దూకుడు’ చిత్ర నిర్మాత అనిల్ నివాసంపై ఆదాయపు పన్ను (ఐటీ)అధికారులు దాడి చేశారు. దూకుడు చిత్ర వసూళ్లకు సంబంధించిన వివరాల్ని అనిల్ నుంచి సేకరిస్తున్నట్టు సమాచారం. టాలీవుడ్ హీరో మహేష్ బాబు, సమంత నటించిన దూకుడు చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. టాలీవుడ్‌లోనే మరో హీరోకు సంబంధించిన వర్గం దూకుడు కలెక్షన్లు రికార్డు స్థాయిలో లేవంటూ ఆరోపణలు చేయడంతో ఈ చిత్ర వసూళ్లు ఇటీవల వివాదస్పదమయ్యాయి
Monday, 21 November 2011
నేనూ చిరంజీవి అభిమానినే:మంత్రి గల్లా అరుణకుమారి
జై రాయలసీమ సినిమా తీయాలి
రాయలసీమ వాసులు కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలో విశాలాంధ్ర కొరకు త్యాగం చేసి తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో త్యాగాలకు వారసులైన రాయలసీమ త్యాగ నిరతిపై జై రాయలసీమ చిత్రాన్ని సినీ నిర్మాతలు తీయాలని రాయలసీమ ఐక్య వేదిక అధ్యక్షులు పిబివి సుబ్బయ్య కోరారు. ఆదివారం స్ధానిక రవీంద్ర ఇంగ్లీషు మీడియం పాఠశాలలో సీమ ఐక్య వేదిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జై రాయలసీమ చిత్ర నిర్మాణం కోసం తాము సినిమా నిర్మాతలను సంప్రదించాలని, తమ సభ్యులతో కలసి చలన చిత్ర మండలి మాజీ అధ్యక్షులు, నిర్మాత బీవీ రెడ్డిని త్వరలో కలుస్తామని అన్నారు. ఐక్య వేదిక కార్యదర్శి విక్టర్ ఇమ్మానియేలు మాట్లాడుతూ రాయలసీమ ఫ్యాక్షన్ గురించి, కత్తులు కటారులు చూపడం భావ్యం కాదన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి వీరగాధలు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర ఆధ్యాత్మికతను ప్రధాన భూమికగా చూపాలని అన్నారు. మంచి హృదయంతో కర్నూలు ప్రజలు సమైక్యవాదానికి ప్రతీకగా నిలిచిన కర్నూలు త్యాగ నిరతిని చూపించాలని కోరారు. విద్యార్ధి సంఘాలు, ఐక్య కార్యాచరణ సంఘాలు, రాజకీయవాదులు, మేధావి వర్గాలు వీటిపై స్పందించి తగిన రీతిలో ముందుకు వచ్చి మన త్యాగ నిరతిని సినిమా ద్వారా, సాహితీ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చాటాలని ఆయన పిలుపునిచ్చారు
త్వరలో జైళ్ల కంప్యూటరీకరణ
రాష్ట్రంలోని జైళ్లను కంప్యూటరీకరణ చేస్తున్నట్లు జైళ్ల శాఖ ఐజి సునీల్‌కుమార్ తెలిపారు.వ్యవసాయ ఆరుబయలు కారాగారాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. జిల్లా జైలులో కోటి నలబై ఏడులక్షల రూపాయలతో నిర్మిస్తున్న ప్రహరీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సిబ్బంది, అధికారులకు అనువైన ఆఫీసు నిర్వహణా కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. ఆరుబయలు కారాగారంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శనశాల, వ్యవసాయ కర్మాగారంలో ఖైదీల ద్వారా పండిస్తున్న కూరగాయలు, పండ్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్‌ను ఐజి సునీల్‌కుమార్ పరిశీలించా
రాజమౌళి-అక్కినేని కాంబినేషన్లో ఓ సినిమా
మహేష్ బాబు కొత్త సినిమా ముగ్గురు హీరోయిన్లు
వీఆర్‌ఓ, వీఆర్‌ఏ నియామకాల్లో మార్పులు
వీఆర్‌ఓ, వీఆర్‌ఏ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీఆర్‌ఓ పరీక్షలకు రాత పరీక్ష నిర్వహించాలని, ఇంటర్వ్యూ విధానం ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మార్కుల రేషనైలేజేషన్ సాధ్యం కాదని మంత్రులకు అధికారులు స్పష్టం చేశారు. నవంబర్ 30 తేదిన మరో షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించనుంది. త్వరలో 1172 వీఆర్‌ఓ పోస్టులు, 6063 వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది
Subscribe to:
Posts (Atom)