్లో పృధ్వీ వెంకటేశ్వర్లు దిగంబరంగా ఆలయంపై ఉన్న నవనందులు, ఆలయ గోపురాన్ని కలుపుతూ పాగా అలంకరించారు. పాగాలంకరణ, రుద్రాభిషేకం, కల్యాణోత్సవం తిలకించేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయింది.
శ్రీకాళహస్తి
మహాశివరాత్రి పర్వదినమైన సోమవారం ఉదయం శ్రీకాళహస్థీశ్వర స్వామి, శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవి సర్వభూషితాలంకారులై ఇంద్రవిమానం, చప్పరం వాహనాలపై కొలువుదీరి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తూ ఆశీర్వదిస్తూ చిద్విలాసాన్ని ప్రదర్శించారు. అదే విధంగా సోమవారం రాత్రి శ్రీకాళహస్థీశ్వరుడు నంది వాహనం, గజవాహనంపై జ్ఞానప్రసూనాంబికా దేవిలు ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. వాహనాల ముందు కేరళ పంచవాయిద్యాలు, తప్పెటగుళ్లు, లంబాడీల నృత్యాలు, కోలాటాలు, భజనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను కళాకారులు ఆనందోత్సాహాలతో నృత్యం చేశారు. అదే విధంగా ఏనుగులు, గుర్రాలు, వృషభాలు కూడా వాహనాల ముందు నడుస్తూ భక్తులను అలరించాయి. మొత్తంమీద ఉత్సవాల ఊరేగింపుతో మహాశివరాత్రి పర్వదినం నాడు శ్రీకాళహస్తి పట్టణం నాలుగుమాడావీధులు భక్తుల హరహర ధ్వానాలతో పులకించాయి.
తిరుపతి
తిరుపతిలోని శ్రీకపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజైన సోమవారం మహాశివరాత్రి పర్వదినం రావడంతో భక్తులు పెద్దఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున రెండుగంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. 2.30గంటల నుండి 4.30గంటల వరకు అభిషేకం, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం 7గంటల నుండి 9గంటల వరకు రథోత్సవం(బోగితేరు) కన్నులపండుగా జరిగింది. ఆత్మరథికుడు, శరీరమే రథం, బుద్ధిసారధి, మనస్సుపగ్గం. ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు, ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూలశరీరం వేరని, సూక్ష్మశరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. ఉదయం 9గంటల నుండి 11గంటల వరకు అర్చకులు స్నపనతిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీసోమస్కందమూర్తి, కామాక్షి దేవి అమ్మవార్లకు పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. కాగా సాయంత్రం 6గంటల నుండి రాత్రి 10గంటల వరకు నంది వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా జూలకంటి బాలసుబ్రమణ్యం రచించిన, టిటిడి ముద్రించిన ‘కమనీయక్షేత్రం కపిలతీర్థం’ అనే పుస్తకాన్ని టిటిడి ఇఓ ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు జాగారం చేసేందుకు రాత్రి 10గంటల నుండి 12గంటల వరకు హరికథా కాలక్షేపం ఏర్పాటు చేశారు. ఆ తరువాత రాత్రి 12గంటల నుండి మంగళవారం తెల్లవారుజామున 4గంటల వరకు లింగోద్భవకాల అభిషేకాలు నిర్వహించారు.
శాసనసభ నడపడం చేతకాకపోతే రాజీనామా చేయాలి...చంద్రబాబు
శాసనసభ సమావేశాలను వాయిదా వేస్తూ పోతుండడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు
నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై, స్పీకర్
నాదెండ్ల మనోహర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ఇదే రకంగా చేసి వైయస్ ఏమయ్యారో
చేశారని, వీరికి కూడా అదే అవుతుందని, ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి
వస్తుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వైయస్
రాజశేఖర రెడ్డి అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారని, మిగిలి ఉన్న
అసెంబ్లీని భ్రష్టు పట్టించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు
ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. శానససభా సమావేశాల తీరు చూస్తుంటే మొదటి
సారి తనకు ఆవేదన, బాధ కలుగుతున్నాయని ఆయన అన్నారు. జాతీయ రాజకీయాలు టిడిపికి కొత్తేమీకాదన్నారు. గతంలో ప్రధాని అయ్యే అవకాశం
వచ్చినా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వదులుకున్నట్లు ఆయన తెలిపారు. మళ్లీ
టిడిపి గెలిస్తే తానే ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు. ఉప ఎన్నికల
పొత్తుపై సిపిఎంతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. శాసనసభ
సమావేశాలు చూస్తుంటే బాధ కలుగుతోందని అన్నారు. ప్రజా సమస్యలు
చర్చిద్దామన్నా అవకాశం లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ
జరుగకూడదని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. శాసనసభని
చక్కగా నడిపించవలసిన బాధ్యత స్పీకర్ దేనని చెప్పారు. రేపటి నుంచైనా
శాసనసభని సజావుగా నడిపించమని సలహా ఇచ్చారు. ప్రజా సమస్యలపై శాసనసభని నడపడం
చేతకాకపోతే రాజీనామా చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు చురకలు
అంటించారు.శాసనసభ
సమావేశాలు జరగకపోతే బాగుంటుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
అనుకుంటున్నారని ఆయన అన్నారు. అది జరగకపోతే ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడానికి తాము ఏం
చేయాలో అది చేస్తామని ఆయన అన్నారు. ప్రజల ముందు ప్రభుత్వాన్ని దోషిగా
నిలబెడతామని ఆయన అన్నారు. ప్రజా సమస్యలు శాసనసభలో చర్చకు రాకుండా
చూస్తున్నారని ఆయన అన్నారు. ధోనీ తన పద్ధతి మార్చుకోవాలి...సౌరవ్ గంగూలీ
ఎక్కువ
కాలం ఫలితాలు సాధించని ఆటగాళ్లను సమర్థించడాన్ని ధోనీ మానుకోవాలని ఆయన
సూచించారు. తన మైండ్ సెట్ వల్ల ఎవరో ఒక్కరిని కాపాడుతూ పోవడం సరి కాదని ఆయన
అన్నారు. రైనా విషయాన్ని ఆయన ఉదహరించారు. మూడు ఫార్మాట్లకు ముగ్గురు
వేర్వేరు కెప్టెన్లను నియమించాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు.
సెలెక్టర్లు ఆ దిశగా ఆలోచన చేయాలని ఆయన అన్నారు. క్రికెట్ ఎక్కువగా జగడమే
కాకుండా ఫార్మాట్లు పెరిగాయని ఆయన అన్నారు.భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రొటేషన్ పాలసీపై మాజీ
కెప్టెన్ సౌరవ్ గంగూలీ విరుచుకుపడ్డారు. ఉత్తమ ఫీల్డింగ్ ప్రమాణాల కోసం
సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి ఆటగాళ్లకు రొటేషన్ పాలసినీ అమలు
చేస్తున్నట్నలు ధోనీ చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు. జట్టులోని 11 ఆటగాళ్లు
ఫీల్డింగ్‌లో అత్యద్భుతమైన ప్రదర్శన కనబరచడమనేది జరగదని ఆయన అన్నారు.
ఆస్ట్రేలియా జట్టు కూడా అలా లేదని ఆయన అన్నారు. ఫిల్డింగ్ మరీ మరీ ముఖ్యమే
అయినప్పటికీ క్లిష్టమైన పరిస్థితిలో పరుగులు సాధించడం అంతకన్నా ముఖ్యమని
ఆయన అన్నారు. ధోనీ తన పద్ధతి మార్చుకోవాలని ఆయన అన్నారు.మహేంద్ర సింగ్ ధోనీపై మ్యాచు నిషేధం విధించడంతో భారత జట్టుకు వీరేంద్ర
సెహ్వాగ్ నాయకత్వం వహిస్తున్నాడు. రోహిత్ శర్మ ఈ మ్యాచులో ఆడడం లేదు.
పార్ధివ్ పటేల్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. జహీర్ ఖాన్‌ను పక్కకు పెట్టి
స్పిన్నర్ అశ్విన్‌ను మైదానంలోకి దించారు. గత మ్యాచులో స్వల్పంగా గాయపడిన
సచిన్ టెండూల్కర్ ఈ మ్యాచులో ఆడుతున్నాడు. భారత్ జట్టులో మూడు మార్పులు
జరిగాయి. ధోనీ, రోహిత్ శర్మ, జహీర్ ఖాన్ స్థానాల్లో పార్థివ్ పటేల్,
అశ్విన్, సెహ్వాగ్ మైదానంలోకి దిగారు. శ్రీలంక జట్టులో ఏ విధమైన మార్పులు
జరగలేదు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో పది పాయింట్లతో భారత్ రెండో స్థానంలో
ఉంది. శ్రీలంక ఏడు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా మొదటి
స్థానంలో ఉంది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన వన్డే మ్యాచులో భారత్‌పై
శ్రీలంక పగ తీర్చుకుంది. భారత్‌ను 51 పరుగుల తేడాతో ఓడించింది.
జగన్ పార్టీ మా శత్రువే,ఉప ఎన్నికల్లో పోటీ...వైఎస్ వివేకానందరెడ్డి
వచ్చే ఉప ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పదని మాజీ మంత్రి వైఎస్
వివేకానందరెడ్డి అన్నారు.తన సోదరుడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమకు
ప్రధాన శత్రువు అని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ నేత వైయస్ వివేకానంద
రెడ్డి మంగళవారం అన్నారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెసుకు
ప్రధాన శత్రువులు తెలుగుదేశం, జగన్ పార్టీలేనని ఆయన స్పష్టం చేశారు. తాము
జగన్ పార్టీతో కలిసే ప్రసక్తే లేదన్నారు. తాను అధిష్టానాన్ని రాజ్యసభ సీటు
అడిగేందుకే ఢిల్లీ వచ్చానని చెప్పారు. పార్టీ సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా
తాను కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. పార్టీకి ఎన్నో ఏళ్లుగా
సేవ చేశాను కాబట్టే తాను పదవిని ఆశిస్తున్నానని అన్నారు. కాంగ్రెసు ఇప్పటి
వరకు ఎవరినీ వాడుకొని వదిలేయలేదన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని
అందలమెక్కిస్తుందన్నారు.జగన్‌తో సహా అవినీతి ఆరోపణలు వచ్చిన వారు
ఎవరైనా విచారణకు హాజరు కావాల్సిందేనని అన్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు
విచారణ చేస్తే కక్ష సాధింపు చర్యలు అనుకోవడం పొరబాటు అన్నారు. వైయస్
రాజశేఖర రెడ్డి పథకాలను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని
జగన్ చేస్తున్న ప్రచారం తప్పన్నారు. కాంగ్రెసు పార్టీ ప్రజా సంక్షేమ
పథకాలను ఎప్పుడూ విస్మరించలేదన్నారు. 15 ఏళ్లుగా రాయలసీమ ప్రాంతవాసులకు రాజ్యసభ సీటు
దక్కనందున ఈసారి అది తనకు దక్కే అవకాశముందని వైఎస్ వివేకా ఆశాభావాన్ని
వ్యక్తం చేస్తున్నారు.
Monday, 20 February 2012
సచిన్ టెండుల్కర్ కు ఎమ్మారై స్కాన్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు వైద్యులు ఎమ్మారై స్కాన్
తీశారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో బ్రెట్ లీ బౌలింగ్‌లో ఓ బంతి సచిన్
హెల్మెట్‌కు బలంగా తాకింది. మాస్టర్ కుడి కన్నుపై తగలడంతో ముందు
జాగ్రత్తగా స్కాన్ తీస్తే మంచిదని వైద్యులు సూచించారు. బంతి తగిలిన తర్వాత
కూడా అలాగే బ్యాటింగ్ చేసిన మాస్టర్ కాసేపటికే ఔటయ్యాడు. పెవిలియన్‌లో
అతనికి ఐస్ ట్రీట్‌మెంట్ చేశారు. బ్రెట్‌లీ వేసిన బంతికి తగిన సమయంలో అతను జవాబు
చెప్పలేకపోయాడు. దీంతో బంతి ముందు జాగ్రత్తగా ఎంఆర్ఐ స్కాన్ తీయించుకునే
పనిలో ఉన్నట్లు చెబుతున్నారు. బ్రెట్‌లీ రెండో ఓవరు చివరి బంతి పేస్‌ను
అంచనా వేయలేకపోవడంతో అది అతని హెల్మెట్ గ్రిల్‌కు తగిలింది. దానివల్ల సచిన్
టెండూల్కర్ నుదటికి దెబ్బ తగిలినట్లు అనుమానిస్తున్నారు. అతను
బ్యాటింగును కొనసాగించాడు. అయితే ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే అతను
అవుటయ్యాడు. డ్రెసింగ్ రూంలో సచిన్ టెండూల్కర్‌కు ఐస్ ట్రీట్‌మెంట్
ఇచ్చారు. నుదురు ఉబ్బినట్లు చెబుతున్నారు. పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ
ఎంఆర్ఐ స్కాన్‌కు వైద్యులు సలహా ఇచ్చారు. భారత జట్టులోని రాజకీయాలు,
రోటేషన్ పద్ధతి వల్ల పక్కన కూర్చోవాల్సి రావడం, వందో శతకం చేయాలనే ఒత్తిడి
సచిన్ టెండూల్కర్‌ను ఈ స్థితికి తెచ్చినట్లు చెబుతున్నారు.
తిరుమలలో భారీ అగ్నిప్రమాదం
తిరుమలలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీవారి ఆలయం
సమీపంలో టిటీడీ మినీ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఒక్కసారిగా మంటలు ఎగసిపడుతుండడంతో భక్తులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ
ఘటనలో 10 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదుగానీ,
సుమారు 25 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా ప్రదేశానికి చేరుకుని
మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్‌సర్య్యూట్‌వల్లే ఈ అగ్ని ప్రమాదం
జరిగినట్లు తెలియవచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు
చేపట్టారు.
శ్రీశైలం పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిట
శ్రీశైలం పుణ్య క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. రాత్రి 7 గంటలకు
నందివాహనసేవతో స్వామివారి గ్రామోత్సవం, ఎదుర్కోల్ల ఉత్సవాన్ని
నిర్వహించనున్నారు. రాత్రి 10:30 గంటలకు లింగోద్భోవకాల మహాన్వసపూర్వక
రుద్రాభిషేకం, రాత్రి 12 గంటలకు భ్రమరాంభిక-మల్లికార్జుస్వామి వారి
కల్యాణోత్సవం జరగనుంది. చిత్తూరు మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయం భక్తులతో
పోటెత్తింది. ముక్కోటిని దర్శించుకోడానికి వేలాది మంది భక్తులు బారులు
తీరారు. తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనం సుమారు ఆరు గంటల సమయం పడుతోంది.
Sunday, 19 February 2012
రైతు కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధం....జయప్రకాష్ నారాయణ
లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ రెండో రోజు రైతు
సత్యాగ్రహ
పాదయాత్రను కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి ప్రారంభించారు. వచ్చేవారం
ఆంక్షలు ఉల్లంఘించి ధాన్యాన్ని పొరుగు రాష్ర్టాలకు తరలిస్తామని ఈ సందర్భంగా
మాట్లాడిన జయప్రకాష్ నారాయణ తెలిపారు. నిజామాబాద్ నుంచి నాందేడ్,
శ్రీకాకుళం నుంచి ఒడిశా, ధర్మపురి నుంచి తమిళనాడుకు తరలిస్తామన్నారు.
రైతులు తమ పంట ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోనివ్వకుండా ప్రభుత్వం
విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 65 ఏళ్ల దుర్మార్గపు పాలనతో
నగరం, పల్లెల్లోనూ రైతులు యాచకులుగా మారిపోయారని ఆయన
విమర్శించారు.నిత్యావసర సరుకుల చట్టం ప్రకారం ఆహార ధాన్యాలను ఎక్కడ నుంచి
ఎక్కడికైనా
తరలించవచ్చని, ఆ విధానం దేశమంతటా అమలవుతున్నా రాష్ట్రప్రభుత్వం మాత్రం
రైతుకు సంకెళ్లు వేసిందని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం చేసిన
చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించడం నేరం కాదా అని ప్రశ్నించారు.
పంటలకు లాభసాటి ధర కోసం పోరాడే తనను ధైర్యముంటే అరెస్టుచేయాలని జేపీ
కోరారు. ఆంక్షల ఉల్లంఘన పర్యవసానం కూడా తనకు తెలుసునన్నారు. అరెస్టు అయి
కేసు నమోదైతే శాసనసభ సభ్యత్వం పోతుందన్నారు. అయినా ప్రస్తుతం తనకు రైతు
కష్టాలే ముఖ్యమన్నారు. ఇందుకోసం తాను దేనికైనా సిద్ధమన్నారు.
82 ఏళ్ల క్రితం పూజ్య బాపూజీ ఆంగ్లేయులు వేసిన ఉప్పు పన్నును వ్యతిరేకించి
సత్యాగ్రహం చేశారన్నారు.
జేపీ చేపట్టిన పాదయాత్రకు అన్నివర్గాల నుంచి విశేష స్పందన లభించింది.
పార్టీలకతీతంగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 70ఎద్దుల బండ్లతో
ర్యాలీ కూడా నిర్వహించారు." రాయలసీమ" ఎస్‌ఐ పరీక్ష ఫలితాల విడుదల
ఎస్‌ఐ అభ్యర్థుల తుది జాబితాను డీఐజీ కర్నూలు డీ ఐజీ కార్యాలయం శనివారం
విడుదల చేసింది. నాలుగో జోన్‌కు ఎస్సైలుగా(సివిల్) 193 మంది ఎన్నికయ్యారు.
ఇందులో నాలుగో జోన్ పరిధిలో 181 మంది అభ్యర్థులు ఎన్నిక కాగా, ఇతర జోన్‌ల
నుండి నాలుగో జోన్‌కు మరో 12 మంది అభ్యర్థులు ఎన్నికయ్యారు. ఎన్నికైన వారు ఈ
నెల 24వ తేది కర్నూలులో బీ క్యాంపులో ఉన్న డీఐజీ కార్యాలయానికి రావాలని
డీఐజీ కార్యాలయం తరుపున రఘునందన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా
ఆయన అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. నాలుగో జోన్ పరిధిలో కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం
అభ్యర్థులు ఉన్నారు. వీరు 2011 మేలో జరిగిన ఎస్‌ఐ పోస్టుల పరీక్షలు రాశారు
సూచనలు:
ప్రెసిడెంట్, జూనియర్ ఆఫీసర్స్‌మెస్, అప్పా, హైదరాబాద్ పేరుపై 12,000 రూపాయల డిమాండ్ డ్రాప్ట్‌ను తీసుకుని రావాలి.
ఒరిజినల్ సర్టిఫికెట్స్ తమ వెంట తెచ్చుకోవాలి.
8 పాస్‌పోర్టుసైజు ఫోటోలు, ఓ స్టాంప్ సైజు ఫోటో తీసుకురావాలి.
ఇండెమ్‌నిటి బాండును వంద రూపాయల విలువ చేసే బాండుపై టైపు చే సి తీసుకు రావాలి. మోడల్ బాండు పేపరు ఈనెల 21 నుండి కర్నూలు డీఐజీ ఆఫీసులో పొందవచ్చు.
అభ్యర్థులందరూ వారితో పాటు వారి హాల్‌టిక్కెట్, సర్వీసు బుక్ తీసుకురావాలి.
వైద్య పరీక్షలకు అవసరమయ్యే నగదును తెచ్చుకోవాలి.
ఎంపిక జాబితా ఇలా:
131585 134020 134128 134192 134237 134415 134555 134560 134649 134883 135241 135243 135321 135407 135464 135578 135885 135294 135956 136015 136063 136107 136115 136156 136323 136359 136455 136456 136457 136529
136575 136609 136616 136647 136905 136940 136941 136945 136954 136956 137153 137400 137546 137674 137811 137943 137964 138298 138355 138592 138747 139015 139104 139422 139503 139600 139605 140017 140035 140037 140232 140373 130465 140870 140927 141066 141191 141192 141225 141379 141469 141494 141531 141541 141570 141615 141786 142124 142405 142406 142534 142561 142809 142826 142832 142844 142849 142853 143345 143482 143490 143527 143615 143815 143817 144016 144046 144094 144141 144179 144221 144239 144352 144356 144562 144570 144814 144843 145001 145059 145111 145186 145193 145321 145478 145488 146071 146079 146084 146259 146518 146520 146616 146943 146946 147080 147205 147459 147540 148025 148088 148224 148261 148316 148354 148438 148442 148484 148523 148558 148561 148582 148611 148620 148975 172836 176217 177698 180270 181325 193675 193750 201267 201283 201289 201623 201660 201685 201691 201748 205684 205783 206220 206360 206454 207605 207606 207720 208105 546315 550599
నాల్గవ జోన్‌కు ఇతర జోన్‌ల నుంచి ఎన్నికైన అభ్యర్థుల రిజిస్ట్రేషన్ నెంబర్లు
136965, 140910, 145272, 146662, 146666, 146675, 147074, 147413, 148372, 152332, 201604, 207788.
సూచనలు:
ప్రెసిడెంట్, జూనియర్ ఆఫీసర్స్‌మెస్, అప్పా, హైదరాబాద్ పేరుపై 12,000 రూపాయల డిమాండ్ డ్రాప్ట్‌ను తీసుకుని రావాలి.
ఒరిజినల్ సర్టిఫికెట్స్ తమ వెంట తెచ్చుకోవాలి.
8 పాస్‌పోర్టుసైజు ఫోటోలు, ఓ స్టాంప్ సైజు ఫోటో తీసుకురావాలి.
ఇండెమ్‌నిటి బాండును వంద రూపాయల విలువ చేసే బాండుపై టైపు చే సి తీసుకు రావాలి. మోడల్ బాండు పేపరు ఈనెల 21 నుండి కర్నూలు డీఐజీ ఆఫీసులో పొందవచ్చు.
అభ్యర్థులందరూ వారితో పాటు వారి హాల్‌టిక్కెట్, సర్వీసు బుక్ తీసుకురావాలి.
వైద్య పరీక్షలకు అవసరమయ్యే నగదును తెచ్చుకోవాలి.
ఎంపిక జాబితా ఇలా:
131585 134020 134128 134192 134237 134415 134555 134560 134649 134883 135241 135243 135321 135407 135464 135578 135885 135294 135956 136015 136063 136107 136115 136156 136323 136359 136455 136456 136457 136529
136575 136609 136616 136647 136905 136940 136941 136945 136954 136956 137153 137400 137546 137674 137811 137943 137964 138298 138355 138592 138747 139015 139104 139422 139503 139600 139605 140017 140035 140037 140232 140373 130465 140870 140927 141066 141191 141192 141225 141379 141469 141494 141531 141541 141570 141615 141786 142124 142405 142406 142534 142561 142809 142826 142832 142844 142849 142853 143345 143482 143490 143527 143615 143815 143817 144016 144046 144094 144141 144179 144221 144239 144352 144356 144562 144570 144814 144843 145001 145059 145111 145186 145193 145321 145478 145488 146071 146079 146084 146259 146518 146520 146616 146943 146946 147080 147205 147459 147540 148025 148088 148224 148261 148316 148354 148438 148442 148484 148523 148558 148561 148582 148611 148620 148975 172836 176217 177698 180270 181325 193675 193750 201267 201283 201289 201623 201660 201685 201691 201748 205684 205783 206220 206360 206454 207605 207606 207720 208105 546315 550599
నాల్గవ జోన్‌కు ఇతర జోన్‌ల నుంచి ఎన్నికైన అభ్యర్థుల రిజిస్ట్రేషన్ నెంబర్లు
136965, 140910, 145272, 146662, 146666, 146675, 147074, 147413, 148372, 152332, 201604, 207788.
కడప జిల్లాలో పోలీసులు, ఖైదీల మధ్య ఘర్షణ
పోలీసులకు, బెయిల్‌పై విడుదలైన ఖైదీల మధ్య రాత్రి ఘర్షణ
చెలరేగింది. సంఘటనలో ఖాసీం అనే ఖైదీకి స్వల్ప గాయాలయ్యాయి. ప్రొద్దుటూరు
సమీపంలో జరిగిన జంట హత్యల కేసుల్లో పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె
గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి, ఖాసీం బెయిల్‌పై శుక్రవారం
విడుదలయ్యారు. వెంటనే వారు గ్రామానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న
ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి గ్రామానికి వెళ్లి.. ‘డీఎస్పీ పిలుస్తున్నారు.
స్టేషన్‌కు రావాలని’ కోరారు. అయితే తాము ఇప్పుడు రాలేమని, ఉదయమే వస్తామని
చెప్పడంతో ఎస్‌ఐ వారిపై కోప్పడ్డారు. దీంతో వారి మధ్య స్పల్ప ఘర్షణ
జరిగినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. సంఘటనలో ఖాసీం తలకు గాయాలు
కావడంతో వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ మహమ్మద్ షరీఫ్
ఏమంటున్నారంటే...హత్య కేసుల్లోని నిందితులు బెయిల్‌పైగ్రామాలకు
వెళ్లినప్పుడు ఎటువంటి
అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. అందులో
భాగంగా జంట హత్యల కేసులోని పైన పేర్కొన్న నిందితులు బెయిల్‌పై గ్రామానికి
వచ్చినట్లు తెలియగానే ముందు జాగ్రత్తగా పెద్దముడియం ఎస్‌ఐ నెమళ్లదిన్నెకు
వెళ్లారు. పోలీసులకు సహకరించాల్సింది పోయి అడ్డం తిరగడం మంచిది కాదన్నారు.
భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు...మంత్రి సీ. రామచంద్రయ్య
‘టీటీడీ అతి పెద్ద వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో చిన్నచిన్న లోపాలు ఉంటాయి.
ఆగమాలకు ఆనుగుణంగానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు. అంత మాత్రాన భక్తుల
మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం మంచిది కాదు.’ అని రాష్ట్ర దేవదాయ
శాఖ మంత్రి సీ. రామచంద్రయ్య తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టీటీడీపై,
తిరుమలపై విమర్శలు చేసేవారు ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. తిరుపతి
పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్లో శనివారం రాత్రి రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి
సి.రామచంద్రయ్యను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
దేవాలయ ఆస్తుల పరిరక్షణకు పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రజలు, నాయకులు,
న్యాయస్థానాలు సహకరించాలని కోరారు. ప్రస్తుత రాజకీయాల్లో దిగజారుడుతనం
తాండవిస్తోందని విమర్శించారు. అవకాశవాద రాజకీయాలు, వ్యక్తిగత విమర్శలు
ఎక్కువయ్యాయని ఆరోపించారు. ధర్మాన్ని నిలబెట్టే విధంగా, శక్తి వంచన లేకుండా
పనిచేస్తానని తెలిపారు. ప్రజాసేవ కంటే ముందు మాధవసేవ చేయమని ఆ దేవుడే
దేవదాయమంత్రి పదవి ఇప్పించాడని అన్నారు. దేవదాయ మంత్రి పదవి
తీసుకుంటే రాజకీయ భవిష్యత్ ఉండదని అందరూ అన్నారని చెప్పారు. మన పనిని
చిత్తశుద్ధితో చేస్తే అన్నీ మంచే జరుగుతాయని అన్నారు.
Saturday, 18 February 2012
న్యూజిలాండ్ క్రికెట్టుకు కర్నూలు బిడ్డ అండ !
కర్నూలుకు చెందిన పాల్ వాల్తాటీ ఐపియల్‌లో సంచలనమే సృష్టించాడు. ఇప్పుడు
కర్నూలు జిల్లాకే చెందిన తరుణ్ సాయి నేతుల న్యూజిలాండ్ క్రికెట్‌లో
దూసుకొస్తున్నాడు. వెట్టోరీకి ప్రత్యామ్నాయం ఈ యువ క్రికెటరేననే మాట
వినిపిస్తోంది. నేతుల 1983 మే 8వ తేదీన కర్నూలులో జన్మించాడు. న్యూజిలాండ్
దేశవాళీ క్రికెట్‌లో అతను సంచలనాలు చేస్తు్నాడు. లెగ్ స్పిన్నర్‌గా
న్యూజిలాండ్‌కు ఉన్న స్పిన్నర్ల కొరతను తీర్చడానికి సిద్ధపడుతున్నాడు
నేతుల. కుడి చేతి వాటం బ్యాట్స్‌మన్ అతను. అతనికి 12 ఏళ్ల వయస్సు
ఉన్నప్పుడు కుటుంబం న్యూజిలాండ్‌కు మారింది. అతను న్యూజిలాండ్‌లో ఇప్పుడు
ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. 2008 - 09లో ఫస్ట్ క్లాస్ సీజన్
క్రికెట్‌లో అతను అడుగు పెట్టాడు. అత్యధిక వికెట్లు తీసుకుని ఆక్లాండ్
స్టేట్ చాంఫియన్‌షిప్‌ను అందించాడు. అక్కడ అతనికి సరైన అవకాశాలు రాకపోవడంతో
సెంట్రల్ డిస్ట్రిక్ట్స్‌కు మారాడు. ఇక్కడ అతను అన్ని క్రికెట్
ఫార్మాట్లలో ప్రధానమైన సభ్యుడైపోయాడు. 2012 జింబాబ్వేపై పరిమిత ఓవర్ల
సిరీస్ కోసం అతను న్యూజిలాండ్ జట్టులోకి వచ్చాడు. జింబాబ్వేతో
మూడు మ్యాచుల వన్డే సిరీస్‌కు తనను ఎంపిక చేయడం పట్ల తరుణ్ నేతలు ఆశ్చర్యం
వ్యక్తం చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు తాను ఎప్పుడూ పోటీ పడలేదని,
టెస్టు మ్యాచులపైనే దృష్టి పెట్టానని, అందుకే ఆశ్చర్యం వేసిందని అతను
అన్నాడు. లెగ్ స్పిన్నర్‌గా అనతు ఈ నెల 6వ తేదీన తన కెరీర్‌ను అతను
ప్రారంభించాడు. తరుణ్‌కు ముందు భారత సంతతికి చెందిన దీపక్ పాటిల్, జీతన్
పాటిల్ న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించారు. వెట్టోరీ ఫామ్‌తో ఇబ్బంది
పడుతున్న ప్రస్తుత స్థితిలో తరుణ్ న్యూజిలాండ్‌కు అంది వచ్చిన అవకాశంగా
భావిస్తున్నారు.
కర్నూలులో జేపీ సత్యగ్రహ పాదయాత్ర ప్రారంభం
లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ శనివారం కర్నూలు జిల్లాలో రైతు
సత్యగ్రహ పాదయాత్రను చేపట్టారు. ఆయన ఎమ్మిగనూరు నుంచి యాత్రను
ప్రారంభించారు. ఈ యాత్ర రాయచూరు వరకూ కొనసాగనుంది. జయప్రకాష్ నారాయణ
ఎమ్మిగనూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంతకు ముందు నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రార్థనలు
చేశారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ సంకెళ్లతో
బస్తాలు మోసి తన నిరనస తెలిపారు.ఎక్కడ పండిన పంటను అక్కడే
అమ్ముకునే అవకాశం రైతులకు ఉండాలని ఆయన అన్నారు. పండించిన పంటను
అమ్ముకోవడానికి ఆంక్షలు పెట్టడం సరి కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం చేసిన
పాపాల వల్ల రెండేళ్లలో ఎరువుల ధఱలు రెండింతలు పెరిగాయని ఆయన విమర్శించారు.
గిట్టుబాటు ధరలు సగానికి పడిపోయాయని ఆయన అన్నారు. రైతుల కోసం జైలుకు వెళ్లడానికైనా తాను
సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. రైతుల కోసం ఎవరు మద్దతిచ్చినా
తీసుకుంటానని ఆయన చెప్పారు. తన యాత్రను తెలుగుదేశంశం పార్టీ అధ్యక్షుడు
నారా చంద్రబాబు నాయుడి రైతు పోరుబాటతో పోల్చుకోలేనని ఆయన అన్నారు.ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎక్కడ పండిన పంటను అక్కడే అమ్ముకునే
అవకాశం ఉండాలన్నారు. పండించిన పంటను అమ్ముకోవటానికి ఆంక్షలు పెట్టడం
సరికాదన్నారు. ప్రభుత్వం చేసిన పాపాల వల్ల రెండేళ్లలో ఎరువుల ధరలు
రెండింతలు పెరిగాయన్నారు. గిట్టుబాటు ధరలు సగానికి పడిపోయాయని జేపీ ఆవేదన
వ్యక్తం చేశారు. జేపీ యాత్రకు కాంగ్రెస్ నేత రుద్రగౌడ్ మద్దతు తెలిపారు
శ్రీకాళహస్తిలో మహా శివరాత్రికి ఏర్పాట్లు పూర్తి
మహా శివరాత్రి పర్వదినం సందర్భం గా శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆల యానికి వచ్చే
భక్తులను దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పా ట్లు చేసినట్లు దేవస్థానం ఈవో
విజయకుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ
భక్తులందరికీ శీఘ్ర ద ర్శనం అయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆలయంలో ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేశామని చెప్పారు. గతంలో రెండుసార్లు శివరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన అనుభవం ఉండడంతో అందరి సహకారంతో పనులను త్వరితగతిన పూర్తి చేశామని తెలిపా రు. స్వర్ణముఖినదిలో భక్తులు స్నానాలు చేసేం దుకు ఏర్పాట్లు చేశామని, మహిళలు బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక గదులను ని ర్మించామన్నారు. మరుగుదొడ్లను రెండుచోట్ల నిర్మించామని, శివరాత్రి రోజున మొబైల్ మ రుగుదొడ్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు. ‘లక్షకు పైగా భక్తులు వచ్చినా ఇబ్బందులు లేకుండా దర్శనం చేయిస్తాం. ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటుచేస్తున్నాం. సాధారణ భక్తులు, స్పెషల్ టికెట్లు కొనుగోలు చేసినవారు, వీఐపీలు ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. ఆలయంలోని క్యూలో ఉండే భక్తులకు మంచినీటిని అందిస్తాం. భక్తులు ఉక్కపోతకు గురికాకుండా అదనంగా ఫ్యాన్లు ఏర్పాటు చేశాం. అలంకరణకు బెంగళూరునుంచి పుష్పాలను తెప్పిస్తున్నాం. లక్షకు పైగా వడలను తయారు చేస్తున్నాం. పులిహోర, పొంగలి, జిలేబీ ప్రసాదాను అదేరోజు తయారు చేయిస్తాం. రథోత్సవం, కల్యాణోత్సవానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. ఆలయ పరిసరాల్లో విద్యుత్ దీపాలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశాం. ఉత్సవాల నిర్వహణకు భారీ బందోబస్తు కల్పిస్తాం. టీటీడీ సహకారంతో విద్యుత్ ఆర్చీలు, గుర్రాలు, ఏనుగులు, తదితరాలను ఉత్సవాలకు తీసుకొచ్చాం’ అని ఈవో విజయకుమార్ వివరించారు.మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం తేజోమయుడైన శివుడు సూర్యప్రభ వాహనంపై కొలువుదీరి పురవీధులలో విహరించారు. జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు రథంపై వెంటరాగా సూర్యప్రభ వాహనంపై స్వామివారు ఉదయం భక్తులకు కన్నులపండువగా సాక్షాత్కరించారు.ఆకాశంలో వెలిగే సూర్యబింబాన్ని ధిక్కరించేవిధంగా ప్రమ«థ గణాధిపతి అలరారారు. రంగురం గుల కొత్తగొడుగులు, ఛత్రచామరాలు మెరయుచుండగా స్వామివారి ఊరేగింపు భక్తజనరంజకంగా సాగింది. ఆది దంపతుల ఊరేగింపులో వేదమంత్రోచ్ఛరణలు మార్మోగగా పరిసరాలు పవిత్రమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు స్వామి, అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు
తిరుపతిలో అంతర్జాతీయస్థాయి స్టేడియం
తిరుపతిలో అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మాణానికి త్వరలో పునాది రాయి
వేయడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు పార్లమెంటు సభ్యుడు డాక్టర్
చింతామోహన్ తెలిపారు. శ్రీకాళహస్తి రిపబ్లిక్ క్లబ్‌లో శుక్రవారం సాయంత్రం
జాతీయ స్థాయి టెన్నిస్ టోర్నీలో ఫైనల్ పోటీలను మాజీ ఎమ్మెల్యే
ఎస్సీవీనాయుడుతో కలిసి తిలకించారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ మాట్లాడుతూ రేణిగుంటలో అంతర్జాతీయస్థాయి
విమానాశ్రయం, మన్నవరంలో భారీ విద్యుత్ ఉపకరణాల ప్రాజెక్టు రాకతో రాబోయే
రోజుల్లో చిత్తూరు జిల్లా ప్రపంచంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా
మారుతుందనడంలో సందేహం లేదన్నారు.
రాలయసీమ జిల్లాలకు బడ్జెట్‌లో అంతంతే..!
హంద్రీనీవా ప్రాజెక్టుకు గత ఏడాది రూ. 660 కోట్లు కేటాయించగా అందులో రూ.
550 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టు చిత్తూరు జిల్లా వరకు
వెళ్తున్నందున వాటి పనులు వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్
కుమార్‌రెడ్డి కొంత ప్రాధాన్యత ఇచ్చి పోయిన ఏడాది కేటాయించిన నిధుల కంటే
రూ.40 కోట్లు అదనంగా కేటాయించారు. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం
జిల్లాలకు సాగునీరు, తాగునీరు అవసరాలు తీర్చనున్న హంద్రీ నీవా సుజల స్రవంతి
ప్రాజెక్టు పనులు ఈ ఏడాదైనా పూర్తి అవుతాయని రైతులు ఎదురు చూస్తున్నారు.
గత ఏడాది బ డ్జెట్‌లో ఎస్‌ఆర్‌బీసీకి రూ. 70 కోట్లు కేటాయించినప్పటికీ రూ.
148 కోట్లు విలువ చేసే పనులు పూర్తి చేసినట్లు అధికారులు లెక్కలు తేల్చారు.
కేసీ కెనాల్ ఆధుకునీకరణకు పోయిన ఏడాది కేటాయించిన నిధుల కంటే అదనంగా ఈ
బడ్జెట్‌లో రూ. 15 కోట్లు ఇచ్చారు. గత ఏడాది కేటాయించిన బడ్జెట్‌లో కనీసం సగం నిధులు కూడా ఇవ్వకపోవడంతో పనులు
ముందుకు కదలకుండా ఆగిపోయాయి. ఈ సారైనా బడ్జెట్‌లో కేటాయించిన నిధులు విడుదల
చేస్తే కొంతవరకు ప్రయోజనం వుంటుంది. ఇదిలా వుండగా ఫీజు రీయింబర్స్‌మెంట్
పథకానికి అవసరమైనన్ని నిధులు కేటాయించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి
నిరుద్యోగులకు ఏమాత్రం ఉపయోగం లేని రాజీవ్ యువకిరణాలకు ప్రత్యేకంగా బడ్జెట్
కేటాయించడం పలువురు విమర్శిస్తున్నారు. ప్రజలకు అన్ని విధాలా ఉపయోగ పడే
108, 104లకు ప్రాధాన్యత ఇవ్వలేదు. అనంతపురం జిల్లా
అనంత సేద్యాన్ని గాడిలో పెట్టడానికి తీసుకోవాల్సిన చర్యలను రేపోమాపో ప్రభుత్వానికి నివేదించనుంది. వాటి అమలుకు నిధులను కేటాయిస్తామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ఇదివరకే ప్రకటించారు. అయితే... బడ్జెట్లో మాత్రం పైసా కూడా కేటాయించలేదు. దీన్నిబట్టి కేంద్ర కమిటీ నియమించడం కంటితుడుపు చర్యేనని విశదమవుతోంది. ఈ ఏడాది వేరుశనగ పంట రైతులను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. వాతావరణ బీమా వస్తుందో, రాదోనన్న అనుమానాలను బడ్జెట్ కేటాయింపులు మరింత బలపరుస్తున్నాయి. బీమా పరిహారానికి బడ్జెట్లో రూ.300 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో జిల్లాకు రూ.25 కోట్లకు మించి దక్కే అవకాశాలు లేవు! జిల్లాలో 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు, 10 లక్షల జనాభాకు తాగునీరు అందించే లక్ష్యంతో సీఎం అయిన వెంటనే వైఎస్ పనులు ప్రారం భించారు. ఆయన హయాంలో ప్రతి బడ్జెట్‌లోనూ ఈ ప్రాజెక్టుకు విశేషంగా నిధులు కేటాయించి, వాటిని ఖర్చు పెడుతూ వచ్చారు. కిరణ్ సీఎం అయ్యాక గత ఏడాది బడ్జెట్‌లో రూ 695 కోట్లు మాత్రమే ఈ ప్రాజెక్టుకు కేటాయించారు. ఇందులో సుమారు రూ 100 కోట్లకు పైగా పాత బకాయిలు చెల్లించేందుకు ఖర్చు పెట్టారు. ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయిస్తానని సీఎం చెబుతూ వచ్చారు. ఈ స్థాయిలో పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఇప్పటి దాకా రూ.4,933 కోట్లు ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ 1800 కోట్లు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ సారి కనీసం రూ వెయ్యి కోట్లు ఇవ్వాలని కోరారు. గత ఏడాది కంటే రూ.3 కోట్లు మాత్రం పెంచి రూ 698 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధుల్లో 80 శాతం అనంతపురం జిల్లాలో జరుగుతున్న పనులకే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈలెక్కన చూస్తే జిల్లాలో హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులకు ఈసారి గ్రహణం పట్టే ప్రమాదం కనిపిస్తోంది.
చిత్తూరు జిల్లా
కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేసేలా అధికార యంత్రాంగంపై ముఖ్యమంత్రి వత్తిడి పెంచి... సొంత జిల్లాలో సాగునీటి పథకాలను త్వరితగతిన పూర్తి చేయించాల్సింది పోయి... నిధుల కేటాయింపులో కోత విధించడం రైతన్నలను నిరాశకు గురిచేసింది. జిల్లాలోని 19 పశ్చిమ మండలాల పరిధిలో 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు, 10 లక్షల జనాభాకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన హంద్రీ- నీవా పథకానికి 2011-12 బడ్జెట్‌లో రూ. 695 కోట్లు కేటాయించగా, ఈ సారి రూ. 700 కోట్లు కేటాయించారు. ఈ పథకం పూర్తి కావడానికి రూ. 1675 కోట్లు అవసరమని ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపగా అందులో 50 శాతం కంటే తక్కువగా... 700 కోట్లు మాత్రమే కేటాయించారు. దీంతో ఈ పథకం 2013లో కూడా పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.ఇక తూర్పు మండలాల్లో మెట్టభూములను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన సోమశిల- స్వరముఖి కాలువకు కేటాయింపులే కనిపించలేదు. సోమశిలకు ప్రాజెక్టుకు కేటాయించిన నిధులను ఈ పనులకు వెచ్చిందే అవకాశం లేనందున ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు అటకెక్కినట్టే భావించాల్సి వస్తోంది. మరోవైపు జిల్లాలో చెరువులు, మధ్యతరహా ప్రాజెక్టుల మరమ్మతులు, ఆధునికీకరణ పనులకు వందలకోట్లు ఖర్చు చేస్తామంటూ ముఖ్యమంత్రి స్వయంగా చేసిన ప్రకటనపైనా బడ్జెట్ కేటాయింపులతో నీలినీడలు కమ్ముకున్నాయి. మీడియం చెరువులు, ప్రాజెక్టుల పునరుద్ధరణకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కేటాయింపు 130 కోట్లు మాత్రమే కావడంతో... అందులో జిల్లాకు దక్కేది ఎంతో వేచిచూడాలి.రీకాళహస్తి నియోజక వర్గంలోని 36,847 హెక్టార్ల భూములకు సాగునీరందించే లక్ష్యంతో ప్రారంభించిన సోమశిల- స్వర్ణముఖి కెనాల్‌కు ఈ బడ్జెట్‌లో కూడా నామ మాత్రపు నిధులే దక్కాయి. సోమశిల ప్రాజెక్టుతో పాటు ఈ కెనాల్‌కు బడ్జెట్‌లో రూ.230 కోట్లు కేటాయించారు. 100 కిలోమీటర్ల 425 మీటర్ల దూరం తవ్వే కెనాల్‌కు ఇందులో కనీసం 50 కోట్లు కూడా దక్కే అవకాశాలు లేవు. గత బడ్జెట్‌లో ఈ కెనాల్ నిర్మాణానికి 90 కోట్లు కేటాయించగా,44 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.గాలేరు- నగరి పనులు ఇప్పడు నత్తకు నడక నేర్పుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు గత ఏడాది బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయిస్తే పెండింగ్ బిల్లులు చెల్లించి పనులు వేగంగా చేయిస్తామని అధికారులు ప్రభుత్వానికి విన్నవించారు. కేవలం 450 కోట్లు కేటాయించి, ఈసారి సర్దుకు పోవాలంటూ ప్రభుత్వం సముదాయించింది. ఈ సారైనా వెయ్యి కోట్లు ఇవ్వాలని అధికారులు ప్రభుత్వాన్ని అడిగారు. అయితే రూ 420 కోట్లు మాత్రం కేటాయించింది. ఈ నిధుల్లో 80 శాతం వైఎస్సార్ జిల్లాలో జరుగుతున్న పనులకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కావాలంటే రూ 1300 కోట్లు అవసరం అవుతాయి. జిల్లాలో 1.03 లక్షల ఎకరాలకు తాగునీరు, అనేక గ్రామాలకు తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు మళ్లీ గాలిలో దీపంగా మారే ప్రమాదం కనిపిస్తోంది.బడ్జెట్ కేటాయింపుల్లో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది.
కడప జిల్లా
గత రెండేళ్ళతో పోలిస్తే... జిల్లాలో ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులు గత రెండేళ్ళతో పోలిస్తే బాగా తగ్గాయి. ముగ్గురు మంత్రులు జిల్లాలో ఉన్నా జిల్లాకు సముచితమైన బడ్జెట్ కేటాయింపులు చేయించుకోలేక పోయారు. బడ్జెట్ కేటాయింపులు ఏటేటా ఇలా కుచించుకు పోతూ వస్తుంటే ప్రాజెక్టుల పూర్తి ఎప్పటికి సాధ్యమవుతుందో చెప్పడం కష్టమే.ఆర్థిక శాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాలోని ప్రాజెక్టులకు, మిగతా రంగాలకు కోతలు పెట్టారు. దీంతో జిల్లాలోని ప్రాజెక్టులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు మృగ్యమైపోయాయి. నిధులు సమకూర్చి పనులు నిర్వహిస్తే కొద్ది నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టులను సైతం ప్రభుత్వం గాలికొదిలేసింది. మూడేళ్లుగా జిల్లాలోని ప్రాజెక్టులకు కేటాయింపుల్లో నిధుల కోత పడుతునే ఉంది. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు, కేబి నెట్ ర్యాంకు స్థాయి నేత ఉన్నా బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత లేకపోవడం గమనార్హం. జిల్లాకు ప్రాణప్రదమైన జీఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టుకు కూడా కేటాయింపుల్లో ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది.బడ్జెట్‌లో కేటాయింపులు ఎలా ఉన్నా విడుదల మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. గత ఏడాది జీఎన్‌ఎస్‌ఎస్ మొదటి దశ పనులకు 540 కోట్లు కేటాయించినప్పటికీ, కేవలం 225.32 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మైలవరానికి 9.90 కోట్లు, తెలుగుగంగకు 118.19 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. గండికోట రిజర్వాయర్‌కు 150 కోట్లు కేటాయించినప్పటికీ 149.95 కోట్లు, గండికోట లిఫ్ట్‌లకు 50 కోట్లు కేటాయిస్తే 11.97 కోట్లు మాత్రమే నిధులను విడుదల చేశారు. ఈ ఏడాది కూడా వెయ్యి కోట్ల కు పైగా బడ్జెట్‌లో నిధులు కేటాయించినప్పటికీ 50 శా తం నిధులు కూడా విడుదలయ్యే అవకాశాలు లేవు.సాగు అవసరాలతో పాటు పరిశ్రమలకు నీటిని అందిస్తున్న మైలవరం రిజర్వాయర్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపింది. గత బడ్జెట్‌లో రూ. 20 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం అందులో కోత విధించి రూ.15 కోట్లే కేటాయించింద.
కర్నూలు జిల్లా
గత ఏడాది కేటాయించిన బడ్జెట్‌లో కోతపెట్టి.. ఈ ఏడాది కేటాయింపులోనూ కత్తెర వేసింది. జిల్లాలో హంద్రీనీవా ప్రాజెక్టుకు మాత్రమే నిధుల కేటాయింపులోకొంత ప్రాధాన్యత కల్పించారు. 2012-13 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి శుక్రవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు ఆశించిన మేరకు నిధులు కేటాయించకపోవడంతో రైతాంగానికి భరోసా ఇవ్వలేకపోయారనే విషయం మరో మారు తేటతెల్లమైంది. గతఏడాది కంటే ఈ సారి బడ్జెట్‌లో రూ. 65.19 కోట్లు కుదించారు. తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణకు రూ.82 కోట్లు, గాలేరు నగరి ప్రాజెక్టుకు రూ.419.86 కోట్లు, తెలుగు గంగకు రూ. 160 కోట్లు, గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు రూ.80 కోట్లు, హంద్రీనీవా ప్రాజెక్టుకు రూ. 700 కోట్లు, తుంగభద్ర దిగువ కాల్వకు రూ. 18 కోట్లు, ఎస్‌ఆర్‌బీసీకి రూ.125 కోట్లు, కేసీ కెనాల్ ఆధునీకరణకు రూ.75 కోట్లు, గాజుల దిన్నె ప్రాజెక్టుకు రూ.45 లక్షలు కేటాయించారు ఇదిలా వుండగా గత ఏడాది బడ్జెట్‌లో కేటాయించిన నిధులు సరిగా మంజూరు చేయకపోవడంతో అనుకున్న మేరకు పనులు వేగవంతం కాలేదు. దీంతో నిధుల కొరత వల్ల ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇందులో భాగంగానే తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణ కోసం రూ.95.5 కోట్లు కేటాయించగా అందులో రూ.63.9 కోట్లు, గాలేరు నగరికి రూ.540 కోట్లకు గాను రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దీంతో పాటు తెలుగు గంగకు ప్రాజెక్టుకు రూ.180 కోట్లు కేటాయించినా మరో రూ.20 కోట్ల పనులు అదనంగా చేపట్టారు. గురురాఘవేంద్రకు గత ఏడాది రూ.100 కోట్లు కేటాయించగా వీటిలో రూ.80 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అందుకోసమే ప్రస్తుత బడ్జెట్‌లో గత ఏడాదితో పోల్చితే రూ.20 కోట్లు తక్కువ ఇచ్చారు.
Subscribe to:
Posts (Atom)









