Friday, 18 November 2011

నయనతార కు హాట్సాప్:ప్రభుదేవ

బాలయ్య రాముడి పాత్రలో, నయనతార సీత పాత్రలో నటించిన శ్రీరామ రాజ్యం సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి హిట్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో సీతగా నటించిన నయనతార తన ప్రియుడు, కాబోయే భర్త ప్రభుదేవతో కలిసి సినిమా వీక్షించింది. ఈ సినిమాలో నయన అభియనం చూసి ముగ్ధుడైపోయాడు ప్రభుదేవా. నయన నటనకు హాట్సాప్, ఆమె సినిమా షూటింగ్ జరిగినంత కాలం చాలా పవిత్రంగా జీవనం గడిపింది, అప్పుడు మరీ ఇంత అవసరమా? అని భావించాను, కానీ సినిమా పట్ల ఆమె అంకిత భావం మంచి ఫలితం ఇచ్చినందుకు సంతోషంగా ఉందని తన సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం. "నయనతార మా 'శ్రీరామరాజ్యం' షూటింగ్‌లో పాల్గొన్నన్ని రోజులూ మహాసాధ్విగానే ప్రవర్తించింది. ప్రతిరోజూ ఉదయం గుడికెళ్ళిగానీ సెట్‌లో అడుగుపెట్టేది కాదు. శాకాహారమే తీసుకుంది. ఆమె కృషి ఫలితం తప్పకుండా స్క్రీన్‌పై కనిపిస్తుంది'' అని నిర్మాత యలమంచిలి సాయిబాబు 'శ్రీరామరాజ్యం' విడుదలకు ముందు చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకుని తెగ పొంగి పోయాడట ప్రభుదేవ. నాకు కాబోయే జీవిత భాగస్వామి మంచి పేరు తెచ్చుకోవడం ఆనందం ఉంది, సినిమాలోనే కాదు...ఆమె నిజంగా పవిత్రురాలే అంటూ ఆనంద పడిపోతున్నాడట

పర్యావరణ పరిరక్షణకు ఓ యువకుడు తనవంతు కృషి

పర్యావరణ పరిరక్షణకు ఓ యువకుడు తనవంతు కృషి చేస్తున్నాడు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలంటూ గోడలపై రాస్తూ ప్రచారం చేపట్టాడు.ప్లాస్టిక్‌ను నిషేధించాలంటూ అతను చేపట్టిన ప్రచారానికి ఇప్పుడు పలువురు తోడయ్యారు. చిత్తూరు జిల్లాలో ఒకే ఒక్కడుగా సైకిల్‌పై తిరుగుతూ గోడరాతలతో ప్రజలను చైతన్య పరుస్తున్నాడు. ఆత్మవిశ్వాసంతో సైకిల్‌పై వెళుతున్న ఇతని పేరు మురళి. డిగ్రీ వరకు చదవుకున్న ఇతను ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూ ప్రకృతిపై ప్రేమను పెంచుకున్నాడు. ఆధునిక పోకడలతో అడవులను నరుకుతూ పర్యావరణానికి చేస్తున్న కీడుపై ప్రజలకు అవగాహనకల్పించాలన్న సంకల్పం బాగా వంట బట్టించుకున్నాడు. అందుకు గోడలపై రాతలనే ప్రచారంగా ఎంచుకున్నాడు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదంటూ జన జాగృతం చేస్తున్నాడు. తనకొచ్చిన జీతంలోనే కొంత వెచ్చిస్తూ గోడలపై సందేశాత్మక రాతలను రాస్తున్నాడు.మురళి కృషిని ఇప్పుడు ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. కొందరు అతనికి తోడుగా తమవంతుగా చేయూతను ఇస్తున్నారు

వైయస్సా పార్టీ శానససభ్యులు తిరిగి వెనక్కి వస్తారు:జెసి దివాకర్ రెడ్డి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెసు సీనియర్ నేత, శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి పోట్లగిత్తగా అభివర్ణించారు. జగన్ వెంట వెళ్లినవారు పోట్ల గిత్తలేనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెసు, జగన్ నాయకత్వాలను రుచి చూసిన తమ పార్టీ శాసనసభ్యులు మరింత రాణిస్తారని ఆయన అన్నారు.అన్నిరకాలుగా అండదండలున్నవారు మరింత పోట్ల గిత్తల్లా వారు మారిపోతున్నారని ఆయన అన్నారు. పోట్ల గిత్తల్లా వెళ్లినవారిని ఎద్దుల్లా మార్చి తిరిగి తమ కాంగ్రెసు పార్టీలోకి పంపిస్తున్నారని, సంతోషమేనని ఆయన అన్నారు. ఎద్దులుగా మారిన తర్వాత వారు మరింతగా రాణిస్తారని ఆయన అన్నారు. జగన్ వెంట వెళ్లనవారు వయ్ససులో ఉన్నవారు, పోట్ల గిత్తల్లాంటివారని ఆయన అన్నారు. కాంగ్రెసు నుంచి వెళ్లినవారు తిరిగి రాక తప్పదని ఆయన అన్నారు. వైయస్ జగన్ వెంట వెళ్లిన తమ కాంగ్రెసు పార్టీ శానససభ్యులు తిరిగి వెనక్కి వస్తారనే వార్తలపై ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు. దాదాపు డజను మంది శానససభ్యులు జగన్‌ను వీడి కాంగ్రెసులోకి రావడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే

తిరుమల ఉచిత భోజన టోకన్లు రద్దు


తిరుమలలో టిటిడి ఏర్పాటు చేసిన తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవన సముదాయంలో ప్రసాదం తినే భక్తులకు టోకన్ విధానాన్ని ప్రవేశపెట్టడంపై టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత భోజనానికి టోకన్లు పెట్టమని ఎవరు చెప్పారని అన్నదానం డిప్యూటీ ఇఓ గజపతిని ప్రశ్నించారు. వాస్తవానికి ఈ టోకన్ విధానాన్ని తిరుమల జేఇఓ శ్రీనివాసరాజు వారం రోజుల క్రితం ప్రవేశపెట్టారు. ఈ నేపధ్యంలో గురువారం అన్నదానం భవనాన్ని తనిఖీ చేసిన చైర్మన్ టోకన్ విధానంతో భక్తులు భోజనశాలకు వెళుతున్న విషయాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా టోకన్ కౌంటర్ వద్ద భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరి ఉన్నారు. కానీ, లోపల భోజన హాలు మాత్రం ఖాళీగా ఉంది.  దీంతో ఆగ్రహించిన బాపిరాజు ఇలాంటి ఆలోచనలు చేసి భక్తులను ఎందుకు ఇబ్బంది పెడతారంటూ ప్రశ్నించారు. అలాగే, పాదరక్షలు లేకుండా భోజనం చెయ్యాలన్న నిబంధన ఎందుకు పెట్టారు? పోనీ ఒక నిబంధన పెట్టినప్పుడు అందుకు తగిన సౌకర్యాలు ఎందుకు కల్పించలేదు? అని కోప్పడ్డారు. అయినా బెంచిలపై కుర్చుని భోజనం చేస్తున్న భక్తులకు పాదరక్షలు వున్నా లేకున్నా ఒకటేనని వ్యాఖ్యానించారు. భక్తులకు సదుపాయాలను వీలైనంత తక్కువ ఇబ్బందులతో కల్పించాలని సూచించారు.

తిరుమలలో శుభ్రత, భద్రత ప్రధానం
తిరుమల పుణ్యక్షేత్రం శుభ్రంగా వుండటం, వైకుంఠం కాంప్లెక్స్‌లోని భక్తులకు భద్రత కల్పించడమే తన ఆశయమని టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లు తనిఖీ సందర్భంగా భద్రతకు సంబంధించి ఆయన అధికారులను ప్రశ్నించారు. కాంప్లెక్స్ భద్రత ఎవరి పర్యవేక్షణలో వుంటుందని ప్రశ్నించారు. టిటిడి నిఘా అధికారుల పర్యవేక్షణలో వుంటుందని అక్కడనున్న సిఐ తెలిపారు. అలా కాకుండా పోలీసులు ఈ భద్రత పర్యవేక్షించరా? అని ప్రశ్నించారు. డిఎస్‌పి రెడ్యానాయక్ పర్యవేక్షణలో భద్రత చూస్తున్నామని సిఐ సమాధానమిచ్చారు. వెంటనే ఆయన రెడ్యానాయక్‌తో ఫోన్లో మాట్లాడుతూ మీరు తిరుపతిలో వున్నా ఎక్కడ వున్నా తిరుమల పర్యవేక్షణ చెయ్యాల్సిన బాధ్యత మీపై వుందని గుర్తుచేశారు. తాను ఎన్నో పర్యాయాలు తనిఖీకి వచ్చినా తానెప్పుడు మిమ్మల్ని తిరుమలలో చూడలేదని చురక అంటించారు. చైర్మన్ వెంట ఇఇ జగన్మోహన్‌రెడ్డి, డిప్యూటీ ఇఇలు హర్షవర్ధన్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, ఏవిఎస్‌ఓ యుగంధర్, అప్పారావు, డిప్యూటి క్యాటరింగ్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు

కర్నూలు బాలకృష్ణ అభిమానుల కొత్త సంప్రదాయం

కర్నూలు నగర నందమూరి అభిమానులు కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. తమ అభిమాన నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం సినిమాకు గురువారం అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించి వారికి ప్రత్యేకంగా చూపించారు. అభిమాన నటుల సినిమా విడుదలైతే అభిమానులు తమ ఆనందాన్ని భారీ ఎత్తున టపాసులు పేల్చడం, పండుగ వాతావరణం నడుమ జరుపుకుంటారు. అయితే కర్నూలు నందమూరి అభిమానులు ఈ సారి తమ అభిమాన నటుడు బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం సినిమాకు అన్ని రాజకీయ పక్షాల నాయకులను ఆహ్వానించి చూపడం విశేషం. అంతేకాకుండా వారిని సినిమాహాల్ లోపలికి మంగళవాయిద్యాలతో పూలు జల్లుతూ తీసుకెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాలకృష్ణ రాజకీయ రంగ ప్రవేశంపై వస్తున్న వార్తల నడుమ ఆయన అభిమానులు సినిమా విడుదలను ఇలా అఖిల పక్ష నేతలకు చూపడం చర్చనీయాంశంగా మారింది. అంతేగాక పౌరాణిక సినిమా కావడంతో సినిమాహాళ్ల వద్ద సీతారాముల చిత్రపటాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రత్యేక ప్రదర్శనకు టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే కెయి కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, డిసిసి అధ్యక్షుడు ఎస్. రఘురామిరెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లగిశెట్టి విశ్వనాథం, వామపక్ష పార్టీల నాయకులు హాజరై అభిమానులను అభినందించారు. సినిమా విజయవంతం కావాలని ఆకాక్షించారు