Friday, 2 December 2011

విజయ పాలు డైరీకి ముప్పు..

ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పాలను జిల్లా కేంద్రాలకు తెప్పించి అక్కడ నుంచి పట్టణ ప్రాంతాలకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1964లో పాడిపరిశ్రమను ఏర్పాటు చేశారు. వెనుకబడిన ప్రాంతాల్లో పాల ఉత్పత్తులను పెంచేందుకు పాడిపరిశ్రమను 1974 వరకు డైరీ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ గా అనంతరం కార్పోరేషన్ గా మార్చారు. దీంతో ఈ సంస్థ అన్ని జిల్లాలోను అవస్థాపన సౌకర్యాలతో పాటు స్థిర ఆస్తులను సంపాదించుకుంది. సేకరించిన పాలను, పాల పదార్థాలను విజయ పేరుతో విక్రయిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యింది. ఈ పాడి పరిశ్రమను 1980లో కో ఆపరేటీవ్ ఫెడరేషన్ గా ప్రభుత్వం మార్పుచేసింది. కార్పోరేషన్ పరిధిలో ఉన్న ఆస్తులను కార్పోరేషన్ కు బదిలీ చేస్తూ ఏటా వెయ్యి రూపాయల టోకెన్ రెంట్ గా నిర్ణయించారు. అటు సంస్థలో పని చేస్తున్న సిబ్బందిని డిప్యూటేషన్ విధానం ద్వారా ఉపయోగించుకునేవారు.  టీడీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను డి సెంట్రలైజ్ చేయాలనే ఉద్దేశంతో జిల్లా స్థాయిలో యూనియన్లు  ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు నియమించింది. అయితే ఈ వ్యవస్థపై ఉద్యోగ, కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.పాల విక్రయధరలు, పాల ఉత్పతుల ధరలను ఫెడరేషన్ అధికారులు, ఆయా జిల్లాల ఛైర్మన్లు సమిష్టి నిర్ణయం తీసుకునేవారు. అప్పట్లో పాడిపరిశ్రమకు ఉన్న డిమాండ్ రీత్యా భారీస్థాయిలో లాభాలు రావడంతో యూనియన్లు మరింతగా బలపడ్డాయి. 1995లో టీడీపీ ప్రభుత్వం మ్యాక్స్ చట్టం ద్వారా ఫెడరేషన్ నుండి జిల్లా యూనియన్లు స్వయం ప్రతిపత్తి పేరుతో ఆయా జిల్లాల సంఘాలు ఏర్పాటు చేసింది. ఫెడరేషన్ కింద ఉన్న ఆస్తులను తమ ఆధీనంలోకి తీసుకుని పాలను ఉత్పత్తి చేస్తున్నారని ఇది నిబంధనలకు విరుద్ధమని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అభివృద్ధిప్రాంతాలతో పాటు అంతగా పాడిపరిశ్రమ లేని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన తరుణంలో ప్రైవేటుపరం చేయడానికి ప్రణాళికలు వేయడం సరికాదని పాల ఉత్పత్తి దారుల సంఘం నాయకులు ప్రభాకర్ రెడ్డి  అంటున్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ ఆర్ మ్యాక్స్ చట్టం పరిధి నుండి పాడిపరిశ్రమను మినహాయిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు తగ్గ నియమ నిబంధనలుకూడా రూపొందించింది. అయితే ప్రస్తుత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పాడిపరిశ్రమ అభివృద్ధి కోసం ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మ్యాక్స్ చట్టం కింద స్వయంప్రతిపత్తి ఉన్న యూనియన్ల నాయకులు మెుత్తం ఫెడరేషన్ నే ప్రైవేటుపరం చేసేందుకు కుట్రపన్నుతున్నారని కార్మిక సంఘం నాయకులు సాబీర్ పాష్  ఆరోపించారు.

రైతు సమస్యలపై అనంతపురం జిల్లా బంద్, ర్యాలీలు సంపూర్ణం

వర్షాభావ పరిస్థిితుల కారణంగా పంట నష్టపోయిన రైతు లను ఆదుకోవాలని డిమాండు చేస్తూ శుక్రవారం విపక్షాలు అనంతపురం జిల్లా బంద్ నిర్వహించాయి. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతన్నలు పెద్ద ఎత్తున పంట నష్టపోయారు. దీంతో జిల్లాలోని అన్ని మండలాలనూ కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించినా ఎలాంటి సహాయ కార్యక్రమాలు నిర్వహించలేదు.ఈ పరిస్థితుల్లో జిల్లాకు ప్రత్యేక ప్యాకేజి ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం, సీపీఐ, సీపీఎంలతోపాటు ఇతర ప్రజా సంఘాలు శుక్రవారం జిల్లా బంద్ నిర్వహించాయి. అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో ఆయా పార్టీల నేతలు ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చి వాహనాల రాకపోకలను నిలిపివేయించారు.అనేకచోట్ల ర్యాలీలు నిర్వహించారు. దుకాణాలను బంద్ చేయించారు. ఉదయం 6 గంటలకే ఆర్టీసీ డిపో వద్దకు వెళ్లి బస్సులు కదల కుండా అడ్డుకున్నారు. బస్సులు డిపోలోనే నిలిచిపోవడంతో విధులకు వెళ్లే ఉద్యోగులు, ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంద్ కారణంగా బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించాయి.

ఏ పత్రమైనా 15 నిమిషాలే

రాష్ట్ర ప్రభుత్వం ఇక రెవెన్యూ విభా గం సేవలను మీ-సేవ పేరుతో కేవ లం 15 నిమిషాలలో అందించేందుకు సిద్ధమైంది. రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శా ఖల ద్వారా వచె,్చ ఏదాది నాటికి 50 రకాల సేవలను అందించాలన్నది ల క్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. నవంబర్ 4న ఆధికారికంగా తిరుపతి లో లాంఛనంగా ప్రారంభించిన ము ఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన లో తనదైన ముద్ర వేసుకునేందుకు తెరపైకి తెచ్చి ప్రజలకు శ్రమ లేకుం డా సేవలందించేందుకు కసరత్తు మొ దలు పెట్టారు. ఈ క్రమంలో ప్రజలు అధికారులపై ఆధారపడి పరిష్కారమయ్యే వి«ధానానికి స్వస్తి పలికి మీసేవలు ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి వివిధ «ద్రువీకర ణ పత్రాలు పొందడంలో ఎలాంటి జాప్యం జరగకుండా, మామూళ్ళ వ్యవస్థకు అడ్డుకట్టవేసేందుకు ఈ పద్ధతిని తెచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.తక్షణం పని లేదంటే టోల్‌ఫ్రీకి ఫిర్యాదు: మీ-సేవా సేంటర్ల ద్వారా తక్షణం ప్రజలకు సేవలు అందాలి లేని పక్షం లో టోల్‌ఫ్రినెంబర్1100 కు ఫిర్యాదు చేస్తే అక్కడి కక్కడే పరిష్కారం జరగనుంది. ప్రస్తుతం తహసీల్దార్ కార్యలయాల్లో అ«ధికారులు పని ఒత్తిడి వల్ల అవసరమైన పత్రాలను సమయానికి ఇవ్వకపోవడంతో జాప్యం జరుగుతోంది. అడంగల్ కావాలన్న, ఆర్‌వోఆర్ కావాలన్న చివరికి జనన, మరణ కుల ధృవీకరణ పత్రాలు కావాలన్నా అధికారులు అందుబాటులో లేకపోవడం వల్ల ఆలస్యమవుతోంది. మీసే వా కేంద్రాల ద్వారా ఎవరితో అవస రం లేకుండా తక్షణం కోరిన వారికి వాటిని జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం మీ-సేవల ధృవీకర ణ పత్రాలను ఇకపై 15 నిమిషాల్లోపే ఇవ్వనున్నారు. ఈ మీ-సేవలను అ మలు చేసేందుకు పౌర హక్కుల చట్టం తీసుకురానున్నారు.భూ వివాదాలకు చరమగీతం .. ఇంతకు ముందు గతంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు ఆదాయం వస్తుం దా లేదా అని చూస్తూ ఒకే సర్వే నెం బర్ భూమిపై రెండు మూడు రిజిస్ట్రేషన్‌లు జరిగిపోయాయి. దీంతో భూ వివాదాలు అధికమయ్యాయి. ఈ విధానం అమలులోకి వస్తే ఇలాంటి వాటికి చెక్ పడే అవకాశం ఉంది. లిం క్ డాక్యుమెంట్లను పరిశీలించి భూ మిని కూడా సరిచూసుకొని ఈ మీ-సేవ కేంద్రాల్లో ఇచ్చే ధృవీకరణ పత్రాలకు నకిలీ సృష్టించే వీలు లేదు.

రామ్ చరణ్ ఎంగేజ్ మెంట్ లో కనిపించని రేణుదేశాయ్

మెగా బ్రదర్స్ మధ్య మనస్పర్థలు నెలకొన్నాయనే వార్తలు జోరుగా ప్రచారం అయిన నేపథ్యంలో స్వయంగా రామ్ చరణ్ ని ఎంగేజ్ మెంట్ వేడుకకు పవన్ కళ్యాణ్ తీసుకురావడంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్టే. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ లు కలిసి కనిపించక పోవడంతో, రేణు దేశాయ్ తో పవన్ కళ్యాణ్ కు మనస్పర్ధలు వచ్చాయని వెబ్ మీడియా కోడై కూస్తుంది. ఎప్పటిలానే ఆ రూమర్స్ ను పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు. రామ్ చరణ్ ఎంగేజ్ మెంట్ లో కలిసి కనిపిస్తారని ఎదురుచూసిన కొందరు అభిమానులకు నిరాశే మిగిలింది. కానీ ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ తో పాటు అతని భార్య రేణుదేశాయ్ పాల్గొనకపోవడం మాత్రం చర్చనీయాంశమయ్యింది. కొన్నాళ్ళ క్రితం పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ లు విడాకులు వైపు అడుగులు వేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలు రేణు ఖండించింది.ఇటీవల పవన్ కళ్యాణ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు పూణే నుంచి వచ్చిన రేణు అతనిని దగ్గరుండి చూసుకుందనే వార్తలు వచ్చాయి. దాంతో ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలిగిపోయాయని, ఇకపై పవన్, రేణు కలిసే ఉంటారని జనాలు చెప్పుకున్నారు. కానీ నిన్న జరిగిన మెగా వేడుకలో చిరంజీవి కుటుంబసభ్యులు అందరూ పాల్గొనప్పటికీ..పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ ఈ వేడుకలో కనిపించక పోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయని, పవన్ కళ్యాణ్, రేణులు అవకాశం లేదని వార్తలు మళ్ళీ ఊపందుకున్నాయి.

‘శ్రీరామ రాజ్యం’ సినిమాపై పవన్ ప్రశంసల జల్లు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘శ్రీరామ రాజ్యం’ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు. రామ్ చరణ్ ఎంగేజ్మెంట్ తర్వాత.... నిర్మాత యలమంచిలి సాయిబాబు పవన్ కల్యాణ్ కోసం‘ శ్రీరామ రాజ్యం’ స్పెషల్ షో వేయించారు. సినిమా చూసి అనంతరం పవన్ మీడియా ముందుకు వచ్చి శ్రీరామ రాజ్యం ఎంటైర్ టీంను పొగడ్తలతో ముంచెత్తారు. తాను పాత లవకుశ సినిమా చూడ లేదని, బాపు తీసిన ఈ సినిమా అద్భుతంగా ఉందన్నారు. బాలయ్య, నయనతార నటన సూపర్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. లార్డ్ శ్రీ రాముడి పాత్రలో బాలకృష్ణ అద్భుతంగా నటించిందని, సీతాదేవి పాత్రలో నయనత తార జీవించిందని...నిజంగా వారి నటనకు హాట్సాఫ్ అంటూ పవన్ వ్యాఖ్యానించాడు. శ్రీరామ రాజ్యం సినిమా చూసిన తర్వాత బాపుపై గౌరవం మరింత పెరిగిందన్నారు. సినిమాకు సెట్స్ వేసిన ఆర్ట్ డైరెక్టర్ ను కూడా పవన్ ప్రశంసించాడు.

వైయస్ విజయమ్మ ఇక ఎమ్మెల్యే కాదు !! ?

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ శనివారం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుంటే ఆమెపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా శాసనసభ్యులు వరుసగా ఆరు నెలలు అసెంబ్లీకి హాజరు కాని పక్షంలో వారి సభ్యత్వం రద్దయ్యే ఛాన్స్ ఉంది. వైయస్ విజయమ్మ శాసనసభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసి శనివారానికి ఆరు నెలలు పూర్తవుతుంది. గత ఆరునెలలుగా ఆమె ఒక్కసారి సమావేశాలకు హాజరు కాలేదు. దీంతో ఆమె శాసనసభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం స్పీకర్‌కు ఉంటుంది.ఆమెపై వేటు పడే అవకాశాలున్నందున శనివారం ఆమె అసెంబ్లీకి తప్పని పరిస్థితిల్లో హాజరు కావాల్సి ఉంది. పులివెందుల నియోజకవర్గం నుండి గెలిచిన విజయమ్మ ఈ సంవత్సరం జూన్ 3వ తారీఖున ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా విజయమ్మ రెండో రోజు కూడా సమావేశాలకు హాజరు కాలేదు.

తీర్పు: ఇల్లు ఖాళీచేసిన లక్ష్మీ పార్వతి

ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి ఇంటిని కోర్టు అధికారులు శుక్రవారం ఖాళీ చేయిస్తున్నారు. ఈ ఇల్లు బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 13లో ఉంది. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఉన్నప్పటి నుండి ఆమె అందులోనే ఉంటున్నారు. ఎన్టీఆర్ వీలునామా ప్రకారం ఆ ఇల్లు చిన్న కూతురు ఉమా మహేశ్వరికి దక్కింది. ఉమా మహేశ్వరి ఈ ఇంటి పవర్ ఆఫ్ అటార్నీని తన సోదరుడు రామకృష్ణకు ఇచ్చారు.లక్ష్మీ పార్వతిచే ఇల్లు ఖాళీ చేయించాలంటూ రామకృష్ణ కోర్టును ఆశ్రయించారు. సిటీ సివిల్ కోర్టు ఇళ్లు ఖాళీ చేయాలంటూ లక్ష్మీ పార్వతిని ఆదేశించింది. అయితే ఇచ్చిన గడువులోగా ఆమె ఖాళీ చేయకపోవడంతో కోర్టు అధికారులు ఇంటిని ఖాళీ చేయించారు. ఇల్లు ఖాళీ చేయించేందుకు రామకృష్ణ వెళ్లారు. అయితే లక్ష్మీ పార్వతి లేని సమయంలో ఇల్లు ఖాళీ చేస్తుండటంతో ఆమె ఆవేదనకు గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోర్టు ఇచ్చిన గడువు అయిపోయినప్పటికీ ఆ ఇంట్లో ఎన్టీఆర్‌కు సంబంధించిన విలువైన వస్తులు ఉన్నాయని, ఖాళీ చేసేందుకు మరో నెల రోజులు గడువు కావాలని కోరినప్పటికీ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తిరస్కరించారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.