Wednesday, 14 December 2011
2008 నవంబర్ 26న ముంబై ఘటనపై వర్మ సినిమా
పుట్టపర్తిని చూసి నేర్చుకుందాం...టీటీడీ ఈవో
పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి సేవాదళ్ నిర్వహణను అధ్యయనం చేసి తిరుమల
శ్రీవారి సేవ విభాగాన్ని పటిష్టంగా అమలు చేయడానికి టీటీడీ నిర్ణయించిం ది.
ఇందుకోసం తిరుమల జేఈవో శ్రీని వాసరాజు నేతృత్వంలో 25 మంది అధికారుల బృందం
అక్కడికి బయల్దేరింది. పుట్టపర్తి కంటే 20 రెట్లు ఎక్కువగా
భక్తులు తిరుమలకు వస్తున్నందు వల్ల ఆ సూత్రం ఇక్కడికెలా వర్తిస్తుందని
ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు.
పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా దర్శ నం కోసం వచ్చే భక్తులతో పాటు అక్కడి అన్నదానం, వివిధ అనుబంధ సంస్థల్లో స్వచ్చంద సేవలందించే లక్ష్యంతో 1965 ఆగస్టులో శ్రీ సత్యసాయి సేవాదళ్ ఆవి ర్భవించింది. దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక అధ్యక్షుడు ఆ రాష్ట్రానికి చెందిన సత్యసాయి సేవా బృందాలను సమన్వయ పరుస్తారు. ఒక్కో బృందం పుట్టపర్తిలో 15 రోజుల పాటు ఉండి ప్రశాంతి నిల యం, అన్నదానం సముదాయం, సూప ర్ స్పెషాలిటీ ఆస్పత్రి, విద్యాసంస్థల్లో స్వచ్ఛంద సేవలందిస్తారు. ఈ విభాగా న్ని నిర్వహించే విధానం, సమన్వయ పరచే తీరును అధ్యయనం చేసి టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి సేవలో అమలు చేయాలని దశాబ్ద కాలం నుంచి టీటీడీ యోచిస్తోంది. గతంలో టీటీడీ బృందాన్ని పుట్టపర్తికి అధ్యయనం కోసం పంపే ప్రయత్నం చేసింది. స్వామి జన్మదినోత్సవాలను మినహాయిస్తే, రోజుకు 15 వేల నుంచి 20 వేల మంది భక్తులు వచ్చే పుట్టపర్తికి, 50 నుంచి 60 వేల మంది వచ్చే తిరుమలకు పోలికేంటని అప్పట్లో ఉద్యో గ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. దీంతో ఆ ప్రతిపాదన మరుగున పడింది. ప్రస్తుత ఈవో ఎల్‌వీ.సుబ్రమణ్యానికి పుట్టపర్తితో అనుబంధం ఉండటంతోపాటు అక్కడ సాయిసేవాదళ్ సేవలను ప్రత్యక్షంగా చూసిన అనుభవం ఉంది. ఈ కారణంగానే టీటీడీ నుంచి అధికారుల బృందాన్ని అక్కడికి పంపి స్వచ్ఛంద సేవ తీరుపై అధ్యయనం చేయించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే . వీరు రెండు రోజుల పాటు అక్కడే ఉండి సాయిసేవాదళ్ నిర్వహణ తీరును పరిశీలిస్తారు. ఈ అనుభవంతో తిరుమలలో అమలవుతున్న శ్రీవారి సేవ విభాగంలో మార్పులు, చేర్పులు చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రపంచంలోని అనేక ప్రసిద్ధి చెందిన ఆలయాలు తిరుమలకు వచ్చి ఇక్కడి క్యూ, తలనీలాల సమర్పణ, అన్నదానం, పారిశుద్ధ్యం, వసతి లాంటి అంశాలను పరిశీలించి వెళుతుంటే టీటీడీ పుట్టపర్తి బాట పట్టడం ఏమిటనే వాదనలు ఇక్కడి ఉద్యోగుల్లో వినిపిస్తున్నాయి. అయితే మంచిని చూసి అన్వయించుకోవడంలో తప్పేముందని అధికారులు చెబుతున్నారు.

ఇక ఆన్‌లైన్‌లోనే ఆర్మీ పరీక్ష
సైన్యంలో నియామకాలకు ఇక ఆన్‌లైన్ విధానంలోనే పరీక్ష ఉంటుందని ఆర్మీ జనరల్
రిక్రూటింగ్ డిప్యూటీ డెరైక్టర్(స్టేట్స్) బ్రిగేడియర్ పంకజ్ సిన్హా
తెలిపారు. పారదర్శకంగా ఉండేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సైన్యంలో చేరడానికి ఇప్పుడు
యువతలో ఆసక్తి పెరిగిందన్నారు. అధికారుల స్థాయి పరీక్షలు యూపీపీఎస్‌సీ,
ఎస్‌ఎస్‌బీ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతుండగా,
ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు
వెల్లడించారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అభ్యర్థుల ర్యాలీ
నుంచి ఎత్తు, పరుగుపందెం, పుల్‌అప్స్ వంటి శారీరక దృఢత్వ పరీక్షల తర్వాత
రాత పరీక్ష ఉంటుందని వివరించారు. అన్ని ప్రక్రియల్లోనూ కంప్యూటర్‌లో
వివరాలు నమోదు చేస్తారని, ఆన్‌లైన్ పరీక్ష అనంతరం నిమిషాల వ్యవధిలోనే
మార్కులు తెలిసిపోతాయని పేర్కొన్నారు. పరీక్షకు హాజరైన సమయంలోనే
ఓఎంఆర్, బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రల సేకరణ, ఐరిస్, ఫొటోగుర్తింపు
వంటివి తీసుకుంటామని, ఇందువల్ల ఆయా అభ్యర్థులు దేశంలో ఎక్కడ పరీక్షకు
హాజరైనా డేటాషీట్ ద్వారా వారి పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. ఈ విధానంలో
మొట్టమొదటిసారి వచ్చే ఏడాది ఏప్రిల్ 12న పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు
జరుగుతున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు www.indianarmy.comవెబ్‌సైట్
చూడొచ్చని ఆయన సూచించారు.
శ్రీశైలం అడవు ల్లో నక్సల్స్ కోసం కూబింగ్ గ్రేహౌండ్స్ పోలీసులు
ముగ్గురు యు వతులను
అదుపులోకి
కర్నూలు-ప్రకాశం జిల్లా స రిహద్దు ప్రాంతంలోని శ్రీశైలం అడవు ల్లో
నక్సల్స్ కోసం కూబింగ్ చేస్తున్న గ్రేహౌండ్స్ పోలీసులు ముగ్గురు యు వతులను
అదుపులోకి తీసుకున్నట్లు స మాచారం. పాలుట్ల అ టవీ ప్రాంతంలో
కూంబింగ్ నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్ పోలీసులకు వీరు తారసడ్డారని
తెలుస్తోంది. గ్రేహౌండ్స్ పార్టీతోపాటు స్థానిక ట్రైనింగ్ ఎస్ఐ వి
జయబాస్కర్ కూడా వారితో వున్నట్లు సమాచారం. ఇంతకూ గ్రేహౌండ్స్ పో లీసులు ఆ
ముగ్గురు యువతులను విడిచిపెట్టారా? లేక స్థానిక పోలీసుల కు అప్పగించారా?
అనే విషయం తేలలేదు. ఈ విషయంపై స్థానిక టూ టౌ న్ పోలీస్ స్టేషన్ ట్రైనింగ్
ఎస్ఐ విజయభాస్కర్‌ను వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ... పాలుట్ల ప్రాంతం నుంచి
సున్నిపెంట గ్రామానికి వస్తున్న ముగ్గురు విద్యార్థినులను అనుమానం తో
అదుపులోకి తీసుకున్నామని, వారు శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని ప్రతిభ పా ఠశాల
విద్యార్థినులని చెప్పారు. అయి తే ప్రతిభ పాఠశాల వారిని
వదిలేశామని ప్రిన్సిపాల్ ఎంబీ ఇస్మాయిల్, ఐటీడీఏ అధికారి కె.రమేష్‌లను
ఆన్‌లైన్ వివరణ కోరగా.. పోలీసులు చెప్తున్నట్లు ఆ విద్యార్థినులు తమ
పరిధిలోని పాఠశాల విద్యార్థులు కారని, వారు ఎవరో తమకు తెలియదని చెప్పారు.
ఇంతకూ సున్నిపెంట టూటౌన్ పోలీసులు ఎవరిని అదుపులోకి తీసుకున్నదీ తేలాల్సి
ఉన్నది. ఆ ముగ్గురు మావోయిస్టులా? లేక నక్సల్స్ సానుభూతి పరులా? లేక
విద్యార్థులా? అనే విషయం వెలుగులోకి రావాల్సి ఉంది
చిత్తూరు జిల్లాను విడదీస్తే ఊరుకోం...ఎమ్మెల్యే అమరనాధ రెడ్డి
జిల్లాను విభజించే ప్రయత్నాన్ని ప్రభుత్వం వెంటనే మానుకోవాలని పలమనేరు
ఎమ్మెల్యే అమరనాధ రెడ్డి డిమాండు చేశారు. ఆయన
విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి మాణిక్య వరప్రసాద్
జిల్లా విభజనపై లేనిపోని ప్రకటనలు చేసి ప్రజలను ఉద్వేగానికి గురి చేయడం
తగదన్నారు. వనరులు, నీటి సదుపాయాలు లేక కరువు కాటకాలతో అల్లాడుతున్న
చిత్తూరు జిల్లాలో అంతర్భాగమైన తిరుపతిని వేరు చేయడమంటే ప్రజలను
రెచ్చగొట్టడమేనన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమలపై కడప, నెల్లూరు
జిల్లాలకు చెందిన ప్రముఖుల కళ్ళు పడినట్లనిపిస్తోందని, వ్యాపార నిమిత్తం
వలస వచ్చి తిరుపతిలో స్థిరపడిన బడా వ్యాపారస్తులు, కొందరు రాజకీ య నేతలు
తిరుపతిని చిత్తూరు జిల్లానుంచి వేరు చేయాలనే కుట్ర పన్నుతున్నట్లు
తెలుస్తోందన్నా రు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త డివిజన్ల ఏర్పాటుకు అందరూ
అంగీకరిస్తారని, జిల్లా ను ముక్కలు చేయాలనుకుంటే మాత్రం ఆందోళన
కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్
కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ సహచర మంత్రి
ప్రకటనపై తనకేమీ పట్టనట్టు వ్యవహరించడం విడ్డూరంగా వుందన్నారు.
రాజకీయాలకతీతంగా జిల్లా లోని ప్రజాప్రతినిధులందరూ ఈ విషయంపై స్పందించాలని
కోరారు. జిల్లాకు ఉద్యోగ, ఉపాధి, వ్యాపార, విద్యాకేం ద్రంగా
విలసిల్లుతున్న తిరుప తిని జిల్లా నుంచి వేరు చేస్తామని ప్రభుత్వం ఆలో
చిస్తుంటే విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘా లు స్పందించకపోతే
భవిష్య త్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.
తారక రత్న తన పేరును ‘ఎన్టీఆర్’గా మార్పు
నిన్నమొన్నటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ అంటే....స్టూడెంట్ నెం.1, ఆది,
సింహాద్రి, అదుర్స్ చిత్రాల్లో నటించిన నందమూరి యువ హీరోనే. కానీ ప్రస్తుతం తెలుగు
సినీ పరిశ్రమలో మరో ఎన్టీఆర్ తయారయ్యాడు. అతడు కూడా నందమూరి చిన్నోడే. గతంలో
అతగాడిని నందమూరి తారక రత్న అని పిలచే వారు. కానీ తారక్ ఇప్పడు తన పేరును కూడా
షార్ట్ కట్‍గా ఎన్టీఆర్ అని మార్చుకున్నాడు. ఇకపై ఎన్టీఆర్ అంటే నేనే అంటూ
ప్రకటించుకున్నాడు. పరిశ్రమలో ఇద్దరు ఎన్టీఆర్ లు ఉండటంతో నందమూరి
అభిమానులు......గందరగోళానికి గురవుతున్నాడు. అందులోనూ ఇద్దరూ నందమూరి కుటుంబానికి
చెందిన వారే కావడంతో తికమక పడుతున్నారు.
త్వరలో ఐదు సీబీఐ కోర్టులను ఏర్పాటు
Subscribe to:
Posts (Atom)