సినీ నిర్మాత అల్లు అరవింద్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో సినిమా
నటీనటులు జీవిత, రాజశేఖర్‌లకు నాంపల్లి కోర్టు గురువారం నాడు సమన్లు జారీ
చేసింది. ఫిబ్రవరి 9 వ తేదీన వీరిరువురూ కోర్టు ఎదుట హాజరు కావాలని కోర్టు
ఆదేశించింది.
చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తాన్ని అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ జీవిత,
రాజశేఖర్ కొన్నాళ్ల క్రితం ఆరోపించిన విషయం తెలిసిందే. చిరంజీవి చారిటబుల్
ట్రస్టుపై జీవిత, రాజశేఖర్ చేసిన ఆరోపణలలో వాస్తవం లేదని, ఈ దంపతులు
తప్పుడు ఆరోపణలు చేశారనీ అల్లు అరవింద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తాము ప్రజా సేవ చేస్తున్నామే తప్ప వ్యాపారం చేయడంలేదని, కావాలంటే ఈ విషయమై
ప్రభుత్వం ఏ దర్యాప్తు సంస్థతోనైనా దర్యాప్తు చేయించుకోవచ్చునని
అప్పట్లోనే బ్లడ్ బ్యాంకు నిర్వాహకుల నుంచి వివరణ వచ్చింది. ఈ విషయమై
అల్లు అరవింద్ వేసిన పిటిషన్‌పై ఇప్పుడు నాంపల్లి కోర్టు ఈ సమన్లు జారీ
చేసింది.
Thursday, 15 December 2011
బ్రహ్మిణి స్టీల్స్‌ను తరలిస్తే ఊరుకోం
బ్రహ్మిణి స్టీల్స్‌ను వేరే ప్రాంతాలకు తరలిస్తే ఊరుకునేది లేదని రాయలసీమ
హక్కుల నేత పీహెచ్ చంద్రశేఖరరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సెయిల్
కంపెనీ ద్వారా బ్రహ్మిణి స్టీల్స్‌ను ప్రభుత్వమే నిర్వహించాలని ఆయన డిమాండ్
చేశారు. రాయలసీమ ప్రజలకు మేలు చేసే బ్రహ్మిణి
స్టీల్స్‌ను ఇక్కడి నుంచి తరలించాలని ప్రయత్నిస్తే ఊరుకోమన్నారు. రాజకీయ
విభేదాలతో బ్రహ్మిణిని తరలిస్తే రాయలసీమ ప్రాంతానికి తీరని నష్టం
జరుగుతుందన్నారు.
అనంతపురం జిల్లాలో ఉప ఎన్నికలు పార్టీ లు గట్టి పోటీ
గ్రూపు తగాదాలతో కాంగ్రెస్… అవిశ్వాసానికి మద్దతు తెలిపిన అనంతపురం
ఎమ్మెల్యే గురునాథరెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిల
భవితవ్యం ఏ విధంగా ఉండనుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
వైఎస్.రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితులైన గురునాథరెడ్డి, కాపు
రామచంద్రారెడ్డిలు 2009 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తరుపున గెలుపొందారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తరువాత చోటు చేసుకున్న
రాజకీయ పరిణమాల నేపథ్యంలో వారు ఆయన తనయుడు వైఎస్.జగన్మోహన్‌రెడ్డి వైపు
మొగ్గుచూపారు.
ఇప్పటికే కాంగ్రెసులో నియోజకవర్గ ఇన్‌ఛార్జీల కోసం విపరీతమైన పోటీ
నెలకొంది. ఆ పదవిని దక్కించుకునేందుకు ఎవరికివారు తమదైన శైలిలో పావులు
కదుపుతున్నారు. ఇన్‌ఛార్జి పదవిని దక్కించుకోవడం ద్వారా వైఎస్‌ఆర్ పార్టీ
తరపున అనంతపురం నియోజకవర్గానికి తిరిగి గురునాథరెడ్డి బరిలో ఉండే
అవకాశాలున్నాయి. టీడీపీలోనూ అభ్యర్థులు తీవ్రంగానే పోటీ పడుతున్నారు. ఇక
రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తే డిసిసి అధ్యక్షులు పాటిల్
వేణుగోపాల్‌రెడ్డిని కాదని అప్పట్లో వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కాపు
రామచంద్రారెడ్డికి ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకు పాటిల్
సహకరించాల్సి వచ్చింది. ఇప్పుడు కాపు జగన్‌వైపు వెళ్లడంతో పాటిల్‌కు తిరిగి
మార్గం సుగమమైంది. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులున్నందున ఆయన తనయుడు
నియోజకవర్గ రాజకీయాల్లో ప్రవేశించేందుకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇక
టిడిపి తరుపున దీపక్‌రెడ్డిని ఇప్పటికే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే
రాయలసీమలో జగన్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. యువకుడు కావడం ఒక కారణమైతే,
కాంగ్రెస్ పెద్దలు మోసం చేశారన్నసానుభూతి ఉంది. మరోవైపు కాంగ్రెస్‌లో ముఠా
తగాదాలు ఉన్నాయి. గ్రూపులుగా ఏర్పడటంతో నాయకత్వం లోపించింది. మంత్రులు
రఘువీరారెడ్డి, శైలజానాధ్‌లు ఒక గ్రూపుగా, మాజీ మంత్రి జేసీ
దివాకర్‌రెడ్డి మరోగ్రూపుగా ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారు. అందుకని ఇక్కడ
జగన్‌కు జనం జై కొట్టే అవకాశముంది.అనంతపురంలో జగన్‌కు జనం జై కొట్టే అవకాశముంది. జనంలోకి వెళ్లిన జగన్‌కు
బలమైన క్యాడర్ కూడా ఉంది. అనంత జిల్లాలో జగన్ వర్గ ఎమ్మెల్యేలు ఇద్దరు
పోటీ చేయనున్నారు. బలంగా ఉన్న తెలుగుదేశం కూడా గట్టి పోటీ ఇవ్వనుంది.
కాంగ్రెస్ మాత్రం గ్రూపు తగాదాలతో సతమతమవుతోంది.
శ్రీవారి ఆలయంలో తిరుప్పావై సేవ ప్రారంభం
గురువారం
సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించాడు. దీంతోతిరుమల శ్రీవారి ఆలయంలో తిరుప్పావై
సేవ ప్రారంభం అయింది. ధనుర్మాసం నెల్లాళ్లూ శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి
బదులుగా గోదాదేవి రచించిన పాశురాలను ఆలపించి శ్రీవారిని మేల్కొలుపుతారు. ఈ
సేవ రేపటి నుంచి వచ్చేనెల 16వ తేదీ వరకు జరుగుతుంది. శ్రీవళ్లి
పుత్తూరులో కొలువైన గోదాదేవి తన యుక్తవయసునుంచి శ్రీనివాసున్ని తన భర్తగా
భావించి ఆరాధిస్తుంది. ఆమె స్వామివారిని కీర్తిస్తూ తమిళంలో 30పాశురాళ్లను
రచించి అంకితమిచ్చింది. తదనంతరం శ్రీనివాసుడు గోదాదేవి వివాహం చేసుకున్నట్లు తమిళ పురాణాలు
చెబుతున్నాయి. ప్రతిఏటా సూర్య భగవానుడు ధనుర్ రాశిలోకి ప్రవేశించినప్పటి
నుంచి కౌసల్యా సుప్రజా, రామా అని ప్రారంభమయ్యే సుప్రభాతానికి బదులుగా
గోదాదేవి రచించిన 30పాశురాళ్లను పాడి శ్రీవారిని మేల్కోపుతారు. తిరుప్పావై
సూర్యుడు మకర సంక్రమణం చేసేవరకూ ఆచరించడం జరుగుతుంది. ఈ కాలంలో శ్రీవారి
ఆలయంలో తిరుప్పావైతో పాటు సహాస్ర నామార్చన, తోమాల సేవలు కొనసాగుతాయి.
సహాస్ర నామార్చనలో స్వామి వారికి తులసీ దళానికి బదులుగా బిల్వపత్రాన్ని
వినియోగిస్తారు. స్వామివారి అలంకారంలో కూడా మార్పులు జరుగనున్నాయి. స్వామివారి రత్నభరణాలు పొదిగిన బంగారు చిలుకను సమర్పిస్తారు. ఇదిలా ఉంటే
స్వామివారికి ప్రతి రోజు రాత్రి జరిగే ఏకాంత సేవల సాధారణంగా
భోగశ్రీనివాసమూర్తి నిర్వహిస్తారు. అయితే ధనుర్మాసంలో మాత్రం గర్భాలయంలో
ఉండే శ్రీకృష్ణస్వామికి ఏకాంతసేవ, పవళింపు సేవ నిర్వహించడం జరుగుతుంది.
ఉప ఎన్నికలు జగన్ సొంత జిల్లా పైనే అందరి దృష్టి
కడప జిల్లా ఉప ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ఆరాటం
తిరుమలలో కలకలం శ్రీవారి ఆలయంపై వెలుగుచుక్క
తిరుమల శ్రీవారి ఆలయం పైభాగాన బాగా ఎత్తులో బుధవారం రాత్రి ఓ వెలుగుచుక్క
ప్రయాణించిన సంఘటన కలకలం రేపింది. ఆకాశంలో జరిగిన ఈ అద్భుతంపై రకరకాల
వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఇది స్వామి దివ్యజ్యోతి అని, తిరుమల
క్షేత్రానికి అదృష్టమని కొందరు అంటుంటే, ఇది ‘ఫ్లైయింగ్ సాసర్ ’(ఎగిరే
పళ్లెం) అయి ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే భక్తులు మాత్రం
ఇది స్వామి జ్యోతి అయి ఉంటుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. ఇది
సాయిజ్యోతి అని కొంత మంది ప్రచారం చేస్తుంటే, ఇది తోకచుక్క అని ఇంకొంతమంది
అంటున్నారు. తోకచుక్క అయితే ఆకాశం నుండి కిందకు జారుతూ క్రమంగా
అదృశ్యమవుతుంది. అయితే బుధవారం శ్రీవారి ఆలయంపై తూర్పు నుండి పడమర వైపు
కదులతూ వెలుగుచుక్క దర్శనమిచ్చింది. అందరూ చూస్తుండగానే కనుమరుగైంది.
అయ్యప్ప మకరజ్యోతి తరహాలో రెండు నిమిషాల పాటు ఆలయంపై ఈ వెలుగు చుక్క
ముందుకు సాగింది. ఆలయ గోపురంపై నుండి ఓ వెలుగుచుక్క వెళుతూ వుండటాన్ని విధి
నిర్వహణలో వున్న ఓ సెక్యూరిటీ గార్డు గమనించి, పాత్రికేయులకు చూపించాడు.
కొంత మంది ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన వారు ఈ వెలుగుచుక్కను కెమేరాల్లో
బంధించారు. అయితే సాధారణ కెమేరాల్లోకి ఈ చుక్క అందుబాటులోకి రాలేదు.
దివిటీలా వెలుగుతూ పడమర వైపు పయనిస్తూ రెండు, మూడు నిమిషాల వ్యవధిలో
కనుమరుగయింది. ఈ వెలుగు రహస్యమేమిటో శాస్తవ్రేత్తలే తేల్చాల్సి ఉంది. ఏది
ఏమైనా బుధవారం వెంకన్న ఆలయంపై ఆవిష్కృతమైన ఈ అద్భుతంపై వాడివేడిగా చర్చ
సాగుతోంది.
Subscribe to:
Posts (Atom)