Sunday, 6 November 2011

రాజకీయాల్లో త్వరలో పెనుమార్పులు

                                                             
రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో పెనుమార్పులు రానున్నాయని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ ఆదివారం అన్నారు. తెలంగాణ విషయంలో భారతీయ జనతా పార్టీది రెండు నాల్కల ధోరణి అని విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా కొత్త ఉద్యమానికి నాంది పలకబోతున్నట్లు చెప్పారు. హైదరాబాదులోని పాత నగరం, ఉత్తరాంధ్ర నేతలను కలుపుకొని అభివృద్ధి కోసం ఉద్యమిస్తామని చెప్పారు ప్రజలంతా ప్రస్తుతం అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు అందరూ ఈ ప్రభుత్వంలో కొనసాగాలని భావిస్తున్నారని చెప్పారు. కాగా టిజి వెంకటేష్ ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయన తెలంగాణకాకుండా వెనుకబడిన ప్రాంతాల ఆధారంగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆయన పలుమార్లు డిమాండ్ చేశారు. తెలంగాణ కంటే రాయలసీమ ప్రాంతం ఎక్కువ వెనుకబడి ఉందని, సీమ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కూడా ఆయన పలుమార్లు డిమాండ్ చేశారు

అర్చక పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం


 అన్ని రకాల ఆలయాల్లో అర్చకుల నియామక పరీక్షలకోసం దేవాదాయ, ధర్మాదాయ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆలయాల్లో ప్రవేశ, వర, ప్రవరలకు వచ్చే ఏడాది జనవరి 21, 22 తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు దేవాదాయ, ధర్మాదాయ శాఖ కంట్రోలర్ చంద్రకుమార్ శనివారం తెలిపారు. అర్చక పరీక్షలు రాయదలచిన వారు ఈ నెల 30వ తేదీలోగా ఆయా జిల్లాల సహాయ కమిషనర్ల కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలి. పూర్తి వివరాలకోసం హైదరాబాద్‌లోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో సంప్రదించవచ్చు. లేదా www.apendowments.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోగలరు.


తిరుమలలో 22 కోట్ల రూపాయలతో ఏసి కల్యాణమండపం


తిరుమలలో 22 కోట్ల రూపాయలతో ఏసి కల్యాణమండపాన్ని
నిర్మించాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉందని టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు తెలిపారు.
శనివారం తిరుమల అన్నమయ్య భవన్‌లో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశ నిర్ణయాలను
ఆయన విలేఖరులకు వివరించారు. టిటిడి ఉద్యోగ సహకార బ్యాంకుకు 2 కోట్ల రూపాయలు షేర్
క్యాప్టల్‌గా కేటాయించామన్నారు. 2009 నుండి ఈ ప్రతిపాదన వున్నప్పటికీ అమలు
కాలేదన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించిన నేపధ్యంలో టిటిడి
ఉద్యోగులకు 7,500 రూపాయలు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
గతంలో 6500 రూపాయలు ఇచ్చేవారన్నారు. టిటిడిలో పనిచేసే అటెండర్లకు యూనిఫాం
కొనుగోలుకు ఇకపై నగదు చెల్లించాలని నిర్ణయించామన్నారు. నారుూ బ్రాహ్మణుల
కమ్యూనిటీ హాలుకు తిరుపతిలో 1000 గజాలు కేటాయించాలని నిర్ణయించామన్నారు. గత 10
ఏళ్లుగా వారు ఈకోరికను తీర్చమని టిటిడికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు

తిరుమలలో 22 కోట్ల రూపాయలతో ఏసీ కల్యాణమండపం


తిరుమలలో 22 కోట్ల రూపాయలతో ఏసి కల్యాణమండపాన్ని
నిర్మించాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉందని టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశ నిర్ణయాలను
ఆయన విలేఖరులకు వివరించారు. టిటిడి ఉద్యోగ సహకార బ్యాంకుకు 2 కోట్ల రూపాయలు షేర్క్యాప్టల్‌గా కేటాయించామన్నారు. 2009 నుండి ఈ ప్రతిపాదన వున్నప్పటికీ అమలు
కాలేదన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించిన నేపధ్యంలో టిటిడిఉద్యోగులకు 7,500 రూపాయలు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
గతంలో 6500 రూపాయలు ఇచ్చేవారన్నారు. టిటిడిలో పనిచేసే అటెండర్లకు యూనిఫాంకొనుగోలుకు ఇకపై నగదు చెల్లించాలని నిర్ణయించామన్నారు. నారుూ బ్రాహ్మణులకమ్యూనిటీ హాలుకు తిరుపతిలో 1000 గజాలు కేటాయించాలని నిర్ణయించామన్నారు. గత 10
ఏళ్లుగా వారు ఈకోరికను తీర్చమని టిటిడికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు

డిసెంబర్‌లోగా 5,292 మందికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం


 రాజీవ్ యువ కిరణాలు ద్వారా ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా
డిసెంబర్‌లోగా 5,292 మందికి ఉపాధి కల్పిస్తామని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్
ముఖ్యమంత్రికి తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. శనివారం హైదరాబాదు
నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్
మాట్లాడుతూ జిల్లాకు రాజీవ్ యువకిరణాల కింద 12,765 మందికి ఉపాధి కల్పించేందుకు ఈ
ఏడాది లక్ష్యంగా కేటాయించారని అందులో డిసెంబర్‌లోగా 5,292 మందికి ఉపాధి కల్పించేందుకు
ప్రణాళిక సిద్ధం చేశామని, ఇప్పటికే 2,749 మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించామని చెప్పారు.
ఇంకా 2,543 మందికి శిక్షణ కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల గ్రామీణ ప్రాంతాల్లో 10, 20,
30వ తేదీల్లో యువతను సమావేశపర్చి అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో గల 97
మంది పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఏర్పాటు చేసి వారికి కావాల్సిన రంగాల్లో యువతకు
శిక్షణ అందిస్తున్నామన్నారు. ఇప్పటికే 27 మంది పారిశ్రామిక వేత్తలు 2000 మందికి ఉపాధి
కల్పించగలమని తెలిపినట్లు వివరించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి 1 లక్ష మంది
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జిల్లా కలెక్టర్లు చరుగ్గా పనిచేయాలని ఆదేశించారు.
రాజీవ్ యువకిరణాలు ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఎక్కువ సంఖ్యలో ఎస్టీ,
ఎస్సీలకు అవకాశాలు కల్పించాలన్నారు. శిక్షణ ఇచ్చేటప్పుడే శిక్షణ పూర్తి అయ్యాక ఎక్కడ
అవకాశం ఉంటుంది, జీతం వివరాలను ముందుగానే స్పష్టంగా తెలపాలన్నారు

అరటి రైతులు తీవ్ర ఆందోళన

  జిల్లాలో ఒక్కసారిగా అరటి పండు ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొన్నటి వరకు కిలో రూ. 10 పలుకగా నేడు కిలో రూ. 3 పలుకుతోంది. దీంతో అరటి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో రైల్వేకోడూరు, రాజంపేట, పులివెందుల నియోజకవర్గాలలో దాదాపు 50 వేల ఎకరాలలో అరటి సాగు చేశారు. ప్రస్తుత సీజన్‌లో రోజు వంద లారీలు అరటి కాయలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుత సీజన్‌లో కిలో ధర రూ. 10 నుంచి 11 వరకు విక్రయించాల్సి ఉండగా ధరలు పడిపోవడంతో రైతులు కిలో రూ. 3 నుండి 3-50లకే విక్రయించుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అరటి సాగుపై పెట్టిన పెట్టుబడి కూడా రైతుకు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఎకరాకు రూ. 70 వేలు ఖర్చు అవుతుంది. వివిధ రకాలకు చెందిన అరటి పిలకలను తీసుకొచ్చి రైతులు పంటను సాగు చేశారు. 11 నెలలకే పంట దిగుబడి వస్తుంది.   
                                         

 ఎకరాకు 12 వందల చెట్లు రైతులు వేస్తారు. అందులో దాదాపు 300 చెట్లు తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బ తింటాయి. ఇక మిగిలిన 900 చెట్లను ఆధారం చేసుకొని రైతులు ఆదాయం తీసుకోవాలి. బాగా పండిన తోటలో ఒక్కొక్క గెలకు 25 నుంచి 30 కిలోల కాయలు వస్తాయి. కిలో రూ. 9 నుంచి 10 వరకు ధర పలుకుతుంది. అయితే కాయలు బాగా పెద్ద సైజ్‌లో ఉన్న ధర మాత్రం పూర్తిగా పడి పోయింది. దళారులకు రైతులు ఒక్కొక్క గెలకు కమిషన్ కూడా తీస్తుంటారు. అయితే రైతులు అందించిన సమాచారం మేరకు నెల కిందట 160 గెలలు కొడితే కేవలం రూ. 9 వేలు మాత్రమే చేతికి అందాయి. ధర బాగుండింటే చేతికి రూ. 25 వేల నుంచి 30 వేల వరకు అందేది. ధరలు పడిపోవడం వల్ల కేవలం రూ. 9 వేలు వచ్చిందని రైతులు వాపోతున్నారు. ఎకరా పంటకు రూ. 70 వేలు పెట్టుబడి పెట్టి 11 నెలల పాటు అరటి తోటలను కంటికి రెప్పలగా కాపాడుకున్న ఫలితం దక్కలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు

త్రిపుల్ ఐటిల్లో రిలే దీక్షలను ప్రారంభించారు

రాష్ట్ర ప్రభుత్వం త్రిపుల్ ఐటిల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది సమస్యల పట్ల స్పందించి పరిష్కారం చేయకపోవడం దర్మార్గమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. రాంమోహన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట ఆర్‌జెయు - ఐఐఐటి ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర పిలుపుమేరకు చేపట్టిన రిలే దీక్షలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంమోహన్ మాట్లాడుతూ ఇడుపులపాయ త్రిపుల్ ఐటిలో 300 మంది దాకా బోధన, బోధనేతర సిబ్బంది గత 3 సంవత్సరాలుగా పని చేస్తున్నారని ఆయన తెలియజేశారు. వీరిలో మెంటర్స్, హెచ్‌ఆర్‌టిలు, ఇతర సిబ్బంది వివిధ రకాల పనులు నిర్వహించుచున్నారని ఆయన తెలిపారు. ఇతర సిబ్బందికి జివో నెం.3 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సిలర్‌కు, డైరెక్టర్‌గా అనేక సార్లు విజ్ఞప్తి చేసినా స్పందించి సమస్యను పరిష్కారం చేయలేదన్నారు. దీనికి నిరసనగా నవంబర్ 9 నుండి ట్రిపుల్ ఐటి సిబ్బంది సమ్మె చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి ఎన్. శివరాం, జిల్లా కమిటీ సభ్యులు కామనూరు శ్రీనివాసులరెడ్డి, ఐఐటి ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు మల్లికార్జున, సాగర్ తదితరులు పాల్గొన్నారు

రామలింగరాజును దర్శకుడు రాంగోపాల్‌వర్మ కలిశారు


ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ మరో సంచలనం రేపారు. సత్యం కుంభకోణంలో బెయిల్‌పై విడుదలైన రామలింగరాజును ఆయన కలిశారు. రెండున్నరేళ్ల జైలు జీవితం అనంతరం రామలింగరాజు శనివారం తొలి సారిగా ఇంటికొచ్చారు. అక్కడే ఆయనతో వర్మ అర్ధగంటకుపైగా భేటీ అయ్యారు. ఈ విషయాన్ని వర్మ సమీప బంధువొకరు «ద్రువీకరించారు. అయితే ఈ భేటీ ఎందుకన్నదీ తెలియరాలేదు. వర్మ ఏదైనా సినిమాకు ప్రణాళిక రూపొందిస్తున్నారా? ఇందులో భాగంగానే రామలింగరాజును కలిశారా? అన్న ఊహాగానాలు జోరందుకున్నాయి
                                         . 
గతంలో పరిటాల సునీతను, సూరిని కలిసిన అనంతరమే వర్మ.. పరిటాల రవిపై సినిమా తీసే విషయాన్ని వెల్లడించారు. అనంతరం ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంతో ఆయన రూపొందించిన 'రక్త చరిత్ర'పై దుమారం రేగిన సంగతి తెలిసిందే. అలాగే విజయవాడలో రెండు వర్గాల ఆధిపత్య రాజకీయాలపై చిత్ర నిర్మాణం చేపట్టి మరో వివాదానికి తెరతీశారు. 'బెజవాడ రౌడీలు' అన్న టైటిల్‌పై తీవ్ర విమర్శలు రేగడంతో దానిని 'బెజవాడ'గా మార్చారు. ఈ సినిమా కూడా విడుదల అనంతరం వివాదాలు సృష్టించొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సత్యం రామలింగరాజుతో భేటీ జరపడం వెనుకా.. ఏదైనా సినిమా తీసే యోచన ఉండొచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి