ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం జిల్లాకు రానున్నారు. ఉదయం 8.35 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 9.35 గంటలకు బెంగళూరు చేరుకుంటారు. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం 10.45కు బయలుదేరి 11.15 గంటలకు పలమనేరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడ అధికార, అనధికారులతో సమావేశమవుతారు. 11.20 గంటలకు రోడ్డు మార్గంలోగంగవరం చేరుకుని పలు నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తారు.
అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.35 గంటలకు డీసీసీ అధ్యక్షుడు సుధాకర్ ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. 1.55గంటలకు పలమనేరు నుంచి బయలుదేరి 2.10 గంటలకు కలికిరి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొం టారు. సాయంత్రం 5 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి పీలేరుకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొం టారు. మళ్లీ సాయంత్రం 6.40 గంటలకు కలికిరికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 2 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 2.30 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళుతారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు