Wednesday, 7 December 2011
‘పంజా’ సినిమా కు ‘A’సర్టిఫికెట్
సిఎం క్యాంపు కార్యాలయంలో వైయస్ వివేకాకు విచిత్ర అనుభవం
రైతు బాధలు చూస్తే గుండె పగులుతోంది....జగన్‌మోహన్‌రెడ్డి
మంత్రివర్గ విస్తరణ లో మెగా ప్యాకేజీ….?
డిసెంబరు రెండో వారంలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఈమేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పటి వరకూ మంత్రివర్గ విస్తరణ జరగలేదు. రోశయ్య హయాంలో పనిచేసిన మంత్రులనే నేటికీ కేబినెట్‌లో కొనసాగిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని ఊహాగానాలొచ్చాయి. అయితే సకలజనుల సమ్మె, తెలంగాణా సమస్య తీవ్రం కావడంతో విస్తరణ వాయిదా పడింది .ఇక జాక్‌పాట్ కొట్టింది మెగాస్టారే. ఎందుకంటే మొన్న జరిగిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా చిరంజీవి బ్యాచ్ అలక వహించి నేరుగా హైకమాండ్ నుంచి పెద్ద హామీలనే పొందింది. మెగా ప్యాకేజీనే దక్కించుకుంది. మంత్రివర్గ విస్తరణలో పిఆర్పీ ఎమ్మెల్యేలు ఐదుగురికి మంత్రి పదవులు ఇవ్వాన్నది వారి డిమాండ్. అంతకు ముందు ఇద్దరికి మంత్రి పదవులిస్తే చాలన్న చిరు మొన్న అవిశ్వాస తీర్మానం తర్వాత ఐదుగురికివ్వాలని హైకమాండ్ ముందు ప్రతిపాదన ఉంచారు. ఇందుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ చిరుకు ఆమేరకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇదే జరిగితే తూర్పు, విశాఖలోని ఇద్దరు మంత్రులకు కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పదు. మొత్తం మీద చిరు బ్యాచ్ జాక్ పాట్ కొట్టిందని చెప్పక తప్పదు
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో జాగ్రత్త..!
Subscribe to:
Posts (Atom)