Thursday, 23 February 2012

'అనంత' రైతులను అ కారణంగా చితకబాదిన ఎస్ఐ

న్యాయం చేయాల్సిన పోలీసులే అకారణంగా రెచ్చిపోయారు. ఇద్దరు రైతులపై ప్రతాపం చూపించారు. ఏ తప్పూ చేయకున్నా వారిని ఇష్టారాజ్యంగా కొట్టారు. తమనే ప్రశ్నిస్తావా అంటూ ఓ రైతుని... తమ వాహనాన్ని ఢీకొట్టాడంటూ మరో రైతును విచక్షణా రహితంగా చితకబాదారు. పోలీసు స్టేషన్‌లోనే వారిని తీ వ్రస్థాయిలో దుర్భాషలాడారు. అక్కడి తో ఆగకుండా ఇష్టం వచ్చినట్లు చితకబాదారు. దీంతో గ్రా మం మొత్తం ఏకమైంది.అప్పటికే పో లీసుల తీరుపై అసహనంగా ఉన్న గ్రా మస్థులు వారి వ్యవహారాన్ని సహించలేకపోయారు. అకారణంగా రైతుపై పోలీసులు ఝులుం ప్రదర్శించారం టూ స్థానిక పోలీసు స్టేషన్‌ని ముట్టడించారు. ఎనిమిది గంటలపాటు రా స్తారోకో నిర్వహించారు. రైతులను అ కారణంగా చితకబాదిన కొత్తచెరువు ఎస్ఐ ఇస్మాయిల్, కానిస్టేబుళ్లు బా బా, చెన్నకేశవులుపై చర్యలు తీసుకో వాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.ఎనిమిది గంటలపాటు ఆందోళన.. ఉదయం పదకొండు గంటల సమయంలో ఇదంతా జరిగింది. మధ్యా హ్నం 12గంటల నుంచి రాత్రి ఏడువరకు గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎనిమిది గంటలపాటు పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించా రు. నెహ్రూసర్కిల్లో రాస్తారోకో చేశా రు. రైతు గోపాల్, నాగేంద్ర ఏమి త ప్పుచేశారని పోలీసులు చితకబాదారం టూ ప్రశ్నించారు. ఎటువంటి వివాదాలకు వెళ్లని తనభర్తను రోడ్డువెంబడి కొ ట్టుకుంటూ పోలీసు స్టేషన్‌కి తీసుకువచ్చారంటూ గోపాల్ భార్య గిరిజ ఆవేదన వ్యక్తం చేసింది. పలువురు గ్రామస్థులు ఆమెకు మద్దతుగా తరలివచ్చా రు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పో లీసుస్టేషన్‌పై దాడులకు దిగే స్థాయి లో గ్రామస్థులు ఉద్యమించారు. ఆం దోళనకారుల నిరసనలతో కొత్తచెరువు అట్టుడికిపోయింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ నవాబ్‌జాన్, ఎనిమిది మంది సీఐలు కొత్తచెరువుకు చేరుకున్నారు. భారీఎత్తున అదనపు పోలీసు బలగాలు మోహరించాయి. డీఎస్పీ, సీఐలు గ్రామస్థులతో చర్చించి, ఆందోలనకారులకు సర్దిచెప్పే ప్రయత్నం చే సినా ఫలితం లేకపోయింది. ఓ సందర్భంలో నేరుగా ఎస్పీ షహనవాజ్‌ఖా సీం జోక్యం చేసుకుని ఫోన్‌ద్వారా గ్రా మంలోని పెద్దలతో చర్చించారు. ఎస్ ఐ ఇస్మాయిల్ చేష్టలతో విసిగిపోయిన ప్రజలు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ఆందోళనకు సిద్ధపడ్డారు. ఎస్ఐని స స్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ దెబ్బలకు గాయపడిన రైతులు గ్రామస్థుల కంట పడకుండా పోలీసు లు పలు స్టేషన్లకు తరలించారు. గా యపడ్డ రైతులను తీసుకురావాలని గ్రామస్థులు పట్టుపట్టడంతో సాయం త్రం ఆరుగంటలకు వారిని గ్రామస్థులకు చూపించారు. అనంతరం పెనుకొండ ఆస్పత్రికి తరలించారు.ప్రత్యేక విచారణకు ఆదేశం.. కొత్తచెరువులో రైతులను ఎస్ఐ, కానిస్టేబుళ్లు చితకబాదడంపై ఎస్పీ షహనవాజ్‌ఖాసీం ప్రత్యేక విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా పెనుకొండ డీఎస్పీని నియమించినట్లు గ్రా మప్రముఖులతో ఎస్పీ ఫోన్‌ద్వారా వివరించారు.


జైలుకు పంపించాలని కాంగ్రెస్ కుట్ర....చంద్రబాబు

శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఎమ్మార్ పాపం చంద్రబాబుదేనని సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలతో సభలో కలకలం చెలరేగింది. ముఖ్యమంత్రి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ సభ్యులు సీఎం ప్రసంగానికి పదేపదే అడ్డుతగిలారు. కిరణ్ ప్రసంగాన్ని కొనసాగిస్తూనే వాస్తవాలు వినేందుకు టీడీపీ సభ్యులు సిద్ధంగా లేరని అన్నారు. గుమ్మడికాయ దొంగ అంటే చంద్రబాబు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. దీంతో టీడీపీ సభ్యులు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. స్పీకర్ పోడియం వద్ద నిల్చుని నినాదాలు చేశారు. స్పీకర్ కోరినప్పటికీ అక్కడి నుంచి కదలలేదు. దీంతో సభ కొన్ని నిమిషాల పాటు స్తంభించింది. నన్ను జైలుకు పంపించాలని కాంగ్రెస్ నాయకులు ఎప్పటినుంచో విఫల యత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నన్ను జైలుకు పంపించడం ఎవరి తరమూ కాదని కూడా ఆయన హెచ్చరించారు.రాష్ట్ర శాసన సభలో గురువారంనాడు జరిగిన చర్చలో తమపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెబుతూ తాము చేసిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్ కుళ్లుకుంటోందని ఆయన అన్నారు. రాష్ట్రానికి కన్వెన్షన్ సెంటర్‌లు తీసుకువచ్చిన ఘనత తమదేనని వివరిస్తూ, గచ్చిబౌలి స్టేడియంను తాము తీసుకువస్తే, కాంగ్రెస్ నాయకులు ఈ ప్రతిష్ఠాత్మకమైన స్టేడియంను సమావేశాలకు వాడుకుంటూ ఆ స్టేడియంను నాశనం చేసేశారని ఆయన వివరించారు. వీటిని హైదరాబాద్‌కు తీసుకువచ్చిన ఘనత మాకే చెందుతుందని చంద్రబాబు నాయుడు వివరిస్తున్నప్పుడు అధికార పక్ష సభ్యులు గొడవ సృష్టించారు.