జామీతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఓ గొప్ప అవకాశంగా భావిస్తున్నానని
యువరాజ్ సింగ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. రిటైర్మెంట్ సందర్భంగా యువీ
ట్విట్టర్‌లో 'ది వాల్' రాహుల్ ద్రవిడ్‌కు శుభాకాంక్షలు తెలియజేశాడు.
టీమిండియా జట్టులో రాహుల్ ద్రవిడ్ నైతిక విలువలు గల గొప్ప వ్యక్తి అని
సహచర ఆటగాడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. జామీ కఠోర శ్రమ ఎప్పుడూ విఫలం
కాలేదని, యువ క్రికెటర్లకు ఆదర్శప్రాయుడని కొనియాడాడు. ద్రావిడ్
కెప్టెన్‌గా ఉన్నపుడే యువీ టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.
యువీ ద్రవిడ్‌ని ముద్దుగా జామీ అని పిలవడం మనకు తెలిసిన విషయమే.ఇది
ఇలా ఉంటే ఆల్ టైమ్ బెస్ట్ టెస్టు క్రికెటర్ల జాబితాలో భారత బ్యాటింగ్
దిగ్గజం రాహుల్ ద్రవిడ్ 30వ స్థానంలో నిలిచాడు.అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన దిగ్గజ
బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రావిడ్‌పై ఆసీస్ మీడియా ప్రశంసల వర్షం కురిపించింది.
మిస్టర్ డిపెండబుల్‌గా పేరుగాంచిన ద్రావిడ్ ఒక క్రికెటర్ మాత్రమే కాదు..
హూందాగా వ్యవహరించే గొప్ప వ్యక్తి, ఆట గురించి నిరంతరం ఆలోచించే మేధావి
అంటూ ఆస్ట్రేలియా పత్రిక మార్నింగ్ హెరాల్డ్ ద్రావిడ్‌ను
ఆకాశానికెత్తేసింది.Sunday, 11 March 2012
ట్విట్టర్ ద్వారా ద్రవిడ్ శుభాకాంక్షలు తెలిపిన....యువరాజ్ సింగ్
జామీతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఓ గొప్ప అవకాశంగా భావిస్తున్నానని
యువరాజ్ సింగ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. రిటైర్మెంట్ సందర్భంగా యువీ
ట్విట్టర్‌లో 'ది వాల్' రాహుల్ ద్రవిడ్‌కు శుభాకాంక్షలు తెలియజేశాడు.
టీమిండియా జట్టులో రాహుల్ ద్రవిడ్ నైతిక విలువలు గల గొప్ప వ్యక్తి అని
సహచర ఆటగాడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. జామీ కఠోర శ్రమ ఎప్పుడూ విఫలం
కాలేదని, యువ క్రికెటర్లకు ఆదర్శప్రాయుడని కొనియాడాడు. ద్రావిడ్
కెప్టెన్‌గా ఉన్నపుడే యువీ టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.
యువీ ద్రవిడ్‌ని ముద్దుగా జామీ అని పిలవడం మనకు తెలిసిన విషయమే.ఇది
ఇలా ఉంటే ఆల్ టైమ్ బెస్ట్ టెస్టు క్రికెటర్ల జాబితాలో భారత బ్యాటింగ్
దిగ్గజం రాహుల్ ద్రవిడ్ 30వ స్థానంలో నిలిచాడు.అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన దిగ్గజ
బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రావిడ్‌పై ఆసీస్ మీడియా ప్రశంసల వర్షం కురిపించింది.
మిస్టర్ డిపెండబుల్‌గా పేరుగాంచిన ద్రావిడ్ ఒక క్రికెటర్ మాత్రమే కాదు..
హూందాగా వ్యవహరించే గొప్ప వ్యక్తి, ఆట గురించి నిరంతరం ఆలోచించే మేధావి
అంటూ ఆస్ట్రేలియా పత్రిక మార్నింగ్ హెరాల్డ్ ద్రావిడ్‌ను
ఆకాశానికెత్తేసింది.‘వీఆర్‌వో, వీఆర్‌ఏ’ ఫలితాలు రేపు విడుదల
వీఆర్‌వో, వీఆర్‌ఏ రాత పరీక్షా ఫలితాలు రేపు సాయంత్రం 4 గంటలకు
విడుదలకానున్నాయి. రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి ఫలితాలు విడుదల
చేయనున్నారు. ఫలితాలు విడుదల తర్వాత జిల్లాల్లో రిజర్వేషన్ ప్రాతిపదికన
ఎంపిక జాబితాలను కలెక్టర్లు ప్రకటిస్తారు.
తిరుపతిలో సీసీ కెమెరాల నిఘా
గీత దాటితే జరిమానా వాహనదారులు ఇక నిబంధనలను అతిక్రమిస్తే పోలీసులకు దొరికిపోవడం ఖాయం.
తిరుపతి పుణ్యక్షేత్రంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు అర్బన్
పోలీసులు సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ప్రధానమైన ట్రాఫిక్
కూడళ్లలో అత్యాధునిక సీసీ కెమెరాలను అమర్చి వాహనదారుల దూకుడుకు కళ్లెం
వేయనున్నారు. ఈ మేరకు అర్బన్ పోలీసు జిల్లా కార్యాలయంలో ఎస్పీ
ప్రభాకర్‌రావు అధ్యక్షతన తిరుపతి మున్సిపల్ కమిషనర్ ప్రసా ద్, ఆర్టీసీ
ఆర్‌ఎం నాగశివుడు, టీటీడీ సూపరింటెం డెంట్ ఇంజనీర్ సుధాకర్‌తోపాటు వివిధ
విభాగాల అధికారులతో సమీక్షించారు. సమావేశం అనంతరం అర్బన్ ఎస్పీ మీడియాతో మాట్లాడారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను
శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఫర్చూన్
టెక్నాలజీ సహకారంతో నగరంలో 120 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు
పేర్కొన్నారు. 500 మీటర్ల దూరంలోని వాహనంలో దాగి వున్న మనిషిని కూడా జూమ్
చేసి గుర్తించడం ఈ కెమెరా ప్రత్యేకతన్నారు. సమస్యాత్మకంగా ఉన్న 42 ట్రాఫిక్
సర్కిళ్లను ఇప్పటికే గుర్తించినట్లు వివరించారు. ఈ ప్రాంతంలో అత్యాధునిక
స్పీడ్ డూం వైర్‌లెస్ సీసీ కెమెరాలను అమర్చనున్నట్టు తెలిపారు. కెమెరాల్లో
రికార్డయిన సమాచారాన్ని కంట్రోల్ రూంకి, అక్కడి నుంచి అధికారుల వద్ద ఉన్న
సెల్‌ఫోన్‌కు సమాచారం అందుతుందన్నారు. రాయలసీమకు ఈ బడ్జెట్‌లో రైల్వే అభివృద్ధి సాధిస్తాం
రైల్వే పరంగా మరింత అభివృద్ధి సాధించడానికి ప్రయత్నం
చేయడంతో పాటు కరువు
జిల్లా అయిన అనంతపురానికి రైల్వే పరిశ్రమను మంజూరు చేయాలని ప్రధానమంత్రి
మన్మోహన్‌సింగ్‌ను అభ్యర్థించి నట్లు అనంతపురం ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి
వెల్లడించారు. శనివారం సాయంత్రం గుంతకల్లు రైల్వే జంక్షన్‌లోని
ప్లాట్‌ఫామ్-1, 2లో ఏర్పాటు చేసిన గుంతకల్లు-తిరుపతి ప్యాసింజర్ రైలు
ప్రారంభోత్సవ సభలో ఎంపీ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఉపాధి అవకాశాలు లేక
కరువు ప్రాంత యువత కష్టనష్టాల పాలవుతున్నారని, ఈ విషయాలను దృష్టిలో
ఉంచుకుని గుంతకల్లు, గుత్తి రైల్వే జంక్షన్ల మధ్య రైల్వే పరిశ్రమ ఏర్పాటు
చేయాలని రైల్వే బోర్డుకు, ప్రధాన మంత్రికి విన్నవించామని
చెప్పారు.గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని వచ్చే అనంతపురం, కడప,
కర్నూలు, చిత్తూరు జిల్లాల ఎంపీలతో కలిసి రైల్వే రంగం లో మరింత అభివృద్ధి
సాధించడానికి రానున్న రోజుల్లో కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
హైదరాబాదు-డోన్‌ల మధ్య నడిచే తుంగభద్ర రైలు ను గుత్తి లేదా గుంతకల్లు వరకు
పొడిగించాలని కోరుతున్నామన్నారు. అలాగే పగటి పూట పుట్టపర్తి, దర్మవరంల
నుంచి అనంతపురం, గుంతకల్లు మీదుగా హైదరాబాదుకు ఒక రైలును నడపాలని,
బెంగళూరు-షిరిడీ మధ్య ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించాలని,
చెన్నై-హైదరాబాదు నడుమ కొత్త రైలును నడపాలని, గుంతకల్లు మీదుగా హుబ్లీ
ప్రాంతానికి మరిన్ని రైళ్లను ప్రారంభించాలని ప్రతిపాదనలు పంపామన్నా రు.
గుంతకల్లు స్టేషన్‌ను ఆధునికీకరించేందుకు రూ.6 కోట్లు, గుంతకల్లులో బైపాస్
లైన్ నిర్మా ణం కోసం రూ.19 కోట్లు, పెన్నా బ్రిడ్జి నిర్మాణానికి నిధులు
మంజూరు చేయాలని రైల్వే అధికారులను కోరుతున్నట్లు ఆయన చెప్పారు.
గుత్తి-బెంగళూరు రైల్వే మార్గం విద్యుదీకరణ సర్వే కు రైల్వే బోర్డు గత
ఏడాది అనుమతించిందని, ఈ పర్యాయం నిధులు మంజూరు చేయాలని బోర్డుపై ఒత్తిడి
తేనున్నామని అన్నారు. కేంద్రం లో యూడీఎఫ్, ఎన్‌డీఏ ప్రభుత్వాలు ఉన్న సమయంలో
రైల్వేలో అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యా యం
జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నష్టాన్ని పూడ్చుకునే దిశగా ప్రస్తుతం
గట్టి ప్రయత్నాలే చేస్తున్నామని అన్నారు. యూడీఎఫ్, ఎన్‌డీఏ ప్రభుత్వాల
హయాంలో గుంతకల్లు డివిజ న్‌ను కుదించడానికి ప్రయత్నాలు జరిగాయని, స్పష్టంగా
చెప్పాలంటే నష్టం కూడా జరిగిందని అప్పటి ప్రభుత్వ పెద్దల తీరును ఎంపీ
విమర్శించారు. అనంతరం గుంతకల్లు ఎమ్మె ల్యే మధుసూదన్‌గుప్తా మాట్లాడుతూ మన
ఆర్థి క ఎదుగుదలకు భారతదేశాన్ని ఒక్క తాటిపై తీసుకురావడానికి, సైన్యానికి
సేవలు అందించే విషయంలో రైల్వే ఎనలేని సేవలు చేస్తోందన్నారు. అతి తక్కువ
ఖర్చుతో ప్రయాణించడానికి రైల్వే అతి సులువైన రవాణా వ్యవస్థగా కొనియాడారు.
గుత్తికి సమీపంలోనే ఇమామ్‌పురంలో రైళ్లను ఆపాలని, గుత్తి స్టేషన్‌ను మరింత
అభివృద్ధి పరచాలని రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు.
కెప్టెన్సీ కావాలని నేనెప్పుడూ కోరుకోలేదు....వీరేంద్ర సెహ్వాగ్
కెప్టెన్సీ కోసమే తాను జట్టులో విభేదాలు సృష్టిస్తున్నానని భారత మాజీ కోచ్
గ్రెగ్ చాపెల్ తనపై చేసిన వ్యాఖ్యలను డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్
తోసిపుచ్చాడు. సారథి కావాలనే కోరిక తనకు లేదని, ఈ విషయాన్ని చాలాసార్లు
చెప్పానని స్పష్టం చేశాడు. నాలుగేళ్ల కిందట కుంబ్లే నాయకత్వ బాధ్యతల నుంచి
తప్పుకున్న తర్వాత కెప్టెన్ కావాలని వీరూ ప్రయత్నించాడని చాపెల్
వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ‘జట్టుకు నాయకుడిని కావాలని నేనెప్పుడూ
కోరుకోలేదు. టీమ్‌లో సీనియర్ ఆటగాడిని. వైస్ కెప్టెన్‌గా ఉన్నా లేకపోయినా
పరుగులు చేయడమే నా లక్ష్యం. సలహాలు ఇవ్వాలనుకుంటే కెప్టెన్‌గా ఎవరున్నా సరే
నేరుగా వెళ్లి చెప్పేస్తా’ అని వీరూ వ్యాఖ్యానించాడు.
Saturday, 10 March 2012
జగన్‌ను అరెస్టు చేస్తే రణరంగమే!....వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గం
వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ అరెస్టు
చేయకుండా అడ్డుకునేందుకు ఆ పార్టీ శ్రేణు లు వ్యూహ రచన చేస్తున్నాయి. వివిధ
రూపాల్లో ఆందోళనలు చేపట్టాలని యోచిస్తున్నాయి. జగన్‌ను అరెస్టు చే స్తే
ఆందోళన కార్యక్రమాలను తీవ్రత రం చేసి రణరంగం సృష్టించాలనే ల క్ష్యంతో ఆ
పార్టీ శ్రేణులున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
సందర్భంగా ఈనెల12వతేదీ నుంచి ఆందోళనలకు శ్రీకారం చుట్టాలని పార్టీ
శ్రేణులకు ముఖ్యనేతలు పి లుపునిచ్చారు. దీంతో జగన్ అరెస్టుకు రంగం
సిద్ధమైందనేది స్పష్టమవుతోం ది. అనంతపురం నగరంలోని వీకే మెమోరియల్ హాల్‌లో
నిర్వహించిన అత్యవసర సమావేశంలో నే తలంతా ఆ మేరకు సమష్టి నిర్ణయం
తీసుకున్నారు.ఆ
పార్టీ జిల్లా కన్వీనర్ పైలా నరసింహయ్య అధ్యక్షతన జరి గిన ఈ సమావేశానికి
ముఖ్యనేతలతోపాటు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ,మండల కన్వీనర్లు, అనుబంధ సంఘాల
జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. ముందుగా వైఎస్సార్ చిత్రపటానికి పూల
మాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు జగన్‌కు అండగా
ఉందాం. ప్రా ణత్యాగానికైనా సిద్ధపడదామని ప్రతిజ్ఞ చేశారు. వైఎస్ జగన్
మోహన్‌రెడ్డి ని అరెస్టు చేయకుండా అడ్డుకోవడం. అరెస్టు చేస్తే ఏ విధంగా
ఎదుర్కొవాలన్నదే సమావేశం ప్రధాన అజెండాగా సాగింది. అత్యవసర సమావేశంలో
మాట్లాడిన నాయకులంతా ఇదే అం శంపైనే తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అధికార,
ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై తమ అధినేతను కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు
గురిచేస్తున్నారనేది ఆపార్టీ శ్రేణులు బలంగా నమ్ముతున్న నేపథ్యంలో అధికార,
ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతల ఇళ్లను ముట్టడించాలని సమావేశంలో
తీర్మానించారు. ప్రజాబలాన్ని కూడగట్టి జగన్ అరెస్టును అడ్డుకోవాలనే యోచనలో
భాగంగా ఈనెల12న గ్రామా ల్లో పార్టీ జెండాలు ఎగురవేసి, ఆ తర్వాత మండల
కేంద్రాలకు చేరుకొని ప్రభుత్వ కార్యాలయాలను బంద్ చేయించి పెద్ద ఎత్తున
నిరసనలు, రాస్తారోకోలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
చిరంజీవికి రాజ్యసభ సీటు ఎఐసిసి చూసుకుంటుంది...డీఎల్ రవీంద్రారెడ్డి
చిరంజీవికి
రాజ్యసభ సీటు ఇచ్చే విషయం అధిష్ఠానం నిర్ణయం మేరకే ఉంటుందని రాష్ట్ర
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా
ఖాజీపేటలోని ఆయన నివాసగృహంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. రాజ్యసభ
సీట్లు ముఖ్యమంత్రి కిరణ్, లేదా పిసీసి అధ్యక్షుడు బొత్స లేక ఇతర మంత్రులో
చెబితే ఇవ్వరని అదీ కేవలం పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకే ఉంటుందన్నారు.
చిరంజీవికి సముచిత స్థానం కల్పించాలని అధిష్ఠానం భావిస్తోందన్నారు.
జగన్,చంద్రబాబు కుమ్మకై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని
చూస్తున్నారని ముఖ్యమంత్రి కిరణ్ అనటం... నిన్న కాంగ్రెస్, తెలుగుదేశం
కుమ్మక్కయ్యిందని జగన్ అనటం... ఇదంతా కేవలం ఎన్నికల కోసం ఒకరి మీద ఒకరు
మాట్లాడుకోవడం తప్పితే ఏముందని అన్నారు. ప్రధాన పార్టీలు ఏవైనా కేవలం తమ
అభ్యర్థుల గెలుపే ప్రధాన లక్ష్యంగా మాట్లాడుతారని తెలిపారు.గుంతకల్లు నుంచి తిరుపతి ప్యాసింజర్ రైలు ప్రారంభం
గుంతకల్లు-తిరుపతి
సాయంత్రపు ప్యాసింజరు రైలును శనివారం సా యంత్రం ప్రారంభించనున్నారు.
డివిజన్‌లోని చిట్టచివరి మీటర్ గేజ్‌లైను లో నడచిన ఈ ప్యాసింజర్ రైలును
పు నరుద్ధరణకు జిల్లా వాసుల నుంచి ఉ న్న డిమాండు కారణంగా ఎట్టకేలకు ఈ రైలు
పట్టాలెక్కనుంది. గుంతకల్లు-కల్లూరు మీటర్ గేజ్ లైనును బ్రా డ్‌గేజ్‌గా
మార్చే పనుల ప్రారంభ స మయంలో ఈ మార్గంలో నడచిన తి రుపతి ప్యాసింజరు
రైళ్లను నాలుగేళ్ల కిందట రద్దుచేసిన విషయం విదిత మే.ఎట్టకేలకు
ఆదేశాలు అందడంతో రైలును ప్రారంభించడానికి ఏర్పాట్లను పూర్తిచేశారు.
శనివారం ఉదయం గుంతకల్లు స్టేషన్‌లోని 1, 2 ప్లాట్‌ఫారాలను ఏడీఆర్ఎం
కృష్ణారెడ్డి, సీనియర్ డీసీఎం సుబ్బరాయుడు, ఎస్సెమ్మార్ నగేశ్,
సందర్శించారు. సాయంత్రం 5-30 గంటలకు చేపట్టాల్సిన ప్రారంభోత్సవ
కార్యక్రమంపై సమీక్షించారు. ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే మధుసూధన్
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రానున్నారు. ఏదేమైనా అత్యంత ప్రాధాన్యత
కలిగిన ఈ రైలును ప్రారంభించడం జిల్లా వాసులకు, బాలాజీ భక్తులకు
తీపికబురే.ఈ
లైను కన్వర్షన్ పూర్తయిన త ర్వాత ఉదయం 7 గంటలకు తిరుపతి వెళ్లే
ప్యాసింజరును గత సంవత్సరం ప్రారంభించినా సాయంత్రం రైలును మాత్రం
పునరుద్ధరించలేదు. గత రైల్వే బడ్జెట్టులో ఈ ప్యాసింజర్ రైళ్లను
పునరుద్ధరించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నా, కేవలం ఉదయ
పు రైళ్లను మాత్రమే ప్రారంభించారు. మరి కొన్ని రోజుల్లో ఆర్థిక సంవత్సరం
ముగిసి పోనుండగా సాయంత్రపు రై ళ్లనూ పట్టాలెక్కించడానికి నిర్ణయించా రు. ఈ
రైళ్లకు సంబంధించిన బోగీల ను ఇటు గుంతకల్లులోనూ, అటు తి రుపతిలోనూ సిద్ధం
చేశారు. తిరుప తి, గుంతకల్లు నుంచి బయలుదేరే ఈ రెండు రైళ్లనూ శనివారం
సాయంత్రం ప్రారంభించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఈ రైళ్లను ప్రా
రంభించడానికి యోచించినా గుంతక ల్లు అధికారులకు శనివారం సాయంత్రం వరకూ జోనల్
కార్యాలయం నుంచి తుది ఆదేశాలు రాలేదు.
Friday, 9 March 2012
అనంతపురం జిల్లా రాజకీయ పార్టీలో ఉప ఎన్నికల సర్వే గోల
త్వరలో అనంతపురం అర్బన్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల విషయంలో
కాంగ్రెస్ టికెట్ ఎవరికి కేటాయించాలి అనే దానిపై ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి
ఒక సర్వే చేయించడట. దాన్ని లీక్ చేసి అనంతపురం అసెంబ్లీ స్థానానికి పోటీగా
తన తమ్ముడే ఉండాలని ఎంపీ అంటున్నాడట…దీనిపై జేసీ దివాకర్ రెడ్డి వర్గం
మండిపడుతోంది. ఆ సర్వే వివరాలు ఇవి..
* ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఎవరు సరైన వ్యక్తులు,
ఆయా రాజకీయ పార్టీల్లో ఎవరెవరికి కార్యకర్తల నుంచి ఆదరణ ఉందనే విధంగా
నివేదిక రూపొందించారు. తెలుగుదేశం పార్టీ నుంచి మహాలక్ష్మి శ్రీనివాస్‌కు
97.4 శాతం, మునిసిపల్ మాజీ చైర్మన్ ప్రభాకర్ చౌదరికి 1.1 శాతం, నదీమ్‌కు
1.5 శాతం ఆ పార్టీ కార్యకర్తల ఆదరణ ఉందని చూపించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డికి 99.1 శాతం ఆదరణ ఉన్నట్లు చూపించారు. సీపీఐ
నేత కె.రామకృష్ణకు 86.4 శాతం ఆదరణ ఉందని, బీజేపీలో లలిత్‌కుమార్‌కు 94.2
శాతం ఉన్నట్లు నివేదికలో చూపించారు.ఈ శాతాలు పరిశీలిస్తే ఇదో బూటకపు సర్వే
అనేది స్పష్టమవుతోంది జేసీ
ప్రధాన అనుచరుడు కోగటం విజయభాస్కర్‌రెడ్డి విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఉప
ఎన్నికల్లో అనంతపురం టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో కుట్ర జరుగుతోంది.
ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి కుటుంబ సభ్యులకే టికెట్ దక్కేలా జిల్లా
మంత్రులు, ఎంపీ హైడ్రామాకు తెరతీశారు. ఎంపీ సోదరుడికి టికెట్
కట్టబెట్టేందుకు బోగస్ సర్వే చేయించారని ధ్వజం ఎత్తారు.ఈ సర్వేను
పరిశీలిస్తే ఇది ఎంత బూటకపు సర్వే అన్నది తెలుస్తుందన్నారు.
కాంగ్రెస్‌పార్టీలో ఇప్పటి వరకు పనిచేయని… కాంగ్రెస్ పార్టీ జెండా రంగులు
తెలియని… కాంగ్రెస్‌పార్టీ కార్యాలయం మెట్లు ఎక్కని… ఎంపీ సోదరుడు అనంత
సుబ్బారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థికి సరైన వ్యక్తని 95.7 శాతం మంది
కార్యకర్తలు చెప్పినట్లుగా సర్వేలో చూపించారన్నారు. వాస్తవంగా సుబ్బారెడ్డి
అనే వ్యక్తి ఎంపీ సోదరుడనే విషయం జిల్లాలో 99 శాతం మంది కార్యకర్తలకు
తెలియదన్నారు. ఇప్పటి వరకు పార్టీ ద్వారా వీరు లబ్ధిపొందారే తప్ప వీరి వల్ల
పార్టీకి ఒనగూరింది ఏమీ లేదని జేసీ వర్గం గుర్రుమంటోంది. మరి ఎన్నికల
పోరాటంలో ఎవరు గెలుస్తారో అన్న ఆసక్తి కన్నా కాంగ్రెస్ టికెట్ పోరాటంలో
ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తి కరంగా ఉంది.జూ.ఎన్టీఆర్ పై కేసు వేస్తా....రామ్ గోపాల్ వర్మ
ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండే రామ్ గోపాల్ వర్మ తాజాగా
పూజారులపై కామెంట్స్
చేసి వివాదం క్రియేట్ చేసారు. ఆ వివాదాన్ని టీవి ఛానెల్స్ పెద్దది చేయటంతో
వర్మ తన ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్ అదుర్స్ చిత్రాన్ని కూడా
లాగారు. ఆయన ట్వీట్ లో...నా పూజారుల మీద కామెంట్ల కంటే జూఎన్టీఆర్
అదుర్స్ లో చేసింది ఎక్కువ కానీ తను స్టార్ కనుక నేను ప్లాప్ డైరక్టర్ కనుక
పూజారులు నన్ను టార్గెట్ చేస్తున్నారు.ఈ విషయం మీద నేను జూ.ఎన్టీఆర్
మీద,పూజారుల మీద,ఎండోమెంట్స్ డిపార్టమెంట్ మీద కంప్లైంట్ ఇస్తా పూజారుల మీద
జూ.ఎన్టీఆర్ కి నాకు మధ్య సెలక్టివ్ డిస్క్రిమినేషన్ నేరం క్రింద కేసు
పెడతా.నేను ట్వీట్స్ లో రాసినందుకీ జూ.ఎన్టీఆర్ అదుర్స్ లో చేసినందుకీ
కంపేర్ చేస్తే ఏ మూర్కుడుకైనా నేను చెప్పింది అర్దమవుతుంది .అంటూ
ట్వీట్ చేసారు. ఇక వర్మ ప్రస్తుతం చేస్తానంటున్న రెడ్డి గారు పోయారు
వివాదం మరలించటానికే ఈ కొత్త వివాదాన్ని ఎత్తుకున్నాడని పరిశీలకులు
అంటున్నారు. మీడియా సపోర్టుతో ఈ వివాదాన్ని పెద్దది చేసి ఆ వివాదాన్ని
మర్చిపోయేలా చేయాలని ఆయన ఆలోచనగా చెప్తున్నారు. అందుకనే ఎన్టీఆర్ ని కూడా ఈ
వివాదంలోకి లాగుతున్నారని చెప్తున్నారు.కర్నూలు జిల్లా నదీతీరాన కెసిఆర్ విగ్రహం...టీజీ వెంకటేశ్
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ మీద కూల్చివేతకు గురైన మహనీయుల విగ్రహాలను
కర్నూలు సమీపంలో తుంగ భద్ర నదీతీరాన ఏర్పాటు చేస్తామని చిన్న నీటిపారుదల
శాఖ మంత్రి టీజీ వెంక టేశ్ తెలిపారు. వాటికి ఎదురుగా వాటిని చూస్తూ
సిగ్గుపడుతున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.
చంద్రశేఖర రావు విగ్రహాన్ని కూడా పెడతామని ఆయన చెప్పారు. వాటిని
కూల్చివేసినందుకు కెసిఆర్ విగ్రహం అలా పెడతామని ఆయన అన్నారు. కర్నూలు
జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహ ఏర్పాటుకు ఆయన
గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- తెలంగాణ ఉద్యమం
పేరుతో రాజధానిలోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న సాహితీ, సాంస్కృతిక రంగాల
మహనీయులు, స్వాతంత్య్రోద్యమ నాయకుల విగ్రహాలను టీఆర్ఎస్ నాయకులు,
కార్యకర్తలు ధ్వంసం చేయడం విచార కరమన్నారు. అందుకే ఆ విగ్రహాలను తుంగభద్ర
నదీతీరాన నిర్మించే వరద రక్షణ గోడలపై నెలకొల్పుతున్నట్టు చెప్పారు.అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్....రాహుల్ ద్రావిడ్
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్
అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించారు.
ఇప్పటికే టి-20 కేరీర్‌కు వీడ్కోలు పలకగా, చివరిగా టెస్ట్ క్రికెట్ నుంచి
కూడా వైదొలిగారు. పదహారేళ్ళపాటు టెస్ట్ క్రికెట్‌లో ఆడడం ఆనందంగా ఉందని,
తనను ఇంతగా ఆదదరించిన అభిమానులకు ద్రావిడ్ కృతజ్ఞతలు తెలియజేశారు. బెంగళూరు
చిన్న స్వామి స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో తమ
రిటైర్‌మెంట్ ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తన కెరీర్‌కు సహకరించిన
ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. తన కెరీర్‌లో భార్య,
కుటుంబ సభ్యుల సహకారం మరువరానిదని ఆయన అన్నారు. భారత జట్టుకు సారథ్యం
వహించడం తన అదృష్టమని, ఆస్టేలియా టూర్ తరువాత రిటైర్ కావాలనుకున్నానని, యువ
క్రికెటర్లకు అవకాశం కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాట్లు
రాహుల్‌ద్రావిడ్ పేర్కొన్నారు. కికెట్ నుంచి తప్పుకుంటున్నందుకు విచారంగా
లేదని అన్నారు.
తప్పుకుంటున్నందుకు విచారమేమీ లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా ద్రావిడ్
చెప్పారు. ద్రావిడ్ 164 టెస్టు మ్యాచులు ఆడాడు. 13,288 పరుగులు చేశాడు.
టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 36
సెంచరీలు, టెస్టుల్లో 63 అర్థ సెంచరీలు చేశాడు. సచిన్ టెండూల్కర్, గంగూలీ,
అనిల్ కుంబ్లే, హర్భజన్, సెహ్వాగ్ వంటి ఆటగాళ్లతో ఆడడం తనకు గౌరవమని
ద్రావిడ్ అన్నారు. 16 ఏళ్ల పాటు ఆటపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా
నేర్చుకున్నానని ఆయన అన్నారు. తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని,
యువకులకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అద్భుతమైన యుగంలో
తాను భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. విచారంతోనే
తప్పుకుంటున్నా గౌరవంగా ఉందని ఆయన అన్నారు.తన నిర్ణయాన్ని సచిన్
స్వాగతించినట్లు ద్రావిడ్ చెప్పారు. క్రికెట్ జీవితంలో పొగడ్తలూ ఉన్నాయి,
విమర్శలూ ఉన్నాయని ఆయన అన్నారు. టీమిండియాలో విభేదాలున్నట్లు వచ్చిన
వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం
గర్వంగా ఉందని చెప్పారు. తన నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తారని
అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
Thursday, 8 March 2012
పన్ను ఎగవేతలో అనంతపురం జిల్లాకు రెడ్‌మార్క్
సకాలంలో పన్ను చెల్లించి శాభివృద్ధికి, ప్ర జా సంక్షేమానికి దోహద పడాలని
ఆదాయ పన్నుల శాఖ అనంతపురం రీజియన్ జాయింట్ కమిషనర్ వివి రమణరావు
వ్యాపారులు,పన్ను చెల్లింపుదారులకు సూచించారు. పన్నుల ఎగవేతలో అనంతపురం
జిల్లాకు హైదరాబాద్‌లో రెడ్‌మార్క్ ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
‘ముందస్తు పన్నుల చెల్లింపు- ప్రయోజనాలు’ అంశంపై బుధవారం సాయంత్రం స్థానిక
ఐఎంఎ హాలులో వివిధ వ్యాపా ర వర్గాలతో అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక
సీనియర్ ఆదాయ పు పన్నుల శాఖ అధికారి శివానందం అధ్యక్షతన జరిగిన సదస్సులో
ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నంబూరి శంకర్, ట్యాక్స్ బార్ అసోసియేషన్
అధ్యక్షులు నరసింహయ్యశెట్టి తదితరులు పాల్గొన్నారు. రమణరావు మాట్లాడుతూ
పట్టణంలో వ్యాపార వర్గాలు పన్నుల ఎగవేతకు పాల్పడటం ఎంతవరకు సబబని
ప్రశ్నించారు. హిందూపురంలోని బంగారు నగల వ్యాపారులు ఒక్కరు కూడా రూ.40
లక్షల లావాదేవీలను చూపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. కేవలం రూ.6
లక్షల నుండి రూ. 7 లక్షల వరకు మాత్రమే లావాదేవీలను చూపిస్తున్నారని
పేర్కొన్నారు. లావాదేవీలు ఇలా చూపిస్తే ఆదాయం ఏ మేరకు బయటపడుతుందన్నారు.
ఆదాయపు పన్నుల శాఖ తనిఖీలు నిర్వహిస్తే పన్నుల ఎగవేత సులువుగా
బహిర్గతమవుతుందని స్పష్టం చేశారు. అదే విధంగా హిందూపురంలో మండీ వ్యాపారులు
కూడా పెద్ద ఎత్తున పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నట్లు తమ శాఖ ఇంటలిజిన్స్
విభాగం నివేదిక సమర్పించినట్లు తెలిపారు. దీనికి తోడు అనంతపురం జిల్లాకు
చెందిన అనేక మంది బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించి సబ్
రిజిస్ట్రర్ శాఖ నిర్ణయించే మార్కెట్ ధరకు, డాక్యుమెంట్‌లో చూపిస్తున్న
విలువకు ఎంతో వ్యత్యాసం ఉంటోందన్నారు. బెంగళూరుకు చెందిన ఐటి శాఖ ఆయా
వ్యక్తుల సమాచారాన్ని హైదరాబాద్‌కు పంపగా వారందరికీ నోటీసులు జారీ చేసి
ఎగవేసిన పన్నును వసూలు చేస్తామని స్పష్టం చేశారు. హిందూపురంలో ఇప్పటికీ ఐటి
శాఖ నిర్దేశించిన పన్నుల వసూళ్ళలో దాదా పు రూ.1.50 కోట్లు వసూలు కావాల్సి
ఉందన్నారు. గత ఆరేళ్లుగా రిఫండ్స్ ఆగిపోవడంతో ఇబ్బందులు ఎక్కువ
అవుతున్నాయని అభిప్రాయ పడ్డారు. ఆదాయపు పన్నును సక్రమంగా చెల్లించకపోతే
తప్పకుండా ఆయా పన్ను ఎగవేతదారులు నష్టపోవాల్సి ఉంటుందని రమణరావు
హెచ్చరించారు. భారతదేశ ఆర్థిక ప్రగతిని దృష్టిలో వుంచుకొని ప్రతి ఒక్కరూ
పన్నులను సక్రమంగా చెల్లించాలని సూచించారు. ఇకపోతే ముందస్తు పన్నుల
చెల్లింపు వల్ల చేకూరే ప్రయోజనాలు, చెల్లించకపోతే జరిగే నష్టాలను
విశదీకరించారు. ఈ నెల 15వ తేదీ లోగా ముందస్తు పన్నును ప్రతి ఒక్కరూ
చెల్లించి వడ్డీ మినహాయింపు పొందాలని సూచించారు. ఈ సదస్సులో ఆడిటర్లు
వరదరాజులు, రాఘవేంద్రగుప్త తదితరులు తగు సూచనలు అందచేశారు.
సుకుమార్ దర్సకత్వం చిత్రంలో మహేష్ సిక్స్ ప్యాక్
అందరు హీరోలు మళ్లీ తమ శరీరాలను శ్రమింప చేసి తెరపై కండలు చూపించి
మార్కులు కొట్టాయాలి అనుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో మహేష్ సైతం
చేరాడంటున్నారు. సుకుమార్ దర్సకత్వంలో చేయబోయే చిత్రంలో ఓ సీన్ లో మహేష్
చొక్కా విప్పి ఫైట్ చేస్తాడని,ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర వచ్చే ఆ ఫైట్ కోసం
మహేష్ ప్రత్యేక శ్రద్ద తీసుకుని ట్రైనర్ సాయింతో శరీరాన్ని
తీర్చుదిద్దుకుంటున్నాడని చెప్తున్నారు. దీనికి కారణం మహేష్ బాబు,
దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తుందంటే దానికి అంచనాలు
భారీగా ఉండమే అంటున్నారు. ఈ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా
14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ బారీగా ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది.
ఏప్రిల్ రెండవ వారంలో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. 'దూకుడు' సినిమా సూపర్
హిట్ కావటంతో ఈ చిత్రనిర్మాణ సంస్థకు మహేష్ సినిమాతో మరో మారు మెగా హిట్
కొడతామనే నమ్మకంతో ఉంది. మరోవైపు హండ్రెడ్ పర్సెంట్ లవ్ హిట్ కావటంతో
సుకుమార్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అవన్నీ దృష్టిలో పెట్టుకునే హాలీవుడ్
ట్రైనర్ ఆధ్వర్యంలో మహేష్ బాబు సిక్స్‌ప్యాక్ కోసం శ్రమిస్తున్నాడని
చెప్తున్నారు.. అదే సమయంలో ముఖం అందం చెడకుండా మహేష్ జాగ్రత్త
పడుతున్నాడు. తొలిసారిగా మహేష్ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం
అందిస్తున్నాడుటీమిండియాకు టెస్టుల మీద ఆసక్తి లేదు....మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్
భారతీయుల్లో నాయకత్వ లక్షణాలు చాలా తక్కువ ఉంటాయని,
దీనికి అక్కడి కట్టుబాట్లే కారణమన్నాడు. భారత్‌లో పిల్లలపై చిన్నప్పటి
నుంచే ఒత్తిడి అధికంగా ఉంటుందని, పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఇంట్లో
తల్లిదండ్రులు ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారన్నాడు. దీంతో పెద్దవారైన తర్వాత
చాలా మంది భారతీయులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేక పోతారన్నారు. ప్రపంచ
క్రికెట్‌ను శాసిస్తున్న భారత్ కావాలనే టెస్టులను నిర్వీర్యం చేసేందుకు
ప్రయత్నిస్తుందన్నాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లలో క్లీన్‌స్వీప్
కావడమే దీనికి నిదర్శనమన్నాడు.టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ మరోసారి భారత్‌పై విరుచుకుపడ్డాడు.
స్వతహాగా నోటి దురుసు ఎక్కువ కలిగి.. పదవి ఊడి ఐదేళ్లవుతున్నప్పటికీ
అప్పడప్పుడు భారత్ గురించి ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ వార్తుల్లో ఉంటున్నాడు.
అడిలైడ్‌లో ఓప్రముఖ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ
‘భారత్‌కు టెస్టుల మీద ఆసక్తి లేదు. ఎందుకంటే వాళ్లకు ఈ ఫార్మాట్ చాలా
కష్టం. ఆస్ట్రేలియాలో వాళ్ల ఆట దారుణం. ఆ జట్టులోని అనేక మందితో నేను కలిసి
పని చేశాను. వాళ్ల గురించి నాకు తెలుసు. టి20, వన్డేలు ఆడి డబ్బు
సంపాదించుకోవాలని అనుకుంటారు. అందుకే వారికి టెస్టులు ఆడటం కష్టంగా ఉంది’
అని అన్నారు.ధోనిలో నాయకత్వ లక్షణాలను నేను
మొదట్లోనే గమనించాను. మూడేళ్లుగా కెప్టెన్‌గా, కీపర్‌గా, భారీ లక్ష్యాలను
సాధించే బ్యాట్స్‌మెన్‌గా చాలా బాధ్యతలు పోషిస్తున్నాడు. అతడు దొరకడం
టీమిండియా అదృష్టం. ప్రస్తుతం డ్రెస్సింగ్‌రూమ్‌లో వాతావరణం వల్ల ధోని
టెస్టులను వదులుకునే అవకాశం ఉందన్నాడు. సెహ్వాగ్‌కు కెప్టెన్ కావాలనే ఆశ
ఎక్కువగా ఉందని, దీనివల్లే సమస్యలు వస్తున్నాయని గ్రెగ్‌చాపెల్ అన్నా రు.
‘కుంబ్లే రిటైర్ అయిన తర్వాత తానే కెప్టెన్ అవుతానని సెహ్వాగ్ అనుకున్నాడు.
అలా జరగకపోవడంతో టీమిండియాలో విబేధాలు వచ్చాయని చాపెల్ తెలిపాడు.రాయలసీమలో ఘనంగా హోలీ పండుగ
ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల తో జరుపుకునే హోలీ పండుగ వచ్చేసిం ది. ప్రతి
సంవత్సరం పాల్గుణ మాసం పూర్ణిమ తిథి నాడు అత్యంత ఆనందోత్సవాలతో హోలీ
పర్వదినాన్ని ఘనం గా జరుపుకుంటారు. ఈ పండుగ వసంత రుతువు ఆగమనాన్ని తెలియజే
స్తూ ఉంటుంది. పూర్వం రఘు మహారాజు హోలిక అనే రాక్షసిని చంపడంతో ప్రజలు ఈ
పండుగ జరుపుకుంటున్నారన్నది ప్రతీతిలో ఉంది. దీన్నే కాముని పున్నమి,
డోలికోత్సవం, పాల్గుణోత్స వం వంటి వివిధ నామాలతో వ్యవహరిస్తుంటారు. ఇక
మహారాష్ట్రంలో హోలిక దహన్‌ను కామ దహనం అంటారు. ఈ పండుగను సాధారణంగా
శీతాకాలం చివరిలో ఫిబ్రవరి లేదా మార్చి నెలల తదుపరి వారాల్లో వచ్చే చివరి
ఫాల్గుణ మాసం (పూర్ణిమ) పౌర్ణమి రోజున జరుపుకుంటారు.కళ్లకే ప్రమాదం
పొడి, ద్రావకం రూపంలో ఉన్న రంగులు విసురుకున్నప్పుడు అవి కళ్ల లో పడే
ప్రమాదం ఉంది. ముఖ్యంగా కెమికల్ కలర్లు కళ్ల మీద చాలా దుష్ఫ్రభావాన్ని
చూపిస్తాయి. వీటితో కళ్ల కల క, అలర్జీ వచ్చే ప్రమాదముంది. అలాగే తాత్కాలిక
అంధత్వం, కలర్, బ్లైండ్‌నె స్, ఫొటో ఫోబియా (వెలుగును చూడలేక పోవడం) వంటి
సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక చర్మపై ఈ సింథటిక్ డైకలల్ చూపించే ప్రభావం
అంతా ఇంతాకాదు. కొన్ని నాసిరకం రసాయనిక రంగులతో కేన్సర్ బారిన పడే అవకాశం
ఉంది. కెమికల్ డైస్ జుట్టుపై కూ డా దుష్ప్రభావాలు చూపిస్తుంది.Wednesday, 7 March 2012
రామ్ గోపాల్ వర్మకు కెవిపి షాక్
ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మకు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి
ప్రియ మిత్రుడు, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు షాక్
ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మకు ఇచ్చిన అపాయిటంట్‌మెంటును రద్దు చేసుకున్నారు.
రెడ్డిగారు పోయారు సినిమా కోసం రామ్ గోపాల్ వర్మ కెవిపి రామచందర్ రావును
కలవాలని అనుకున్నారు. సినిమా కోసం వస్తున్నానని వర్మ తనతో చెప్పలేదని,
సినిమా కోసం వస్తున్నట్లు తెలిసి తర్వాత భేటీని రద్దు చేసుకున్నానని కెవిపి
రామచందర్ రావు చెప్పారు. సినిమా కోసం వస్తున్నట్లు వర్మ తొలుత
తనతో చెప్పలేదని, అందుకే అపాయింట్‌మెంట్ ఇచ్చానని, సినిమా కోసమని చెప్పాక
అపాయింట్‌మెంట్‌ను రద్దు చేసుకున్నానని ఆయన చెప్పారు. రామ్ గోపాల్ వర్మను
తాను కలువబోనని ఆయన చెప్పారు. రెడ్డిగారు పోయారు సినిమా కోసం వర్మ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను కూడా కలుసుకోవాలని
అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి మరణాంతర పరిణామాలపై
రెడ్డిగారు పోయారు అనే సినిమాను వర్మ తలపెట్టినట్లు ప్రచారం జరుగుతున్న
విషయం తెలిసిందే.
చిరు రాజ్యసభకు వెళ్తే తిరుపతి నుంచి పోటీ....మంత్రి గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్
మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభకు వెళ్తే తాను తిరుపతి నుంచి శానససభకు పోటీ
చేయడానికి సిద్ధంగా ఉన్నానని మంత్రి గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్
చెప్పారు. తిరుపతి శాసనసభా సీటుకు చిరంజీవి రాజీనామా చేసి రాజ్యసభకు
నామినేట్ అయితే, జరిగే ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఆయన చెప్పారు. ఆయన
బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను ఇప్పటి వరకు వ్యాపారవేత్తగా
ఉన్నానని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన
చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనే విషయంపై
కాంగ్రెసు పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెబుతూనే తాను పోటీ
చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు జయదేవ్ తెలిపారు. చిరంజీవి రాజ్యసభకు
వెళ్లకుండా తిరుపతి నుంచి శాసనసభ్యుడిగా కొనసాగితే తాను 2014లో శాసనసభకు
పోటీ చేస్తానని ఆయన చెప్పారు. తన తనయుడు గల్లా జయదేవ్ రాజకీయ రంగ
ప్రవేశాన్ని మంత్రి గల్లా అరుణ కుమారి ఇది వరకే ధ్రువీకరించారు.
రేపు నెట్ సేవలు బంద్
ఇంటర్నెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. రేపు నెట్ సేవలు బంద్. నెట్‌వర్క్
కంప్యూటర్లకు వైరస్ ముప్పు తలెత్తుతుండడంతో దీన్ని అధిగమించేందుకు ప్రపంచ
వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను 24 గంటలపాటు నిలిపేస్తున్నారు. 2007 నుంచి డొమైన్ నేమ్ సిస్టమ్ (డిఎన్ఎస్) చేంజర్ పేరుతో వైరస్
సాఫ్ట్‌వేర్‌ను ఇంటర్నెట్‌లోకి క్రిమినల్స్ అప్‌లోడ్ చేస్తుండటంతో
ప్రపంచవ్యాప్తంగా వైరస్ సమస్యలు తలెత్తుతున్నాయని సైబర్ సెక్యూరిటీ
నిపుణులు తెలిపారు. 2007 నుంచి ఎస్తోనియాకు చెందిన క్రిమినల్స్ ఈ
వైరస్‌ను విస్తరించే పనిలో ఉన్నారని యుఎస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్
ఇన్వెస్టిగేషన్ 2011 నవంబర్‌లో గుర్తించిందని క్విక్ హీల్ టెక్నాలజీస్ చీఫ్
టెక్నాలజీ ఆఫీసర్ సంజయ్ కట్కర్ చెప్పారు. ఈ వైరస్‌ను నియంత్రించే
ఉద్దేశంతో క్విక్ హీల్ ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పేజీని ఏర్పాటు చేసింది.
కంప్యూటర్లు వైరస్ బారినపడితే సలహాలు, సహాయం కోసం
http://www.quickheal.com/chkdnsను సందర్శించవచ్చని సూచించింది.Tuesday, 6 March 2012
సోషల్ నెట్‌వర్కింగ్ ద్వారా అనుభవాలు
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఇక నుంచి అభిమానులకు నిత్యం అందుబాటులో
ఉండనున్నాడు. త్వరలో ప్రారంభమయ్యే ఐపిఎల్ సీజన్ నుంచి సచిన్ సోషల్
నెట్‌వర్కింగ్ సైట్‌లో అకౌంట్ తెరవనున్నాడు. దీని ద్వారా సచిన్ తన
ఆలోచనలను, మైదానంలో తన అనుభవాలను అభిమానులతో పంచుకోనున్నాడు. సచిన్‌తో పాటు
ముంబయి ఇండియన్స్ జట్టు సభ్యులు హర్భజన్ సింగ్, మలింగ, ఇతర ఆటగాళ్లు, కోచ్
షాన్ పొలాక్ ‘ఎమ్‌ఐ పాల్టన్’ అనే పేరుతో ఒకే అకౌంట్‌లో అందుబాటులో ఉంటారు.
ఆటగాళ్లకు, అభిమానులకు మధ్య సంబంధాలను పెంచడానికి ఈ ప్రయత్నం చేశారు. ఐపి
ఎల్ ఫ్రాంచైజీలు అభిమానులతో టచ్‌లో ఉండటానికి ఫేస్‌బుక్, ట్విట్టర్‌లాంటి
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లను కొంత కాలంగా ఉపయోగించుకుంటున్నాయి. యువ
క్రికెటర్లు సచిన్, ఇతర ముంబయి ఇండియన్స్ (ఎమ్‌ఐ) ఆటగాళ్లతో ఐపి ఎల్ జరిగే
టప్పుడు, తర్వాత కూడా క్రికెట్ గురించి చర్చించవచ్చు. ‘అభిమానులు
ఎల్లప్పుడూ మా వెంటే ఉండి మద్దతునిచ్చారు. మేము ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
చెప్పాలనుకుంటున్నాం. దీనికోసం ప్రతి ఆటగాడు అభిమానులకు అందుబాటులో
ఉండేవిధంగా ఎమ్‌ఐ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది’ అని ఎమ్‌ఐ ప్రతినిథి
తెలిపాడు. అభిమానులతో ఇలా అందుబాటులో ఉండటానికి సచిన్ ఆసక్తిని వ్యక్తం
చేశాడు. ‘అభిమాలకు అందుబాటులో ఉండగలగడం, వారు ఏం ఆనుకుంటున్నారో
తెల్సుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. మాలో చాలా మంది తొలి సారిగా
సోషల్ నెట్‌వర్కింగ్ ద్వారా అభిమానులకు చేరువవుతున్నారు’ అని భజ్జీ
చెప్పాడు.
Monday, 5 March 2012
కర్నూలు జిల్లా ఉపఎన్నికకు నేతల ఆధిపత్య పోరు
ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజక వర్గంలో ఆది నుంచి గంగుల, భూమా కుంటుంబాల మధ్య
ఫ్యాక్షన్, గ్రూపు రాజకీయాలు నడుస్తూన్నాయి. పార్టీల కన్నా గంగుల, భూమా
గ్రూపు ఆధిపత్య రాజకీయమే ఆళ్లగడ్డలో కీలకం. అయితే స్థానిక ఎమ్మెల్యే
శోభానాగిరెడ్డి రాజీనామాను రెండురోజుల క్రితం అసెంబ్లీ స్వీకర్ ఆమోదించడంతో
ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానంలో ఉపఎన్నికకు తెర లేచింది. దీంతో అందరి దృష్టి
ఆళ్లగడ్డవైపు మళ్లింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలతో
పాటు స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డిలు కూడా తమ గ్రూపులను
ఇప్పటి నుంచే ఉపపోరుకు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఎంకిపెళ్లి సుబ్బి
చావుకొచ్చిందన్న చందంగా రెండు ప్రధాన గ్రూపుల ఆధిపత్య పోరు మధ్య అధికారుల
నలిగిపోతున్నారు. ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధికారులతో
సమావేశమై కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, ఆళ్లగడ్డ నియోజక
వర్గంలోని అన్ని గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులతో పాటు
గ్రామపంచాయితీ నిధులు కూడా తాము సూచించిన వారికే కేటాయించాలని స్పష్టం
చేశారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్న విషయాన్ని
ప్రజలకు తెలుపాలన్నదే తమ ఉద్దేశ్యం అని కాంగ్రెస్‌పార్టీ అసెంబ్లీ
ఇన్‌చార్జి చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎమ్మెల్యే
శోభానాగిరెడ్డి కూడా అన్ని శాఖల అధికారులతో సమావేశమై ప్రభుత్వ నిబంధనలమేరకు
ఉపాధి హామీ పనులు చేయాలని సూచించారు. రాజకీయ వత్తిళ్లకు తలవంచి
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పరోక్షంగా
హెచ్చరిక జారీ చేశారు.
జగన్ కేసు విషయం సీబీఐ చూసుకుంటుంది...సీఎం
ఉప ఎన్నికల విషయమై ఎన్నికల కమిషనన చూసుకుంటుందని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా సోమవారం మీడియాతో సీఎం మాట్లాడుతూ ప్రత్యేక కారణాలవల్ల ఈ
ఎన్నికలు జరుగుతున్నందున ప్రభుత్వానికి రెఫరెండం కాదని అన్నారు. ఉప ఎన్నికల
ప్రచారం విషయం పీసీసీ పరిశీలిస్తోందని, అవసరమైన చోట తమతోపాటు ఇతర నేతలు
ప్రచారానికి వెల్తారని కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యనేతలు
ప్రచారం చేస్తే లాభాలతోపాటు, నష్టాలు కూడా ఉండవచ్చునని అభిప్రాయం వ్యక్తం
చేశారు.రాజ్యసభ సీట్ల వ్యవహారాన్ని అధిష్టానం చూస్తుందని సీఎం తెలిపారు.
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు అక్రమాస్తుల వ్యవహారం సీబీఐ
చూస్తోందని, ప్రభుత్వానికి సంబంధం లేదని, పార్టీలో ఇతర నేతల వ్యాఖ్యలపై
తాను స్పందించనని మీడియాముఖ్యమంత్రి తెలిపారు. తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి
ఎక్కడున్నా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగమేనని సీఎం పేర్కొన్నారు. జగన్ అరెస్ట్ ఖాయం జేసీ సంచలన వ్యాఖ్యలు
జగన్‌ను అరెస్ట్ చేయక తప్పదని, స్పష్టత లేదని అసెంబ్లీ ఆవరణలో జేసీ దివాకర్ రెడ్డి సంచలన
వ్యాఖ్యాలు చేశారు.వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్
జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయక తప్పదని అనంతపురం జిల్లా కాంగ్రెసు పార్టీ
సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి సోమవారం అన్నట్లుగా తెలుస్తోంది.
అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం జెసి టిడిఎల్పీ గదికి వచ్చారు. ఆయన టిడిపి
నేతలు మోత్కుపల్లి నర్సింహులు, పయ్యావుల కేశవ్‌తో పిచ్చాపాటిగా మాట్లాడారు.
జగన్‌ను అరెస్టు చేయడం తప్పదని, అయితే అది కొవ్వూరు ఎన్నికలకు ముందా లేక
తర్వాత అన్న దానిపై స్పష్టత లేదని చెప్పారు. ప్రభుత్వ మాజీ సలహాదారు కెవిపి
రామచంద్ర రావును ఎందుకు అరెస్టు చేయడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న అని
అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు
సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును మీరు బాగా ఇరుకున పెడుతున్నారని
మోత్కుపల్లికి జెసి కితాబిచ్చారు. మీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
చేసిన దానికి ఇప్పుడు మేం ఫలితం అనుభవిస్తున్నామని వారితో అన్నారు.
అధికారులు అవినీతి విషయంలో బాగా బరి తెగించారని అరోపించారు. కాగా
కెసిఆర్‌కు వ్యతిరేకంగా తాను చేపట్టబోయే పాదయాత్ర వివరాలను మోత్కుపల్లి
ఆయనకు వివరించారు.కేసీఆర్ ను ఘాటుగా విమర్శిస్తున్నారని
మోత్కుపల్లిని ప్రసంశించారు.
Sunday, 4 March 2012
దమ్ము డైలాగులు.. టాలీవుడ్ కు పంచ్
టాలీవుడ్ కు పంచ్ డైలాగుల ఫీవర్ పట్టుకుంది. ‘భయానికి
మీనింగే తెలియని మీనింగ్ రా నాది’ అంటూ దూకుడులో.. ‘నేను మాట్లాడ్డానికొచ్చాను కాబట్టి
మనస్ఫూర్తిగా కొట్టట్లేదు’ అంటూ బిజినెస్ మేన్ లో మహేష్ బాబు చెప్పిన డైలాగులు ఎంత
సంచలనం సృష్టించాయో తెలిసిందే. ఇప్పుడు నెంబర్ వన్ రేసులో మహేష్ ను ఢీకొట్టడానికి సిద్ధమవుతున్న
జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇలాంటి పంచ్ డైలాగులతోనే సిద్ధమవుతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో
జూనియర్ హీరోగా నటిస్తున్న దమ్ము సినిమాలో ఇలాంటి పంచ్ డైలాగులకు కొరత లేదు. విడుదలకు
చాలా సమయమున్నా అప్పుడే ఈ సినిమా డైలాగులు లీకయ్యాయి. క్రేజ్ కోసం యూనిటే ఇలా లీక్
చేసిందో ఏమో.. మొత్తానికి దమ్ము డైలాగుల్లో కొన్ని...
"బాగా భయపడేవాడు ధైర్యం కోసం ఎదురుచూస్తాడు...బాగా బలుపు ఉన్నోడు వాడ్ని టచ్ చేసే మగాడు కోసం చూస్తాడు..నేను రెండో టైప్"
‘‘ఎవడ్రా నువ్వు.. ’’ ‘‘డిపార్ట్ మెంట్లో టైగర్ అంటారు..
బయట యంగ్ టైగర్ అంటారు’’
‘‘వితౌట్ ఖాకీలో కూల్ గా ఉంటా.. విత్ ఖాకీలో కుమ్మేసేలా
ఉంటా’’
‘‘నేను డైలాగ్ కొడితేనే విజిల్స్ తో థియేటర్స్ ఊపేస్తారు..
అదే నేను కొడితే ఇక ఆంధ్రా మొత్తం తీన్ మారే’’
‘‘ట్రైలర్స్ తోనే సెన్సేషన్ సృష్టించ టైపురా నేను.. ఇక
సినిమా రిలీజ్ అయితే సునామీని తట్టుకోవడం ఎవరి వల్లా కాదు’’
‘‘మంచి,
చెడు గురించి ఆలోచించడానికి నేను అన్నా హజారేని కాదు, ఎన్టీ రామారావుని అసలే కాను’’
‘‘నా తప్పు ఉన్నప్పుడు ఆలోచిస్తా...నీ తప్పు ఉంటే చంపేస్తా’’
‘‘నాలాంటోణ్ని ఎప్పుడూ కెలకొద్దు.. పొరపాటున కెలికావా
చరిత్రలో కనివీనీ ఎరుగని రేంజ్ లో క్రైమ్ రేట్ పెరిగిపోతుంది’’
‘‘నాలాంటోడిని ఎప్పుడూ కెలకొద్దు...పొరపాటున కెలికావా చరిత్రలో కనివీనీ
ఎరుగని రేంజ్ లో క్రైమ్ రేట్ పెరిగి పోతుంది’’
‘‘అడుగేస్తే సుమోలు ఎగరడం చూసుంటావ్...తొడగొడితే ట్రైన్ వాపస్ పోవడం చూసుంటావ్...కానీ నేను కొడితే గ్లోబ్ మొత్తం చుట్టి వచ్చినట్లు ఉంటుంది’’
‘‘చరిత్ర తిరగరాసే పవర్ నా బ్లడ్ లోనే ఉంది..నువ్వు లక్షల మందితో వచ్చినా నవ్వుతూ
చంపుతా’’
‘‘నేను సైలెంట్ గా మాట్లాడతా కానీ..యాక్షన్ లో దిగితే మాత్రం ఫుల్ వయొలెంట్’’
‘‘నీచేతిలో ఆయుధం నీకు బలమైతే...నా దమ్మే నాకు బలం’’
రాంచరణ్ "రచ్చ" మగధీర రికార్డును బ్రేక్ చేస్తుందట...!
మగధీర తర్వాత హిట్టు కోసం మొహం వాచిపోయి ఎదురుచూస్తున్న
రాంచరణ్‌కు రచ్చ పండగ చేయడం ఖాయమట. సినిమా రష్‌ను చూసిన ఇన్నర్ సర్కిల్.. రచ్చ చూస్తున్నంత
సేపు తమ రోమాలు నిక్కబొడుచుకునే ఉన్నాయని చెపుతున్నారట. రాంచరణ్‌కు రచ్చ మరో రికార్డును
తెచ్చి పెడుతుందని అంటున్నారట. రాంచరణ్ కూడా ఈ సినిమాపై గంపెడాశలు పెట్టుకున్నాడు. ఇటీవలి
కాలంలో మెగా కుటుంబం నుంచి మంచి హిట్ రాక తహతహలాడుతున్న ఫ్యాన్స్‌కు ఈ చిత్రం మంచి
జోల్ట్ ఇస్తుందని అనుకుంటున్నారు. ఇకపోతే తెలుగు రచ్చతోపాటు ఇదే చిత్రాన్ని మలయాళం, హిందీల్లో కూడా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు
ప్లాన్ చేస్తున్నారు. ఇతర భాషల గురించి ఆలోచిస్తున్నారంటే రచ్చలో స్టామినా ఉండే ఉంటుందని
అంటున్నారు ఫిలిమ్ జనం. చూద్దాం రాంచరణ్ రచ్చతో ఎంతమాత్రం రఫ్ ఆడిస్తాడో...?!!చంద్రబాబు నన్ను సన్యాసిగా మార్చాడు ....మాజీ మేయర్
జగన్ అరెస్ట్ పై పుకార్లు
వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్
చేస్తారు? ఆయనను అరెస్ట్ చేయడానికి సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు.
వారికేమీ లభ్యం కాలేదు. ఎందుకంటే, దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డి
ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జగన్ ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు.
అందుకే వారు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇంకా అలాంటప్పుడు ఎందుకు అరెస్ట్
చేస్తారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. అయినా
కాంగ్రెస్, టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు ‘ఆధారాలు లేకపోయినా జగన్‌మోహన్
రెడ్డిని సీబీఐ తాకితే... ఆయనపై ఒక్క చేయి పడినా రాష్ట్రంలోని లక్షల, కోట్ల
చేతులు సమాధానం చెబుతాయి...’ అని గట్టిగా హెచ్చరించారు. జగన్‌ను
అరెస్టు చేస్తారంటూ శనివారం అర్థరాత్రి నుంచీ ఓ వర్గం మీడియా, టీడీపీ,
కాంగ్రెస్ వర్గాలు చేసిన దుష్ర్పచారంపై రాంబాబు తీవ్రంగా స్పందించారు. ఆయన
ఆదివారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల
సమావేశంలో జగన్ కోవూరు ఎన్నికల ప్రచారం ఒక రోజు మాత్రమే కుటుంబ కారణాల వల్ల
వాయిదా పడిందనీ సోమవారం నుంచి మూడు రోజుల పాటు యథావిధిగా ఆయన నెల్లూరు
జిల్లాకు వెళ్లి ప్రచార సభల్లో పాల్గొంటారనీ స్పష్టం చేశారు. ‘జగన్ దివంగత
వై.ఎస్.రాజశేఖరరెడ్డి, వై.ఎస్.విజయమ్మల ఏకైక పుత్రుడే కాదు...ఈ
రాష్ట్రంలోని ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఆయనను తమ కుమారుడుగా
భావిస్తున్నారు...ప్రతి చెల్లి, ప్రతి అక్క జగన్‌ను ఒక సోదరుడుగా
భావిస్తోంది...ప్రతి అవ్వ, ప్రతి తాత జగన్‌ను తమ మనవడిగా
చూసుకుంటున్నారు...సీబీఐకి ఇదే హెచ్చరిక చేస్తున్నాను....సీబీఐ...! జగన్‌పై
ఒక్క చెయ్యి వేస్తే కోట్లాది చేతులు లేస్తాయి...’ అని ఆయన తీవ్ర స్వరంతో
అన్నారు. ఏ ఆధారాలు లేక పోయినా కాంగ్రెస్, టీడీపీ నాయకులు
చెబుతున్నట్లుగా ఆయనను అరెస్టు చేస్తే ఆ పరిణామాలు ఎలా ఉంటాయో...చూస్తారు’
అని అంబటి అల్టిమేటమ్ జారీ చేశారు. జగన్‌నూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని
రాజకీయంగా బహిరంగంగా ఎదుర్కోలేక అరెస్టు చేస్తారనే ప్రచారాలు చేస్తున్నారని
ఆయన అన్నారు. జగన్‌పై చేయి పడితే అది ఆయనపై కాదు, తెలుగు గడ్డపై పడిన
చేయిగా ప్రజలు భావిస్తారని ఆయన అన్నారు. జగన్ ఇంటి ముందు అర్ధరాత్రి అలజడి
హైదరాబాద్‌లో కడప ఎంపీ వైఎస్ జగన్మోహన రెడ్డి నివాసం. శనివారం రాత్రి
తొమ్మిది గంటలు.. సుమారు 40 మంది అక్కడికి చేరుకున్నారు. గంటలు
గడుస్తున్నాయి. వస్తున్న జనం సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. అర్ధరాత్రి
ఒంటి గంట అయ్యేసరికి అక్కడికి దాదాపు 600 మంది వరకు చేరుకున్నారు. అక్రమ
ఆస్తుల కేసులో జగన్‌ను సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందన్న సమాచారం వారికి
అందడమే ఈ హడావుడికి కారణమని తెలిసింది. జగన్ ఇంటికి చేరుకున్న మద్దతుదారులు
హల్‌చల్ సృష్టించారు. జగన్ ఇంటికి చేరుకునే నాలుగు దారుల్లోనూ రాకపోకలను
అడ్డుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
వాహనాలనే బ్యారికేడ్లుగా మార్చి రోడ్డుకు అడ్డంగా నిలబెట్టారు. ఆ
మార్గంలోని వీధిలైట్లను ఆర్పేశారు. మరోవైపు, జగన్‌ను ఏ క్షణమైనా అరెస్టు
చేసే అవకాశం ఉందని, అందువల్ల, ఆయన ఇంటి వద్దకు చేరుకోవాలని
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన మద్దతుదారులకు ఎస్ఎంఎస్‌లు పంపుతున్నట్లు
తెలిసింది. ముఖ్యంగా మహిళలను పెద్దఎత్తున తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు
సమాచారం.
Saturday, 3 March 2012
కడప జిల్లా ఫ్యాక్షన్ అదుపులో ఉంది....జిల్లా ఎస్పీ
జిల్లాలో ఫ్యాక్షన్ అదుపులో ఉందని ఎస్పీ సుందర్‌కుమార్ దాస్
పేర్కొన్నారు. మండలంలోని ఫ్యాక్షన్ గ్రామంగా ముద్ర పడిన గండి కొవ్వూరు
గ్రామాన్ని ఆయన సందర్శించారు. అనంతరం పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన
విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఫ్యాక్షన్ అదుపులో ఉందని,
అరకొరగా జరిగిన సంఘటనలు ఫ్యాక్షన్ గ్రామాల్లో కాకుండా బయట జరిగాయన్నారు.
ముందస్తు చర్యల్లో భాగంగా ఫ్యాక్షన్‌పై పోలీసులు డేగ కన్ను వేసినట్లు
తెలిపారు. ఫ్యాక్షన్ గ్రామాల వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తూ అదుపులో
పెట్టామన్నారు. ముఖ్యంగా గండి కొవ్వూరు గ్రామంలో 1920 సంవత్సరం నుండి
ఫ్యాక్షన్ కొనసాగిందని, గత రెండు దశాబ్ధాల క్రితం నుంచి గ్రామంలోని
ఇరువర్గాల మధ్య ఐక్యత ఏర్పడిందన్నారు. పూర్తిగా తగ్గిపోయిందనే సందర్భంలో
బయట ప్రాంతంలో ఒకదాని తర్వాత మరొకటి రెండు సంఘటనలు చోటు చేసుకుని వర్గ
పోరాటాలకు ఇరువురు బలయ్యారన్నారు. అప్పటి నుండి దాదాపు రెండేళ్లుగా గండి
కొవ్వూరు గ్రామంలో పోలీసుల ఫికెటింగ్ ఏర్పాటు చేసి ప్రజల్లో భయాన్ని
తొలగించి ప్రశాంతతను నెలకొల్పామన్నారు. అలాగే కోర్టులకు ముద్దాయిలుగా
వెళ్తున్న ఫ్యాక్షన్ గ్రామస్థులకు బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ
సంఘటనలు జరగకుండా రక్షణ కవచం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా
ఫ్యాక్షన్ గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో జిల్లా
కేంద్రంలోని ఎస్పీ బంగ్లాలో వారానికి ఒక్కరోజున ఫ్యాక్షనిస్టులతో సమావేశం
ఏర్పాటు చేసి వారిలో కొంత మార్పును తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈయన వెంట
పులివెందుల డిఎఎస్పీ జయచంద్ర, లక్కిరెడ్డిపల్లె సిఐ సుధాకర్, ఎస్‌బిసిఐ
సువర్ణ, చక్రాయపేట ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పుట్టపర్తిలో4 కోట్లతో మ్యూజియం
ప్రపంచంలోని ప్రతి నిరుపేద భక్తునికి భగవంతుని సందేశం వినిపించడం ధ్యానం
యోగా ద్వారా మానసిక ప్రశాంతతను కలుగ జేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని,
బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ డైరక్టర్ రతన్‌జీ తెలిపారు.
గోకులంలో గల వారి కార్యాలంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా
130 దేశాల్లో బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలున్నా, విదేశాలకు
లండన్ ప్రధాన కేంద్రంగా భారత్‌లో వౌంట్ అబు కేంద్రంగా పని
చేస్తున్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 8500 సేవా కేంద్రాలు వున్నాయని,
భారతదేశ కాలమాన ప్రకారం ఉదయం 4 గంటల నుండి 5 గంటల వరకు బ్రహ్మ ముహుర్తంలో
రోజు 10 లక్షల మంది ధ్యానం చేస్తారని, ప్రతి మూడవ ఆదివారం సాయంత్రం 6:30
గంటల నుండి 7:30 గంటల మధ్య విశ్వశాంతి కోసం ప్రపంచ వ్యాప్తంగా ధ్యానం
నిర్వహిస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతినికి కాంక్షించే సంస్థగా
ఐక్యరాజ్య సమితి తల ట్రస్టుకు ఐదు శాంతిదూత అవార్డులను ప్రధానం
చేసిందన్నారు. నైతిక విలువలతో కూడిన బోధనలు, మారసిక ప్రశాంతత చేకూరడం, దుర
అలవాట్లకు గురైన వారిని సన్మార్గంలో మార్చడం యోగా ద్వారా సాధ్యమన్నారు.
పుట్టపర్తిలో ఐదు ఎకరాల్లో 81 అడుగుల ఎత్తుతో లింగాకృతిలో సుమారు 5 కోట్ల
వ్యయంతో మ్యూజియంను నిర్మించడానికి కృషి చేస్తామన్నారు. ఇందులో ఆడిటోరియం,
ధ్యాన మందిరం వసతి గృహాలు వుంటాయన్నారు. ప్రతి మతం వారు భగవంతుడు ఒక్కడే
అని నమ్ముతున్నారని, అయితే ఆ భగవంతుడు ఎవరనేది తెలుసుకోలేక పోతున్నారని,
రాజయోగం ద్వారా పరమాత్తుని గురించి తెలుసుకోవచ్చన్నారు.త్వరలో కాంగ్రెసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ....టిజి వెంకటేష్
ఆంధ్రలో చిచ్చు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.
చంద్రశేఖర రావు ప్రయత్నిస్తున్నారని మంత్రి టిజి వెంకటేష్ విమర్శించారు.
ఆంధ్రలో చిచ్చు పెట్టేందుకే ఉప ఎన్నిక జరుగుతున్న కోవూరు శానససభా
నియోజకవర్గంలో ప్రచారం సాగిస్తానని కెసిఆర్ చెబుతున్నారని ఆయన శనివారం
మీడియా ప్రతినిధులతో అన్నారు. కోవూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ
అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ప్రజలు ఓటేస్తే రాష్ట్ర
విభజనకు ఓటేసినట్లేనని ఆయన అన్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన 17 మంది
శానససభ్యులపై స్పీకర్ వేటు వేస్తూ సరైన నిర్ణయమే తీసుకున్నారని, వేటు
బాధాకరమే అయినప్పటికీ అది సరైన నిర్ణయమని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు
వైపు వెళ్లిన నాయకులు తిరిగి కాంగ్రెసులోకి వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ త్వరలో కాంగ్రెసులో విలీనమవుతుందని ఆయన
అన్నారు.
దగ్గుబాటి రాణాతో రామ్ గోపాల్ వర్మ సినిమా
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో కొత్త సినిమా ప్రకటించారు. దగ్గుబాటి
రాణా-నతాలియా జంటగా సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. యాక్షన్,
రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందనుందని, అతి త్వరలోనే ఈ చిత్ర
షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుతం వర్మ బాలీవుడ్ లో
రూపొందిస్తున్న ‘డిపార్ట్‌మెంట్’ చిత్రంలో బ్రెజిల్ భామ నతాలియా ఐటం
సాంగులో నటిస్తోంది. ఇంతకు ముందు వర్మ నతాలియా అందచందాల గురించి
తెగ పొగిడేసిన విషయం తెలిసిందే. నతాలియా లాంటి అందాన్ని నేను నా సినీ
కెరీర్లో ఇదివరకెప్పుడూ చూడలేదని, ఆమె అందం చూసి
పిచ్చిక్కిపోతోందని......హింసాత్మక ఘటన నేపథ్యంలో రక్తచరిత్ర సినిమా
రూపొందించినట్లుగా, ఆమె ‘అందం’ గురించి అంతా చర్చించుకునేట్లుగా ఓ సినిమా
తీయనున్నట్లు కూడా ప్రకటించారు వర్మ. మరి ఈ సినిమా...రాణా-నతాలియా జంటగా
తీయబోయే సినిమా ఒకటేనా? అనేది తేలాల్సి ఉంది. వర్మ ఇప్పటి వరకు బోలెడు
కొత్త సినిమాలు ప్రకటించారు. అందులో ఆచరణ వరకు వచ్చినవి చాలా తక్కవ. మరి ఈ
సినిమాల సంగతేమిటో కాలమే నిర్ణయించాలి.తిరుపతి దేవస్థానంకు భారీ బడ్జెట్
2010 కోట్ల రూపాయలతో టిటిడి బడ్జెట్ ని ఆమోదించారు. ఈరోజు
జరిగిన టిటిడి
పాలకమండలి సమావేశంలో దీనిని ఆమోదించారు. దేశంలోని దేవాలయాల చరిత్రలో ఇదే
భారీ బడ్జెట్ . భక్తుల కోసం తిరుపతిలో కాటేజీలు నిర్మించాలని నిర్ణయించారు.
తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం దేవాలయాలకు పెద్దపీట వేశారు.
కన్యాకుమారిలో 22.5 కోట్ల రూపాయలతో ఆలయం, కల్యాణమండపం నిర్మించాలని
నిర్ణయించారు. ఈ నెలాఖరున 'నిత్యకల్యాణం' ప్రారంభిస్తారు. టిటిడి
విద్యాసంస్థలలో పని చేసే అధ్యాపకుల జీతాలు పెంచాలని నిర్ణయించారు. ఈ ఏడాది
150 శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తారు. మహాద్వారం వైపు నుంచి
వయోవృద్ధులతోపాటు మరొకరిని అనుమతించాలన్న ప్రతిపాదనని ఆమోదించారు. గత ఏడాది
హుండీ ఆదాయం 730 కోట్ల రూపాయలు కాగా, ఈ ఏడాది 800 కోట్ల రూపాయలు వచ్చే
అవకాశం ఉందని అంచనావేశారు.బడ్జెట్ లో వివిధ విభాగాలకు కేటాయించిన నిధులు ఈ విధంగా ఉన్నాయి.
హిందూ ధర్మప్రచారానికి 106 కోట్ల రూపాయలు
ఆరోగ్యం కోసం 58.43 కోట్ల రూపాయలు
ఆస్పత్రి కోసం 22.04 కోట్ల రూపాయలు
పెన్షన్ పథకానికి 50 కోట్ల రూపాయలు
విద్యాసంస్థలకు 65 కోట్ల రూపాయలు
ఇంజనీరింగ్ విభాగానికి 149 కోట్ల రూపాయలు
విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగానికి 39.63 కోట్ల రూపాయలు
రాలయసీమ ఎమ్మెల్యేలపై అనర్హత ఆమోదం
ఎట్టకేలకు సభాపతి 'అంతిమ తీర్పు' వెలువడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా,
దేశ చరిత్రలోనే తొలిసారిగా అధికార పార్టీకి చెందిన 6 మంది ఎమ్మెల్యేలపై
మూకుమ్మడిగా అనర్హత వేటు పడింది. 'శోభా నాగిరెడ్డి రాజీనామాకు ఆమోదం... 6
మందిపై వేటు'... ఇది శుక్రవారం రాత్రి పొద్దుపోయాక స్పీకర్ నాదెండ్ల మనోహర్
ప్రకటించిన నిర్ణయం. దీంతో... 3 చోట్ల ఉప ఎన్నికల ప్రక్రియ ముగియకముందే,
పది జిల్లాల పరిధిలో మరో 17 స్థానాల్లో ఉప సమర వేదిక సిద్ధమైంది.
దీంతోపాటు నెల్లూరు లోక్‌సభ స్థానానికీ ఉప ఎన్నిక జరగనుంది.'సెమీ
ఫైనల్స్'కు తెరలేచింది.
ఖాళీ అయిన స్థానాలకు ఆరు
నెలలలోపు ఉప ఎన్నికలు జరగాలి. అంటే... సెప్టెంబర్ 3లోపు
ఉపసమరం ముగియాలి. అయితే జూలై 25లోపు రాష్ట్రపతి ఎన్నిక పూర్తి కావాల్సి ఉంది. అందువల్ల ఆలోపే ఉప ఎన్నికలు జరపక తప్పదు.
అనంతపురం జిల్లా
గుర్నాథరెడ్డి (అనంతపురం అర్బన్)
కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం)
కర్నూలు జిల్లా
చెన్నకేశవరెడ్డి (ఎమ్మిగనూరు)
శోభా నాగిరెడ్డి(ఆళ్లగడ్డ)
కడప జిల్లా
అమర్నాథ రెడ్డి (రాజంపేట)
శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి)
అనంతపురం జిల్లా
గుర్నాథరెడ్డి (అనంతపురం అర్బన్)
కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం)
కర్నూలు జిల్లా
చెన్నకేశవరెడ్డి (ఎమ్మిగనూరు)
శోభా నాగిరెడ్డి(ఆళ్లగడ్డ)
కడప జిల్లా
అమర్నాథ రెడ్డి (రాజంపేట)
శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి)
Friday, 2 March 2012
రామ్ గోపాల్ వర్మ వార్నింగ్..!
వివాదాస్సద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘రెడ్డి గారు పోయారు’ అనే చిత్రాన్ని
రూపొందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ మరణానంతరం చోటు
చేసుకున్న పరిణామాలతో రాజకీయ కోణాన్ని టచ్ చేస్తూ ఈ సినిమా తీయబోతున్నట్లు
ప్రకటించి సంచలనానికి తెరలేపారు ఈ దర్శకుడు. వర్మ ఈ టైటిల్ ప్రకటించిందే
ఆలస్యం....‘రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్’ నుంచి వార్నింగ్ కూడా వచ్చింది.
వెంటనే టైటిల్ మార్చాలని హెచ్చరించారు. వైఎస్‌ఆర్ అభిమానుల నుంచి కూడా
ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో వర్మ దిగొచ్చినట్లే కనిపిస్తున్నాడు.
ఈ చిత్రం టైటిల్ ను ‘రెడ్డి గారు పోయారు’అని కాకుండా ‘ఆయన పోయారు’గా
మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా...టైటిల్ మార్చాలని వచ్చిన
హెచ్చరికలపై వర్మ ట్విట్టర్లో తనదైన రీతిలో స్పందించారు. ‘రెడ్డి గారు
పోయారు టైటిల్ మీద ఎందుకు ప్రాబ్లమో? అర్థం కావడం లేదు. వాళ్ల ప్రాబ్లం
రెడ్డి గారు పోలేదనా? లేక రెడ్లెవరూ పోరనా?’’ అని వ్యాఖ్యానించారు. వర్మ
వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరినట్లయింది. అయితే వైఎస్‌ఆర్ అభిమానులు తన
బెండు తీస్తారని గ్రహించిన వర్మ టైటిల్ మార్చాలని నిర్ణయించుకున్నట్లు
తెలుస్తోంది.విశ్రాంతినివ్వాలని కోరా...వీరేంద్ర సెవాగ్
ఆసియాకప్ నుంచి తనకు విశ్రాంతిని ఇవ్వాల్సిందిగా బోర్డును కోరాననీ, తనను
జట్టు నుంచి తప్పించలేదనీ వీరేంద్ర సెవాగ్ స్పష్టం చేశాడు. కోల్‌కతా లోని
స్పోర్ట్స్ సెంటర్‌లో జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశానికి ముందు జట్టు
ఫిజియో ఇవాన్ స్పీచ్‌లీ ఒక ఫిట్‌నెస్ నివేదికను సెలెక్టర్లకు పంపాడు. ఆ
నివేదికలో సెవాగ్, జహీర్‌లకు విశ్రాంతినివ్వాలని సూచించినట్లు తెలుస్తోంది.
కెప్టెన్ ధోనీ, కోచ్ డంకన్ ఫ్లెచర్ కూడా సెవాగ్ విశ్రాంతిని
కోరుకుంటున్నాడని సెలెక్టర్లకు చెప్పారు. దీంతో సెవాగ్‌ను ప్రధాన సెలెక్టర్
శ్రీకాంత్ సంప్రదించాడు. తాను విశ్రాంతి తీసుకుంటాననీ, తాను జట్టులో
ఉండాల్సిందేనని సెలెక్టర్లు భావిస్తున్నట్లయితే అందుబాటులో ఉంటాననీ సెవాగ్
అతడికి తెలిపాడు. అందువల్ల సెవాగ్‌కు రెస్ట్ ఇచ్చారు. తాను గాయాన్ని
దాచాలని అనుకోవడంలేదని సెవాగ్ ‘మిడ్ డే’ పత్రికతో చెప్పాడు. ‘నేను వెన్ను
నొప్పితో బాధ పడుతున్నాను. కొంత విశ్రాంతి అవసరం. ఫిట్‌నెస్ విషయంలో
నేనెప్పుడూ జట్టు మేనేజ్‌మెంట్‌ను తప్పుదోవ పట్టించలేదు. ఇది వరకు భుజానికి
ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కూడా అప్పటి కోచ్ కిర్‌స్టెన్, కెప్టెన్
ధోనీని సంప్రదించాను’ అని సెవాగ్ పేర్కొన్నాడు. ఫిజియో నివేదికను ఆధారంగా
చేసుకునే సెవాగ్‌కు విశ్రాంతినిచ్చారు. అయితే జట్టును ప్రకటించినప్పుడు
సెవాగ్ ఫిట్‌నెస్ సమస్య గురించి శ్రీకాంత్ వివరించకపోవమే ఈ గందరగోళానికి
కారణమయ్యింది. సెలెక్షన్ కమిటీ సమావేశానికి ముందే సచిన్.. తను ఆసియా కప్‌లో
అడాలనుకుంటున్నానని టీం మేనేజ్‌మెంట్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. జట్టులో
స్థానం దక్కించుకోని సెవాగ్, జహీర్, ఉమేష్‌లకు విశ్రాంతినిస్తున్నట్లు
మాత్రమే శ్రీకాంత్ చెప్పాడు. వారికి అయిన గాయాలేంటో అతడు తెలపలేదు. అయితే
జహీర్‌కు చీలమండ గాయమైనందు వల్ల, ఉమేష్ సుదీర్ఘ సిరీస్ ఆడి అలసిపోయినందు
వల్ల విశ్రాంతిని ఇచ్చారని తెలుస్తోంది.
జగన్ అరెస్టు విషయంలో రాజకీయాల్లో చర్చ..!
కడప లోక్‌సభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి
విషయంలో ఇక కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది.
జగన్‌కు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై చర్యలు
తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. అదే సమయంలో అక్రమ ఆస్తుల కేసులో సిబిఐ
విచారణను ఎదుర్కొంటున్న జగన్ అరెస్టుకు కూడా రంగాన్ని సిద్ధం చేస్తున్నట్లు
తెలిసింది. జగన్ వర్గానికి చెందిన ప్రజారాజ్యం పార్టీ
ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి శాసనసభ్యత్వానికి చేసిన రాజీమానామాను ఆమోదిస్తూ,
జగన్ వర్గానికి చెందిన పదహారు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హులు
శాసనసభ స్పీకర్ ప్రకటించనున్నారు. ఈ వారంలోనే స్పీకర్ తన నిర్ణయాన్ని
ప్రకటించే అవకాశాలున్నాయని తెలిసింది. బహుశా మూడు లేదా నాలుగో తేదీన
స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చని శాసనసభ సచివాలయ వర్గాలు తెలిపాయి.
ఆరో తేదీ ప్రాంతంలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు సంబంధించిన
కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించవచ్చని భావిస్తున్నారు. 3, 4
తేదీల్లో కాని పక్షంలో రాజ్యసభ ఎన్నికల కార్యక్రమాన్ని ప్రకటించిన
తర్వాతనైనా జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు పడవచ్చని భావిస్తున్నారు. ఇక
అక్రమ ఆస్తుల వ్యవహారంలో జగన్ సిబిఐ విచారణను ఎదుర్కొంటున్న విషయం
తెలిసిందే. జగన్ ఆస్తుల వ్యవహారంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న నిమ్మగడ్డ
ప్రసాద్‌ను రెండు, మూడు రోజుల్లో సిబిఐ అరెస్టు చేయవచ్చని విశ్వసనీయంగా
తెలిసింది. నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఇప్పటికే సిబిఐ అధికారులు విచారించారు.
అక్రమ ఆస్తుల కేసులో జగన్ అరెస్టుకు నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టు సంకేతంగా
అభిప్రాయపడుతున్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టయిన వారం పది రోజుల్లో జగన్
అరెస్టు కూడా ఖాయమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. జగన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన తర్వాత ఆరు నెలల్లో ఆ అసెంబ్లీ
స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అక్రమ ఆస్తుల కేసులో జగన్
అరెస్టయిన పక్షంలో ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఉండదని, అదే విధంగా
జగన్ అరెస్టుతో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కూడా నైతికంగా కొంత దెబ్బ
తినవచ్చని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. దీని ప్రభావం ఉప ఎన్నికలపై
పడవచ్చని, కాంగ్రెస్ పరిస్థితి కొంత మెరుగుపడవచ్చని అనుకుంటున్నారు. అక్రమ
ఆస్తుల వ్యవహారంలో ఏదో ఒక రోజు సిబిఐ తనను అరెస్టు చేయకతప్పదన్న
అభిప్రాయంతో జగన్ కూడా ఉన్నారు. ఇందుకు మానసికంగా ఆయన సిద్ధంగానే ఉన్నారని
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. ఇటీవల పార్టీ ముఖ్యనేతలతో
జగన్ సమావేశమైనపుడు సిబిఐ తనను అరెస్టు చేయవచ్చన్న అంశాన్ని ఆయనే స్వయంగా
ప్రస్తావించారు. ‘సిబిఐ నన్ను అరెస్టు చేస్తే పార్టీని అమ్మ చూసుకుంటుంది’
అని జగన్ వ్యాఖ్యానించినట్లు ఆ పార్టీ నాయకులు తెలియజేశారు. జగన్ విషయంలో
కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాల వల్ల రానున్న పదిహేను రోజుల్లో
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయని
భావిస్తున్నారు.ఈ వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ‘ముఖ్యు’లకు
కూడా అధిష్ఠానం చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జగన్ విషయంలో కఠినంగా
ఉండాలన్న నిర్ణయంలో భాగంగా ముందుగా ఆయనకు మద్దతు ఇస్తున్న నెల్లూరు లోక్‌సభ
సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి గతంలో లోక్‌సభ సభ్యత్వానికి చేసిన
రాజీనామా లోక్‌సభ స్పీకర్ ఆమోదం పొందేలా చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో
జగన్‌కు మద్దతు ఇస్తున్న పదిహేడు మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా
చర్యలు తీసుకుంటోంది. ఈ వారంలోనే జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై
అనర్హత వేటు పడే అవకాశాలున్నాయి.Thursday, 1 March 2012
రెండోసారి కీమోథెరపీ చేయించుకున్న ...యువరాజ్‌సింగ్
ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న క్రికెటర్ యువరాజ్‌సింగ్ రెండోసారి
కిమోథెరపీ చేయించుకున్నారు. అమెరికాలోని బోస్టన్‌తో చికిత్స పొందుతున్న
యూవీ మెల్లమెల్లగా క్యాన్సర్ నుంచి కోలుకుంటున్నాడు. తాను రెండో సారి
కీమోథెరిపి చేయించుకున్నట్లు యువరాజ్ ట్విటర్‌లో తెలిపాడు. చికిత్సలో
భాగంగా మళ్లీ స్కానింగ్ ఈనెల ఏడో తేదీన ఉన్నట్లు యువీ ట్విటర్‌లో
చెప్పారు.ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న యువీ ట్యూమర్ తగ్గుతోందన్నాడు. గత
నెల రోజుల నుంచి బోస్టన్‌లోనే ఉంటున్న యువరాజ్ మే మొదటి వారంలో మళ్లీ
బ్యాట్ పట్టే అవకాశాలున్నాయి. జనవరిలో చికిత్సలో భాగంగా యువీ గుండు
చేయించుకున్నాడు. ఈనెల మొత్తం యువీ చికిత్స తీసుకోనున్నాడు. వచ్చే నెల
నుంచి రిహాబిలిటేషన్ మొదలవుతుంది.
నేటి నుంచి అనంతపురం జిల్లాలో చెరువు పోరు బాట
'నీరు లేనిదే మనిషికి మనుగడ లే దు... నీటి వనరులున్న చోట నాగరికత ఉంటుంది.
జిల్లాలో సాగునీటి సౌకర్యాలు పెద్దగా అందుబాటులో లేనందున చెరువులను
అభివృద్ధి చేయడం ద్వారానే కరువు కోరల నుంచి రైతన్నలకు విముక్తి
లభిస్తుంది. అందుకే 'చెరువు బాట' ప్రతి ఒక్కరికీ బతుకు బాట కావాలనే
ఆకాంక్షతో ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నామ'ని రాయలసీమ వికాస సాధన సమితి
అధ్యక్షుడు, సీనీనటుడు నరేష్ పేర్కొన్నారు. జిల్లాలో గురువారం
నుంచి 'చెరువుబాట' పేరుతో ఆయన రథయాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భా న్ని
పురస్కరించుకుని మార్చి 1 న
అనంతపురంలో రథయాత్రను ప్రారంభించి ఆరు రోజుల్లో 36 మండలాల మీదుగా 800 కిలో
మీటర్ల దూరం ప్రయాణించి ప్రజలను చైతన్య పరచనున్న ట్లు చెప్పారు. అన్ని
రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు,
స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు, కళాకారు లను భా గస్వాములను చేయనున్నట్లు
తెలిపారు. యాత్ర ద్వారా ప్రతి చెరువు చరిత్రా తెలు సుకోవాలని
ఆశిస్తున్నామన్నారు. యాత్రకు జాతీయ స్థా యిలో గుర్తింపు తీసుకురావాలనే
ఉద్దేశంతో మెగసెసే అవార్డు గ్రహీ త, వాటర్‌మన్ ఆఫ్ ఇండియాగా పే రొందిన
రాజస్థాన్ కు చెందిన రాజేంద్రసింగ్‌ను ఆహ్వానించామన్నారు. ఇక్కడి చెరువుల
అభివృద్ధి కోసం అవసరమైతే ప్రధాన మంత్రిని కూడా కలుస్తామన్నారు.చెరువుల అభివృద్ధి కోసమే
రాయలసీమ వికాస సాధన సమితి
దేశంలోనే కరువు జిల్లాగా గుర్తింపు పొందిన అనంతపురం నుంచి ప్రా రంభించి
రాయలసీమ వ్యాప్తంగా ఉండే చెరువులను అభివృద్ధి పరిచేందుకు అంచెలంచెలుగా
పోరాటాలు చేయాలనే ఉద్దేశంతోనే రాయలసీమ వికాస సాధన సమితి ఏర్పాటు చేసినట్లు
నరేష్ వెల్లడించారు.
జగన్ సిఎంగా ఉంటే బాగుండేది ...డిఎల్ రవీంద్రా రెడ్డి
మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి గురువారం సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా
సమాచారం. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండేదని కాంగ్రెసు పార్టీ
శాసనసభ్యులు మదనపడుతున్నారని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి గురువారం
అసెంబ్లీ లాబీల్లో అన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత తమిళనాడు గవర్నర్
కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా
ఒరిగిందేమీ లేదని అనుకుంటున్నారని ఆయన అన్నారు.మూడు నెలల్లో
ఆసుపత్రుల్లో డాక్టర్ల పోస్టులను భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. వారం
రోజుల్లో 130 పిహెచ్‌సిలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆసుపత్రుల్లో
వైద్యుల కొరత ఉందని కానీ మందుల కొరత మాత్రం లేదని చెప్పారు. మందులు అన్ని
ఆసుపత్రులలో దొరుకుతున్నాయని చెప్పారు.
Subscribe to:
Posts (Atom)



