Wednesday, 12 October 2011

చరణ్ కు రూ. 120 కోట్ల విలువ చేసే పెళ్లి కానుక దక్కనుందట?

                                                                                                                                  తొక్కలో తోటకూరగాళ్లే ఈ మధ్య వరకట్నం కింద కోట్ల కోట్లు గుంజుతున్నారు అత్తింటి వారి నుంచి. అలాంటి సినిమా హీరో, పైగా మెగాస్టార్ తనయుడు, అందాడు, సినిమా సినిమాకు కనీసం ఆరు కోట్లు సంపాదించే సత్తా ఉన్న రామ్ చరణ్ కు అత్తింటి వారి కానుక ఏరేంజ్ లో ఉంటుందో ఊహించండి. సామాన్య జనాల అది ఊహకు అందడం కష్టమే. పది, పాతిక, ఓ యాభై కోట్లు, మహా అయితే వంద కోట్లు అనుకుంటారంతా. కానీ మన అంచనాలను మించి పోయాడు రామ్ చరణ్. మెగాస్టార్ కుటుంబం సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం చరణ్ కు రూ. 120 కోట్ల విలువ చేసే పెళ్లి కానుక దక్కనుందట. ఇదంతా క్యాషు రూపంలో ఇస్తారు అనుకుంటే పొరపాటే. ఆ డబ్బుకు సమానమైన విలువ చేసే విమానాన్ని చెర్రీకి కొనిస్తున్నారట అత్తింటివారు

రచ్చబండ కార్యక్రమాన్ని వచ్చేనెల 2వ తేదీకి వాయిదా వేశారు

                                                                                              నెల 15 నుంచి జరగాల్సిన రెండో విడత రచ్చబండ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. నవంబరు 2 నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రచ్చబండపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రుల బృందం అందజేసిన నివేదిక మేరకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
                                                            
                                                                
   
పేద, బలహీన వర్గాలపై వరాల జల్లులు కురిపించేందుకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. రెండో విడత రచ్చబండ కార్యక్రమంలో దాదాపు 38 లక్షల మందికి లబ్ధి చేకూర్చే దిశలో భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. వాస్తవానికి ఈ నెల 15 నుంచి జరగాల్సిన రచ్చబండ కార్యక్రమాన్ని సకల జనుల సమ్మె నేపథ్యంలో వాయిదా వేశారు. ఓ వైపు ఉద్యమంతో పాలన కుంటుపడుతున్న నేపథ్యంలో రచ్చబండకు వెళ్లడం వల్ల మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని, ఎప్పుడైనా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చే అవకాశాలూ ఉండడంతో సీఎం రచ్చబండను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఈ నెల 15 నుంచి రైల్ రోకోకు పొలిటికల్ జేఏసీ సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో రచ్చబండ పేరుతో టూర్ వెళ్లకుండా, ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించడం, అవసరమైన ఆదేశాలివ్వడం ఉత్తమమని సీఎం నిర్ణయించినట్లు ఆయన ఆంతరంగికులు చెబుతున్నారు. దీంతో రచ్చబండ కార్యక్రమాన్ని వచ్చేనెల 2వ తేదీకి వాయిదా వేశారు

ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత

కడప: ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఓట్ల కోసం ప్రజల వద్దకు రావాలని సవాల్ విసిరారు. కరెంటు పోరులో భాగంగా మంగళవారం స్థానిక కలెక్టరేట్ వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులు 45 రోజుల

కిందటే సమ్మె చేస్తున్నట్లు ప్రభుత్వానికి నోటీసులిచ్చారు. 45 రోజుల పాటు ప్ర భుత్వానికి కార్మికులు వెసులుబాటు కలిగించినా ప్రభుత్వం బొగ్గు నిల్వలు పెంచుకోలేదు. ఇతర రాష్ట్రాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకోలేదు. దక్షిణాది రాష్ట్రాల్లో 1100 మెగావాట్లు వి ద్యుత్ ఉత్పత్తి ఉంటే మన రాష్ట్రానికి కే వలం 175 మెగావాట్ల విద్యుత్ మా త్రమే సరఫరా అవుతుంది. మిగతా విద్యుత్‌ను తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు తీసుకుంటున్నాయి. సమ్మె వల్ల నష్టపోయేది రైతులు, ప్రజలే కదా మాకేమి అన్న భావనలో ప్రభుత్వం ఉందని జగన్ విమర్శించారు

గ్రూప్ - 2 పరీక్షలు యథాతథంగా



                                                             
 గ్రూప్ - 2 పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఏపీపీఎస్సీ బుధవారం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎపీపీఎస్సీ తెలిపింది. అధికారులు పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

4.5 లక్షల మంది అభ్యర్థులు గ్రూప్ -2 పరీక్షలకు హాజరుకానున్నారు. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ జేఏసీ నేతల అభ్యర్ధనను ప్రభుత్వం తోసిపుచ్చింది. భారీ బందోబస్సు మధ్య ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు బోర్డు పేర్కొంది. అడ్డుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది

సామాజిక కార్యకర్త అన్నాహాజారే బృందం పై దాడి

సామాజిక కార్యకర్త అన్నాహాజారే బృందం సభ్యుడు, జన్‌లోక్‌పాల్ ముసాయిదా కమిటీ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది అయిన ప్రశాంత్ భూషణ్‌పై ఇద్దరు యువకులు బుధవారం దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు

కత్రినా కైఫ్ ఏకంగా 20 కోట్లు.

                                                                                                                               ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా తన హవా కొనసాగిస్తోంది కత్రినా కైఫ్. ఇటీవల తన వద్దకు వచ్చిన ఓ నిర్మాతకు తన రెమ్యూనరేషన్ భారీగా చెప్పి అతన్ని ఖంగు తినిపించిందట ఈ బ్యూటీ. మరి కత్రినా ఆ సినిమాకు అడిగిన రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 20 కోట్లు. బాలీవుడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం నిర్మాత వాసు భగ్నాని తను తీయబోయే తర్వాతి సినిమాలో తన కొడుకు జాకీ పక్కన హీరోయిన్‌గా నటించాలని ఆమెను సంప్రదించాడు. జాకీ పెద్దగా పేరు లేని నటుడు. ఇందులో కత్రినాను హీరోయిన్‌గా నటింప చేస్తే సినిమా బాగా ఆడుతుందని, తద్వారా తన కొడుకు సినిమా భవిష్యత్ మెరుగు పడుతుందని ఆ నిర్మాత ఆశ.

నిర్మాత ప్లాన్ ముందే గ్రహించిన కత్రినా పూర్తిగా తనకున్న ఇమేజ్ తోనే సినిమా నడుస్తుంది కాబట్టి తాను అడిగిన మొత్తం ఇవ్వాల్సిందే, అప్పుడే సినిమా చేయడానికి ఒప్పుకుంటానంటూ తెగేసి చెప్పిందట. ఇంకేముంది సినిమా మొత్తం తీయడానికి అయ్యే ఖర్చులో దాదాపు సంగం కత్రినాడిమాండ్ చేయడంతో సదరు నిర్మాత అంత మొత్తం ఇచ్చుకోవడానికి వెనకడుగు వేసి అక్కడి నుంచి పరారయ్యాడని బాలీవుడ్ గుసగుస.