Thursday, 2 February 2012

బాలయ్య దేశ వ్యాప్తంగా...!

బాలయ్య నటించిన పౌరాణిక సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే గత నెల ఈ సినిమా 50 రోజుల వేడుక కూడా జరుపుకుంది. ఈ సినిమాను మలయాళంలో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత యలమంచిలి సాయిబాబు. ఏప్రిల్ 14న మలయాళీ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇంతటితో ఆగకుండా ఈ సినిమాను హిందీ, ఇంగ్లీష్ లలో కూడా అనువదించి దేశం మొత్తం ఈ సినిమాను మార్కెట్ చేయాలని చూస్తున్నారు నిర్మాత. అదే జరిగితే ఈ సినిమాలకు దర్శకత్వం వహించిన బాపు పేరు, బాలకృష్ణ, నయనతారల పేర్లు దేశం మొత్తం మారుమ్రోగనున్నాయి.

పాల ధరలకు రెక్కలొచ్చాయి

 ఏడాది కాలంలో మూడు పర్యాయాలు ప్రైవేటు డెయిరీలు పాల ధరలను పెంచి వినియోగదారుల నెత్తిన భారం మోపాయి. ఏటా ఇతర డెయిరీలకన్నా రూపాయి అదనంగా పెంచే హెరిటేజ్ కంపెనీ తాజాగా లీటరు పాలుపై రూ.4 పెంచింది. దీంతో ఇతర డెయిరీలు తామేమీ తక్కువ కాదంటూ హెరిటేజ్ కంపెనీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి. అందులో భాగంగానే హెరిటేజ్‌తో పాటు జిల్లాలోని మరో 8 డెయిరీలు కూడా లీటరు రూ.26 ఉన్న పాలధరలను రూ.30కి పెంచాయి. 3.0 శాతం కొవ్వు, 8.5 వెన్నశాతం ఉన్న లీటర్ పాలను రూ. 30 (రీటైల్ ధర) లకు విక్రయిస్తున్నారు. పాల సేకరణ ధరను పెంచకుండా ప్రైవేటు డెయిరీ యాజమాన్యాలు పబ్బం గడుపుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రానున్న మార్చి నుంచి మే నెలాఖరు వరకు పాలసేకరణ ఆశించిన స్థాయిలో ఉండదని ప్రైవేటు డెయిరీలు భావిస్తున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా పాలసేకరణ ధర పెంపును పక్కన బెట్టి ఉత్పత్తుల విక్రయ ధరలను మాత్రం పెంచాశాయి. చాలా ప్రైవేటు డెయిరీలు లీటర్ నాణ్యమైన పాల సేకరణకు రూ. 14 నుంచి 19 వరకు మాత్రమే చెల్లిస్తున్నాయి.జిల్లాలో పాలిచ్చే ఆవులు, గేదెలు 5.80 లక్షలు ఉన్నాయి. 48 ప్రైవేటు డెయిరీలు, 101 బల్క్‌మిల్క్ సెంటర్‌ల ద్వారా రోజుకు దాదాపు 18 లక్షల లీటర్ల పాలసేకరణ జరుగుతోంది. 3 లక్షల లీటర్లు స్థానిక పాల వ్యాపారులు విక్రయిస్తున్నారు. మిగిలిన 15 లక్షల లీటర్ల పాలను ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీలు కొవ్వు(ఫ్యాట్), వెన్నను తీసివేసి ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వ నిర్వహణలోని డెయిరీలు మినహా మిగిలిన 48 ప్రైవేటు డెయిరీలు పాల సేకరణ రేటును అనధికారికంగా పెంచేశాయి. సాధారణంగా పాలసేకరణ, విక్రయధరల నిర్ణయం ప్రభుత్వ సమక్షంలో నిర్ణయించాల్సి ఉంది. అలాంటివేమీ చేయకుండానే గుట్టుచప్పుడు కాకుండా ధరలను పెంచేశాయి. ప్రభుత్వ ఆధీనంలోని బాలాజీ, ఏపీ డెయిరీలు లీటర్ పాలను రూ. 28కు విక్రయిస్తున్నాయి.

అనంతపురం జిల్లాలో వజ్రాలపై అంతర్జాతీయ సదస్సు

స్థానిక జియలాజికల్ సర్వే ఆఫ్‌ఇండియా(జీఎస్‌ఐ) వజ్రాల పరిశోధన కేంద్రంలో గురువారం నుంచి రెండు రోజుల పాటు వజ్ర పరిశోధనలపై అంతర్జాతీయ సదస్సు జర గనుంది. ఈ సదస్సుకు దేశ, విదేశీ శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు.వారి కోసం వసతి ఏర్పాట్లు పూర్తి చేశారు. వజ్రాలు ఎలా లభిస్తాయి? వజ్రాల ముడి ఖనిజమైన కింబర్‌లైట్ ఎలా ఉంటుంది ? అందులో ఎన్ని రకాలు ఉంటాయి? నాణ్యతను గుర్తించడం ఎలా ? వ్యాపారపరంగా సాధ్యమా.. కాదా? తదితర అంశాలపై శాస్త్రవేత్తలు సదస్సులో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ముడిఖనిజాన్ని ప్లాంట్‌కు తరలించిన తరువాత వజ్రాలు ఎలా వెలికితీస్తారు? అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలను జూనియర్ జియాలజిస్టులకు సీనియర్ శాస్తవేత్తలు వివరించే అవకాశముంది.

రేపట్నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాల ఆం దోళనల నేపథ్యంలో.. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు ప్రకటించింది. ఈ శుక్రవారం నుంచి ఈనెల 25వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తం గా 6,33,571 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరుకానున్నారు. అందులో 4,85, 356 మంది జనరల్, 1,48,215 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు. వివరాలను ఇంటర్ బోర్డు సెక్రెటరీ  ఒక ప్రకటనలో విడుదల చేశా రు. పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. రోల్ నెంబర్లు, బ్యాచ్ లు, టైమ్-టేబుల్ సహా హాల్ టికెట్ల ముద్రణ, అభ్యర్థులకు పంపిణీ పూర్తయ్యాయి. అభ్యర్థులు తమ బ్యాచ్‌ని మార్చుకునేందుకు అవకాశం లేదు. జాతీయ క్రీడలకు హాజరయ్యే అభ్యర్థులకు మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుంది. 'సమ్మక్క-సారల మ్మ' జాతర రూట్లలో ఉన్న కాలేజీల్లో ప్రాక్టికల్ పరీక్షలను జాతర అనంతరం నిర్వహిస్తారు. సెంటర్ల వద్ద ర్యాండమ్‌గా వీడియోగ్రఫీ ఏర్పాటు చేస్తారు. జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా.. ఎస్పీ వైస్ ఛైర్మన్‌గా.. ఆర్జేడీ, డీవీఈవో ఎక్స్అఫీషియో మెంబర్లుగా ఒక సీనియర్ ప్రిన్సిపాల్ మెంబర్‌గా హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీస్ జరిగిన సెంటర్లలో రీఎగ్జామ్ నిర్వహణకు ఆదేశించే అధికారం ఈ కమిటీకి ఉంటుంది. పనిచేసే కాలేజీల్లో/అదే యాజమాన్య కాలేజీలో ప్రాక్టికల్ పరీక్షల విధులు నిర్వహించకుండా ఎగ్జామినర్లను జంబ్లింగ్ చేస్తున్నారు. ప్రతి 20 సెంటర్లకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనా కాలేజీలో 25 శాతం మందికిపైగా విద్యార్థులకు 100శాతం మార్కులు వస్తే.. ఆయా విద్యార్థుల ఆన్సర్ స్క్రిప్టును రీవెరిఫికేషన్ చేస్తారు. మూల్యాంకనం అనంతరం 27 నుంచి 30 మార్కుల మధ్య స్కోర్ సాధిస్తే మిగతా వారి ఆన్సర్ స్క్రిప్టులను కూడా రీవెరిఫికేషన్ చేస్తారు.
నాలుగు విడతల్లో నిర్వహించనున్న ఈ పరీక్షల కోసం 2,708 సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 11,456 మంది ఎగ్జామినర్లను నియమించారు. మొదటి విడత 3వ తేదీ నుంచి నుంచి 8వరకు, రెండో విడత 9 నుంచి 13 వరకు, మూడో విడత 14 నుంచి 18 వరకు, నాలుగో విడత ప్రాక్టికల్స్ 21 నుంచి 25 వరకు జరుగుతాయి. మిలాద్ నబీ కారణంగా ఈ నెల 5న, వీఆర్వో పరీ క్ష కారణంగా 19న, శివరాత్రి కారణంగా 20న పరీక్ష ఉండదు.