తెలంగాణ సమస్యపై కేంద్ర ప్రభుత్వం కౌంట్ డౌన్‌ను ప్రారంభించిందని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖా మంత్రి, రాయలసీమ హక్కుల ఐక్య వేదిక కన్వీనర్ టీజీ వెంకటేష్ అన్నారు. ఆయన గురువారం కర్నూలులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో ఇటీవల వరకు కొనసాగిన సకల జనుల సమ్మెతో ఆ ప్రాంత నాయకులు తమ ఉనికిని చాటుకున్నారని వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్ర సమస్య కేవలం ఒక్క తెలంగాణకు సంబంధించినది కాదని దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ సమస్య ఉందని అన్నారు. తెలంగాణ అంశంపై కేంద్రం తన నిర్ణయాన్ని తీసుకునేందుకు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించాలని ఆయన సూచించారు. ఉద్యమాలు చేయడం మానేసి ఇక తమ ప్రాంత అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రాంత నేతలకు ఆయన హితవు పలికారు. సకల జనుల సమ్మె కారణంగా ప్రధానంగా ఏర్పడిన విద్యుత్ సమస్యతో రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు ఎంతో నష్టపోయాయన్న విషయాన్ని నాయకులు గుర్తుంచుకోవాలని కోరారు. వర్షాలులేక, విద్యుత్ కోతతో నీరందక లక్షల ఎకరాల్లో పంట నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని తీసుకునే వరకు తెలంగాణలో శాంతియుత పరిస్థితులను కల్పించి అభివృద్ధికి నాంది పలకాలని కోరారు రాయలసీమ హక్కుల ఐక్య వేదిక తరపున సీమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ నెల 22న కర్నూలులో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు టీజీ వెంకటేష్ తెలిపారు. ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించి సీమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు అన్ని పార్టీల వారు మద్దతు తెలిపి ఆయనకు అండగా నిలవాల్సిన సమయం వచ్చిందన్నారు. సీమలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇచ్చేందుకు సహకరించాలన్నారు. సీమను దేశంలోనే ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దుకోవాలన్న లక్ష్యంతో హక్కుల వేదిక పనిచేస్తోందన్నారు. తాము ఎప్పటికీ సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉంటామని, ఐక్యతతోనే దేన్నైనా సాధిస్తామని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు తొలిగిపోయేలా ముఖ్యమంత్రి కృషి చేశారని ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రాయలసీమకు ఎంతో కొంత మంచే జరుగుతుందని ఆయన తెలిపారు. గతంలో రాయలసీమను ఫాక్షన్ భూతం వెంటాడిందని ఎపుడైతే మంచి పంటలు పండి నాయకులు, వారి అనుచరులకు డబ్బులు రావడం ప్రారంభించాయో ఆ రోజు నుంచి ఫ్యాక్షన్ తగ్గిందని ఆయన గుర్తుచేశారు. ఇదే విధంగా అభివృద్ధి జరిగితే సాధారణ నేరాలు కూడా జరుగవని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ నాయకులు కూడా ఇదే విధంగా అభివృద్ధి కోసం పోరాడుతూ ప్రత్యేక ప్యాకేజీలను పొంది తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని టీజీ వెంకటేష్ సూచించారు
Friday, 21 October 2011
తెలంగాణ సమస్యపై కేంద్ర ప్రభుత్వం కౌంట్ డౌన్‌ను ప్రారంభించింది

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment