Thursday, 24 November 2011

రజనీ రాణా సినిమా కు బ్రేక్ ....కూతురు సౌందర్య తో మరో సినిమాకు కమిట్ అయ్యారు.

భారీ అంచనాలతో మొదలైన రజనీ ‘రాణా’ సినిమా ప్రారంభం రోజే రజనీకాంత్ అనారోగ్యం పాలవడంతో....షూటింగ్ కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. రజనీ అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత ఆ సినిమాను తీద్దామని అనుకున్నప్పటికీ....భారీ యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ సినిమాలో నటించేందుకు అతని అరోగ్యం సహకరించదని డాక్టర్లు తేల్చి చెప్పడంతో ఈ ప్రాజెక్టు తాజాగా ఆగి పోయింది. మళ్లీ మొదలవుతుందో ? లేదో కూడా తెలియని పరిస్థితి.ఆ సినిమా సంగతి పక్కన పెడితే...రజనీ తాజగా మరో సినిమాకు కమిట్ అయ్యారు. తన చిన్న కూతురు సౌందర్య దర్శకత్వంలో ‘కోచ్ అదయన్’ సినిమా చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ విషయాన్ని సౌందర్య తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమా మొట్ట మొదటి ఇండియన్ 3డి చిత్రంగా రికార్డులకెక్కబోతోంది

కిషన్‌జీ ఎన్‌కౌంటర్: చంద్రబాబుకు భద్రత పెంపు

మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వర రావు ఎన్‌కౌంటర్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి భద్రత పెంచారు. రైతు పోరు బాటలో భాగంగా చంద్రబాబు ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని బుచ్చయ్యపేటలో పర్యటిస్తున్నారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం ఉండడంతో చంద్రబాబుకు భద్రత పెంచారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్న రాజకీయ నేతలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా రాష్ట్రంలో మావోయిస్టులు రెచ్చి పోయే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. దీంతో పలు చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. తనిఖీలు ముమ్మరం చేశారు

బాలయ్య అభిమానులకు శుభవార్త....‘శ్రీరామ రాజ్యం’ సినిమా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్

బాలయ్య అభిమానులకు శుభవార్త. బాలకృష్ణ నటించిన ‘శ్రీరామ రాజ్యం’ సినిమా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపిక చేయబడింది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత యలమంచిలి సాయిబాబు స్వయంగా మీడియాకు వెల్లడించారు. నవంబర్ 28న 500 మంది అంతర్జాతీయ మీడియా జర్నలిస్టుల కోసం ప్రత్యేక షో ఏర్పాటు చేశామని సాయిబాబు వెల్లడించారు. చాలా సుదీర్ఘం కాలం తర్వాత ఒక భారతీయ పౌరాణిక సినిమా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించప బడుతుంది. ఇందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. శ్రీరామ రాజ్యం సక్సెస్ కు కారణమైన మొత్తం టీంకు నేను థ్యాంక్స్ చెబుతున్నాను అని చెప్పారు. బాలకృష్ణ లార్డ్ రామా పాత్రలో, నయనత తార సీత పాత్రలో నటంచిన శ్రీరామ రాజ్యం సినిమా నవంబర్ 17న విడుదలై మంచి హిట్ టాక్ తో దూసుకెలుతోంది

వైయస్ విజయమ్మ బాధపడుతుంటారు: పయ్యావుల

తెలుగుదేశం పార్టీ వాదన ఇప్పుడు విని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ బాధపడుతుంటారని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ గురువారం ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. హైకోర్టును తప్పుదోవ పట్టించే విధంగా విజయమ్మతో పిటిషన్ వేయించారని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి బినామీ కర్నాటి వెంకటేశ్వర రావు వైయస్ హయాంలోనే వెలుగులోకి వచ్చారన్నారు. కర్నాటి, కెవిపి రామచంద్రా రావు ఒకే భవనంలో ఉంటారన్నారు.

లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు

హోరాహోరీ కాల్పుల్లో కిషన్‌జీ మృతి

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు ఆలియాస్ కిషన్‌జీ గురువారం మధ్యాహ్నం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. పశ్చిమబెంగాల్‌లోని కుష్బోనీ అడవిప్రాంతం, జంగల్ మహల్‌లో భద్రతాదళాలు-మావోయిస్టుల మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో కిషన్‌జీ మృతి చెందారు. ఈ ఘటనలో మరో మహిళా నక్సలైట్ కూడా మృతి చెందిన నట్లు నిఘా వర్గాలు ధృవీకరించాయి. 30 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న కిషన్‌జీది కరీంనగర్ జిల్లా పెద్దపల్లి.

2250 కోట్లతో రాష్ట్రంలోమెగా వాటర్‌షెడ్లు

భూగర్భ జలాల పెంపు, జీవనోపాదుల మెరుగులో భాగంగా రాష్ట్రంలో రూ.2250 కోట్లతో 450 మెగా వాటర్‌షెడ్లు ప్రారంభించిట్లు రాష్ట్ర సమగ్ర జల వనరుల అభివృద్ధి పథకం ప్రత్యేక కమిషనర్ సువర్ణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతుల జీవనోపాదుల మెరుగు కోసం ఇందిర జలప్రభ కింద రూ.1800 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. పది వేల హెక్టార్లలో ఆరు వేల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారని ఆమె  హిందూపురంలో తెలిపారు. ఈ పథ కం కోసం ఉపాధి హామీ ద్వారా రూ. 1000 కోట్లు, నాబార్డ్ ద్వారా రూ.800 కోట్లు విడుదల కానుందని తెలిపారు. ఇప్పటికే నాబార్డ్ ద్వారా రూ. 400 కోట్లు విడుదలైందని ఆమె తెలిపారు. అదనపు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. మెగా వాటర్‌షెడ్లు, ఉపాధి హామీ పథకం ఒకే గొడుగు కిందకు తేవడం జరిగిందని, దీని ద్వారా అన్ని జిల్లాల్లో జీవనోపాదుల కల్పన కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఒక్కొక్క మెగా వాటర్‌షెడ్ ద్వారా 15,500 ఎకరాల భూమి సారవంతమవుతుందని, ప్రతి వాటర్‌షెడ్‌పైన 5 నుండి 7 ఏళ్ళ లోపు రూ.5 కోట్ల పైబడి ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. అనంతపురం జిల్లాలో 70 మెగా వాటర్‌షెడ్లు ప్రతిపాదించడం జరిగిందని, ఇప్పటికే 20 పైబడి వాటర్‌షెడ్‌లలో పనులు ప్రారంభమయ్యాయన్నారు. జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలకు కొన్ని వాటర్‌షెడ్లు కేటాయించారన్నారు. పథకాల అమలులో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, లేకపోతే ఆశించిన స్థాయిలు సాధించడం సాధ్యపడదన్నారు. వాటర్‌షెడ్ల ద్వారా గ్రామాల్లో శాశ్వత వనరులు ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నాయని, దీనికి తోడు వ్యవసాయం, పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతాయన్నారు. 



ఆర్టీసీ కార్మికులకు సెల్‌ఫోన్లు

 ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు ఆర్టీసీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది. బస్సుల రాకపోకల సమాచారం కచ్చితంగా తెలుసుకునేందుకు వీలుగా మొబైల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఆర్టీసీ కార్మికులకు సెల్‌ఫోన్లు అందజేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1.22 లక్షల మందికి సీయూజీ ఉచిత సెల్‌ఫోన్లను ఇచ్చారు. దీనివల్ల ప్రయాణికులకు మరింత సమాచారం అందుబాటులోకి వస్తుందని, తద్వారా ఆర్టీసీ అభివృద్ధి చెందుతుందని ఆ సంస్థ ఉన్నతాధికారులు చెబుతున్నారు. మొబైల్ సేవల కు సంంధించి కర్నూలులో ఉన్న ఆర్టీసీ సంస్థ ప్రాంతీయాధికారి పి. కృష్ణమోహన్‌కు ఇప్పటికే ఉత్తర్వులు అందా యి.
కర్నూలులో ఉన్న రెగ్యులర్ ఉద్యోగులు 5,048 మంది బీఎస్ఎస్ఎన్ మొబైళ్లు పంపిణీ చేశారు. ఇక నుంచి ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ కార్మికులు క్షేత్రస్థాయి నుంచే అధికారులు నిర్ణయాలను తీసుకొనవచ్చని కృష్ణమోహన్ తెలిపారు. ఫోన్‌పై ప్రతినెలా రూ. 29 అద్దెను ఆర్టీ సీ భరిస్తుందని తెలిపారు. బీఎస్ఎన్ఎల్ కాకుండా ఇతర ఫోన్లకు కాల్ చేస్తే చార్జి పడుతుందన్నారు. 

ఉపయోగాలివే.
  • ఆర్టీసీ సిబ్బంది మధ్య సమన్వ యం కుదురుతుంది. సమాచారం ఇచ్చిపుచ్చుకుంటారు.
  •  ఆర్టీసీ బస్సు గ్యారేజీలో బ స్సుల మరమ్మతుల వివరాలను తెలుసుకొనవచ్చు.
  • బస్సులు సకాలంలో బలుదేరుతున్నాయో లేదో డిపోమేనేజర్లు, సూ పర్‌వైజర్ల ద్వారా తెలుసుకొనవచ్చు. 
  • బస్సులు మార్గమధ్యలో ఆగిపోతే ఆ బస్సుల వివరాలను డిపో మే నేజర్లకు, చీఫ్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లకు కండక్టర్లు, డ్రైవర్లు వివరించవచ్చు.
  •  బస్సులు సరైన సమయంలో నడిపేందుకు అవకాశం ఉంటుంది. 
  • ప్రస్తుతం బస్సు రాకపోకల వివరాలు సక్రమంగా తెలియక ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మొబైల్ సేవల వల్ల ఈ ఇబ్బందులు చాలావరకు తొలగిపోతాయి

ఓటరు నమోదు...తూతూ మంత్రం

 ఓటరు నమోదు ప్రక్రియలో ఎ న్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించి పకడ్బందీగా జాబితా రూపొందించాలనే ఆదేశం మేరకు  కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ప్రత్యేక ఓట ర్ల నమోదు, పర్యవేక్షణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో అత్యవసర స మావేశం జరిగింది. ఈ సమావేశానికి పలు పార్టీలకు చెందిన నేతలు డుమ్మాకొట్టగా, ప్రధాన పార్టీలకు చెందిన కింది స్థాయి నాయకులు హాజరైనా ఎలాం టి అవగాహన లేకపోవడంతో అధికారులు చెప్పినదానికి తలలు ఆడించి వె నుతిరిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2,829 పోలిం గ్ కేంద్రాలకు రిటర్నింగ్ స్థాయి అధికారులను ఏర్పాటు చేస్తామని ఓటర్ జా బితాలో తప్పులు, పొరపాట్లు లేకుం డా బూత్ స్థాయి ఏజెంట్లు సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో పర్యవేక్షించేందుకు బూత్‌స్థాయి ఏజెంట్లను నియమించాలని ఆదేశించారు. ప్రధాన ఎన్నికల అ ధికారి సూచనల మేరకు అన్ని పో లింగ్ కేంద్రాల్లో ప్రత్యేక నమోదు కా ర్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించామని, ఈనెల 27వ తేదీ ప్రత్యేక న మోదు దినంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. బూత్‌స్థాయి అధికారులు, ఏజెంట్లు కలిసి సంయుక్తంగా తప్పులు లేకుండా ఓటర్ జాబితాను సిద్ధం చే సేందుకు బూత్‌స్థాయి ఏజెంట్లను ని యమించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.తప్పుఒప్పుల సవరణకు ఈ నెల 30వ తేదీ వరకు అవకా శం ఉందన్నారు

తిరుపతిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనుమతులు తీసుకుని అతిక్రమించినవి కొన్ని, అనుమతులు లేకుండా చేపట్టినవి మరికొన్ని భవనాల నిర్మాణం ఆకాశమే హద్దుగా సాగిపోతోంది. తిరుపతి మున్సిపాలిటీగా ఉన్నప్పుడు ఖజానాకు గండికొట్టి కొందరు టౌన్‌ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించినట్టు పలు విమర్శలు ఉన్న నేప«థ్యంలో నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాద్ దీనిని సవాల్‌గా తీసుకుని అక్రమ నిర్మాణాల కూల్చివేతకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఆధికార పార్టీ నేతలతోపాటు సీఎం పేషీ నుంచి ఒత్తిడి వచ్చినా లెక్క చేయకుండా, తన ఫోన్ స్విచ్ ఆఫ్‌చేసి అనుమతిలేని అంతస్తుల కూల్చివేత కొనసాగించారు.

మహిళా ఎస్ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి: ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్

 జిల్లాలోని వితంతువులు, స్వచ్చంధ సంస్థల్లో ఉన్న అనాధలు, బాలసదనం, సేవాసదనం, దుర్గాబాయి మహిళ శిశు వికాస కేంద్రంల్లో ఉన్న మహిళలు ఎస్ఐ, కానిస్టేబుళ్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ముత్యాలమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26వతేదీలోపు స్థానిక సీడీపీఓల ద్వారా అభ్యర్థులు స్వయంగా వచ్చి మహిళ,శిశు సంక్షేమశాఖ పీడీ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా శారీర డారుఢ్యం కలిగి ఉండాలన్నారు. మహిళా ఎస్ఐ పోస్టుకు ఓసీ అభ్యర్థులు 21 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయస్సు వరకు, బీసీ,ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు 21 సంవత్సరాల నుంచి 30 ఏళ్లవరకు వయస్సు ఉండాలన్నారు. ఓసీ,బీసీ అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థల నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలన్నారు. ఎస్టీ,ఎస్సీ అభ్యర్థులు గుర్తింపుపొందిన సంస్థలనుంచి డిగ్రీ పాస్‌లేదా ఫెయిల్ అయినా సరిపోతుందన్నారు. మహిళా కానిస్టేబుల్ పోస్టుకు ఓసీ అభ్యర్థులు 18 నుంచి 22 సంవత్సరాలు, బీసీ,ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు 18 నుంచి 27 సంవత్సరాల వయస్సువరకు ఉండాలన్నారు. ఓసీ,బీసీ అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థల నుంచి ఇంటర్ పాస్ అయి ఉండాలన్నారు. ఎస్టీ,ఎస్సీ అభ్యర్థులు గుర్తింపుపొందిన సంస్థలనుంచి ఇంటర్ పాస్‌లేదా ఫెయిల్ అయినా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు