విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జన్మదిన వేడుకలు, ఆయన విరచిత జాతీయ గీతం
'జనగణమన' వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గీతానికి స్వరకల్పన జరిగిన
మదనపల్లి బిటి కళాశాలలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఠాగూర్
విగ్రహాన్ని ఆవిష్కరించి, 10 వేలమంది విద్యార్ధులతో కలిసి 'జనగణమన' గీతం
ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీటీ కాలేజీ ప్రహరీ గోడకై రూ.2
కోట్లు జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయన రచించిన జాతీయ గీతం
భారతీయులకు స్ఫూర్తిగా నిలిచిందని సీఎం కొనియాడారు. చిత్తూరు జిల్లాలో
రెండు రోజులు పర్యటించనున్నారు.ఏ గీతం వింటే దేశవిదేశాల్లోని భారతీయుల హృదయాలు పులకరిస్తాయో. దేశంలోని 120
కోట్ల మంది లేచి నిల్చుని గౌరవిస్తారో అలాంటి జాతీయగీతాన్ని మంగళవారం
మదనపల్లెలోని బిసెంట్ దివ్యజ్ఞాన కళాశాలలో పదివేల మంది విద్యార్థులు
ముక్తకంఠంతో 20సార్లు జాతీయగీతాన్ని ఆలపించి రెండు లక్షల గళార్చన
పూర్తిచేశారు.తొలుత బెంగాలీలో రచించిన ఈ గీతాన్ని మదనపల్లె బీటీ కళాశాల సందర్శనార్థం
ఇక్కడికి వచ్చిన ఠాగూర్ ఆంగ్లంలోకి తర్జుమా చేయడం ద్వారా మదనపల్లెకు
ఖ్యాతిని తెచ్చిపెట్టారు. జనగణమన గీతానికి ఎంతటి గౌరవం, ప్రాధాన్యత
ఇస్తున్నామో, అంతటికంటే మించిన విశ్వవ్యాప్త గౌరవం కూడా దక్కింది. 1911లో
మొదటిసారిగా పాడిన ఈ గీతాన్ని 1950 జనవరి 24 న జాతీయగీతంగా రాజ్యాంగ సభ
స్వీకరించింది.ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ ఉత్సవాల్లో
బీజేపీ జాతీయనేత, రాజ్యసభసభ్యుడు వెంకయ్యనాయుడు, చిరంజీవి, మంత్రులు
రఘువీరారెడ్డి, గల్లా అరుణకుమారి, తదితరులు పాల్గొన్నారు.
Tuesday, 24 January 2012
పరిటాల రవీంద్ర వర్థంతి ఘనంగా
మాజీ మంత్రి, తెదేపా నేత పరిటాల రవి ఏడో వర్థంతి కార్యక్రమం
కుటుంబసభ్యులు, పార్టీ కార్యకర్తలమధ్య
మంగళవారం ఘనంగా జరిగింది. అనంతపురం జిల్లా వెంకటాపురంలోని పరిటాలఘాట్
వద్ద రవి భార్య సునీత, కుటుంబసభ్యులు ఆయనకు నివాళి అర్పించారు. రవి
వర్థంతిని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పరిటాల
ఘాట్ అలంకరణకు థాయ్ లాండ్, ఫ్రాన్స్ నుంచి ప్రత్యేకంగా పుష్పాలు
తెప్పించారు. ఇక బెంగుళూరుకు చెందిన కళాకారులు ఘాట్ ని పుష్పాలతో
ప్రత్యేకంగా అలంకరించారు. మంగళవారం
పరిటాల రవీంద్ర ఏడవవర్ధంతి మండలంలోని వెంకటాపురంలో ఈ
సందర్భంగా పరిటాల రవీంద్ర ఘాట్‌ని ప్రత్యేకంగా అలంకరించారు. పరిటాల
రవీంద్రమెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదానశిబిరాన్ని ఏర్పాటు
చేశారు. ఈ రక్తదానశిబిరం నిర్వహణ బాధ్యతలను పరిటాల రవీంద్ర తనయుడు పరిటాల
శ్రీరామ్ చేపట్టారు. ప్రధానంగా రక్తదాన శిబిరంలో 130పడకలు ఏర్పాటు
చేశారు.రక్తదానశిబిరం ద్వారా పరిటాల అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తదితర
దాతలు
ఇచ్చే రక్తాన్ని సేకరించడానికి అనంతపురం ప్రభుత్వవైద్యశాల సిబ్బంది,
రెడ్‌క్రాస్‌సొసైటీ, ఆర్‌డీటీ, ఎన్టీఆర్ ట్రస్ట్, తలసీమియా సొసైటీకి చెందిన
వైద్య బృందం మంగళవారం ఉదయాన్నే వెంకటాపురం చేరుకోనుంది. ఉదయం
తొమ్మిది గంటలకు రక్తదానశిబిరాన్ని ప్రారంభించనున్నారు. జిల్లా ప్రజల
గుండెల్లో స్థిరంగా నిలిచిపోయిన పరిటాల రవి తనయుడు శ్రీరామ్ ఆధ్వర్యంలో
మొదటిసారి కార్యక్రమం జరుగుతుండడంతో పలువురు అభిమానులు ఉత్సాహంగా ఆయనకు
మద్ధతుగా నిలిచి తమ పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నారు. అంతే కాకుండా
పరిటాల శ్రీరామ్‌తో పరిచయం కోసం తహతహలాడుతున్నారు.
బాలయ్య - చిరు వర్గాల మధ్య ఘర్షణ
తిరుపతిలో చిరంజీవి - బాలకృష్ణ అభిమానుల మధ్య ఘర్షణ
ప్రారంభమై, మంగళవారం
ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో పోలీసులు
కార్యకర్తలపై లాఠీచార్జీ చేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాంగ్రెసు శాసనసభ్యుడు మెగాస్టార్ చిరంజీవికి, తెలుగుదేశం పార్టీ నాయకుడు
బాలకృష్ణకు మధ్య మాటల యుద్ధం ఇరు పక్షాలకు మధ్య ఘర్షణకు దారి తీస్తోంది.
చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య తిరుపతిలో ఘర్షణ ప్రారంభమై, ఇరు పార్టీల
కార్యకర్తల మధ్య ఘర్షణకు దారి తీసింది. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత
నెలకొంది. తిరుపతిలోని నాలుగు కాళ్ల మండపం వద్ద బాలయ్య అబిమానులు,
కాంగ్రెసు కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పక్షాలు పరస్పరం
దాడులకు దిగాయి. . కవరేజీకి వెళ్లిన మీడియా
ప్రతినిధులపై కూడా పోలీసులు తమ ప్రతాపం చూపించారు. చిరంజీవి,
Subscribe to:
Posts (Atom)
