రక్తనిధి ఉద్యోగులు విధులు బహిష్కరించడంతో రోగులకు రక్తంకోసం పడరాని పాట్లు పడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం స్థానిక రక్తనిధిలోని ఉద్యోగులు మూడు రోజులుగా ఆందోళన బాట పట్టారు. జిల్లాలో ఉన్న ఒకే ఒక్క రక్తనిధిని ఆదోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఈ బ్లడ్ బ్యాంకు పరిధిలో 17 మండలాలు, 298 గ్రామాలున్నాయి. బ్లడ్ బ్యాంకు రోజూ 50 మందికి పైగానే రక్తం అందిస్తూ ప్రాణాలను కాపాడుతోంది. మూడు రోజులుగా మూత పడటంతో రోగులు రక్తం కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలు స్వచ్ఛంద సంస్థల్ని రక్తం కోసం ఆశ్రయిస్తున్నారు. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్‌హోంలలో చికిత్స పొందుతున్న దీర్ఘకాలిక రోగులు, రక్తహీనత, గర్భిణిలు, బాలింతలు, చిన్న పిల్లలు, ప్రాణాంతకర జబ్బులతో బాధ పడుతున్నారు. ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి ఈ సమస్య పట్టకపోవడం బాధకరమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, రోగులకు సరైన సమయానికి రక్తం అందేలా చర్యలు చేపట్టాలని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మహిళమండళ్లు, వివిధ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు
సినిమాలలో నటించగలను గాని ప్రజా జీవితంలో నటించలేనని ఎమ్మెల్యే జయసుధ శనివారంనాడు స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ జగన్‌కు మద్దతుగా నిలిచి శుక్రవారంనాడు బహిరంగంగానే కిరణ్ సర్కార్‌కు జయసుధ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతి రోజూ ప్రభుత్వాన్ని తిడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేనని ఆమె వ్యాఖ్యానించారు. అందుకే తాను సినిమాలలో నటించగలను కాని బయట నటించలేనని ఆమె అన్నారు. ఈ రెండేళ్లూ రాజకీయంలో ఇమడలేక మానసికంగా చాలా ఇబ్బంది పడ్డానని, ప్రజలకు సంబంధించినంతవరకూ ఎన్నో పనులు జరగవలసి ఉందని, తన నియోజక ప్రజల శ్రేయస్సుకోసమే కిరణ్ సర్కార్‌కు మద్దతు పలికినట్టు ఆమె వెల్లడించారు