Saturday, 18 February 2012

న్యూజిలాండ్ క్రికెట్టుకు కర్నూలు బిడ్డ అండ !

కర్నూలుకు చెందిన పాల్ వాల్తాటీ ఐపియల్‌లో సంచలనమే సృష్టించాడు. ఇప్పుడు కర్నూలు జిల్లాకే చెందిన తరుణ్ సాయి నేతుల న్యూజిలాండ్ క్రికెట్‌లో దూసుకొస్తున్నాడు. వెట్టోరీకి ప్రత్యామ్నాయం ఈ యువ క్రికెటరేననే మాట వినిపిస్తోంది. నేతుల 1983 మే 8వ తేదీన కర్నూలులో జన్మించాడు. న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్‌లో అతను సంచలనాలు చేస్తు్నాడు. లెగ్ స్పిన్నర్‌గా న్యూజిలాండ్‌కు ఉన్న స్పిన్నర్ల కొరతను తీర్చడానికి సిద్ధపడుతున్నాడు నేతుల. కుడి చేతి వాటం బ్యాట్స్‌మన్‌ అతను. అతనికి 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు కుటుంబం న్యూజిలాండ్‌కు మారింది. అతను న్యూజిలాండ్‌లో ఇప్పుడు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. 2008 - 09లో ఫస్ట్ క్లాస్ సీజన్ క్రికెట్‌లో అతను అడుగు పెట్టాడు. అత్యధిక వికెట్లు తీసుకుని ఆక్లాండ్ స్టేట్ చాంఫియన్‌షిప్‌ను అందించాడు. అక్కడ అతనికి సరైన అవకాశాలు రాకపోవడంతో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్‌కు మారాడు. ఇక్కడ అతను అన్ని క్రికెట్ ఫార్మాట్లలో ప్రధానమైన సభ్యుడైపోయాడు. 2012 జింబాబ్వేపై పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం అతను న్యూజిలాండ్ జట్టులోకి వచ్చాడు. జింబాబ్వేతో మూడు మ్యాచుల వన్డే సిరీస్‌కు తనను ఎంపిక చేయడం పట్ల తరుణ్ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు తాను ఎప్పుడూ పోటీ పడలేదని, టెస్టు మ్యాచులపైనే దృష్టి పెట్టానని, అందుకే ఆశ్చర్యం వేసిందని అతను అన్నాడు. లెగ్ స్పిన్నర్‌గా అనతు ఈ నెల 6వ తేదీన తన కెరీర్‌ను అతను ప్రారంభించాడు. తరుణ్‌కు ముందు భారత సంతతికి చెందిన దీపక్ పాటిల్, జీతన్ పాటిల్ న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించారు. వెట్టోరీ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న ప్రస్తుత స్థితిలో తరుణ్ న్యూజిలాండ్‌కు అంది వచ్చిన అవకాశంగా భావిస్తున్నారు.

కర్నూలులో జేపీ సత్యగ్రహ పాదయాత్ర ప్రారంభం

లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ శనివారం కర్నూలు జిల్లాలో రైతు సత్యగ్రహ పాదయాత్రను చేపట్టారు. ఆయన ఎమ్మిగనూరు నుంచి యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర రాయచూరు వరకూ కొనసాగనుంది. జయప్రకాష్ నారాయణ ఎమ్మిగనూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  అంతకు ముందు నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రార్థనలు చేశారు.  ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ సంకెళ్లతో బస్తాలు మోసి తన నిరనస తెలిపారు.ఎక్కడ పండిన పంటను అక్కడే అమ్ముకునే అవకాశం రైతులకు ఉండాలని ఆయన అన్నారు. పండించిన పంటను అమ్ముకోవడానికి ఆంక్షలు పెట్టడం సరి కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం చేసిన పాపాల వల్ల రెండేళ్లలో ఎరువుల ధఱలు రెండింతలు పెరిగాయని ఆయన విమర్శించారు. గిట్టుబాటు ధరలు సగానికి పడిపోయాయని ఆయన అన్నారు. రైతుల కోసం జైలుకు వెళ్లడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. రైతుల కోసం ఎవరు మద్దతిచ్చినా తీసుకుంటానని ఆయన చెప్పారు. తన యాత్రను తెలుగుదేశంశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి రైతు పోరుబాటతో పోల్చుకోలేనని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎక్కడ పండిన పంటను అక్కడే అమ్ముకునే అవకాశం ఉండాలన్నారు. పండించిన పంటను అమ్ముకోవటానికి ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం చేసిన పాపాల వల్ల రెండేళ్లలో ఎరువుల ధరలు రెండింతలు పెరిగాయన్నారు. గిట్టుబాటు ధరలు సగానికి పడిపోయాయని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు. జేపీ యాత్రకు కాంగ్రెస్ నేత రుద్రగౌడ్ మద్దతు తెలిపారు

శ్రీకాళహస్తిలో మహా శివరాత్రికి ఏర్పాట్లు పూర్తి

మహా శివరాత్రి పర్వదినం సందర్భం గా శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆల యానికి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పా ట్లు చేసినట్లు దేవస్థానం ఈవో విజయకుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ భక్తులందరికీ శీఘ్ర ద ర్శనం అయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు.
ఆలయంలో ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేశామని చెప్పారు. గతంలో రెండుసార్లు శివరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన అనుభవం ఉండడంతో అందరి సహకారంతో పనులను త్వరితగతిన పూర్తి చేశామని తెలిపా రు. స్వర్ణముఖినదిలో భక్తులు స్నానాలు చేసేం దుకు ఏర్పాట్లు చేశామని, మహిళలు బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక గదులను ని ర్మించామన్నారు. మరుగుదొడ్లను రెండుచోట్ల నిర్మించామని, శివరాత్రి రోజున మొబైల్ మ రుగుదొడ్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు. ‘లక్షకు పైగా భక్తులు వచ్చినా ఇబ్బందులు లేకుండా దర్శనం చేయిస్తాం. ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటుచేస్తున్నాం. సాధారణ భక్తులు, స్పెషల్ టికెట్లు కొనుగోలు చేసినవారు, వీఐపీలు ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. ఆలయంలోని క్యూలో ఉండే భక్తులకు మంచినీటిని అందిస్తాం. భక్తులు ఉక్కపోతకు గురికాకుండా అదనంగా ఫ్యాన్లు ఏర్పాటు చేశాం. అలంకరణకు బెంగళూరునుంచి పుష్పాలను తెప్పిస్తున్నాం. లక్షకు పైగా వడలను తయారు చేస్తున్నాం. పులిహోర, పొంగలి, జిలేబీ ప్రసాదాను అదేరోజు తయారు చేయిస్తాం. రథోత్సవం, కల్యాణోత్సవానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. ఆలయ పరిసరాల్లో విద్యుత్ దీపాలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశాం. ఉత్సవాల నిర్వహణకు భారీ బందోబస్తు కల్పిస్తాం. టీటీడీ సహకారంతో విద్యుత్ ఆర్చీలు, గుర్రాలు, ఏనుగులు, తదితరాలను ఉత్సవాలకు తీసుకొచ్చాం’ అని ఈవో విజయకుమార్ వివరించారు.మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం తేజోమయుడైన శివుడు సూర్యప్రభ వాహనంపై కొలువుదీరి పురవీధులలో విహరించారు. జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు రథంపై వెంటరాగా సూర్యప్రభ వాహనంపై స్వామివారు ఉదయం భక్తులకు కన్నులపండువగా సాక్షాత్కరించారు.ఆకాశంలో వెలిగే సూర్యబింబాన్ని ధిక్కరించేవిధంగా ప్రమ«థ గణాధిపతి అలరారారు. రంగురం గుల కొత్తగొడుగులు, ఛత్రచామరాలు మెరయుచుండగా స్వామివారి ఊరేగింపు భక్తజనరంజకంగా సాగింది. ఆది దంపతుల ఊరేగింపులో వేదమంత్రోచ్ఛరణలు మార్మోగగా పరిసరాలు పవిత్రమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు స్వామి, అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు

తిరుపతిలో అంతర్జాతీయస్థాయి స్టేడియం

తిరుపతిలో అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మాణానికి త్వరలో పునాది రాయి వేయడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు పార్లమెంటు సభ్యుడు డాక్టర్ చింతామోహన్ తెలిపారు. శ్రీకాళహస్తి రిపబ్లిక్ క్లబ్‌లో శుక్రవారం సాయంత్రం జాతీయ స్థాయి టెన్నిస్ టోర్నీలో ఫైనల్ పోటీలను మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీనాయుడుతో కలిసి తిలకించారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ మాట్లాడుతూ రేణిగుంటలో అంతర్జాతీయస్థాయి విమానాశ్రయం, మన్నవరంలో భారీ విద్యుత్ ఉపకరణాల ప్రాజెక్టు రాకతో రాబోయే రోజుల్లో చిత్తూరు జిల్లా ప్రపంచంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారుతుందనడంలో సందేహం లేదన్నారు.

రాలయసీమ జిల్లాలకు బడ్జెట్‌లో అంతంతే..!

హంద్రీనీవా ప్రాజెక్టుకు గత ఏడాది రూ. 660 కోట్లు కేటాయించగా అందులో రూ. 550 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టు చిత్తూరు జిల్లా వరకు వెళ్తున్నందున వాటి పనులు వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి కొంత ప్రాధాన్యత ఇచ్చి పోయిన ఏడాది కేటాయించిన నిధుల కంటే రూ.40 కోట్లు అదనంగా కేటాయించారు. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సాగునీరు, తాగునీరు అవసరాలు తీర్చనున్న హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు ఈ ఏడాదైనా పూర్తి అవుతాయని రైతులు ఎదురు చూస్తున్నారు. గత ఏడాది బ డ్జెట్‌లో ఎస్‌ఆర్‌బీసీకి రూ. 70 కోట్లు కేటాయించినప్పటికీ రూ. 148 కోట్లు విలువ చేసే పనులు పూర్తి చేసినట్లు అధికారులు లెక్కలు తేల్చారు. కేసీ కెనాల్ ఆధుకునీకరణకు పోయిన ఏడాది కేటాయించిన నిధుల కంటే అదనంగా ఈ బడ్జెట్‌లో రూ. 15 కోట్లు ఇచ్చారు. గత ఏడాది కేటాయించిన బడ్జెట్‌లో కనీసం సగం నిధులు కూడా ఇవ్వకపోవడంతో పనులు ముందుకు కదలకుండా ఆగిపోయాయి. ఈ సారైనా బడ్జెట్‌లో కేటాయించిన నిధులు విడుదల చేస్తే కొంతవరకు ప్రయోజనం వుంటుంది. ఇదిలా వుండగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి అవసరమైనన్ని నిధులు కేటాయించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి నిరుద్యోగులకు ఏమాత్రం ఉపయోగం లేని రాజీవ్ యువకిరణాలకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించడం పలువురు విమర్శిస్తున్నారు. ప్రజలకు అన్ని విధాలా ఉపయోగ పడే 108, 104లకు ప్రాధాన్యత ఇవ్వలేదు.

అనంతపురం జిల్లా
అనంత సేద్యాన్ని గాడిలో పెట్టడానికి తీసుకోవాల్సిన చర్యలను రేపోమాపో ప్రభుత్వానికి నివేదించనుంది. వాటి అమలుకు నిధులను కేటాయిస్తామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ఇదివరకే ప్రకటించారు. అయితే... బడ్జెట్లో మాత్రం పైసా కూడా కేటాయించలేదు. దీన్నిబట్టి కేంద్ర కమిటీ నియమించడం కంటితుడుపు చర్యేనని విశదమవుతోంది. ఈ ఏడాది వేరుశనగ పంట రైతులను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. వాతావరణ బీమా వస్తుందో, రాదోనన్న అనుమానాలను బడ్జెట్ కేటాయింపులు మరింత బలపరుస్తున్నాయి. బీమా పరిహారానికి బడ్జెట్లో రూ.300 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో జిల్లాకు రూ.25 కోట్లకు మించి దక్కే అవకాశాలు లేవు! జిల్లాలో 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు, 10 లక్షల జనాభాకు తాగునీరు అందించే లక్ష్యంతో సీఎం అయిన వెంటనే వైఎస్ పనులు ప్రారం భించారు. ఆయన హయాంలో ప్రతి బడ్జెట్‌లోనూ ఈ ప్రాజెక్టుకు విశేషంగా నిధులు కేటాయించి, వాటిని ఖర్చు పెడుతూ వచ్చారు. కిరణ్ సీఎం అయ్యాక గత ఏడాది బడ్జెట్‌లో రూ 695 కోట్లు మాత్రమే ఈ ప్రాజెక్టుకు కేటాయించారు. ఇందులో సుమారు రూ 100 కోట్లకు పైగా పాత బకాయిలు చెల్లించేందుకు ఖర్చు పెట్టారు. ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయిస్తానని సీఎం చెబుతూ వచ్చారు. ఈ స్థాయిలో పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఇప్పటి దాకా రూ.4,933 కోట్లు ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ 1800 కోట్లు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ సారి కనీసం రూ వెయ్యి కోట్లు ఇవ్వాలని కోరారు. గత ఏడాది కంటే రూ.3 కోట్లు మాత్రం పెంచి రూ 698 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధుల్లో 80 శాతం అనంతపురం జిల్లాలో జరుగుతున్న పనులకే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈలెక్కన చూస్తే జిల్లాలో హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులకు ఈసారి గ్రహణం పట్టే ప్రమాదం కనిపిస్తోంది.
 
చిత్తూరు జిల్లా
 కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేసేలా అధికార యంత్రాంగంపై ముఖ్యమంత్రి వత్తిడి పెంచి... సొంత జిల్లాలో సాగునీటి పథకాలను త్వరితగతిన పూర్తి చేయించాల్సింది పోయి... నిధుల కేటాయింపులో కోత విధించడం రైతన్నలను నిరాశకు గురిచేసింది. జిల్లాలోని 19 పశ్చిమ మండలాల పరిధిలో 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు, 10 లక్షల జనాభాకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన హంద్రీ- నీవా పథకానికి 2011-12 బడ్జెట్‌లో రూ. 695 కోట్లు కేటాయించగా, ఈ సారి రూ. 700 కోట్లు కేటాయించారు. ఈ పథకం పూర్తి కావడానికి రూ. 1675 కోట్లు అవసరమని ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపగా అందులో 50 శాతం కంటే తక్కువగా... 700 కోట్లు మాత్రమే కేటాయించారు. దీంతో ఈ పథకం 2013లో కూడా పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.ఇక తూర్పు మండలాల్లో మెట్టభూములను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన సోమశిల- స్వరముఖి కాలువకు కేటాయింపులే కనిపించలేదు. సోమశిలకు ప్రాజెక్టుకు కేటాయించిన నిధులను ఈ పనులకు వెచ్చిందే అవకాశం లేనందున ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు అటకెక్కినట్టే భావించాల్సి వస్తోంది. మరోవైపు జిల్లాలో చెరువులు, మధ్యతరహా ప్రాజెక్టుల మరమ్మతులు, ఆధునికీకరణ పనులకు వందలకోట్లు ఖర్చు చేస్తామంటూ ముఖ్యమంత్రి స్వయంగా చేసిన ప్రకటనపైనా బడ్జెట్ కేటాయింపులతో నీలినీడలు కమ్ముకున్నాయి. మీడియం చెరువులు, ప్రాజెక్టుల పునరుద్ధరణకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కేటాయింపు 130 కోట్లు మాత్రమే కావడంతో... అందులో జిల్లాకు దక్కేది ఎంతో వేచిచూడాలి.రీకాళహస్తి నియోజక వర్గంలోని 36,847 హెక్టార్ల భూములకు సాగునీరందించే లక్ష్యంతో ప్రారంభించిన సోమశిల- స్వర్ణముఖి కెనాల్‌కు ఈ బడ్జెట్‌లో కూడా నామ మాత్రపు నిధులే దక్కాయి. సోమశిల ప్రాజెక్టుతో పాటు ఈ కెనాల్‌కు బడ్జెట్‌లో రూ.230 కోట్లు కేటాయించారు. 100 కిలోమీటర్ల 425 మీటర్ల దూరం తవ్వే కెనాల్‌కు ఇందులో కనీసం 50 కోట్లు కూడా దక్కే అవకాశాలు లేవు. గత బడ్జెట్‌లో ఈ కెనాల్ నిర్మాణానికి 90 కోట్లు కేటాయించగా,44 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.గాలేరు- నగరి పనులు ఇప్పడు నత్తకు నడక నేర్పుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు గత ఏడాది బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయిస్తే పెండింగ్ బిల్లులు చెల్లించి పనులు వేగంగా చేయిస్తామని అధికారులు ప్రభుత్వానికి విన్నవించారు. కేవలం 450 కోట్లు కేటాయించి, ఈసారి సర్దుకు పోవాలంటూ ప్రభుత్వం సముదాయించింది. ఈ సారైనా వెయ్యి కోట్లు ఇవ్వాలని అధికారులు ప్రభుత్వాన్ని అడిగారు. అయితే రూ 420 కోట్లు మాత్రం కేటాయించింది. ఈ నిధుల్లో 80 శాతం వైఎస్సార్ జిల్లాలో జరుగుతున్న పనులకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కావాలంటే రూ 1300 కోట్లు అవసరం అవుతాయి. జిల్లాలో 1.03 లక్షల ఎకరాలకు తాగునీరు, అనేక గ్రామాలకు తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు మళ్లీ గాలిలో దీపంగా మారే ప్రమాదం కనిపిస్తోంది.బడ్జెట్ కేటాయింపుల్లో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది.   

 కడప జిల్లా

 గత రెండేళ్ళతో పోలిస్తే... జిల్లాలో ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులు గత రెండేళ్ళతో పోలిస్తే బాగా తగ్గాయి. ముగ్గురు మంత్రులు జిల్లాలో ఉన్నా జిల్లాకు సముచితమైన బడ్జెట్ కేటాయింపులు చేయించుకోలేక పోయారు. బడ్జెట్ కేటాయింపులు ఏటేటా ఇలా కుచించుకు పోతూ వస్తుంటే ప్రాజెక్టుల పూర్తి ఎప్పటికి సాధ్యమవుతుందో చెప్పడం కష్టమే.ఆర్థిక శాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాలోని ప్రాజెక్టులకు, మిగతా రంగాలకు కోతలు పెట్టారు. దీంతో జిల్లాలోని ప్రాజెక్టులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు మృగ్యమైపోయాయి. నిధులు సమకూర్చి పనులు నిర్వహిస్తే కొద్ది నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టులను సైతం ప్రభుత్వం గాలికొదిలేసింది. మూడేళ్లుగా జిల్లాలోని ప్రాజెక్టులకు కేటాయింపుల్లో నిధుల కోత పడుతునే ఉంది. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు, కేబి నెట్ ర్యాంకు స్థాయి నేత ఉన్నా బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత లేకపోవడం గమనార్హం. జిల్లాకు ప్రాణప్రదమైన జీఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టుకు కూడా కేటాయింపుల్లో ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది.బడ్జెట్‌లో కేటాయింపులు ఎలా ఉన్నా విడుదల మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. గత ఏడాది జీఎన్‌ఎస్‌ఎస్ మొదటి దశ పనులకు 540 కోట్లు కేటాయించినప్పటికీ, కేవలం 225.32 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మైలవరానికి 9.90 కోట్లు, తెలుగుగంగకు 118.19 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. గండికోట రిజర్వాయర్‌కు 150 కోట్లు కేటాయించినప్పటికీ 149.95 కోట్లు, గండికోట లిఫ్ట్‌లకు 50 కోట్లు కేటాయిస్తే 11.97 కోట్లు మాత్రమే నిధులను విడుదల చేశారు. ఈ ఏడాది కూడా వెయ్యి కోట్ల కు పైగా బడ్జెట్‌లో నిధులు కేటాయించినప్పటికీ 50 శా తం నిధులు కూడా విడుదలయ్యే అవకాశాలు లేవు.సాగు అవసరాలతో పాటు పరిశ్రమలకు నీటిని అందిస్తున్న మైలవరం రిజర్వాయర్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపింది. గత బడ్జెట్‌లో రూ. 20 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం అందులో కోత విధించి రూ.15 కోట్లే కేటాయించింద.
కర్నూలు జిల్లా
గత ఏడాది కేటాయించిన బడ్జెట్‌లో కోతపెట్టి.. ఈ ఏడాది కేటాయింపులోనూ కత్తెర వేసింది. జిల్లాలో హంద్రీనీవా ప్రాజెక్టుకు మాత్రమే నిధుల కేటాయింపులోకొంత ప్రాధాన్యత కల్పించారు. 2012-13 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి శుక్రవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు ఆశించిన మేరకు నిధులు కేటాయించకపోవడంతో రైతాంగానికి భరోసా ఇవ్వలేకపోయారనే విషయం మరో మారు తేటతెల్లమైంది. గతఏడాది కంటే ఈ సారి బడ్జెట్‌లో రూ. 65.19 కోట్లు కుదించారు. తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణకు రూ.82 కోట్లు, గాలేరు నగరి ప్రాజెక్టుకు రూ.419.86 కోట్లు, తెలుగు గంగకు రూ. 160 కోట్లు, గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు రూ.80 కోట్లు, హంద్రీనీవా ప్రాజెక్టుకు రూ. 700 కోట్లు, తుంగభద్ర దిగువ కాల్వకు రూ. 18 కోట్లు, ఎస్‌ఆర్‌బీసీకి రూ.125 కోట్లు, కేసీ కెనాల్ ఆధునీకరణకు రూ.75 కోట్లు, గాజుల దిన్నె ప్రాజెక్టుకు రూ.45 లక్షలు కేటాయించారు ఇదిలా వుండగా గత ఏడాది బడ్జెట్‌లో కేటాయించిన నిధులు సరిగా మంజూరు చేయకపోవడంతో అనుకున్న మేరకు పనులు వేగవంతం కాలేదు. దీంతో నిధుల కొరత వల్ల ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇందులో భాగంగానే తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణ కోసం రూ.95.5 కోట్లు కేటాయించగా అందులో రూ.63.9 కోట్లు, గాలేరు నగరికి రూ.540 కోట్లకు గాను రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దీంతో పాటు తెలుగు గంగకు ప్రాజెక్టుకు రూ.180 కోట్లు కేటాయించినా మరో రూ.20 కోట్ల పనులు అదనంగా చేపట్టారు. గురురాఘవేంద్రకు గత ఏడాది రూ.100 కోట్లు కేటాయించగా వీటిలో రూ.80 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అందుకోసమే ప్రస్తుత బడ్జెట్‌లో గత ఏడాదితో పోల్చితే రూ.20 కోట్లు తక్కువ ఇచ్చారు.