సంప్రదించండి

రాయలసీమ.. రాయలు ఏలిన నేల మాత్రమే కాదు, రతనాలు పండిన నేల. ఒక్కో కాలంలో ఒక్కోవిధంగా పరిఢవించిన ఉన్నతోన్నత సీమపై నేడు కరవు ఛాయలు విస్తరించాయి. కానీ, ఈ కష్టాలు ప్రజల్లో చైతన్యం వచ్చే వరకే. ప్రజా చైతన్యం వచ్చిన రోజు కష్టాలే కాదు కరవులను కూడా ఎదుర్కోవడం పెద్ద కష్టమేం కాదు. ఆ రోజులూ త్వరలోనే వస్తాయి.
నమస్తే రాయలసీమ సముద్రపు నీటిబొట్టులా రాయలసీమకు తోడ్పడేందుకు కృషిచేయాలనుకుంటుంది. ప్రజా చైతన్యం ద్వారా దాన్నిసాధించాలనుకుంటోంది. దానికి ఐకమత్యం అవసరం. ఆ ఐకమత్యానికి ఓ వేదిక అవసరం. అది నమస్తే రాయలసీమ కావాలని కాంక్షిస్తున్నాం.
రాయలసీమకు సంబంధించి ఏ విషయాన్ని అయినా మీరు మాతో పంచుకోవచ్చు. వార్తలు పంపవచ్చు. సలహాలు ఇవ్వొచ్చు. ఏ విధంగా అయినా ఇందులో మీ పాత్రను పోషించవచ్చు.

మమ్మల్ని సంప్రదించాల్సిన చిరునామా:
editor@namastherayalaseema.com


ఫేస్ బుక్ అక్కౌంట్ F