Sunday, 4 March 2012

దమ్ము డైలాగులు.. టాలీవుడ్ కు పంచ్


 టాలీవుడ్ కు పంచ్ డైలాగుల ఫీవర్ పట్టుకుంది. ‘భయానికి మీనింగే తెలియని మీనింగ్ రా నాది’ అంటూ దూకుడులో.. ‘నేను మాట్లాడ్డానికొచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు’ అంటూ బిజినెస్ మేన్ లో మహేష్ బాబు చెప్పిన డైలాగులు ఎంత సంచలనం సృష్టించాయో తెలిసిందే. ఇప్పుడు నెంబర్ వన్ రేసులో మహేష్ ను ఢీకొట్టడానికి సిద్ధమవుతున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇలాంటి పంచ్ డైలాగులతోనే సిద్ధమవుతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో జూనియర్ హీరోగా నటిస్తున్న దమ్ము సినిమాలో ఇలాంటి పంచ్ డైలాగులకు కొరత లేదు. విడుదలకు చాలా సమయమున్నా అప్పుడే ఈ సినిమా డైలాగులు లీకయ్యాయి. క్రేజ్ కోసం యూనిటే ఇలా లీక్ చేసిందో ఏమో.. మొత్తానికి దమ్ము డైలాగుల్లో కొన్ని...
 "బాగా భయపడేవాడు ధైర్యం కోసం ఎదురుచూస్తాడు...బాగా బలుపు ఉన్నోడు వాడ్ని టచ్ చేసే మగాడు కోసం చూస్తాడు..నేను రెండో టైప్"
 ‘‘ఎవడ్రా నువ్వు.. ’’ ‘‘డిపార్ట్ మెంట్లో టైగర్ అంటారు.. బయట యంగ్ టైగర్ అంటారు’’
 ‘‘వితౌట్ ఖాకీలో కూల్ గా ఉంటా.. విత్ ఖాకీలో కుమ్మేసేలా ఉంటా’’
 ‘‘నేను డైలాగ్ కొడితేనే విజిల్స్ తో థియేటర్స్ ఊపేస్తారు.. అదే నేను కొడితే ఇక ఆంధ్రా మొత్తం తీన్ మారే’’
 ‘‘ట్రైలర్స్ తోనే సెన్సేషన్ సృష్టించ టైపురా నేను.. ఇక సినిమా రిలీజ్ అయితే సునామీని తట్టుకోవడం ఎవరి వల్లా కాదు’’
 ‘‘మంచి, చెడు గురించి ఆలోచించడానికి నేను అన్నా హజారేని కాదు, ఎన్టీ రామారావుని అసలే కాను’’
 ‘‘నా తప్పు ఉన్నప్పుడు ఆలోచిస్తా...నీ తప్పు ఉంటే చంపేస్తా’’
 ‘‘నాలాంటోణ్ని ఎప్పుడూ కెలకొద్దు.. పొరపాటున కెలికావా చరిత్రలో కనివీనీ ఎరుగని రేంజ్ లో క్రైమ్ రేట్ పెరిగిపోతుంది’’
 ‘‘నాలాంటోడిని ఎప్పుడూ కెలకొద్దు...పొరపాటున కెలికావా చరిత్రలో కనివీనీ ఎరుగని రేంజ్ లో క్రైమ్ రేట్ పెరిగి పోతుంది’’
 ‘‘అడుగేస్తే సుమోలు ఎగరడం చూసుంటావ్...తొడగొడితే ట్రైన్ వాపస్ పోవడం చూసుంటావ్...కానీ నేను కొడితే గ్లోబ్ మొత్తం చుట్టి వచ్చినట్లు ఉంటుంది’’
 ‘‘చరిత్ర తిరగరాసే పవర్ నా బ్లడ్ లోనే ఉంది..నువ్వు లక్షల మందితో వచ్చినా నవ్వుతూ చంపుతా’’
 ‘‘నేను సైలెంట్ గా మాట్లాడతా కానీ..యాక్షన్ లో దిగితే మాత్రం ఫుల్ వయొలెంట్’’
 ‘‘నీచేతిలో ఆయుధం నీకు బలమైతే...నా దమ్మే నాకు బలం’’


రాంచరణ్ "రచ్చ" మగధీర రికార్డును బ్రేక్ చేస్తుందట...!

మగధీర తర్వాత హిట్టు కోసం మొహం వాచిపోయి ఎదురుచూస్తున్న రాంచరణ్‌కు రచ్చ పండగ చేయడం ఖాయమట. సినిమా రష్‌ను చూసిన ఇన్నర్ సర్కిల్.. రచ్చ చూస్తున్నంత సేపు తమ రోమాలు నిక్కబొడుచుకునే ఉన్నాయని చెపుతున్నారట. రాంచరణ్‌కు రచ్చ మరో రికార్డును తెచ్చి పెడుతుందని అంటున్నారట. రాంచరణ్ కూడా ఈ సినిమాపై గంపెడాశలు పెట్టుకున్నాడు. ఇటీవలి కాలంలో మెగా కుటుంబం నుంచి మంచి హిట్ రాక తహతహలాడుతున్న ఫ్యాన్స్‌కు ఈ చిత్రం మంచి జోల్ట్ ఇస్తుందని అనుకుంటున్నారు. ఇకపోతే తెలుగు రచ్చతోపాటు ఇదే చిత్రాన్ని మలయాళం, హిందీల్లో కూడా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇతర భాషల గురించి ఆలోచిస్తున్నారంటే రచ్చలో స్టామినా ఉండే ఉంటుందని అంటున్నారు ఫిలిమ్ జనం. చూద్దాం రాంచరణ్ రచ్చతో ఎంతమాత్రం రఫ్ ఆడిస్తాడో...?!!

చంద్రబాబు నన్ను సన్యాసిగా మార్చాడు ....మాజీ మేయర్

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును నమ్మి తాను మోసపోయానంటూ కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య మరోసారి వినూత్న నిరసన తెలిపారు. ఆదివారం బంగి అనంతయ్య సన్యాసి వేషంతో అడుక్కుంటూ తన నిరసన తెలిపారు. చంద్రబాబును నమ్మి తాను మోసపోయానని అన్నారు. ఆయనను నేను పూర్తిగా నమ్మానని, ఆయన మాటలు నమ్మి ఇళ్లు, ప్లాటు అన్ని అమ్ముకున్నానని, అయితే ఆయన మాత్రం నన్ను సన్యాసిగా మార్చారని ఆరోపించారు. ఆయన ఉబ్బిచ్చి ఉబ్బిచ్చి తర్వాత మోసం చేస్తాడని ఆరోపించారు. ఉన్నదంతా అమ్ముకొని సన్యాసిని అయ్యానన్నారు. బాబు వల్లే తాను దివాళా తీశానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన చేతిలో డబ్బులు పోయెనే జేబులు ఖాళీ ఆయెనే అంటూ పాట పాడుతూ రోడ్డెక్కారు. కాగా గతంలో కూడా ఆయన పలుమార్లు బాబు తీరుపై వినూత్నంగా నిరసన తెలిపారు. కొద్ది రోజుల క్రితం బిక్షమెత్తుతూ బాబు వైఖరిని తూర్పార బట్టారు. చంద్రబాబును నమ్ముకుంటే తెలుగు తమ్ముళ్లకు చిప్పే గతి అని ఆయన అన్నారు. ఎన్నో ఏళ్ల నుండి తాను తెలుగుదేశం పార్టీని నమ్ముకొని పని చేస్తున్నానని కానీ తనకు చిప్ప తప్ప ఏమీ మిగలలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం సాక్షిగా బంగి అనంతయ్య భిక్షాటన చేశారు. తనకు కలిసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో జాగ్రత్త బ్రదర్ అంటూ హెచ్చరించారు.

జగన్‌ అరెస్ట్ పై పుకార్లు

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆయనను అరెస్ట్ చేయడానికి సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. వారికేమీ లభ్యం కాలేదు. ఎందుకంటే, దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జగన్ ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. అందుకే వారు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇంకా అలాంటప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. అయినా కాంగ్రెస్, టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు ‘ఆధారాలు లేకపోయినా జగన్‌మోహన్ రెడ్డిని సీబీఐ తాకితే... ఆయనపై ఒక్క చేయి పడినా రాష్ట్రంలోని లక్షల, కోట్ల చేతులు సమాధానం చెబుతాయి...’ అని గట్టిగా హెచ్చరించారు. జగన్‌ను అరెస్టు చేస్తారంటూ శనివారం అర్థరాత్రి నుంచీ ఓ వర్గం మీడియా, టీడీపీ, కాంగ్రెస్ వర్గాలు చేసిన దుష్ర్పచారంపై రాంబాబు తీవ్రంగా స్పందించారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్ కోవూరు ఎన్నికల ప్రచారం ఒక రోజు మాత్రమే కుటుంబ కారణాల వల్ల వాయిదా పడిందనీ సోమవారం నుంచి మూడు రోజుల పాటు యథావిధిగా ఆయన నెల్లూరు జిల్లాకు వెళ్లి ప్రచార సభల్లో పాల్గొంటారనీ స్పష్టం చేశారు. ‘జగన్ దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి, వై.ఎస్.విజయమ్మల ఏకైక పుత్రుడే కాదు...ఈ రాష్ట్రంలోని ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఆయనను తమ కుమారుడుగా భావిస్తున్నారు...ప్రతి చెల్లి, ప్రతి అక్క జగన్‌ను ఒక సోదరుడుగా భావిస్తోంది...ప్రతి అవ్వ, ప్రతి తాత జగన్‌ను తమ మనవడిగా చూసుకుంటున్నారు...సీబీఐకి ఇదే హెచ్చరిక చేస్తున్నాను....సీబీఐ...! జగన్‌పై ఒక్క చెయ్యి వేస్తే కోట్లాది చేతులు లేస్తాయి...’ అని ఆయన తీవ్ర స్వరంతో అన్నారు. ఏ ఆధారాలు లేక పోయినా కాంగ్రెస్, టీడీపీ నాయకులు చెబుతున్నట్లుగా ఆయనను అరెస్టు చేస్తే ఆ పరిణామాలు ఎలా ఉంటాయో...చూస్తారు’ అని అంబటి అల్టిమేటమ్ జారీ చేశారు. జగన్‌నూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బహిరంగంగా ఎదుర్కోలేక అరెస్టు చేస్తారనే ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు. జగన్‌పై చేయి పడితే అది ఆయనపై కాదు, తెలుగు గడ్డపై పడిన చేయిగా ప్రజలు భావిస్తారని ఆయన అన్నారు. 

  

జగన్ ఇంటి ముందు అర్ధరాత్రి అలజడి

హైదరాబాద్‌లో కడప ఎంపీ వైఎస్ జగన్మోహన రెడ్డి నివాసం. శనివారం రాత్రి తొమ్మిది గంటలు.. సుమారు 40 మంది అక్కడికి చేరుకున్నారు. గంటలు గడుస్తున్నాయి. వస్తున్న జనం సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. అర్ధరాత్రి ఒంటి గంట అయ్యేసరికి అక్కడికి దాదాపు 600 మంది వరకు చేరుకున్నారు. అక్రమ ఆస్తుల కేసులో జగన్‌ను సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందన్న సమాచారం వారికి అందడమే ఈ హడావుడికి కారణమని తెలిసింది. జగన్ ఇంటికి చేరుకున్న మద్దతుదారులు హల్‌చల్ సృష్టించారు. జగన్ ఇంటికి చేరుకునే నాలుగు దారుల్లోనూ రాకపోకలను అడ్డుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వాహనాలనే బ్యారికేడ్లుగా మార్చి రోడ్డుకు అడ్డంగా నిలబెట్టారు. ఆ మార్గంలోని వీధిలైట్లను ఆర్పేశారు. మరోవైపు, జగన్‌ను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందని, అందువల్ల, ఆయన ఇంటి వద్దకు చేరుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన మద్దతుదారులకు ఎస్ఎంఎస్‌లు పంపుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా మహిళలను పెద్దఎత్తున తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.