Sunday, 16 October 2011

సీమాంధ్ర చలో ఢిల్లీ

సమైక్య వాణి వినిపించేందుకు నవంబర్ మొదటి వారంలో రాజకీయాలకు అతీతంగా చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు సాప్స్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు కోడూరు బాలసుబ్రమణ్యం, ఎన్.రాజారెడ్డిలు తెలిపారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరులతో వారు మాట్లాడారు. తెలంగాణ వాదులకు తలొగ్గి రాయలసీమ జిల్లాలను విడగొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంద ని ఆరోపించారు. రాష్ట్రం విచ్ఛిన్నమైతే పూర్తిగా నష్టపోయేది వెనుకబడిన రాయలసీమ ప్రాంతమేనని అన్నారు. అలాంటి రాయలసీమను కూడా విచ్ఛిన్నం చేస్తే మరింత నష్టపోతామని తెలిపారు.

రాజకీయ స్వార్థ ప్రయోజనాలతో కొంద రు వేర్పాటు వాదులు సకల సమ్మె పేరుతో ప్రజా జీవనాన్ని స్తంభింపజేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం విడ్డూరమన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఆందోళనలు చేసిన సమైక్యవాదులపై ప్రభుత్వం కేసులు పెట్టి జైళ్లకు పంపిందన్నారు. నెల రోజులుగా ఆందోళనలు చేస్తూ ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగి స్తున్న తెలంగాణా వాదులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కడపలో శుక్రవారం అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, జేఏసీ నాయకులతో ఏర్పాటు చేసిన సదస్సులో సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా కొన్ని తీర్మానాలు చేసినట్టు వారు తెలిపారు.

ఇండియా ప్రపంచంలోనే అత్యుత్తమ రచనలు

భారతీయ భాషల్లో వచ్చే సృజనాత్మక సాహిత్యం ప్రామాణికమైనది, చాలా గొప్పదని,నోబెల్ బహుమతికి తీసిపోని రచనలు భారతీయ భాషల్లో వచ్చాయని సరస్వతీ సమ్మాన్ అవార్డు గ్రహీత, ప్రముఖ అస్సామీ రచయిత లక్ష్మీనందన్ బోరా అన్నారు. మాతృభాషలో రాసే భారతీయ రచయితలు ప్రపంచంలోనే అత్యుత్తమ రచనలు చేశారని ప్రముఖ మళయాళీ కవి, విమర్శకుడు కె.సచ్చిదానందం అన్న మాటలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తిరుపతిలోని ఎస్వీయూ సెనేట్ హాల్‌లో శనివారం జరిగిన ఈశాన్య, దక్షిణ భారతీయ రచయితల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాహిత్య అకాడమీ, ఎస్వీయూ ఇంగ్లీషు విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం జరిగింది.

భారతీయ రచయితలు అభూత కల్పనలకు, సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తారని విఎస్.నైపాల్, సాల్మన్ రష్దీలు అనడం ద్వారా తమ అహంకారాన్ని ప్రదర్శించారని, భారతీయ రచయితల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని బోరా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ భాషల్లో వచ్చిన కొన్ని నవలలు నోబెల్ బహుమతి పొందడానికి అర్హమైనవని చెపుతూ కమలాదేవి, మహాశ్వేతాదేవి రచనలు నోబెల్ బహుమతి జాబితా వరకు వెళ్లాయన్నారు. ఈ సంవత్సరం మళయాళకవి సచ్చిదానందం పేరు నోబెల్ బహుమతి జాబితాలోకి వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అ స్సాంలో వేర్పాటువాద గ్రూపులు, బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు, వివిధ రూపాల్లో అత్యాచారాలు, భిన్న జీవన విధానాలు, లంచగొండి తనం, రాజకీయ అస్థిరత, తరతరాల మానవ విలువలు అక్కడి రచనల్లో కనిపిస్తాయన్నారు.

సాహిత్య అకాడమీ వల్ల వివిధ భారతీయ భాషల్లోని సాహిత్యం అన్ని భారతీయ భాషల్లోకి రావడం వల్ల జాతీయ గుర్తింపు లభిస్తోందని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో రెండు వందల భాషలున్నాయని, దక్షిణాది రాష్ట్రాల్లో ఇరవై నాలుగు భాషలున్నాయని ఈ సమ్మేళనంలో ప్రసంగించిన ప్రముఖ కథారచయిత కేతు విశ్వనాథరెడ్డి అన్నారు. ఈ రాష్ట్రాల్లోని భాషా సాహిత్యాల అధ్యయనానికి ఎస్వీయూ ఇంగ్లీషు విభాగం తలుపులు తెరవాలని ఆయన కోరారు. సాహిత్య అకాడమీ ఉపకార్యదర్శి కె.శ్రీనివాసరావు అకాడమీ చేస్తున్న కృషిని ప్రారంభోపన్యాసంలో వివరించారు.

సొంత భాషలో పురిటి నొప్పులు
‘ఈ దేశపు తల్లులు సొంత భాషలో పురిటి నొప్పులు పడడం మర్చిపోయారు’ అంటూ ప్రముఖ కవయిత్రి కొండేపూడి నిర్మల ‘పంజరం’ అన్న స్వీయ కవితను వినిపించారు.‘అనువదిస్తే తప్ప నాకల నీకర్థం కాదు’ అంటూ ఇంగ్లీషు భాష పెత్తనాన్ని వ్యక్తీకరించారు. ప్రారంభ సమావేశానంతరం కవితా పఠన కార్యక్రమం జరిగింది. ‘అర్థవంతమైన వాక్యా లు మాట్లాడి మాట్లాడి అలిసిపోయాను’ అని కెఎస్.రమణ తన కవితా పఠనంలో అన్నారు. కన్నడంలో మృత్యుంజయ, మళయాళంలో రోజ్‌మేరి, తమిళంలో తంగంమూర్తి తమ స్వీయ కవితలను చదివారు. సాయంత్రం జరిగిన కవితా పఠనంలో ఎస్.మునిసుందరం ‘గంగిరెద్దు’ అన్న కవితతో పాటు మరికొన్ని కవితలను చదివారు. 

- ఎస్వీ యూనిర్సిటీ 


source: sakshi 

పంట నష్టం భారీ!

జిల్లాలో 5.98 లక్షల హెక్టార్లలో సాగు చేసిన ఖరీఫ్ పంటలు వర్షాభావం వల్ల దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు రాష్ర్ట ప్రభుత్వానికి నివేదిక పంపించారు. మొత్తం 9.45 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. సెప్టెంబర్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల 5.98 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు ఏడీఏ, ఏఓలు సమగ్ర నివేదిక తయారుచేశారు. ఇందులో 5.75 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంటకు నష్టం వాటిల్లినట్లు పొందుపరిచారు. జిల్లాలో 7.07 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగులోకి వచ్చిందని, అందులో మొదటి విడతగా విత్తుకున్న 1.32 లక్షల హెక్టార్ల పంట కొంతవరకు బాగున్నా, రెండు, మూడు విడతలుగా వేసుకున్న పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు నమోదు చేశారు. 

అనంతపురంలో మరో క్రికెట్ తార

రంజీల్లో తమ అద్భుత ప్రతిభతో జిల్లాకు పేరు తెచ్చిన క్రికెటర్లు ప్రసాద్‌రెడ్డి, షాబుద్దీన్, డీబీ ప్రశాంత్‌కుమార్ సరసన ఇప్పుడు సల్మాభాను చేరింది. సల్మా సాధారణ మధ్యతరగతి యువతి. ఈమె తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఆర్డీటీ, జిల్లా క్రికెట్ సంఘం సహకారంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యంగా ముందుకెళుతోంది. క్రికెట్‌లోకి అమ్మాయిలు అడుగుపెట్టడమే అరుదైన ఈ రోజుల్లో సల్మాభాను ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

profile: 



సల్మాభాను కుటుంబం అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డు వద్ద నివాసముంటోంది. తండ్రి సయ్యద్ అప్సర్ రైతు. తల్లి మహముదా గృహిణి. సల్మా ప్రస్తుతం ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. 2003లో ఆఫ్ స్పిన్నర్ గా   క్రికెట్‌ కెరియర్ ప్రారంభించింది. జిల్లా క్రికెట్ సంఘం మాజీ కార్యదర్శి సాగర్ చౌదరి ఈమె గురువు. జిల్లా జట్టుకు ఎంపికై  అనతికాలంలోనే కీలక క్రికెటర్‌గా ఎదిగింది. 2007లో జాతీయ మహిళా క్రికెట్ అసోసియేషన్‌ను బీసీసీఐలోకి విలీనం చేశారు. అదే ఏడాది జరిగిన సెలక్షన్ ట్రయల్స్‌కు సల్మా హాజరైంది. అయితే..తన ఆటతీరుతో సెలక్టర్లను ఆకట్టుకోలేకపోయింది. దాంతో నిరాశ చెందకుండా మరింత శ్రమించింది. ఆ మరుసటి ఏడాదే రాష్ట్ర అండర్ -19 మహిళా జట్టుకు ఎంపికై, జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసింది. తర్వాత వెనుదిరిగి చూడలేదు. 2009లో సీనియర్ మహిళా క్రికెట్ టోర్నీలో ఆడే అవకాశం లభించింది. 

అదే ఏడాది అండర్ -19 సౌత్ ఇండియా టోర్నీలో తమిళనాడుపై 5 వికెట్లు, కర్ణాటకపై 3 వికెట్లు తీసుకుని, నేషనల్ క్రికెట్ అకాడమీకి ఎంపికైంది. 2010లో సౌత్ ఇండియా సీనియర్ క్రికెట్ టోర్నీలో 13 వికెట్లు తీసుకుని సత్తా చాటింది. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా సౌత్ ఇండియా జట్టులో చోటు సంపాదించింది. వైజాగ్‌లో జరిగిన ఆలిండియా ఇంటర్ జోనల్ పోటీల్లో పాల్గొంది. అందులోనూ ప్రతిభ చూపడంతో సీనియర్స్ జాతీయ క్రికెట్ శిక్షణ శిబిరానికి ఎంపిక చేశారు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో శిక్షణ ఇచ్చారు.

ఇండియా రెడ్ జట్టుకు ఎంపిక
త్వరలో జరగనున్న భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) మహిళా చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఇండియా రెడ్ జట్టులో సల్మాభాను చోటు దక్కించుకుంది. బరోడాలో ఈ నెల 4న జరగనున్న మ్యాచ్‌లో ఆమె ఆడనుంది.

భారత జట్టుకు ఆడటమే లక్ష్యం - సల్మా
చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. అందులోనే ముం దుకెళ్తున్నా. ఆర్డీటీ ప్రోగ్రామ్ డెరైక్టర్ మాంఛూఫై, జిల్లా క్రికెట్ సం ఘం సభ్యుడు, కోచ్ సాగర్‌చౌదరి సహా యం మరువలేనిది. భారత జట్టుకు ఆడాలన్నదే లక్ష్యం. మా తల్లిదండ్రుల ఆశయం కూడా ఇదే. ఆ దిశగా ముందుకెళ్తున్నా. 

వాటర్ షెడ్లలో అనంతపురం 1st

వాటర్‌షెడ్ల పథకం నిర్వహణలో అనంతపురం జిల్లా మొదటిస్థానం సాధించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమల్లో నాల్గవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విజయవాడలో శుక్ర, శనివారాల్లో ఉపాధిహామీ పథకం సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరిగిన ఉపాధిహామీ, వాటర్‌షెడ్ల పనులను మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, కమిషనర్ జయలక్ష్మి, స్పెషల్ ఆఫీసర్‌లు విద్యాసాగర్, సువర్ణతో పాటు డెరైక్టర్ ఏ.మురళి సమీక్షించారు. జిల్లాలో 1999 నుంచి 2007 వరకు రూ.227.38 కోట్ల వ్యయంతో 3,78,969.67 హెక్టార్ల విస్తీర్ణంలో వాటర్‌షెడ్ల పథకం అమలు చేశారు. మెగా వాటర్‌షెడ్ల పథకం 2009లో జిల్లాలో ప్రారంభం కాగా, 70 మెగా వాటర్‌షెడ్లు, 202 మైక్రో వాటర్‌షెడ్లు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

వీటిని ప్రాతిపదికగా తీసుకున్న ప్రభుత్వం వాటర్‌షెడ్ల నిర్వహణలో జిల్లాకు మొదటిస్థానం ఇచ్చింది. ఉపాధిహామీ పథకం ప్రారంభం నుంచి జిల్లాలో 9,28,73,112 పనిదినాలు కల్పించారు. ఇందుకోసం రూ.1,158.91 కోట్లు ఖర్చు చేశారు. 2010-11లో 2,03,03,163 పనిదినాలు కల్పించి, రూ.332కోట్లు వ్యయం చేశారు. 2011-12లో 91,62,477 పని దినాలను ఇప్పటి వరకు కల్పించారు. ఇందుకోసం రూ.134.70 కోట్లు వెచ్చించారు. అలాగే ఉపాధి కూలీలకు రోజువారీ వేతనం సగటున రూ.106.35 పైసలు చెల్లించారు. నిధుల వినియోగం, కూలీల సగటు వేతనం పరిగణనలోకి తీసుకోవడంతో ఉపాధిహామీలో మాత్రం జిల్లాకు రాష్ర్టంలో నాల్గవ స్థానం దక్కింది.

టిటిడి పశుగ్రాస బరువునిర్దారణ పరికరాన్ని విరాళంగా అందజేశారు

 టిటిడి ఎస్వీ గోసంరక్షణశాలకు బెంగుళూరుకు చెందిన ఎస్‌ఏ ఎలక్ట్రానిక్ పరికరాల కంపెనీ 13 లక్షల రూపాయలు విలువ చేసే పశుగ్రాస బరువునిర్దారణ పరికరాన్ని శనివారం విరాళంగా అందజేశారు. టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు దాత ఎస్‌ఏ వెంకటేశన్ కుటుంబ సమేతంగా ఈ పరికరాన్ని అందజేశారు. దాదాపు 40 టన్నుల వరకూ ఈ పరికరం ద్వారా పశుగ్రాసాన్ని, ఇతర దాణాల బరువును గుర్తించవచ్చు. ఈ సందర్భంగా ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ధార్మిక సంస్ధాపనలో భాగంగా దేశం నలుమూలల నుండి విచ్చేసే దాతలు తమకు నచ్చిన రీతిలో టిటిడికి సహాయం అందించడం ముదావహామన్నారు. దాతలకు సంబంధించి టిటిడి ఎప్పుడు తనవంతు ప్రోత్సాహాన్ని అభినందనలను అందిస్తూనే వుంటుందన్నారు. స్వామివారి వైభవ ప్రచారంలో కూడా దాతలు బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం దాత ఎస్‌ఏ వెంకటేశన్ మాట్లాడుతూ తాము కంపెనీ ప్రారంభించిన తొలిరోజుల్లోనే స్వామివారికి నాణేలు తూకం వేసే పరికరాన్ని అందించామన్నారు. ప్రస్తుతం తమ కంపెనీ స్వామి కృపతో 250 కోట్ల టర్నోవర్‌తో లాభసాటిగా నడుస్తొందన్నారు. భవిష్యత్తులో కూడా స్వామివారి సేవలో తరించడానికే తాము కట్టుబడి వుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గోశాల సంచాలకులు హరినాథ్ రెడ్డి, ఇఎస్ వన్ సుధాకర్ తదితరులున్నారు

తిరుపతిలో 18.61 ఎకరాల విస్తీర్ణంలో వసతి సముదాయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు

                       
శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వచ్చే భక్తుల అవసరాలను దృష్టిలో వుంచుకుని తిరుపతిలో వసతి సముదాయాల నిర్మాణాలను టిటిడి చేపడుతోందని టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. ఆయన శనివారం తిరుపతిలోని రెండవ సత్రం ఉచిత యాత్రికుల వసతి సముదాయాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం నలుమూలల నుండి శ్రీవారి దర్శనార్ధం తిరుపతికి వచ్చే భక్తులకు తిరుమలలోనే కాకుండా తిరుపతిలో కూడా వసతి సముదాయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ మూడు సత్రాలు 18.61 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన అతిపురాతనమైనవన్నారు. ఇప్పుడు వసతి సౌకర్యాలు ఎంతో బాగున్నాయని, వీటిని మరింత ఆధునీకరిస్తామన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో వుంచుకుని తిరుపతిలో శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసం వంటి వసతి సముదాయాలను తిరుపతిలో నిర్మించిందన్నారు. తిరుపతిలోనే భక్తులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం రెండవ సత్రాన్ని ఆయన పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న డార్మిటరీలను, మరుగుదొడ్లను పరిశీలించారు. భక్తులతో టిటిడి కల్పిస్తున్న సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు.
అండగావుంటా
ఆధైర్యపడవద్దు
తిరుపతిలోని టిటిడి ధర్మసత్రాలను పరిశీలించిన టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు శనివారం అక్కడకు చేరుకోగానే అక్కడ ఎంతోకాలంగా అసౌకర్యాల నడుమ జీవనం సాగిస్తున్న నిర్వాసితులు ఆయన పాదాలపై మొకరిల్లి తమకు న్యాయం చెయ్యాలని వేడుకున్నారు. దీంతో వారికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు

దేశంలో వివిధ ప్రైవేటు పథకాలకు దీటుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ పథకాలను ప్రవేశపెట్టారు

                                
దేశంలో వివిధ ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ పథకాలకు దీటుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ పథకాలను ప్రవేశపెట్టారు. ఈ మేరకు శనివారం స్థానిక స్టేట్ బ్యాంకులో చీఫ్ మేనేజర్ ఎన్.వెంకటయ్య వివిధ స్కీములను లాంచింగ్ చేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ఇన్సూరెన్స్ పథకం ద్వారా కార్లు, ఇళ్లు, అన్ని వాహనాలకు, స్టాక్స్, షాపులు, బిల్డింగ్‌లకు తక్కువ ప్రీమియంతో ప్రతి ఒక్కరూ లబ్ధిపొందవచ్చని వెంకటయ్య తెలిపారు. వివిధ వాహనాల మరమ్మతుల నిమిత్తం 56 రకాలకు ఈ పథకం వర్తించనున్నది. ఏదైనా వాహనం ప్రమాదానికి గురైతే సంబంధిత వాహనదారుడు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా 7 రోజులలోపు ఆ వాహనాన్ని గ్యారేజీకి తీసుకెళ్లడానికి ఇన్సూరెన్స్ ఉన్నవారికి బ్యాంకు రోజుకు వెయ్యి రూపాయల చొప్పున చెల్లిస్తుందని ఆయన తెలిపారు. ఇంత వరకు ఈ పథకాన్ని ఏ సంస్థ కూడా ప్రవేశపెట్టలేదని ఆయన చెప్పారు. అలాగే ఈ ఏడాది 4000 మంది రైతులకు రూ.12 కోట్లు రాయచోటి ఎస్‌బిఐ పరిధిలో రుణాలు ఇచ్చామని సంబంధిత రైతులు బీమా చేసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా పేదరిక నిర్మూలన పథకం కింద ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వయం సహాయక గ్రూపులకు తమ బ్యాంకు నుంచి 1000 మహిళా గ్రూపులకు ఎనిమిది కోట్ల రూపాయలను ఇప్పటి వరకు పంపిణీ చేశామని, సక్రమంగా పని చేసే గ్రూపులకు మరింత ప్రోత్సాహాలు అందిస్తామని తెలిపారు. అలాగే రూరల్ బ్యాంకింగ్ డెవలప్‌మెంట్ ( ఆర్‌బిడి) మేనేజర్ అమిత్ కుమార్ మాట్లాడుతూ ఛీఫ్ మేనేజర్ ఆదేశాల మేరకు ఇన్సూరెన్స్‌లకు సంబంధించిన సందేహాలు తనను కలిసి నివృత్తి చేసుకోవాలని ఆయన కోరారు

మల్లికార్జునస్వామి దేవస్ధానంలో ఆర్జిత సేవ టికెట్ల ధరలను భారీగా పెం పు

 అష్ఠదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల భ్రమరాంబికా, మల్లికార్జునస్వామి దేవస్ధానంలో ఆర్జిత సేవ టికెట్ల ధరలను భారీగా పెంచి భక్తులను దోచుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, కాళింగ నరసింహవర్మలు అన్నారు. భక్తులకు ఎలాంటి కష్టం వాటిల్లిన, కోరిన కోరికలు తీర్చు కొంగుబంగారం అయిన స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి, మొక్కులు తీర్చుకునే అవకాశం లేకుండా దేవస్ధానం వారు ఆర్జిత సేవ టికెట్ల ధరలను పెంచి భక్తులను నిలువు దోపిడీ చేయడం దారుణమని అన్నారు. మొన్నటికి మొన్న భక్తులు ఎంతో పవిత్రంగా చూసే లడ్డు, పులిహోర ప్రసాదాల ధరలను పెంచి భక్తులను ఇబ్బంది కల్గించాలని వారు విమర్శించారు. దేవస్ధానం అధికారులు భక్తుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు.

గ్రామాలలో పాల ప్రగతి కేంద్రాల

                                          
పాల ఉత్పత్తిని పెంచేందుకు గ్రామాలలో పాల ప్రగతి కేంద్రాల (మినీ డెయిరీ యూనిట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈఓ రాజశేఖర్ తెలిపారు. శనివారం స్థానిక ప్రశాంతి జిల్లా సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర మిల్క్ మిషన్ వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రోజూ 3కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోందని, దీనిని 5 కోట్లకు పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.

రాబోయే ఐదేళ్లలో పాడి పశువులు, దూడల పెంపకం, వట్టిపోయిన పశువుల పోషణ, పాలశీతల కేంద్రాల నిర్వహణ తదితర కార్యక్రమాలు చేపట్టి గణనీయమైన ఉత్పత్తి సాధించాలని అధికారులకు సూచించారు. ‘రాష్ట్ర మిల్క్‌మిషన్’ కార్యక్రమం ద్వారా జిల్లాలోని సభ్యులందరికీ అన్ని విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే వర్క్‌షాపు కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి జిల్లాలోనూ సంచార పశు వైద్యశాలలను (మొబైల్ వెటర్నరీ క్లినిక్) ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాలు పితకడంతో పరిశుభ్రత ముఖ్యమన్నారు

అనంతపురం జిల్లా మొదటిస్థానం సాధించింది వాటర్‌షెడ్ల పథకంలో

 వాటర్‌షెడ్ల పథకం నిర్వహణలో అనంతపురం జిల్లా మొదటిస్థానం సాధించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమల్లో నాల్గవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విజయవాడలో శుక్ర, శనివారాల్లో ఉపాధిహామీ పథకం సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరిగిన ఉపాధిహామీ, వాటర్‌షెడ్ల పనులను మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, కమిషనర్ జయలక్ష్మి, స్పెషల్ ఆఫీసర్‌లు విద్యాసాగర్, సువర్ణతో పాటు డెరైక్టర్ ఏ.మురళి సమీక్షించారు. జిల్లాలో 1999 నుంచి 2007 వరకు రూ.227.38 కోట్ల వ్యయంతో 3,78,969.67 హెక్టార్ల విస్తీర్ణంలో వాటర్‌షెడ్ల పథకం అమలు చేశారు. మెగా వాటర్‌షెడ్ల పథకం 2009లో జిల్లాలో ప్రారంభం కాగా, 70 మెగా వాటర్‌షెడ్లు, 202 మైక్రో వాటర్‌షెడ్లు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

వీటిని ప్రాతిపదికగా తీసుకున్న ప్రభుత్వం వాటర్‌షెడ్ల నిర్వహణలో జిల్లాకు మొదటిస్థానం ఇచ్చింది. ఉపాధిహామీ పథకం ప్రారంభం నుంచి జిల్లాలో 9,28,73,112 పనిదినాలు కల్పించారు. ఇందుకోసం రూ.1,158.91 కోట్లు ఖర్చు చేశారు. 2010-11లో 2,03,03,163 పనిదినాలు కల్పించి, రూ.332కోట్లు వ్యయం చేశారు. 2011-12లో 91,62,477 పని దినాలను ఇప్పటి వరకు కల్పించారు. ఇందుకోసం రూ.134.70 కోట్లు వెచ్చించారు. అలాగే ఉపాధి కూలీలకు రోజువారీ వేతనం సగటున రూ.106.35 పైసలు చెల్లించారు. నిధుల వినియోగం, కూలీల సగటు వేతనం పరిగణనలోకి తీసుకోవడంతో ఉపాధిహామీలో మాత్రం జిల్లాకు రాష్ర్టంలో నాల్గవ స్థానం దక్కింది.
ఎస్సీ, ఎస్టీల భూములను సాగులోకి తీసుకువచ్చే ప్రక్రియ జిల్లావ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతుల భూములను ఉపాధిహామీ ద్వారా సాగులోకి తీసుకురావాల్సిందిగా ఆ పథకం కమిషనర్ జయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో సుమారు 47 వేల ఎకరాల విస్తీర్ణంలో ఎస్సీ, ఎస్టీల బీడు భూములు ఉన్నాయని డ్వామా పీడీ ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో 20 వేల ఎకరాలను ఈ ఏడాది సాగులోకి తీసుకురావాలని కమిషనర్ సూచించారు. బలహీన వర్గాలకు చెందిన 1,48,044.45 యూనిట్‌లలో రూ.532.96 కోట్లు వ్యయం చేసి ఉపాధి పనులు నిర్వహించారు