Thursday, 8 March 2012

పన్ను ఎగవేతలో అనంతపురం జిల్లాకు రెడ్‌మార్క్

సకాలంలో పన్ను చెల్లించి శాభివృద్ధికి, ప్ర జా సంక్షేమానికి దోహద పడాలని ఆదాయ పన్నుల శాఖ అనంతపురం రీజియన్ జాయింట్ కమిషనర్ వివి రమణరావు వ్యాపారులు,పన్ను చెల్లింపుదారులకు సూచించారు. పన్నుల ఎగవేతలో అనంతపురం జిల్లాకు హైదరాబాద్‌లో రెడ్‌మార్క్ ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ముందస్తు పన్నుల చెల్లింపు- ప్రయోజనాలు’ అంశంపై బుధవారం సాయంత్రం స్థానిక ఐఎంఎ హాలులో వివిధ వ్యాపా ర వర్గాలతో అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక సీనియర్ ఆదాయ పు పన్నుల శాఖ అధికారి శివానందం అధ్యక్షతన జరిగిన సదస్సులో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నంబూరి శంకర్, ట్యాక్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నరసింహయ్యశెట్టి తదితరులు పాల్గొన్నారు. రమణరావు మాట్లాడుతూ పట్టణంలో వ్యాపార వర్గాలు పన్నుల ఎగవేతకు పాల్పడటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. హిందూపురంలోని బంగారు నగల వ్యాపారులు ఒక్కరు కూడా రూ.40 లక్షల లావాదేవీలను చూపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. కేవలం రూ.6 లక్షల నుండి రూ. 7 లక్షల వరకు మాత్రమే లావాదేవీలను చూపిస్తున్నారని పేర్కొన్నారు. లావాదేవీలు ఇలా చూపిస్తే ఆదాయం ఏ మేరకు బయటపడుతుందన్నారు. ఆదాయపు పన్నుల శాఖ తనిఖీలు నిర్వహిస్తే పన్నుల ఎగవేత సులువుగా బహిర్గతమవుతుందని స్పష్టం చేశారు. అదే విధంగా హిందూపురంలో మండీ వ్యాపారులు కూడా పెద్ద ఎత్తున పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నట్లు తమ శాఖ ఇంటలిజిన్స్ విభాగం నివేదిక సమర్పించినట్లు తెలిపారు. దీనికి తోడు అనంతపురం జిల్లాకు చెందిన అనేక మంది బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించి సబ్ రిజిస్ట్రర్ శాఖ నిర్ణయించే మార్కెట్ ధరకు, డాక్యుమెంట్‌లో చూపిస్తున్న విలువకు ఎంతో వ్యత్యాసం ఉంటోందన్నారు. బెంగళూరుకు చెందిన ఐటి శాఖ ఆయా వ్యక్తుల సమాచారాన్ని హైదరాబాద్‌కు పంపగా వారందరికీ నోటీసులు జారీ చేసి ఎగవేసిన పన్నును వసూలు చేస్తామని స్పష్టం చేశారు. హిందూపురంలో ఇప్పటికీ ఐటి శాఖ నిర్దేశించిన పన్నుల వసూళ్ళలో దాదా పు రూ.1.50 కోట్లు వసూలు కావాల్సి ఉందన్నారు. గత ఆరేళ్లుగా రిఫండ్స్ ఆగిపోవడంతో ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయని అభిప్రాయ పడ్డారు. ఆదాయపు పన్నును సక్రమంగా చెల్లించకపోతే తప్పకుండా ఆయా పన్ను ఎగవేతదారులు నష్టపోవాల్సి ఉంటుందని రమణరావు హెచ్చరించారు. భారతదేశ ఆర్థిక ప్రగతిని దృష్టిలో వుంచుకొని ప్రతి ఒక్కరూ పన్నులను సక్రమంగా చెల్లించాలని సూచించారు. ఇకపోతే ముందస్తు పన్నుల చెల్లింపు వల్ల చేకూరే ప్రయోజనాలు, చెల్లించకపోతే జరిగే నష్టాలను విశదీకరించారు. ఈ నెల 15వ తేదీ లోగా ముందస్తు పన్నును ప్రతి ఒక్కరూ చెల్లించి వడ్డీ మినహాయింపు పొందాలని సూచించారు. ఈ సదస్సులో ఆడిటర్లు వరదరాజులు, రాఘవేంద్రగుప్త తదితరులు తగు సూచనలు అందచేశారు.

సుకుమార్ దర్సకత్వం చిత్రంలో మహేష్‌ సిక్స్‌ ప్యాక్

అందరు హీరోలు మళ్లీ తమ శరీరాలను శ్రమింప చేసి తెరపై కండలు చూపించి మార్కులు కొట్టాయాలి అనుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో మహేష్ సైతం చేరాడంటున్నారు. సుకుమార్ దర్సకత్వంలో చేయబోయే చిత్రంలో ఓ సీన్ లో మహేష్ చొక్కా విప్పి ఫైట్ చేస్తాడని,ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర వచ్చే ఆ ఫైట్ కోసం మహేష్ ప్రత్యేక శ్రద్ద తీసుకుని ట్రైనర్ సాయింతో శరీరాన్ని తీర్చుదిద్దుకుంటున్నాడని చెప్తున్నారు. దీనికి కారణం మహేష్‌ బాబు, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తుందంటే దానికి అంచనాలు భారీగా ఉండమే అంటున్నారు. ఈ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ బారీగా ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఏప్రిల్‌ రెండవ వారంలో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. 'దూకుడు' సినిమా సూపర్ హిట్ కావటంతో ఈ చిత్రనిర్మాణ సంస్థకు మహేష్ సినిమాతో మరో మారు మెగా హిట్ కొడతామనే నమ్మకంతో ఉంది. మరోవైపు హండ్రెడ్ పర్సెంట్‌ లవ్‌ హిట్‌ కావటంతో సుకుమార్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అవన్నీ దృష్టిలో పెట్టుకునే హాలీవుడ్‌ ట్రైనర్‌ ఆధ్వర్యంలో మహేష్‌ బాబు సిక్స్‌ప్యాక్ కోసం శ్రమిస్తున్నాడని చెప్తున్నారు.. అదే సమయంలో ముఖం అందం చెడకుండా మహేష్‌ జాగ్రత్త పడుతున్నాడు. తొలిసారిగా మహేష్‌ చిత్రానికి దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు

టీమిండియాకు టెస్టుల మీద ఆసక్తి లేదు....మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్

భారతీయుల్లో నాయకత్వ లక్షణాలు చాలా తక్కువ ఉంటాయని, దీనికి అక్కడి కట్టుబాట్లే కారణమన్నాడు. భారత్‌లో పిల్లలపై చిన్నప్పటి నుంచే ఒత్తిడి అధికంగా ఉంటుందని, పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారన్నాడు. దీంతో పెద్దవారైన తర్వాత చాలా మంది భారతీయులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేక పోతారన్నారు. ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న భారత్‌ కావాలనే టెస్టులను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందన్నాడు. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా సిరీస్‌లలో క్లీన్‌స్వీప్‌ కావడమే దీనికి నిదర్శనమన్నాడు.టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ మరోసారి భారత్‌పై విరుచుకుపడ్డాడు. స్వతహాగా నోటి దురుసు ఎక్కువ కలిగి.. పదవి ఊడి ఐదేళ్లవుతున్నప్పటికీ అప్పడప్పుడు భారత్ గురించి ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ వార్తుల్లో ఉంటున్నాడు. అడిలైడ్‌లో ఓప్రముఖ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ ‘భారత్‌కు టెస్టుల మీద ఆసక్తి లేదు. ఎందుకంటే వాళ్లకు ఈ ఫార్మాట్ చాలా కష్టం. ఆస్ట్రేలియాలో వాళ్ల ఆట దారుణం. ఆ జట్టులోని అనేక మందితో నేను కలిసి పని చేశాను. వాళ్ల గురించి నాకు తెలుసు. టి20, వన్డేలు ఆడి డబ్బు సంపాదించుకోవాలని అనుకుంటారు. అందుకే వారికి టెస్టులు ఆడటం కష్టంగా ఉంది’ అని అన్నారు.ధోనిలో నాయకత్వ లక్షణాలను నేను మొదట్లోనే గమనించాను. మూడేళ్లుగా కెప్టెన్‌గా, కీపర్‌గా, భారీ లక్ష్యాలను సాధించే బ్యాట్స్‌మెన్‌గా చాలా బాధ్యతలు పోషిస్తున్నాడు. అతడు దొరకడం టీమిండియా అదృష్టం. ప్రస్తుతం డ్రెస్సింగ్‌రూమ్‌లో వాతావరణం వల్ల ధోని టెస్టులను వదులుకునే అవకాశం ఉందన్నాడు. సెహ్వాగ్‌కు కెప్టెన్ కావాలనే ఆశ ఎక్కువగా ఉందని, దీనివల్లే సమస్యలు వస్తున్నాయని గ్రెగ్‌చాపెల్ అన్నా రు. ‘కుంబ్లే రిటైర్ అయిన తర్వాత తానే కెప్టెన్ అవుతానని సెహ్వాగ్ అనుకున్నాడు. అలా జరగకపోవడంతో టీమిండియాలో విబేధాలు వచ్చాయని చాపెల్ తెలిపాడు.


 

రాయలసీమలో ఘనంగా హోలీ పండుగ

ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల తో జరుపుకునే హోలీ పండుగ వచ్చేసిం ది. ప్రతి సంవత్సరం పాల్గుణ మాసం పూర్ణిమ తిథి నాడు అత్యంత ఆనందోత్సవాలతో హోలీ పర్వదినాన్ని ఘనం గా జరుపుకుంటారు. ఈ పండుగ వసంత రుతువు ఆగమనాన్ని తెలియజే స్తూ ఉంటుంది. పూర్వం రఘు మహారాజు హోలిక అనే రాక్షసిని చంపడంతో ప్రజలు ఈ పండుగ జరుపుకుంటున్నారన్నది ప్రతీతిలో ఉంది. దీన్నే కాముని పున్నమి, డోలికోత్సవం, పాల్గుణోత్స వం వంటి వివిధ నామాలతో వ్యవహరిస్తుంటారు. ఇక మహారాష్ట్రంలో హోలిక దహన్‌ను కామ దహనం అంటారు. ఈ పండుగను సాధారణంగా శీతాకాలం చివరిలో ఫిబ్రవరి లేదా మార్చి నెలల తదుపరి వారాల్లో వచ్చే చివరి ఫాల్గుణ మాసం (పూర్ణిమ) పౌర్ణమి రోజున జరుపుకుంటారు.కళ్లకే ప్రమాదం పొడి, ద్రావకం రూపంలో ఉన్న రంగులు విసురుకున్నప్పుడు అవి కళ్ల లో పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కెమికల్ కలర్లు కళ్ల మీద చాలా దుష్ఫ్రభావాన్ని చూపిస్తాయి. వీటితో కళ్ల కల క, అలర్జీ వచ్చే ప్రమాదముంది. అలాగే తాత్కాలిక అంధత్వం, కలర్, బ్లైండ్‌నె స్, ఫొటో ఫోబియా (వెలుగును చూడలేక పోవడం) వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక చర్మపై ఈ సింథటిక్ డైకలల్ చూపించే ప్రభావం అంతా ఇంతాకాదు. కొన్ని నాసిరకం రసాయనిక రంగులతో కేన్సర్ బారిన పడే అవకాశం ఉంది. కెమికల్ డైస్ జుట్టుపై కూ డా దుష్ప్రభావాలు చూపిస్తుంది.