కొత్త ఇంటి మురిపెం తీరముందే బ్యాటింగ్ మ్యాస్ట్రో సచిన్ టెండూల్కర్‌కు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) భారీ జరిమానా వడ్డించింది. ఎంతో ముచ్చటపడి ముంబయి శివారు ప్రాంతం బాంద్రాలో ఓ పాత భవంతిని కొనుగోలు చేసి దాన్ని తన అభిరుచులకనుగుణంగా ఆధునీకరించుకున్న సచిన్... ఆ ఐదు అంతస్థుల కొత్త ఇంటికి బీఎంసీ నుంచి ఆక్యుపేషన్ సర్టిఫికెట్ (ఓసీ) తీసుకోలేదట.
దీంతో బీఎంసీ ఈ మాస్టర్‌బ్లాస్టర్‌కు రూ. 4.35 లక్షల మేరకు పెనాల్టీ విధించింది. ఈ జరిమానాను సచిన్ చెల్లించినట్టు సమాచారం. కాగా, బీఎంసీ అధికారి ఒకరు ఈ విషయం గురించి మాట్లాడుతూ, ముందు జరిమానా చెల్లించాల్సిందేనని, ఆ తర్వాత మరో నాలుగు రోజుల్లో ఓసీ పొందవచ్చని వెల్లడించారు
No comments:
Post a Comment